విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
విశాఖపట్టణం : విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు... పాతతలారివాని పాలెంలో మరిడిమాంబ వేడుక జరుగుతోంది. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీల విషయంలో శుక్రవారం తెల్లవారుజామున వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురికి గాయలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థతి విషయంగా ఉంది. గాయాలైన వారిని స్తానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(అనకాపల్లి)