దత్త పుత్రుడు ఎంత పని చేశాడు! | adopted son is accused in father murder case | Sakshi
Sakshi News home page

దత్త పుత్రుడు ఎంత పని చేశాడు!

Jan 27 2017 6:22 PM | Updated on Jul 26 2019 5:58 PM

దత్త పుత్రుడు ఎంత పని చేశాడు! - Sakshi

దత్త పుత్రుడు ఎంత పని చేశాడు!

పెంపుడు కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొవ్వూరు: పెంపుడు కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు పిల్లలు లేకపోవడంతో తన అన్న కుమారుడిని పెంచి పెద్ద చేసిన ఆయనకు అన్న కుమారుడి రూపంలో మృత్యువు వెంటాడుతుందని ఊహించలేకపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్లకు చెందిన శికా కృష్ణమూర్తి(50) ఈ నెల 21వ తేదీన అదృశ్యమయ్యాడని పెంపుడు కొడుకు వెంకట దుర్గారావు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇటీవల అతని ఆరోగ్యం బాగాలేకపోవడంతో మనస్తాపంతో ఎటో వెళ్లిపోయి ఉంటాడని దుర్గారావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో అతనిపై అనుమానంతో పోలీసులు విచారణ చేస్తుండగా ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం స్థానిక వీఆర్‌ఓ వద్ద తానే తన తండ్రిని చంపానని ఒప్పుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దుర్గారావు, అతని భార్య వెంకటలక్ష్మి కలిసి ఈ నెల 11న బ్రాందీలో మత్తుమందు కలిపి కృష్ణమూర్తికి ఇచ్చారని, మత్తులోకి జారుకున్న తర్వాత పీక నొక్కి చంపారని తెలిపారు. తర్వాత మృతదేహాన్ని వాడపల్లి వద్ద పడేశారు. అనంతరం 4 రోజుల తర్వాత వచ్చి మృతదేహంపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. లొంగిపోయిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement