పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని పుష్కర ఘాట్లలో పిండ ప్రదానాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ 'సాక్షి' మీడియాలో వచ్చిన కథనంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పందించారు.
కొవ్వూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని పుష్కర ఘాట్లలో పిండ ప్రదానాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ 'సాక్షి' మీడియాలో వచ్చిన కథనంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పందించారు. పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు ముండుతున్న ఎండలో తమ పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తున్న విషయం తెలిసిందే. పిండప్రదానాల చేసే స్థలంలో అదనంగా టెంట్లు వేయించి ఆ కార్యక్రమానికి, ఇతర పూజా కార్యక్రమాల నిర్వహణలో భక్తులకు ఇబ్బందులు తెలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.