చిత్తూరు జిల్లా శేషాచలంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్ కౌంటర్ కేసు విచారణ బుధవారం హైకోర్టులో ప్రారంభమైంది.
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్ కౌంటర్ కేసు విచారణ బుధవారం హైకోర్టులో ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున ఒకరు, బాధితుల తరఫున మరొకరు వాద ప్రతివాదనలు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. గత సోమవారం విచారణ సందర్భంగా ఈ కేసును హైకోర్టు బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
తన భర్తను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా హైకోర్టు దీనిపై సీరియస్ గా స్పందించిందిన విషయం తెలిసిందే. దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచాలని, కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎక్కడా ఎవరూ ప్రస్తావించకూడదని గతంలో హైకోర్టు ఆదేశించింది. తన భర్తను శశికుమార్ ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఈనెల 11న ఫిర్యాదు చేసింది.