breaking news
-
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతల దాడి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రణస్థలం మండలం ఎన్టీఆర్‌పురంలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు.గురయ్యపేట బీచ్‌కి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు కొమరకొమర రామును అడ్డగించి టీడీపీ నేతలు ముకుమ్మడిగా దాడి చేశారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై సైతం రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ఉప్పాడ అప్పన్న, మత్సకార సోసైటీ ప్రెసిడెంట్ కొమర అప్పన్న, కొమర రాములు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సాగునీటి సంఘాల ఎన్నికల్లో ‘కూటమి’ బరితెగింపు: చెల్లుబోయిన వేణు
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో నీటిసంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా, కనీస పారదర్శకత లేకుండా నీటిసంఘాల ఎన్నికలను ఏకపక్షంగా ఈ ప్రభుత్వం నిర్వహించిందని మండిపడ్డారు.ఇంకా ఆయన ఎమన్నారంటే..రాష్ట్రంలో సాగు నీటిసంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించామంటూ కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కనీస పారదర్శకతకు చోటు లేకుండా నిరంకుశంగా, తమకు అనుకూలంగా ఈ ఎన్నికలను నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఈ సంఘాలకు నిర్వహించే ఈ ఎన్నికల్లో ఎవరైనా రైతులు టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే, నీటి బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి.ఆ మేరకు వీఆర్ఓ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవాలి. ఇది తప్పనిసరి. అది ఉంటేనే నామినేషన్ అనుమతిస్తారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వైయస్ఆర్ సిపికి చెందిన వారు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు విఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో విఆర్వోలను ఉంచి, నోడ్యూస్ కోసం వచ్చిన వారిని పోలీసులతో బెదిరించి వెనక్కి పంపించారు.న్యాయస్థానం ఉత్తర్వులను కూడా గౌరవించలేదుసాగునీటి సంఘాలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కూటమి ప్రభుత్వం గౌరవించలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీపై కక్షసాధించాలనే ఉద్దేశం, ఏదో ఒకరకంగా ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రయత్నించింది. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తప్పుడు విధానాలకు వినియోగించుకుంది. దీనిని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ అరాచకాలను ప్రజలకు తెలియచేసేందుకు ప్రయత్నించిన మీడియాపై కర్కశంగా భౌతికదాడులకు తెగబడ్డారు. ఇటువంటి దారుణాలతో గెలిచి, ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాల్జేశారు. పైగా పులివెందుల్లో గెలిచామని చెప్పుకుంటూ, ఇదంతా తమ గొప్పతనంగా చాటుకోవడం సిగ్గుచేటు.ఏకగ్రీవాలే లక్ష్యంగా పనిచేశారుఇతర పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా, గ్రామసచివాలయాల్లో నోడ్యూస్ సర్టిఫికేట్ లు ఇవ్వకుండా కుట్రలకు పాల్పడ్డారు. ఇటువంటి దుర్నీతికి నిరసనగానే వైఎస్సార్సీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది.వీఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారుఈ ఎన్నికలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వీఆర్ఓలు అంతా గ్రామ సచివాలయాల్లో ఉండాలి. కానీ చాలా మంది వీఆర్ఓలు ఫోన్లు స్విచాఫ్ చేసి కూర్చున్నారు. ఇంకా అందరు వీఆర్ఓలను మండల ఆఫీస్‌కు తీసుకుపోయి, నిర్భంధం చేశారు. బయట పోలీసులను కాపలగా పెట్టారు. వారిని రెండు రోజుల పాటు మండల ఆఫీస్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? వారిని అక్కడ జైల్లో ఖైదీలుగా ఉంచినట్లు ఉంచారు. ఏ రైతు కూడా తమ వీఆర్ఓను కలిసే వీలు లేకుండా చేశారు. అలా వీఆర్ఓలు ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కుట్ర చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యకాండరాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండను కొనసాగించింది. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కళ్లెంపూడిలో బీజేపీ నాయకుడు కోన మోహన్‌రావు నామినేషన్ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, ఆయన్ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో డీఈ పట్టించుకోలేదు.పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరి తెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్‌కు తరలించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని, తమపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారని నిలదీసినా ప్రయోజనం లేకపోయింది.కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారు. నెల్లూరు జిల్లా కుడితిపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు. పద్మమ్మ అనే మహిళా రైతు గెలిచినా.. టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు..మాజీ ఎమ్మెల్యేపై నోరుపారేసుకున్న సీఐ ‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది.ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలను లాక్కొని చింపి వేశారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వంఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలు చేయడం చేతకానితనం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ను చొక్కా విప్పి కూర్చోబెట్టి ఉండేవారు. మా పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తే, ఓడిపోతామని చెప్పి, రైతులకు నోడ్యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. వీఆర్ఓలు గ్రామ సచివాలయాల్లో ఉండకుండా, వారిని ఎందుకు మండల ఆఫీస్‌ల్లో బంధించి ఉంచారు.చివరకు కవరేజ్‌కు వచ్చిన మీడియాపైనా వైఎస్సార్ జిల్లా వేములలో దాడి చేశారు. ఇన్ని పనులు చేసి, నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం ఎవరూ రాలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్క పులివెందులలోనే కాదు, జమ్మలమడుగులో కూడా అదే పని చేశారు. వీఆర్ఓలు అందరినీ తీసుకెళ్లి, దేవగుడిలో బంధించారు. ఇది వాస్తవం కాదా? అధికారుల తప్పులు, వారు దగ్గరుండి చేయించిన పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్పదు. సాగు నీటి ఎన్నికల్లో టీడీపీ గెలుపు అస్సలు గెలుపే కాదు.. చంద్రబాబు జీవితంలో ఇదో చీకటి అధ్యాయం.. ఎన్నికలు పెట్టకుండా.. టీడీపీ నేతలే చంద్రబాబు నామినేట్ చేసుకుని ఉంటే బాగుండేది. -
విజన్-2047.. చంద్రబాబు మరో పబ్లిసిటీ స్టంట్: వైఎస్ జగన్ చురకలు
సాక్షి, తాడేపల్లి: విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని.. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. ‘‘చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుంది’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘1998లో కూడా చంద్రబాబు విజన్-2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రచరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు...ఆ రోజుల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్-2020 కాదు, “420’’ అంటూ చంద్రబాబును దుయ్యపట్టారు. 2014లోకూడా చంద్రబాబుగారు విజన్-2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.‘‘తన పరిపాలనలో మొత్తం ౩ విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క పోర్టుకాని, ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? స్కూళ్లు బాగుచేశాడా? ఆస్పత్రులు బాగు చేశాడా? వ్యవసాయరంగాన్ని బాగుచేశాడా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా? మానవవనరుల అభివృద్ధి మీద, వారి భవిష్యత్తుమీద ఒక్కపైసా అయినా ఖర్చుచేశాడా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు...ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ విజన్-2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా, స్టంట్ కాదా? ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను గంగలో కలిపిన పాలకుడ్ని చీటర్ అంటారు కాని, విజనరీ అంటారా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.1.విజన్-2047 పేరిట @ncbn మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమే. చంద్రబాబుగారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024 ‘‘చంద్రబాబు పాలనలో, ఆయన గత 14 ఏళ్లకాలంలో కూడా ఎప్పుడూ రెవెన్యూ లోటే కనిపిస్తుందన్నమాట వాస్తవం కాదా? మరి ఇంకెక్కడి సంపద సృష్టి. ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు, సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. ఇప్పుడు విజన్-2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కూడా కట్టుకథ కాదా?..సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటినుంచి వచ్చే 10ఏళ్లు తీసుకున్నా లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధిచెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబు, ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపద ఆవిరిచేసే ఈ బాబు, ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే “420’’ అని అంటారు.’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘ఈ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి, అందరికీ సమాన అవకాశాలు కల్పించి, సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్సార్సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నాం. విద్యారంగంలో సీబీఎస్ఈ, ఐబీ, పిల్లలకు ట్యాబులు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్, ఫాంగేట్ వద్దే ఎంఎస్పీకి పంటల కొనుగోళ్లు, ఆరోగ్య రంగంలో నాడు నేడు ద్వారా ఆసుపత్రుల బలోపేతం, కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌లు, ఉపాధికల్పనా రంగంలో మైక్రో సాప్ట్ తో నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్‌తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం...వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబుగారు నీరుగారుస్తున్నారు, రద్దుచేస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బతీశారు. ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో కింద ఉన్నవారికి చేయూత నిచ్చి వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలుచేసిన కార్యక్రమాలన్నింటినీ తీసివేసి, పేదలను మరింత పేదవాళ్లుగా చంద్రబాబు తయారు చేస్తున్నాడు. మరి చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారు?’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట -
బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. నీటి సంఘాల ఎన్నికల విషయంలో టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారంటూ ధ్వజమెత్తారు. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించకుండా అడ్డుకున్న హీన చరిత్ర బీటెక్ రవిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అప్రజాస్వామ్యంగా గెలిచిన వీటిని ఎన్నికలు అంటారా..? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీటెక్ రవిని పులివెందుల ప్రజలు ఓడించిన చరిత్ర మరిచిపోయావా? వైఎస్ వివేకా హత్యను రాజకీయంగా వాడుకోకపోతే బీటెక్ రవికి ఆ పార్టీలో మనుగడ కూడా లేదు. మీ సొంత గ్రామంలో ఇప్పటివరకు ఏ ఎలక్షన్లోనూ గెలవని చరిత్ర నీది. రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాము’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?.. బీఆర్ఎస్కు డిప్యూటీ సీఎం సవాల్
సాక్షి, ఖమ్మం జిల్లా: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. నూతనంగా పెంచిన డైట్ ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం పడుతుందన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 2014 నాటికి 72450 కోట్ల రూపాయలు.. ప్రభుత్వంతో పాటు కొన్ని కార్పొరేట్ బ్యాంక్‌ల ద్వారా అప్పులు చేసింది. 5893 కోట్లు రాష్ట్ర విభజన జరిగే నాటికి అప్పు ఉంటే అవి 95 వేల కోట్లకు పెరిగింది. పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 23 వేల కోట్లు చేసింది. అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మేము కూడ అప్పులు చేశామని అంటున్నారు. మీరు చేసింది తినేందుకు, మేము చేసేది అప్పు కట్టేందుకు’’ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50 వేల కోట్లు.. మేము అప్పు వడ్డీ కలిపి 66 వేల 722 కోట్లు చెల్లించాం. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు 6 వేల 400 కోట్లు ఉండేది. ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి, తగుదునమ్మా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద అరుస్తా ఉన్నారు. 10 ఏళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి అన్నంలో పురుగులు వంటివి వచ్చాయి. మళ్ళీ తిరిగి రెసిడెన్షియల్ స్కూల్లో టాయిలెట్స్ సరిగా లేవని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా?’’ అంటూ భట్టి ప్రశ్నించారు.‘‘మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 66 వేల కోట్ల రూపాయలు అప్పు కడుతూ రైతుల అప్పు కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు రైతుల అప్పు కట్టలేదు. రైతు భరోసా 7 వేల 625 కోట్లు కల్పించాం. రైతు బీమా కట్టాం. 1500 రూపాయలు రైతు బీమా ప్రభుత్వం కట్టింది. ఆయిల్ ఫోం కి 40 కోట్లు విడుదల చేశాం. 30 వేల కోట్ల రూపాయలు రైతులకు మేము బోనస్ కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుండి వాటికి నేరుగా ఖర్చు పెట్టాం’’ అని భట్టి విక్రమార్క వివరించారు.పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుంది. భూమిలేని నిరుపేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. డిసెంబర్ 28వ తేదీన మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 56 వేల మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించాం. ఇంకా 22 వేల కోట్ల బడ్జెట్‌తో 3500 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రతిపక్ష పార్టీ వాస్తవాలను అవాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది’’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలి: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదన్నారు.విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు , ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ రాణి, కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకట రెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజీవ్, తైనల విజయ కుమార్, చొక్కాకుల వెంకట రావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.అనంతరం, ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరితో కలిసి ముందుకు సాగాలి. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి.జమిలి ఎన్నికలు వస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది. మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘పార్టీ జిల్లా కార్యాలయం ఎండాడలో ఉంది. నగర పార్టీ కార్యాలయం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నగర కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతుంది. రైతు పోరాటానికి విశేషమైన స్పందన లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆరు నెలల్లో చంద్రబాబు 72వేల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషం. పార్టీ చేసే పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. 27వ తేదీన కరెంట్ చార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమం ఉంది. కూటమికి ప్రజలతో సంబంధం లేదు. మీడియాను పట్టుకొని హడావుడి చేస్తోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.అరకు ఎంపీ తనూజ రాణి మాట్లాడుతూ..అందరం కష్టపడి పని చేద్దాం. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. కూటమి పాలనలో నిత్యవసర ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ బలం కార్యకర్తలే అని చెప్పారు. -
జనసేన ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం.. షాపులు కూల్చివేత
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల అరాచక పాలన పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలనే కాకుండా సామాన్యులను కూడా కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కాకినాడలో ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో, బాధితులు ఇదెక్కడి న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాకినాడ రూరల్‌లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు.తమ షాపులు కూల్చివేయడంతో ఆవేదనకు గురైన మత్స్యకారుడు మల్లాడి సింహాద్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న సింహాద్రిని వెంటనే ఆసుపత్రి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సింహాద్రికి చికిత్స కొనసాగుతోంది. అయితే, రోడ్డు ప్రమాదాలకు ఇన్ని రోజులు లేని ఆంక్షలు ఇప్పుడే వచ్చాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
జనాలను మభ్యపెట్టేందుకే బాబు ‘విజన్’
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్–2047 జనాలను మభ్యపెట్టేందుకేనని, ఆ విషయంలో ఆయన ఘనుడని మాజీమంత్రి వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విజన్–2047 పేదల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గతంలో విజన్–2020 ప్రవేశపెట్టినప్పుడే కమ్యూనిస్టులు ‘విజన్–2020.. చంద్రబాబు 420’గా.. వరల్డ్ బ్యాంకు జీతగాడుగా పిలిచేవారు. ఇప్పటికీ ఆయన విజన్‌లో ఎలాంటి మార్పూలేదు. విజన్–2047 గురించి మాట్లాడే ముందు 2024 పరిపాలన విధానంపై ఆయన ఆలోచించాలి. విజన్ అనేది పేదవాడికి సహాయం చేయడానికి ఉండాలి.కానీ.. చంద్రబాబు ఒక్క రూపాయి అయినా సహాయం చేశారా? రైతులకు రూ.20 వేలు పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా ఊసేలేదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆయన 2014లో రుణమాపీ చేయకుండా రైతులను మోసం చేశారు. చంద్రబాబు 1998లో రూ.2 కోట్ల 50 లక్షలతో మెకాన్సీ సంస్థ ద్వారా విజన్ డాక్యుమెంట్ తయారుచేయించారు. అందులో.. అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసి యూజర్ ఛార్జీలు వసూలుచేయమని ఉంది. మెడికల్ సీట్లు వద్దనడమే బాబు విజన్..జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతిచ్చి ఐదింటిని పూర్తిచేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాయడం చంద్రబాబు విజన్. అలాగే, వలంటీర్లు, బేవరేజ్ కార్పొరేషన్ సిబ్బందినీ తొలగించి వారిని రోడ్డున పడేశారు. సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నా కొంతమందికే సంపద కలుగుతోంది. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు దొరకిందన్న అనందం తప్ప పేదవాడికి పది రూపాయలు సహాయం చేశామన్న సంతోషంలేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి కిందస్థాయి అధికారుల వరకు అందరినీ వేధిస్తున్నారు.ఈ ఏడు నెలల కాలంలో రూ.70 వేల కోట్ల అప్పుచేయగా.. ప్రజలకు ఏంచేశామో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులతో రిమాండ్‌కు తరలిస్తున్నారు. కానీ, జగన్మోహాన్రెడ్డి మీద మీరు ఎన్ని పోస్టులైన పెట్టొచ్చా? మీ మాటలకు, చేతలకు పొంతనలేదు. ఉచిత ఇసుక ఎక్కడా అమలుకావడంలేదు. ఇలా ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు?ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ అరెస్టు..అల్లు అర్జున్ అరెస్టు నూటికి నూరుశాతం ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సా«ధింపులా ఉంది. నాలుగు రోజులు జైలులో ఉంచాలని చూసినట్లుగా ఉంది. తొక్కిసలాట సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదా? ఈ విషయంలో ఏపీలో ఒక చట్టం, తెలంగాణాలో ఒక చట్టం అమలవుతోంది. గత గోదావరి పుష్కరాల్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోతే ఆనాడు చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనబడలేదు. అప్పుడాయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి. -
చంద్రబాబు విజన్ పేదల పాలిట శాపం: కన్నబాబు
సాక్షి, కాకినాడ: సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన తాజా విజన్-2047 ఆచరణకు పనికి రాని ఒక డ్రామా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక స్వయం ప్రకటిత విజనరీ అని, గతంలో ఆయన ప్రకటించిన రెండు విజన్లలోని లక్ష్యాలను ఏ మేరకు సాకారం చేశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విజన్ అంటేనే పేదవారి విధ్వంసంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కొత్తసీసాలో... పాతసారాగతంలో చంద్రబాబు రెండుసార్లు విజన్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశాడు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశాడు. ఈ దేశంలో తానే ఒక గొప్ప విజనరీగా భ్రమపడే చంద్రబాబు, ప్రజలను కూడా తన పబ్లిసిటీ స్టంట్లతో భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగానే ఈ తాజా విజన్ 2047 డాక్యుమెంట్. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కొత్త సీసాలో పాత సారా.1995-2004 మధ్య, 2014-19 మధ్య సీఎంగా చంద్రబాబు ప్రకటించిన రెండు విజన్లలో ఒక్క లక్ష్యాన్ని అయినా సాధించిన దాఖలాలే లేవు. చంద్రబాబు తాజాగా విజన్-2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. రెండు మూడు రోజుల నుంచి మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైనే ప్రచారం చేసుకుంటున్నాడు. జనాలను మభ్యపెట్టడం ఎలా అనే అంశంపై చంద్రబాబు పుస్తకం రాస్తే, ఈ ప్రపంచంలోనే అత్యధికంగా అది అమ్ముడు పోతుంది. ప్రజలకు ఏం కావాలనేది ఆయనకు అక్కరలేదు. కానీ వారిని భ్రమల్లో ఉంచడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం ఎవరికీ లేదు. దానిలో భాగమే ఈ తాజా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ'విజన్-2020 చంద్రబాబు-420'చంద్రబాబు గతంలో రిలీజ్ చేసిన విజన్-2020, విజన్-2029 అనే డాక్యుమెంట్ డ్రామాలు ప్రజలను ఎలా మోసం చేశాయో కమ్యూనిస్ట్‌లు ఆనాడే ప్రజలకు గుర్తు చేశారు. గతంలో ఆయన ప్రకటించిన డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన కమ్యూనిస్ట్ లు విజన్-2020 చంద్రబాబు-420 అనే నినాదం కూడా చేసేవారు. అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు విజన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఆనాడు ఎలా ఆలోచించాడో, నేడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు విజన్-2047 అంటూ కొత్త రాగాన్ని ఆలపిస్తే, కూటమిలోని భాగస్వాములు దానికి తప్పెట్లు, తాళాలతో ఆయన చాలా గొప్పనాయకుడు, వంద ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించాలని కీర్తిస్తున్నారు.ప్రజాశ్రేయస్సుకు దూరంగా చంద్రబాబు విజన్2024లో ప్రజలు చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేయాలి, వారి అవసరాలు ఏమిటీ అని ఆలోచించకుండా విజన్ 2020లో ఏం చెప్పారో ఇప్పుడు 2047 విజన్లోనూ అవే చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. కానీ ఈ రాష్ట్రంలో నేటికీ తాగునీరు అందని గ్రామాలు, విద్య, వైద్యం, రహదారులు, కరెంట్, కనీస సదుపాయాలు లేని పల్లెలు ఉన్నాయంటే అత్యధిక కాలం సీఎంగా చేసిన చంద్రబాబుకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇది ఎలాంటి విజన్? కనీస అవసరాలు తీర్చే విజన్ లేకుండా, తనకు తానే భ్రమల్లోకి వెళ్ళి ప్రజలను కూడా భ్రమల్లోకి నెట్టడం సమంజసమా? విజన్ 2020 తరువాత రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి 2.4 శాతం నుంచి 0.29 శాతానికి పడిపోయింది, రాష్ట్ర జీడీపీ ఏకంగా 5 శాతం లోపే నమోదు అయిన విషయం వాస్తవం కాదా?సూపర్ సిక్స్ హామీల అమలుపై మీ ప్రణాళిక ఏదీ?వరుసగా విజన్ లను ప్రకటిస్తున్న చంద్రబాబుకు ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు మాత్రం గుర్తుకు రావడం లేదు. సూపర్ సిక్స్ అని ఇచ్చిన హామీల్లో ఒక్క పథకంలోనూ ఒక్క రూపాయి పేదలకు సాయం చేయకుండా గాలికి వదిలేశారు. రైతులను ఆదుకోవాలనే విజన్ అంతకన్నా లేదు. 2014 కి ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీని అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. వ్యవసాయమే దండుగ అనే విధంగా పాలన సాగించారు. నేడు మళ్ళీ సీఎంగా అధికారంలోకి రావడానికి రైతులకు రూ.20 వేల సాయం అంటూ హామీ ఇచ్చారు. దానిని కూడా ఆరునెలలైన అమలు చేయడం లేదు. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తేశారు ధాన్యం కొనుగోళ్ళు చేయడం లేదు, గిట్టుబాటు ధర కల్పించడం లేదు. నిలువునా రైతులను దగా చేస్తున్న మీరు విజన్ 2047లో రైతులను ఉద్దరిస్తానని చెబుతుంటే, ప్రజలు నవ్వుకుంటున్నారు.విద్య-వైద్య రంగాలపై చంద్రబాబు విజన్ అధ్వాన్నంఈ రోజు మాకు కడుపు నిండా అన్నం పెట్టాలని పేదలు కోరుతుంటే... 2047లో పరవాణ్ణం పెడతానని చంద్రబాబు ఊరిస్తున్నాడు. పేదరికం వల్ల ఇబ్బంది పడకూడదని ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ సీఎంగా ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలను తీసుకువచ్చారు. విద్యా, వైద్యరంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అదే ఒరవడిని సీఎంగా వైఎస్ జగన్ మరింత ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయడం లేదు. జగన్ సీఎం అయ్యే వరకు పాఠశాలలకు సరిపడిన భవనాలు లేవు, పిల్లలు కూర్చునేందుకు బెంచీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడుకునేందుకు టాయిలెట్లు లేవు, కనీసం చాక్ పీస్ లు కూడా లేవు.పాఠశాలలను తీర్చిదిద్దాలనే విజన్ ఏనాడైనా చంద్రబాబుకు ఉందా? విద్యను, వైద్య రంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే ప్రాజెక్ట్‌లను తీసుకు రాకుండా, తాను విజనరీని అని చంద్రబాబు ఎలా చెప్పుకుంటారు? కాకినాడ జనరల్ ఆసుపత్రిలో సరిపడా ఇన్సులిన్ లేదు. ఇది మీ ప్రభుత్వ పరిస్థితి. మేం వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో గ్రామస్థాయిలో సరిపడినన్ని మందులతో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తే, చంద్రబాబు సీఎం కాగానే దానికి మంగళం పాడారు. అటువంటి మీరు విజన్ ద్వారా అభివృద్ధిని, సంతోషాన్ని ఇస్తానని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.విజన్-2020 ద్వారా ప్రైవేటీకరణకు పెద్దపీట వేశారు1998లో చంద్రబాబు ప్రభుత్వం మెకన్సీ అనే విదేశీ కన్సల్టెన్సీకి దాదాపు రూ.2.5 కోట్లు చెల్లించి విజన్ 2020 రూపొందించుకున్నారు. దీనిని చూసి ప్రపంచంలోని నిపుణులు ఆశ్చర్య పోయారు. చంద్రబాబు ప్రపంచంలోని ప్రముఖుల ప్రశంసలు కావాలనే ఆలోచనతో నేను సీఎంను కాదు, సీఈఓను అని ప్రకటించుకున్నారు. మెకన్సీ చేసిన విజన్-2020 డాక్యుమెంట్ చూస్తే విద్యా, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేసి, ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదించారు. అంటే ప్రజలకు ఉచితంగా విద్యా, వైద్యంను అందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని, ప్రైవేటువారికి ఇవ్వాలనే లక్ష్యం మీకు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఇదేనా మీ విజన్? స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి మెరుగైన వైద్యాన్ని ఉచితంగా పేదలకు చేరువ చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ ద్వారా పేదలకు కూడా ఉన్నత విద్యను అందించారు. ఇది కాదా నిజమైన విజన్ అంటే?ప్రజాభాగస్వామ్యం లేని విజన్ ఇదిచంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్ లో ప్రజాభాగస్వామ్యం ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలోని మేధావులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారా? రైతులు, ప్రజల ముందు పెట్టి వారి అభిప్రాయాలు కోరారా? దీనిపై ఎక్కడైనా చర్చకు పెట్టారా? చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులకు చెందిన ఎన్జీఓ సంస్థలతో ఈ విజన్ తయారు చేయించారు. అంతేకానీ నిజంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఎటువంటి లక్ష్యాలు ఉండాలి అనే ఆలోచనలు దీనిలో లేవు. గతంలో విజన్ 2020 ప్రకటించిన తరువాత 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు.విద్యుత్ రేట్లను పెంచడం, అడిగిన రైతులపై కాల్పులు చేయించారు. ఆనాడే కమ్యూనిస్ట్ లు చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడ మళ్ళీ విజన్ 2047 అంటున్నాడు. పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి ఒక్క పోర్ట్ అయినా కట్టాడా? ఒక ఫిషింగ్ హార్బర్ కట్టాడా? తెచ్చిన ఒక కాకినాడ సీపోర్ట్ ఎడిబి రుణంతో నిర్మించి, తర్వాత తనకు కావాల్సిన వారికి దారాదత్తం చేశారు. జగన్ గారు 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, అందులో 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నాడు. మాకు మెడికల్ కాలేజీ సీట్లువద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబుది విజనా? వైద్యవిద్య ఈ రాష్ట్రంలో బలపడాలన్న లక్ష్యంతో పనిచేసిన వైఎస్ జగన్‌ది విజనా?చంద్రబాబు విజన్ పేదవారి పాలిట శాపంవైఎస్ జగన్ గ్రామస్థాయిలోకి పాలన వెళ్ళాలని వాలంటీర్లు, సచివాలయాలను తీసుకువస్తే, వాటిని నిర్వీర్యం చేసిన చంద్రబాబుది ఎటువంటి విజన్? 2020 డాక్యుమెంట్ లో ఏ లక్ష్యాలను సాధించారు? 2047లో పదిసూత్రాలు అంటున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెడితే నవ్వుతారు. పండిన ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించలేని మీరు సెకండరీ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నారు. పేదరికాన్ని తగ్గించడానికా, పెంచడానికా మీ విజన్? జగన్ గారు అమ్మ ఒడి, ఆసరా, చేయూత ఇలా సంక్షేమ పథకాలను అయలు చేస్తే, మీరు మాత్రం వాటిని పక్కకుపెట్టారు.వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం, ఉన్న ఉద్యోగాలను తీసేయడం ఇది చంద్రబాబు విజన్. సంపద సృష్టి ఎవరికోసం చేస్తున్నారు. మీ కోసం సంపదను మీరే సృష్టించుకుంటున్నారు. అంతేకానీ ప్రజలకు సంపదను సృష్టించే ప్రయత్నం చేయడం లేదు. పైగా వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా రూ.15వేల కోట్లు ప్రజలపై భారం వేయడాన్ని సంపద సృష్టి అంటారా? ఈ రోజు పంచాయతీల్లో పన్నులను పెంచి ప్రజలపై భారం వేయబోతున్నారు.14 ఏళ్లు చంద్రబాబు పాలనలో రెవెన్యూ లోటుఎంతో విజన్ ఉన్న చంద్రబాబు తన పాలన 14 ఏళ్ళలో ప్రతిఏటా రెవెన్యూ లోటుతోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఇన్ని సంవత్సరాల పాటు రెవెన్యూ లోటు మరే ప్రభుత్వంలోనూ లేదు. ఇదేనా మీ పాలనా సామర్థ్యం? కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక ఐఎఎస్ అధికారి వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15వేల కోట్లు రుణం మంజూరయ్యింది. దీనిలో 3700 కోట్లు ముందే వచ్చేస్తుంది, దీనితో అమరావతిలో పనులు వెంటనే ప్రారంభించవచ్చు అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. రూ.15 వేల కోట్ల అప్పు దొరికిందని ఆనందిస్తున్నారే కానీ, పేదలకు పదిరూపాయలు ఖర్చు చేయడంలో ఉన్న ఆనందాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులను సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. మీ ప్రభుత్వంలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులపై బెదరింపులు, వేధింపులే. కలెక్టర్ లను బెదిరిస్తున్నారు. సెన్సేషనలిజంను ఈ ప్రభుత్వం నమ్ముకుంది. తిరుపతి లడ్డూ, కాకినాడ పోర్ట్, రేషన్ బియ్యం ఇలా ఏదో ఒక అంశాన్ని తీసుకుని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువెళ్లడం, దానిపై ప్రజలకు అబద్దాలు చెబుతూ మభ్య పెట్టడంను ఒక వ్యూహంగా అమలు చేస్తున్నారు. మంచి జరిగితే మాదే అంటున్నారు. సరిగా జరగకపోతే అధికారుల వైఫల్యం అంటారా?చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన లేదుఅధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల్లో రూ.70 వేల కోట్లు అప్పులు తెచ్చారు. దానిలో కనీసం ఇంత మొత్తం మా హామీల కోసం ప్రజలకు ఖర్చు చేశామని చెప్పుకునే పరిస్థితి లేదు. వైయస్ఆర్ సిపి కార్యకర్తలపైనా, సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపైనా తప్పుడు కేసులు పెడుతున్నారు. జగన్ గారిని విమర్శించే వారిపై ఫిర్యాదు చేసినా మీ ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం కేసు కూడా రిజిస్టర్ చేయడం లేదు. ఇదేనా మీ రూల్ ఆఫ్ లా. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసే నాయకులపై చర్యలు తీసుకోకుండా, వారిని కాపాడుకుంటున్నారు. స్టేజీపై మీ మాటలకు, చేతలకు పొంతన లేదు. అలాంటి మీరు ప్రకటించే విజన్ ఎంత వరకు ఆచరణాత్మకంగా ఉంటుంది?2047 వరకు మీరే అధికారంలో ఉంటారా?విజన్ 2047 వరకు అధికారంలో మీరు ఉంటారా? ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చూడండి. తరువాత కలలు కనండి. ప్రణాళికలతోనే సరిపెట్టకూడదు, అమలు కూడా చూడాలి. అయిదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దీనిపై మీ ప్రణాళిక ఏమిటో బయటపెట్టండి. కనీసం మీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వార్షికోత్సవంలో అయినా వెల్లడించండి. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీకి దిక్కులేదు, విజన్ 2047 అంటున్నారు. ఇదంతా డ్రామా కాదా?సినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్రసినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపులో భాగంగానే జరిగింది. శుక్రవారంనాడు అరెస్ట్ చేసి జైలుకు పంపి కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా ఉండే కుట్ర దీనిలో ఉంది. ఆయన వెళ్ళిన థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, మరో బాలుడు గాయపడటం బాధాకరం. అయితే ఈ సంఘటనకు తెలంగాణ పోలీస్ వైఫల్యం లేదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం లేదా? అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో మీరు చూపించిన శ్రద్ద మీ యంత్రాంగం వైఫల్యంపైఎందుకు చూపడం లేదని ప్రశ్నిస్తున్నాం.రాజమండ్రి తొక్కిసలాటకు చంద్రబాబును బాధ్యుడిని చేయలేదేగతంలో ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటల్లో చాలా ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనలను అడ్డం పెట్టుకుని కక్షసాధించే విధంగా చర్యలు తీసుకుంటే ఆనాడు రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన ఘటనలో చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండేవారు కాదా? ఆ ఘటనలో 27 మంది చనిపోయారు. కనీసం నా వల్ల తప్పు జరిగిందనే పశ్చాత్తాపం కూడా చంద్రబాబు వెల్లడించలేదు. ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదు.అసలు ఆ సంఘటనకు ఎవరూ బాధ్యులే లేరా? అంతేకాదు గత ఎన్నికల్లో గుంటూరులో చంద్రబాబు సభలో చీరెలు పంచడానికి వెడితే తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. కందుకూరులో ఒక ఇరుకు సందులో జనం కనిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సభ పెడితే కాలువలో పడి ఎనిమిది మంది మరణించారు. దీనికి బాధ్యుడిని చేస్తూ చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. ఈ ఘటనల్లో ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? ఇవి ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలు, వీటిని తమకు గిట్టని వారికి వ్యతిరేకంగా తప్పుడు కేసులు బనాయించే సందర్భాలుగా మలుచుకోవడం బాధాకరం.తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే ఇదిఅల్లు అర్జున్ హీరో నటించిన సినిమా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకుంది. ఆయన ఒక థియేటర్ కు వస్తున్నాడు అంటే పోలీసులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. మామూలు వస్త్రాలయాల ప్రారంభోత్సవాలకు సినిమా నటులు వస్తున్నారంటేనే రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి. సినీ నటులపై ప్రజల్లో క్రేజ్ ఉంది. అటువంటి సందర్భంలో ముందు జాగ్రత్తగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాలి. తొక్కిసలాట జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేయాలి.దానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించినట్లు కనిపిస్తోంది. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. చట్ట ప్రకారం అరెస్ట్ చేసే ముందు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారా, ముందస్తు విచారణకు పిలిచారా? ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసినట్లు కాదా? దీనిని మాజీ సీఎం జగన్ గారు తీవ్రంగా ఖండించారు. జాతీయ మీడియా కూడా ఇది తప్పు అని చెబుతోంది. కేంద్రంలోని మంత్రులు కూడా దీనిని ఖండించారు.సెన్సెషనలిజం కోసమే పాలకుల చర్యలుఅల్లు అర్జున్ అరెస్ట్ ను సెన్సేషనలిజం కోసమే చేసినట్లు కనిపిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు. అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్, ఇక్కడ సోషల్ మీడియా యాక్టివీస్ట్ ల అరెస్ట్ లు ఒకేరకంగా సాగుతున్నాయి. ఈ విధానాలు సరైనవి కావు. -
ఇదే మీ చేతగానితనానికి నిదర్శనం: అవినాష్‌రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: సాగునీటి సంఘాల ఎన్నికలను పోలీసుల్ని అడ్డుపెట్టుకుని నిర్వహించడం కూటమి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శమని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విమర్శించారు. సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలపై అవినాష్‌రెడ్డి మండిపడ్డారు.‘బీటెక్ రవి మాటలు సినిమాను తలపిస్తున్నాయి. సినిమా డైరెక్టర్ నిర్మాత, ప్రేక్షకుడు అన్నీ ఆయనే, ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అప్రజాస్వామికంగా సాగునీటి ఎన్నికలు జరిగాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికలు చేయడం చేతకానితనం. ఎన్నికల్లో రైతులు పోటీ చేయాలంటే, నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎన్నికలు కోరుకునే వారైతే.. ప్రతి రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేది. వీఆర్ఓలను అందుబాటులో పెట్టకుండా అందరిని ఎమ్మార్వో కార్యాలయంలో దాచారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే బీటెక్ రవి చొక్కా విప్పేవారు రైతులు. ఖైదీలను బంధించినట్లు వీఆర్ఓలను ఎమ్మార్వో కార్యాలయంలో ఎందుకు బంధించారు. రైతులు మీకు ఎందుకు ఓటేస్తారు?, ఈ క్రాఫ్ విధానం రద్దు చేస్తామన్నారు మరి ఎందుకు రద్దు చేయలేదు?, రైతులకు నో డ్యూస్ ఇవ్వకుండా అడ్డుకున్న దద్దమ్మవి నీవు. జమ్మలమడుగులో వీఆర్ఓలను దేవగుడిలో బంధించినది వాస్తవం కాదా?.’అని విమర్శల వర్షం కురిపించారు. -
పెడన టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి యత్నం
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గం నీటి సంఘం ఎన్నికల్లో టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎలక్షన్ ఆఫీసర్‌పై కత్తితో దాడికి యత్నించారు. పామర్తి వెంకటేశ్వరావును పెడన మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ బలపరచగా, పామర్తి బ్రహ్మయ్యను నందిగామ సర్పంచ్ బొడ్డు సీతయ్య (చినబాబు) బలపర్చారు. ఎన్నికల్లో బ్రహ్మయ్యకు 10 ఓట్లు, వెంకటేశ్వరరావుకు 2 ఓట్లు వచ్చాయి.ఎన్నిక పూర్తయిన తర్వాత ఓటమిని తట్టుకోలేకపోయిన పామర్తి వెంకటేశ్వరరావు.. ఇంటికెళ్లి కత్తి తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి వద్ద ఉన్న పత్రాలు లాక్కునేందుకు యత్నించారు. పత్రాలు ఇవ్వకపోవడంతో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్‌పై కత్తితో దాడికి యత్నించారు. దాడిని అడ్డుకోవడంతో మధుశేఖర్ చేతికి స్వల్పగాయమైంది. దాడి అనంతరం తన చేతిని గాయపరచుకుని పామర్తి వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. పామర్తి వెంకటేశ్వరరావుపై ఎన్నికల అధికారి మధుశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సీఐ ఓవరాక్షన్.. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసు ప్రవర్తన
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ నోరు పారేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న సచివాలయం దగ్గరికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీవు ఎవరు మాకు చెప్పడానికంటూ మాజీ ఎమ్మెల్యేపై సీఐ దురుసుగా వ్యవహరించారు. పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎన్నికలను రాజకీయాలకతీతంగా నిర్వహించాల్సి ఉండగా సంఘాల్లో కేవలం టీడీపీ మద్దతుదారులు ఉండాలనే లక్ష్యంతో అధికారులను రంగంలోకి దింపింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఎన్నికలు అంతా ఏకపక్షంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 123 నీటి వినియోగదారుల అసోసియేషన్లు, 10 డిస్ట్రిబ్యూటరీ, 2 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, కేసీ కెనాల్, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని మేజర్ చెరువుల కింద భూములు ఉన్న ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ఎన్నికలకు కూటమి పార్టీ నేతలు రాజకీయ రంగులద్దారు. -
ఏపీలో రెడ్ బుక్ పాలన.. రాజ్యాంగంపై చర్చలో ఎంపీ గురుమూర్తి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోందని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున ఆయన పాల్గొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతోందని.. కూటమి ప్రభుత్వం కేవలం వట్టి మాటలకే పరిమితమైందన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, పారదర్శకతకు అద్దం పట్టిందన్న గురుమూర్తి.. జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత లాంటి పథకాలు అణగారిన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.ఈ పథకాలు ఆయా వర్గాలను పైకి తీసుకొచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, వారి అభివృద్ధికి పాటుపడ్డారు. రాజ్యాంగం ఒక జీవన పత్రం. అసమానతలను తగ్గించే ఒక సాధనం రాజ్యాంగం. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సోదర భావనకు రాజ్యాంగం పెద్దపీట వేసింది. కేశవానంద భారతి కేసు రాజ్యాంగం పునాదులను మరోసారి నిర్వచించింది. 75 ఏళ్ల ఈ రాజ్యాంగ ప్రయాణంలో ఎంతో ప్రగతి సాధించాం.’’ అని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. అనేక కోట్ల మంది ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మన రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని ప్రకటించారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ ఎకానమీ నుంచి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది.ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట..అక్షరాస్యతలో 74 శాతం సాధించాం. జీవన స్థాయి 70 ఏళ్లకు పెరిగింది. వాతావరణం మార్పులు జీ-20 విషయాల్లో భారత ప్రపంచం నాయకత్వం వహిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక సమానతలు ఇంకా సవాలుగానే పరిణమిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, లింగ అసమానత్వాన్ని రూపుమాపితేనే నిజమైన సమానత్వం వస్తుంది’’ అని ఎంపీ గురుమూర్తి చెప్పారు. -
ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్‌కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇస్తున్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక.. ‘‘వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని’’ వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా..పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. తొలి విడతగా రైతులు, కరెంట్ ఛార్జీలు, స్కూల్ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: బాబు దగా పాలన.. తొలిపోరు విజయవంతంకూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో వైఎస్సార్సీపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్సీపీ పిలుపుఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలుప్రజలపై రూ.15,500 కోట్ల కరెంట్ భారం వేసిన చంద్రబాబు ప్రభుత్వంఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటంజనవరి 3న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ధర్నాలు -
కడపలో పోలీసుల ఓవరాక్షన్.. అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతల టార్గెట్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వైఎస్సార్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటి తీరువా బకాయిలు ఉంటే పోటీకి నో..సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి తీరువా బకాయిలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు నీటి తీరువా బకాయిలు లేవని వీఆర్వోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సాధారణంగా నో డ్యూ సర్టిఫికెట్లను ఆ సాగునీటి సంఘాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు జారీ చేస్తారు.అయితే ఇప్పుడు సాగు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వీఆర్వోలకు కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే కూటమి శ్రేణులు దాడులు చేసి.. భయోత్పాతానికి గురిచేస్తున్నాయి.ఇక, రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి, దోచుకోవాలనే దురాలోచనతో అరాచకాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించేలా చట్టాన్ని సవరించింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెరతీసింది. ఇతర పార్టీల మద్దతుదారులు సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్ర చేస్తోంది. -
సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు జరుగుతున్న ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కో–ఆర్డీనేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన, వారి అభిప్రాయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు.కాన్ఫరెన్స్‌లో నేతలు ఏం చెప్పారంటే..సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి, కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగంకు పాల్పడుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే అడిగిన చోట్ల సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిది. కానీ దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారుపోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని ప్రశ్నించిన పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్‌లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు, తమకు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో రౌడీయిజానికి కూడా దిగుతున్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ పోరుబాట సక్సెస్.. వైఎస్ జగన్ కీలక ట్వీట్వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపైనా దాడులకు దిగడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు తెగబడుతోంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేయొద్దని, కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసగా ఈ ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతల నుంచి వచ్చిన స్పందనను పార్టీ అధినేత వైయస్ జగన్‌కు నివేదించిన నేపథ్యంలో సాగునీటి ఎన్నికలను బహిష్కరించడం ద్వారా కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. కేసులు బనాయించి మరీ అతడ్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సమ్మతం కాదని తీవ్రంగా ఖండించారాయన.హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనన్న వైఎస్ జగన్.. ఆ సమయంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి.. ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అయితే ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ను బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? అని వైఎస్జగన్ ప్రశ్నించారు. తన ప్రమేయం లేకున్నా నేరుగా ఆయన్ని అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదని.. అరెస్టును ఖండించారు.హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్ -
వైఎస్సార్సీపీ పోరుబాట సక్సెస్.. వైఎస్ జగన్ కీలక ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం అయ్యిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. రైతులకు తోడుగా నిలిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.‘‘ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబూ.. ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఇ-క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300-400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా? ..దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకు వస్తే, ఆ ఉచిత పంటలబీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డుపడ్డం చంద్రబాబుగారి రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ చెప్పారు.దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయ్యింది. @ncbn గారు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024 ‘‘మరోవైపు నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలిసి చంద్రబాబు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సర్టిఫికెట్లు వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? తహశీల్దార్ కార్యాలయాలకు రమ్మని చెప్పి, అక్కడ పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారిచేత దాడులు చేయించడం న్యాయమేనా? నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా? ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు చేయడం మీ అరాచకపాలనకు నిదర్శనం కాదా?..ఎంపీ అవినాష్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? అలాంటప్పుడు నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? మీకు నచ్చినవారిని నామినేట్ చేసుకుంటే సరిపోతుందిగా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఓవైపు డప్పాలు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేస్తున్నది నిజం కాదా? అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీటి సంఘాల ఎన్నికలను ఖండిస్తూ, బహిష్కరించాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. రైతుల తరఫున ఎప్పుడూ వారికి అండగా ఉంటూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం? -
ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?
‘‘పాలనలో వేగం పెంచండి’’, ‘‘జనం మెచ్చేలా, మనం నచ్చేలా పాలన’’ అధికారుల వల్లే అసంతృప్తి’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలివి. ఎన్నికల హామీ అమలుపై చర్చ కాదు కదా.. కనీస ప్రస్తావన కూడా లేకుండా సాగిన ఈ సమావేశాన్ని గమనిస్తే దీనికో లక్ష్యమంటూ ఉందా? అన్న సందేహం రాకమానదు. నిర్దిష్ట సూచన, సలహాలు లేకుండా కలెక్టర్లదే బాధ్యతంతా అన్నట్టు చంద్రబాబు వ్యవహరించడం ఎవరిని మభ్యపెట్టేందుకు? వైసీపీ అధికారంలో ఉండగా జగన్ కలెక్టర్ల సమావేశం పెడితే ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీ పత్రాలను దగ్గర పెట్టుకుని వాటి అమలుపై సమీక్ష జరిగేది. అమలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చ జరిగేది. ఇప్పుడు అవేవీ లేవు. చంద్రబాబు తమ సూపర్ సిక్స్ హామీల గురించి కలెక్టర్లతో మాట్లాడే ధైర్యమూ చేయలేకపోతున్నారు. బాబే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో సంబంధం లేని మాటలు నాలుగు మాట్లాడి సమావేశాలను మమ అనిపిస్తున్నారు.ఎస్పీలతో సమావేశాలు కానీ.. కలెక్టర్లతోనైనా కూడా తమ అధికారాన్ని ప్రదర్శించడం తప్ప వీరు చేసిందేమిటన్న ప్రశ్న వస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే కదా.. జనం మెచ్చేది.. పాలకులు నచ్చేది? బదులుగా బాధ్యతంతా అధికారులదే అని చేతులు దులిపేసుకుంటే.. వారి వల్లే తాము ప్రజలకు నచ్చడం లేదూ అంటే ఎలా? రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశం ఎజెండాలో సూపర్ సిక్స్ లేకపోవడం గమనించాల్సిన విషయం. వీటి అమలుకు నిధులెన్ని కేటాయిస్తున్నారో చెప్పకుండా కలెక్టర్లు బాగా పనిచేయాలని అంటారు. ప్రజా ప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోవాలని కూడా చెబుతున్నారు. ఇవి చేస్తే అది జనం మెచ్చే పాలన ఎలా అవుతుంది? ఈ నేపథ్యంలోనే జనంలో తిరుగుబాటు వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే ఈయన ఒకసారి అంతా బాగున్నట్టు.. అప్పుడప్పుడూ ఇలా బాలేనట్లు పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగాల్లోని వైరుద్ధ్యాలు ఎంతో ఆసక్తికరం. చంద్రబాబేమో... ప్రజలతో గౌరవంగా ఉండండని అంటారు. అంతవరకూ ఓకే కానీ ఇది ఐఏఎస్‌లకే కాకుండా ఐపీఎస్‌లకూ వర్తిస్తుంది. టీడీపీ, జనసేన కూటమి నేతలు పోలీసులను తమ ఇష్టానురీతిలో వాడుకుంటూ పౌరులపై దాడులు చేయిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ వీటిని సమర్థిస్తూ.. ఇంకోపక్క సుభాషితాలు చెబుతూండటం విని కలెక్టర్లు నవ్వుకోవడం మినహా ఏమి చేస్తారు! రాష్ట్రం గాడిలో పడుతోందట..చీకట్లు తొలగిపోతున్నాయట. ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చిందట.. చంద్రబాబు ఇలాంటి మాటలు ఎవరిని మాయ చేయడానికి చెబుతున్నారు? వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల హింస, అత్యాచారాలు, వేధింపులు జరుగుతుంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అనడం అంటే ఎంత దారుణం! గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. అధికారులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు.ఇదే కలెక్టర్ ల సమావేశంలో పవన్ కళ్యాణ్ శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు. సీఎంను అడిగి రూ.30 కోట్ల నిధులు తీసుకుని జీతాలు ఇప్పించామని అన్నారు. మున్సిపాల్టీలలో పారిశుద్ద్య కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. పది లక్షల కోట్ల అప్పులు పేరుకున్నాయని చంద్రబాబు అన్నారు. కొద్దికాలం క్రితమే ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని శాసనసభలో చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం, మళ్లీ పాత పాటే పాడుతోంది. కొత్త అప్పులు చేద్దామంటే ఎఫ్ ఆర్ బిఎమ్ అనుమతించడం లేదట. ఇప్పటికి సుమారు డెబ్బై వేల కోట్ల అప్పు చేసి మరీ ఇంకా రుణాలు రావడం లేదని అంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా గతంలో ఎప్పుడూ తాను చూడలేదని పచ్చి అబద్దం చెబుతున్నారు.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో 1999 2004లో పనికి ఆహారం బియ్యం పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన ఏభై లక్షల టన్నుల బియ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన విషయం శాసనసభలోనే పెద్ద రగడ జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆ పార్టీ, ఈ పార్టీ అని ఉండదు. అది తెలిసినా, వైఎస్సార్సీపీ పై బురద చల్లడం కోసం ఇలాంటి అసత్యాలు చెబుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమ రవాణా ఆగడం లేదని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు కదా! మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు ఎగుమతి చేసిన బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నాయా? లేవా? అన్నది ఎందుకు తనిఖీ చేయలేదు? రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలలోను ఉందని కేశవ్ అన్న విషయంపై చంద్రబాబు ఏమి చెబుతారు? వైసీపీ ప్రభుత్వంలో పోర్టులు, సెజ్ లు కబ్జాకు గురయ్యాయట. జగన్ ప్రభుత్వపరంగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తుంటే వాటిని నిలిపి ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించాలని చూస్తున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారు.కాకినాడ సెజ్ లో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు చేసిన భూ దందాపై సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖకు చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా! అధికార యంత్రాంగంలో పాత వాసనలు పోవడం లేదట. ఆయనకు తెలియకుండా వారు పనులు చేస్తున్నారట. కుమారుడు లోకేష్ కనుసన్నలలో అన్నీ జరగుతున్నాయని టీడీపీలో టాక్. కాని తనకు చెప్పడం లేదని ముఖ్యమంత్రి అనడంలో ఆయన బలహీనత తెలుస్తూనే ఉంది కదా! అమరావతి ప్రారంభ దశలో రూ.ఏభై వేల కోట్ల అవసరం అని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఒక్క రూపాయి ఖర్చు చేయనవసరం లేదని, అది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన విషయాన్ని మాత్రం చంద్రబాబు ప్రస్తావించరు. చంద్రబాబు ఒక్క నిజం చెప్పినట్లుగా ఉంది. ఇంతవరకు కేవలం నలభైవేల మందికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయని తెలిపారు. ఎల్లో మీడియా ఇప్పటికే లక్షల మంది గ్యాస్ సిలిండర్లు పొందినట్లు ప్రచారం చేస్తుంటే, చంద్రబాబు పొరపాటున వాస్తవం చెప్పేసినట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలలో జగన్ పాలనలో జీఎస్డీపీ సుమారు 12.5 పెరిగిందని పార్లమెంటులో ప్రకటిస్తే, చంద్రబాబు మాత్రం ఆదాయం తగ్గిందని చెబుతున్నారు.జగన్ టైమ్ లో కరోనా రెండేళ్లు సంక్షోభాన్ని సృష్టించినా, దానిని తట్టుకుని నిలబడితే ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ ఎందుకు తగ్గిందో చెబితే ఒట్టు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం,తదితర సమస్యలపై మాత్రం నిర్దిష్ట హామీ ఇవ్వలేకపోయారు. వచ్చే సీజన్ లో చూద్దామని చెప్పి వదలి వేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా యథాప్రకారం తెలిసి, తెలియనట్లు మాట్లాడారనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు కనుక అక్రమాలను అడ్డుకుంటే మంత్రులు వెళ్లనవసరం లేదట. అదేమిటో అర్థం కాదు. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్లు చేయాలని ముఖ్యమంత్రి చెబుతారు. ఇంకోవైపు అధికారులు నిస్సహాయంగా ఉండవద్దని అంటారు. వ్యవస్థ మూలాలను గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని, పాత సినిమా డైలాగులనే ఆయన వల్లిస్తున్నారు.కాకపోతే ఒక్క వాస్తవం చెప్పారు. ప్రజలు ఆశలను నెరవేర్చలేకపోతున్నామని, తిరగబడే ప్రమాదం ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్ ల పరిస్థితి ఏపీలో ఉందని చెప్పడం మాత్రం విశేషమే. ఇదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కదానిని కూడా సరిగా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, దానివల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోందని జగన్ అంటున్నారు. చంద్రబాబు అబద్దాలు మోసాలుగా మారాయని, అదే ప్రజలలో కోపంగా మారుతున్నాయని, తమకు హామీ ఇచ్చిన విధంగా పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నెలకో రకంగా గోబెల్స్ ప్రచారం చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చిత్తశుద్ది ఉంటే, వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళికను దగ్గర పెట్టుకుని, ఎన్నికల సమయంలో ఏమి చెప్పాం? ఏమి చేస్తున్నామన్న దానిపై ఎన్నడైనా సమీక్ష చేసుకున్నారా? ఆ పని చేయకుండా కలెక్టర్ల సమావేశాలు పెట్టి డ్రామాల మాదిరి కబుర్లు చెబితే ప్రజలకు అర్థం కాదా? ఐఎఎస్ పాసై వచ్చిన కలెక్టర్లు, సెక్రటరీలకు ఇందులోని మోసం తెలియదా?. ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి, ఇప్పుడు డబ్బులు లేవని కథలు చెబుతూ తమను ప్రజలు మెచ్చుకోవాలని ఉపన్యాసాలు ఇస్తే మెచ్చుకోవడానికి ప్రజలు పిచ్చివాళ్లా? కొసమెరుపు ఏమిటంటే ఈ సమావేశంలో కలెక్టర్లు సోది చెబుతున్నారని ఎల్లో మీడియా ఒక స్టోరీ ఇచ్చింది. ప్రభుత్వంలో విషయం లేకపోతే సోది చెప్పక ఏమి చేస్తారు? అందులోను నేతల సోది విన్న తర్వాత వారు మాత్రం అందుకు బిన్నంగా వెళతారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
YSRCP Poru bata: విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం, సాక్షి: కూటమి సర్కార్‌పై పోరుబాటలో భాగంగా.. ఇవాళ అన్నదాతకు అండగా కార్యక్రమం నిర్వహిస్తోంది వైఎస్సార్సీపీ. ఈ క్రమంలో రాష్ట్రమంతా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అయితే.. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.విశాఖ కలెక్టరేట్ వద్దకు వైఎస్సార్సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.మరోవైపు.. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు ఆ పార్టీ నేతలు. ‘‘ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి... సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ.20,000 ఇవ్వాల్సిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని గుడివాడ అన్నారు. -
‘రైతును రాజు చేస్తానన్న పవన్ ఎక్కడ?’
గుంటూరు, సాక్షి: ఏపీలో రోడ్డెక్కిన అన్నదాతలకు వైఎస్సార్సీపీ బాసటగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా.. రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మండిపడ్డారామె. సాక్షితో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోంది. రైతుల సంక్షేమం గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదు. పైగా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోంది. అకాల వర్షాలకు వరి ధాన్యం భారీగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి.రైతును రాజు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదుకోవాల్సిందే. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఇవాళ రైతు పోరుబాట అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యే భర్త మోసాలు! -
బీటెక్ రవి హల్చల్.. అధికారుల అండతో ఓవరాక్షన్
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. టీడీపీ నేతలు కొందరు అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తాజాగా నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో బీటెక్ రవి హల్ చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా బీటెక్ రవి రాజకీయం చేస్తుండటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ, కూటమి నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పులివెందులలో నీటి పన్ను నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు. గిడ్డంగివారిపల్లిలో బీటెక్ రవి తన అనుచరులతో కలిసి నో డ్యూ సర్టిఫికెట్లను చింపివేశారు. అలాగే, ఇనగలూరులో అధికారాలను అడ్డుపెట్టుకుని నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. నియోజకవర్గంలో తన అనుచరులను అడ్డుపెట్టుకుని బీటెక్ రవి హల్ చల్ చేస్తున్నాడు.ఇక, నో డ్యూ సర్టిఫికెట్ ఉంటేనే నామినేషన్ వేసేందుకు అర్హత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ నేతలకు నో డ్యూ సర్టిఫికెట్లు రాకుండా కూటమి నేతలు ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు.. పలుచోట్ల వీఆర్వోలు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరపాలని లేఖలో కోరారు. అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్లు వేస్తే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చేతకాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో అధికారుల తీరుపై ఆర్డీవో, డీఎస్పీకి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా అయితే శాంతిభద్రతల సమస్య వస్తుందని అధికారులకు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పీ.ఏ.సీ. మెంబర్‌గా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పామర్తి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడుగా పఠాన్ సలేహాఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.ఇదీ చదవండి: వారెవ్వా..! కుదిరితే ఎర.. లేకుంటే వధ్యశిల! -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని గొల్లల గూడూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఈసీ మహేశ్వర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. నీటి సంఘాల ఎన్నికలలో పోటీ చేసేందుకు తాహసిల్దార్ కార్యాలయంలో నీటి పన్ను కట్టేందుకు వెళ్లగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పన్ను కట్టేందుకు వెళ్లిన మహేశ్వర్ రెడ్డిని టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి, అతని అనుచరులు అడ్డుకుని బయటకు పంపించారు. మహేశ్వర్ రెడ్డి చేతిలోని కాగితాలను కూడా లాక్కున్న పార్థసారధిరెడ్డి చించివేశారు.అధికారులు సహకరించడం లేదు: వైఎస్సార్సీపీ ఫిర్యాదుజమ్మలమడుగు ఆర్డీవో, డీఎస్పీని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గురువారం కలిశారు. ఈ నెల 14న జరగనున్న నీటి సంఘాల ఎన్నికలకు అధికారులు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేతలకు సంబంధించిన నో డ్యూ సర్టిఫికెట్లను ఇవ్వకుండా కూటమి వర్గీయులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నీటి సంఘాల ఎన్నికల్లో లాండ్ ఆర్డర్ అదుపు తప్పే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.కాగా, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామాల్లోని సాగునీటి సంఘం ఎన్నికలు ఈ నెల 14న నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి నోటీఫికేషన్‌ను ఆయా ఎన్నికల నిర్వహణ కేంద్రాల వద్ద ప్రదర్శించారు. మండల పరిధిలో 10 సాగునీటి సంఘాలు ఉన్నాయి. కెనాల్ పరిధిలోని దువ్వూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట మండలాలతో సంబంధం ఉన్న మండలంలోని నీటి సంఘాలకు సైతం ఒకే రోజున ఎన్నిక నిర్వహించనున్నారు.దువ్వూరు కేసీ కెనాల్ పరిధిలోని 62 అన్నశా్రస్తులపల్లె, 63 మడూరు, 64 చియ్యపాడు, మైదుకూరు కేసీ కెనాల్ పరిధిలో 67 మడూరు, 68 ఉప్పరపల్లె, 69 అనంతపురం, 70 అనంతపురం, 71 సోమాపురం, 74 అల్లాడుపల్లె, 75 మిడుతూరు సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఒక సంఘానికి ఒక్కో చైర్మన్‌ను ఓటర్లు ఎన్నుకుంటారని, సాగునీటి సంఘాల చైర్మన్లు అందరూ మండల చైర్మన్ ఎన్నుకోనున్నారు.63వ సంఘానికి అన్నవరం జెడ్పీ హైసూ్కల్లో, 64 సంఘానికి చియ్యపాడు జెడ్పీ హైసూ్కల్లో, 67 సంఘానికి మడూరు గ్రామ సచివాలయం, 69వ సంఘానికి చాపాడు ఎంపీడీఓ కార్యాలయం, 70వ సంఘానికి చాపాడు జెడ్పీహైసూ్కల్, 71వ సంఘానికి సోమాపురం గ్రామ సచివాలయం, 74వ సంఘానికి లక్ష్మీపేట జెడ్పీ హైస్కూల్లో ఎన్నిక నిర్వహిస్తారు. 68వ సంఘానికి ప్రొద్దుటూరులో, 75వ సంఘానికి ఖాజీపేట, 62వ సంఘానికి దువ్వూరు మండలంలో ఎన్నిక చేపట్టనున్నారు. -
జగన్ పండగ చేస్తే.. చంద్రబాబు దండగ చేశారు: వైఎస్సార్సీపీ
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం రైతులను నిలువున ముంచేసిందని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనే నాధుడే లేడు. రేపు(శుక్రవారం) రైతుల తరఫున వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్లకు మెమోరాండం సమర్పిస్తారని ఆయన చెప్పారు.మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నరసరావుపేటలో మనం ప్రత్యక్షంగా చూశాం. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడని ఆమె మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండగ చేశారని.. కూటమి ప్రభుత్వం దండగ చేసిందన్నారు. బస్తాకు 400 రూపాయలు నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాం. ఉచితంగా పంటల బీమా కల్పించాం. ఏ సీజన్లో పంటకు నష్టం వస్తే అదే సీజన్లో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాం. కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసిందన్నారు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు పైన కేసులు బనాయిస్తోంది. ఇదే దృష్టి పాలన పైన పెట్టాలి. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.