12, 13 తేదీల్లో అఖిలపక్ష సమావేశం | all-party meeting on November 12, 13th | Sakshi
Sakshi News home page

12, 13 తేదీల్లో అఖిలపక్ష సమావేశం

Nov 4 2013 11:33 AM | Updated on Sep 27 2018 5:59 PM

12, 13 తేదీల్లో అఖిలపక్ష సమావేశం - Sakshi

12, 13 తేదీల్లో అఖిలపక్ష సమావేశం

విభజన ప్రక్రియలో కీలకంగా భావిస్తున్న అఖిలపక్ష సమావేశానికి సంబంధించి తేదీలను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది.

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది.  ఈ ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా చేపడుతున్నట్లు సంకేతాలివ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా విభజన ప్రక్రియలో  తదుపరి నిర్ణయం తీసుకునే ముందు మరోసారి అఖిలపక్ష సమావేశాన్నిఏర్పాటు చేసింది. ఈ నెల  12, 13 తేదీల్లో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర హోంశాఖ  ఖరారు చేసింది. అభిప్రాయాలు తెలియచేయాలని  రాష్ట్రంలోని మొత్తం  ఎనిమిది పార్టీలకు కేంద్రం లేఖ రాసింది.

12వ తేదీన నాలుగు పార్టీలకు, 13న మరో నాలుగు పార్టీలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. జీవోఎం విడివిడిగా అభిప్రాయాలను సేకరించనుంది. రాష్ట్ర విభజనకు కేబినెట్ ఆమోదించిన విధి విధానాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిపై రాష్ట్ర పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement