వైఎస్‌ జగన్‌కు చిన్నారి లేఖ, వైరల్‌ | 5th Class Student Wrote Letter To YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు చిన్నారి లేఖ, వైరల్‌

May 8 2018 8:55 PM | Updated on Nov 9 2018 5:06 PM

5th Class Student Wrote Letter To YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, కైకలూరు : ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రజా సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజల గుండెల్లోకి చాలా వేగంగా వెళ్తున్నాయి. రాజన్న బిడ్డ ప్రకటించిన నవరత్నాలతో తమ సమస్యలు తీరుతాయని చిన్నా పెద్ద అందరూ భావిస్తున్నారు. మంగళవారం చినపాలమర్రులో పాదయాత్ర చేస్తున్న జననేతకు ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రాసిన లేఖ ఇందుకు నిదర్శనం.

ఆ చిన్నారి రాజన్న బిడ్డకు రాసిన లేఖలో ఏం ఉందంటే " స్వాగతం సుస్వాగతం జగనన్నకి. మీ అమ్మ ఒడి పథకం చాలా బాగుంది. మా ఇల్లు పూరిల్లు. పూరిల్లుని డాబాలు చేయమని కోరుకుంటున్నాం. 2000 ఫించన్‌ వృద్దులకు ఇవ్వడం మంచిది. రాష్ట్రంలో అత్యాచారాలు బాగా పెరిగిపోయినాయి. ఆడపిల్లల్ని పెద్దన్నలాగా కాపాడుతావని కోరుకుంటున్నాం" అని రాసింది. ఆ చిట్టితల్లి రాసిన చిట్టీని జననేత సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

నవరత్నాల్లో భాగంగా వైఎస్‌ జగన్ పిల్లల్ని బడికి పంపించేందుకు ప్రతి తల్లికీ ‘అమ్మ ఒడి’ పథకం ప్రకటించారు. దీని కింద ఏటా రూ. 15,000 అందిస్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లల చదువు పూర్తయ్యేంత వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వేరే ప్రాంతాల్లో చదువుకునే పిల్లల హాస్టల్‌ ఖర్చు కింద ఏటా రూ. 20,000 ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement