breaking news
-
టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. ఇదే రిపీట్ అవుతుంది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకం చేశారు. మా పార్టీ కౌన్సిలర్లపై కేసులు పెట్టించి బెదిరించారు. కిడ్నాప్ చేసి తమవైపు లాక్కున్నారు. మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులన్నీ వైఎస్సార్సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్ చైర్మన్‌గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.అధికారం ఉందనే అహంకారంతో పదవులను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి నేతలు నేర్పుతున్న పాఠాలు భవిష్యత్తులో అన్ని పార్టీలు అవలంభిస్తాయి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?. నెల్లూరులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పోలీసులను అడ్డు పెట్టుకుని డిప్యూటీ మేయర్‌ను గెలిచారు. అసలు ఒక్క కౌన్సిలర్ని కూడా గెలవలేని టీడీపీ.. ఇప్పుడు వైస్ చైర్మన్లను గెలవాలని చూస్తోంది. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీ మారింది. దొడ్డిదారిలో పదవులు పొందటం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది?. ఇలా పదవులు పొందటం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి వారికి ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు, కుతంత్రాలే: చెల్లుబోయిన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం అంతా కుట్రలు, కుతంత్రాలతో నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రతిపక్ష నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి చెల్లుబోయిన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది. ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలతో నిండి ఉంది. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఉమ్మడి రాజధానికి పదేళ్ల కాలం ఉన్నా రాత్రికి రాత్రే చంద్రబాబు వచ్చేశారు. తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు విలువ లక్షా పదివేల కోట్లు చంద్రబాబు వల్లే రాలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని అనేక ఆరోపణ చేశారు. కేవలం అధికారం కోసం విష ప్రచారం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు. -
అంతా రామోజీ ఊహించినట్టే జరుగుతోందా?
ఇది ఊహించని పరిణామమే!. ఎంతటి బలాఢ్యుడైనా ఏదో ఒక రోజు తన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. డిపాజిట్ల వ్యవహారంలో మార్గదర్శి సంస్థ ఇంతకాలం ఎంతగా బుకాయించినా చివరకు వాస్తవాన్ని పరోక్షంగానైనా అంగీకరించక తప్పలేదు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేసినా.. మార్గదర్శి అక్రమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలిచినా చివరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వాదనే సరైందని తేలింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా రూ.2610 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ధారించింది. దీనితో ఇంతకాలం ఆ సంస్థ అసలు తప్పు చేయలేదని, తప్పు చేయదని, ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావుపైనే నిందలు మోపుతారా అని గుండెలు బాదుకుంటూ మాట్లాడిన వారికి జవాబు వచ్చినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోక్ సభలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై చర్య తీసుకోవాలని YSRCP ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా టీడీపీ ఎంపీలు మార్గదర్శి అధికార ప్రతినిధుల్లా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. సేకరించిన డిపాజిట్లను దాదాపు అందరికి తిరిగి చెల్లించిందని వాదించారు. మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారానికి ఈనాడు మీడియా ‘‘వార్త రాస్తే విషం చిమ్ముతారా’’ అంటూ టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని ప్రముఖంగా ప్రచురించారు. నిజానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఆరోపణలు వస్తే ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని దబాయించడమే తప్పు. పైగా.. ఈనాడేమో.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులపై ఇష్టారీతిన అసత్యాలతో కథనాలు వండివార్చవచ్చు. ఈనాడు గ్రూపులోని సంస్థ అవకతవకలకు పాల్పడిందని కూడా ఎవరూ విమర్శించకూడదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణపై ఇంతకాలం మీడియా బలంతో బుకాయించినప్పటికీ ఆర్బీఐ నివేదిక వచ్చాక టీడీపీ ఎంపీలు ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు చెప్పాలి. మార్గదర్శి చిట్స్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, డిపాజిట్ల సేకరణను రసీదుల రూపంలో కొనసాగించారని, చిట్స్‌లో వందల కోట్ల రూపాయల నల్లధనం ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ సాక్ష్యాధారాలతో సహా కేసు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటిని నీరుకార్చడం ఆరంభించింది. అందులో భాగంగా జప్తు అయిన వేయి కోట్ల మొత్తాన్ని కూడా విడుదల చేశారు. ఇదంతా చూస్తే.. పరస్పర రాజకీయ,వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీ ఈనాడు మీడియాను వాడుకున్నారని పలుమార్లు స్పష్టం అయింది. ఆర్బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని స్పష్టం చేయడంతోపాటు ఈ సంస్థపై తమకు పలువురు ఫిర్యాదు చేశారని కూడా తెలిపింది. రామోజీరావు మరణించినప్పటికీ, ఆ కేసు మూతపడదని, విచారణ కొనసాగించాలన్నదే నిబంధన అని వివరించింది. మరి ఈనాడు మీడియా ఎందుకు దీన్ని ప్రజలకు తెలియజేయడం లేదు. ఆర్బీఐ కూడా తమపై విషం చిమ్ముతోందని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పించలేకపోతోంది?. ఆర్బీఐకి ఈనాడు మీడియాకు ఏ శత్రుత్వం ఉందని ఆ నివేదిక ఇచ్చింది?. నిజానికి అఫిడవిట్ ఫైల్ చేయడం వీలైనంత ఆలస్యం చేసేందుకు ఈనాడు మీడియా తనకు ఉన్న పరపతిని వాడి ఉండవచ్చు. తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చిన తరువాతే ఆర్బీఐ కూడా చట్టంలోని సెక్షన్ 45(ఎస్) గురించి వివరించాల్సి వచ్చింది. దాని ప్రకారం మార్గదర్శి చట్ట విరుద్ద చర్యలకు పాల్పడిందని తేలుతోంది. నేరం నిర్ధారణ అయితే సేకరించిన డిపాజిట్ల మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. దీంతో మార్గదర్శి కొత్త వాదన తీసుకువచ్చింది. రామోజీరావు నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అని అంటోంది. ఈ వాదన రామోజీ నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించడమే అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రామోజీ తర్వాత హెచ్ యుఫ్ (అవిభాజ్య హిందూ కుటుంబ కర్త)గా ఆయన కుమారుడు కిరణ్ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన బాధ్యత వహించాలా? లేదా? సంస్థ తరపున జరిమానా చెల్లించవలసిన బాధ్యత ఆయనపై ఉంటుందా? లేదా?అనేది చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఇంకో సంగతి గుర్తు చేయాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కుమారుడిపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి అక్రమ కేసులు పెట్టాయి. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అప్పట్లో ఈనాడు మీడియా ఇది కరెక్టేనని ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం భిన్నంగా వాదిస్తోంది. రామోజీ లేరు కనుక, ఆయన కర్తగా ఉన్న సంస్థ ఆక్రమ డిపాజిట్లతో కొడుకుకు సంబంధం లేదంటోంది. కాని ఆ డిపాజిట్ల ద్వారా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం అనుభవించవచ్చట. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ అని, దాని కర్త మరణించినా, చట్టపరంగా సంస్థ బాధ్యత పోదని, వారసులు సైతం తీసుకోవల్సిందేనని చట్టం చెబుతోంది. రామోజీ ఆస్తులకు కిరణ్, ఇతర కుటుంబ సభ్యులు వారసులైనప్పుడు ఆయన చేసిన ఆర్థిక అక్రమాలకు వీరికి బాధ్యత ఉండదా? రామోజీరావు మరణించినందున ఈ కేసు విచారణ కొనసాగించాలా? లేదా? అనేది ఆలోచించాలని ఏపీ ప్రభుత్వం తరపున వేసిన అఫిడవిట్లో కోరారు. దానిని అంగీకరిస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చని ప్లాన్ చేశారు. కానీ.. ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్ తో మార్గదర్శి సంస్థ పరిస్థితి కుడితిలో పడ్డయినట్లయిందని అంటున్నారు. అంతకుముందు అసలు డిపాజిట్ల వసూలులో తప్పు చేయలేదని కొంతకాలం, డిపాజిట్లు తీసుకున్నా తిరిగి చెల్లించేశామని మరికొంతకాలం చెప్పింది ఈనాడు. ఉండవల్లికి తెలియకుండానే ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్నారు. కానీ ఆరు నెలల తర్వాత ఆయనకు తెలిసి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ కేసు ఈ దశకు చేరింది. జగన్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయిందన్న కోపంతో ఈనాడు మీడియా పచ్చి అబద్ధాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసింది. ఉండవల్లికి డిపాజిట్ దారుల వివరాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి పెద్ద, పెద్ద లాయర్లను నియోగించింది. మొత్తం మీద 18 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఒక రూపానికి వచ్చినట్లనిపిస్తుంది. ఆర్థికంగా ,రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత శక్తిమంతుడైనా న్యాయ వ్యవస్థ కొంత గట్టిగా ఉంటే చట్టానికి ఎవరూ అతీతులుగా ఉండలేరని ఈ ఉదంతం రుజువు చేసింది. గతంలో సహారా డిపాజిట్ల కేసులో ఆ సంస్థ యజమానిని సుప్రీంకోర్టు జైలులో పెట్టింది. రామోజీరావు ఆ గండం నుంచి తప్పించుకున్నా.. ఆయన మరణం తర్వాత అయినా సత్యం బయటపడిందని అనుకోవాలి. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అండతో ఈ కేసు ముందుకు సాగకుండా చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు. కాగా ఉండవల్లికి డిపాజిటర్ల వివరాలు ఇవ్వక తప్పలేదు. వాటిని పరిశీలించిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావొచ్చు. రామోజీకి అసలు డిపాజిట్లు ఎలా వచ్చాయి? అందరి వివరాలు ఉన్నాయా? అందరికి తిరిగి చెల్లించారా? లేదా? ఆ మొత్తాలకు వడ్డీని కూడా చెల్లించారా? లేదా? ఇలాంటి విషయాలు అన్ని తేలితే అప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. రామోజీరావు గతంలో ఒక మాట అనేవారు. ‘‘వయలేట్ ద లా లాఫుల్లీ’’ అని. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించవచ్చన్నది ఆయన ఫిలాసఫి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకూడదన్న సిద్దాంతం కాదన్నమాట. ఆ క్రమంలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయే అవకాశం ఉందని ఈ అనుభవం చెబుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘టీడీపీకి జనసేన ఎందుకు సహకరించాలి?’
అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’.. ‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్‌ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.రాజశేఖర్ నేపథ్యం.. ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు. ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి -
టీడీపీ నేతల అరాచకం.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా
Municipal Elections Updates..👉ఏపీలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా అధికారంలో ఉన్నారనే అహంకారంతో టీడీపీ నేతలు పోటీకి దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.👉పాలకొండలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా. ఎన్నిక జరగకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. 👉తుని వైఎస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీంతో, మూడోసారి వాయిదా పడినట్టు అయ్యింది. శాంతి భద్రతల సమస్య కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. 👉కాకినాడ..తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాల దౌర్జన్యం. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించిన పచ్చ గుండాలు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లోకి వెళ్లారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా పచ్చనేతలు అడ్డుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టీడీపీ నేతలు. ఇక.. టీడీపీ నేతలకు పోలీసులు వంతపాడుతున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టీడీపీ నాయకులు యనమల డైరెక్షన్లోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పల్నాడులో ప్రజాస్వామ్యం ఖూనీ.. 👉పిడుగురాళ్లలో పట్ట పగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అరాచకానికి ఐకాన్‌గా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మారారు. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉండగా.. గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను తన వైపునకు తిప్పుకున్న యరపతినేని. బలం, అర్హత లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన శ్రీనివాసరావు.👉పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయించారు. బెదిరించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ వైపునకు తిప్పుకున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ మునీరా రెండు ఇళ్లను కూల్చే చేయించిన యరపతినేని. కౌన్సిలర్లు అందరినీ ఒక లాడ్జిలో బంధించి బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చిన తెలుగుదేశం నేతలు. వైఎస్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నట్టు యరపతినేని ప్రకటన. 👉తునిలో మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడే ఉన్నా.. వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు భర్త ఏలూరి బాలు, తొండంగి వైఎస్సార్సీపీ నేత గంగబాబు, తుని ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతా శ్రీనుతో పాటుగా మరో ముగ్గురు కౌన్సిలర్ల భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతరం, తుని టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 👉దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై కచ్చితంగా కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తునిలో 30 స్థానాల్లో 30 కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ గెలిచింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. తొమ్మిది మందిని మభ్యపెట్టి లాక్కున్నారు. చైర్పర్సన్ ఇంటి చుట్టూ వేలాది మంది మోహరించారు. కోర్టులు, వ్యవస్థలు అంటే టీడీపీకి లెక్కలేదు అంటూ మండిపడ్డారు. కాకినాడ..👉తుని మున్సిపల్ ఎన్నిక సందర్భంగా సెక్షన్ 163(2) అమలు చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈ నేపథ్యంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మికూడరాదని ఆదేశాలు జారీ. కానీ, టీడీపీ గుండాలకు వర్తించని సెక్షన్ 163(2).👉మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వందలాదిగా గుమిగూడిన పచ్చ మూకలు. మున్సిపల్ కౌన్సిలర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు. సుధా బాలు నివాసం వద్దకు వెళ్ళిన జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఈ క్రమంలో రాజాను కూడా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీడీపీ వారికే వత్తాసు. వైఎస్సార్సీపీ నేతలను అక్కడి నుంచి పంపిచేస్తున్న పోలీసులు. కాకినాడ..👉తునిలో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మున్సిపల్ చైర్మన్ సుధాబాబు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకోలేదు. టీడీపీ నేతలకు పోలీసుల సహకారం అందిస్తూ.. తొండగి మండలం వైఎస్సార్సీపీ నేత గంగబాబుతో పాటుగా పలువరి నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి అరాచకం..👉ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పచ్చ నేతలు యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బలం లేకపోయినా అధికార మదంతో పోటీకి దిగుతున్నారు టీడీపీ నేతలు. కాగా, నేడు తుని, పాలకొండ, పిడుగురాళ్లలో డిప్యూటీ చైర్మన్, చైర్మన్ల ఎన్నికల జరగనుంది. ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో టీడీపీకి బలం లేకపోయినా పచ్చ నేతలు అధికార మదంతో పోటీలో నిలబడ్డారు. కూటమి నేతలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నా పోలీసులు మాత్రం తమకు ఏదీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.👉ఇక, పిడుగురాళ్లలో కూటమి ప్రభుత్వానికి కోరం లేకున్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో, దౌర్జన్యాలతో లోబరుచుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మద్దతిచ్చేది లేదని 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా సైదావలి తేల్చి చెప్పడంతో ఆదివారం టీడీపీ నేతలు బరితెగింపునకు పాల్పడ్డారు. కౌన్సిలర్ ఇంటితో పాటు, ఆయన బంధువుకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని పొక్లెయిన్‌తో కూల్చివేయించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, శానిటేషన్ సిబ్బందితో పాటు టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, షేక్ ఇంతియాజ్ తదితరులు, ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని దగ్గరుండి మరీ రెండు ఇళ్లను కూల్చివేయించారు.ఇప్పటికే రెండు సార్లు అరాచకాలు 👉పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 33 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా కొత్త వెంకటసుబ్బారావు, వైస్ చైర్మన్లుగా కొమ్ము ముక్కంటి, షేక్ నసీమా జైలాబ్దిన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ముక్కంటి మృతితో ఈ నెల 3న వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జీవో ఇచ్చింది. అయితే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుపడటంతో ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీ కూడా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్ల వద్ద ఉండి ఇళ్లల్లోంచి వారిని బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో మళ్లీ సోమవారానికి వాయిదా పడింది. -
మాజీ మంత్రి విడదల రజిని మామ కారుపై దాడి.. హత్యాయత్నం!
చిలకలూరిపేట: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది అనేందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధుడు అనే విజ్ఞత మరచి టీడీపీ వర్గీయులు మాజీ మంత్రి విడదల రజిని భర్త తండ్రి లక్ష్మీనారాయణపై దాడికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ కారు పురుషోత్తమపట్నంలోని ఇంటికి వెళుతున్న క్రమంలో వేణుగోపినాథస్వామి ఆలయం సమీపంలో టీడీపీ వర్గీయులు పలువురు ఆయనపై దాడిచేసే ఉద్దేశంతో కారును అడ్డగించారు. లక్ష్మీనారాయణను ఉద్దేశించి కిందకు దిగరా అంటూ రాళ్లు, రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. కారులో లక్ష్మీనారాయణ లేకపోవడంతో ఆయనకు ప్రాణహాని తప్పినట్టయింది. దాడికి పాల్పడిన వారి నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని కారుతో పాటు ఇంటికి చేరాడు.ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రి విడదల రజినిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఓ గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయించిన విషయం విదితమే. ఇటీవల మాజీ మంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన విషయంపై ఆమె మీడియాలో టీడీపీ ఆగడాలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమె మామ కారుపై దాడి జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు. -
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్‌లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
పిడుగురాళ్లలో పరాకాష్టకు టీడీపీ నేతల అరాచకం
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో టీడీపీ నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. బరితెగించిన ఆ పార్టీ నేతలతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యారు. రేపు(సోమవారం) మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పది రోజులుగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులను బెదిరించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మునీరా దంపతుల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దగ్గరుండి మరి.. మునీరా దంపతుల ఇళ్లను టీడీపీ నాయకులు కూల్చివేయించారు.కాగా, ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది.తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. -
ఎమ్మెల్యే చింతమనేనికి ఝలక్!
ఏలూరు టౌన్: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మూడు పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తమపై దాడి చేశాడని ఏలూరు త్రీటౌన్ పోలీసులకు శనివారం ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన నాగరాజు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వద్ద కారు డ్రైవర్‌గా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని ఏలూరు శివారు సీతారామపురం గ్రామంలోని పద్మావతి కళ్యాణమండపంలో జరుగుతున్న ఓ వివాహానికి కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చింతమనేని... నాగరాజును ఏరా అంటూ బూతులు మాట్లాడుతూ.. అసభ్యకరంగా తిడుతూ అతని తల్లిని సైతం దూషిస్తూ దుర్భాషలాడుతూ.. రాడ్డుతో దాడి చేశారు.దీంతో, పోలీసు అధికారులు విచారణ చేసి చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన అనుచరులు వట్టి నాగబాబు, కలిదిండి అనిల్ రాజు, మరికొందరిపై చర్యలు తీసుకోవాలని నాగరాజు ఫిర్యాదులో కోరారు. అలాగే.. ఎమ్మెల్యే చింతమనేని తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేశారని పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామానికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన మట్టా ప్రవీణ్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
‘మార్గదర్శి’ కేసులు నీరుగారుస్తున్నారు: పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్చిన్నం జరుగుతోందని, ప్రభుత్వమే రాజ్య హింసకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పొన్నవోలు శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌ను రావణ కాష్టంలా ప్రభుత్వం మారుస్తోంది.వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారు.ప్రజలపై దాడులు చేస్తే నో పోలీస్ అన్నట్లుగా ఉంది. మాచర్లలో దాడులు చేస్తే ఊళ్ళు కాలి చేసి పోతున్నారు .వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులే మేం ఏమీ చేయలేమంటున్నారు.మీడియా ముసుగులో మాఫియాలా తయారవుతున్నారు.ఏపీలో ఏడు నెలలుగా ప్రాథమిక హక్కులు ఎక్కడ పోయాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు.. ప్రభుత్వమే దాడులు చేస్తోంది.దాడులపై కమిషన్‌ను అపాయింట్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని కక్ష పూరితంగా కేసులో ఇరికించారు .2023లో సత్య వర్ధన్‌ను విచారిస్తే కులం పరంగా నన్ను తిట్టలేదు అని కోర్టులోనే చెప్పాడు. విశాఖలో బందువుల ఇంట్లో ఉంటే సత్య వర్ధన్ తమ్ముడిని బలవంతంగా రప్పించి అతని వద్ద తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం చట్టాలను అవహేళన చేస్తోంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను నియోజక వర్గంలో కాలు పెడితే చంపేస్తాం అని పబ్లిక్‌గా ఓ ఎమ్మెల్యే కామెంట్ చేస్తే చర్యలేవి.మాజీ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి’అని పొన్నవోలు ప్రశ్నించారు.మార్గదర్శి కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది..రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థికనేరానికి పాల్పడిన 'మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్' కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని పొన్నవోలు ఆరోపించారు. ఈనాడు సంస్థలకు చెందిన మీడియా మాఫియా అండ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక నేరాల నుంచి మార్గదర్శికి విముక్తి కల్పించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందన్నారు. 2006 లోనే దాదాపు రూ.2610 కోట్ల రూపాయలను మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన కేసు నుంచి మార్గదర్శిని బయటపడేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.‘ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఆనాడు రామోజీరావు ప్రజల నుంచి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా, చట్ట వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఈ విషయాన్ని అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెట్టారు. రామోజీరావు పాల్పడిన ఈ ఆర్థిక నేరంపై ప్రజల నుంచి ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై కేసులు నమోదయ్యాయి. 2006 లెక్కల ప్రకారం రామోజీరావు తన మార్గదర్శి సంస్థల ద్వారా 2.75 లక్షల మంది నుంచి రూ.2610 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. రిజర్వ్ బ్యాంక్ 1984 చట్టం ప్రకారం బ్యాంకులు మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. ఇతర ఏ సంస్థలు సేకరించినా అది నేరం. పత్రికను నడుపుతూ ఆర్థిక నేరాల గురించి నిత్యం పత్రికల్లో కథనాలు రాయించే రామోజీరావు తాను అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న విషయం తెలిసే చట్టాలను ఉల్లంఘించారు. తన చేతిలో మీడియా ఉంది, తనను ఎవరూ ప్రశ్నించలేరు, ఎవరైనా తన అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై తన మీడియా మాఫియాను ప్రయోగిస్తాననే ధీమాతో రామోజీరావు వ్యవహరించారు. మార్గదర్శి సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై విచారణకు సీఐడీని ఆదేశిస్తూ 2006లో జీఓలు 800, 801 జారీ చేశారు. తరువాత సిఐడీ అధికారులు విచారణ జరిపి రామోజీ ఆర్థిక నేరాలపై కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. తరువాత ప్రభుత్వాలు మారడం, తిరిగి రామోజీరావు తన మీడియా మాఫియాతో పాలకులను ప్రభావితం చేసే స్థాయిలో తన ఆర్థిక నేరాల నుంచి బయటపడేందుకు పావులు కదిపారు.రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్ బ్యాంక్, ఏపీ ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును రామోజీరావు క్వాష్ చేయించుకోవడం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న ఫిర్యాదుదారు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్ట్ కు వెళ్ళి క్వాష్ పిటీషన్ ను కొట్టేయించారు. తిరిగి ఈ కేసును విచారించాలని తెలంగాణ కోర్ట్ ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. విచారణలో ఉన్న ఈ కేసులో రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ తానే హిందూ అవిభక్త కుటుంబానికి కర్తను అని ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఇటీవల రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసును కొట్టేయాలని రామోజీరావు తరుఫు న్యాయవాదులు తాజాగా కోర్ట్ లో కొత్త వాదనను తీసుకువచ్చారు. దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి సీఐడీ కనీసం అప్పీల్ కూడా చేయకుండా మార్గదర్శి కేసు కొట్టేసేందుకు సహకరిస్తున్నారు. అంటే గత అయిదేళ్ల పాటు వైయస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకని దుష్ర్పచారం చేయించినందుకు గానూ చంద్రబాబు ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శికి అనుకూలంగా క్విడ్ ప్రో కో కింద సహకరిస్తున్నాడు’అని పొన్నవోలు ఆరోపించారు.మార్గదర్శి సంస్థలో అనేక ఆర్థిక అక్రమాలు..‘మార్గదర్శి చిట్స్ లో జిల్లాలో సేకరించిన అమౌంట్లు హెడ్ ఆఫీస్ కు పంపడం చిట్స్ చట్టం ప్రకారం నేరం. జిల్లాల్లో సేకరించిన డబ్బులో కొందరు మధ్యలో చిట్స్ నిలిపివేస్తే, వాటిని మార్గదర్శి ఖాతాలో వేసుకుని, వారి ఆస్తులుగా చూపించారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ లో ఆస్తులు, అప్పులను సక్రమంగా చూపలేదు. ప్రజల సొమ్మును అక్రమంగా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టారు. రూ.2610 కోట్లు డిపాజిట్లుగా చూపి, దానిలో 1300 కోట్లు నష్టాలుగా చూపించారు. ప్రజల డబ్బు చీటీల రూపంలో తమ వద్ద పెడితే, దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి సగానికి పైగా నష్టాలు వచ్చినట్లు చూపారు. ఇవ్వన్నీ సీఐడీ విచారణలో కూడా వెలుగుచూశాయి. వైయస్ఆర్ ప్రభుత్వంలో రంగాచారి కమిటీని నియమించింది. దీనిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. మార్గదర్శిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులపై వ్యక్తిగత దాడిగా ఈనాడు పత్రికలో బుదరచల్లే రాతలు రాస్తూ వారిని భయపెడుతున్నారు. సీఎం చంద్రబాబు అండతో వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడం, బదిలీలు చేయించడం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పార్లమెంట్లో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఈనాడు పత్రిక దుర్మార్గమైన తప్పుడు రాతలతో వేధిస్తోంది. జేజే రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభకుల్లో ఒకరైతే, ఆయనను శంకగిరి మాన్యాలు పట్టించి, వారి ఆస్తులు గుంజుకుని, దేశం నుంచి పరారయ్యేలా చేశారు. మీడియా మాఫియాగా చీకటి వ్యాపారాలకు పాల్పడుతూ, అధికార తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ, ప్రజల్లో తమకు వ్యతికులపై విషప్రచారానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు తమ చెప్పుచేతల్లో ఉంటాయని, మేం తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించుతామనే అహంకారంతో ఉన్నారు’ అని పొన్నవోలు విమర్శించారు. -
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్‌కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్‌కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పీక్కు చంద్రబాబు ప్రచార పిచ్చి: పుత్తా శివశంకర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఓర్వకల్లు విమానాశ్రయానికి 'ఉయ్యాలవాడ' పేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్కు చేరుకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నాలుగేళ్ల క్రితమే నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. రెడ్డి సంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని, గతంలో ఈ మేరకు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్ హామీ ఇచ్చి విస్మరించారంటూ చంద్రబాబుకు విన్నవించుకున్నారు. వెంటనే చంద్రబాబు చాలా అన్యాయం జరిగింది.. ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరును పెడతానంటూ హామీ ఇచ్చేశారు. ఇదంతా కూడా నిత్యం చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా ఈనాడు పత్రికలో పెద్ద ఎత్తున ప్రచురించారు. ఈ కథనంలో చంద్రబాబును కలిసిన ఆ రెడ్డి సంఘం ప్రతినిధులు ఎవరో కూడా వెల్లడించకుండా ఈనాడు పత్రిక జాగ్రత్త పడింది.నిత్యం వైఎస్ జగన్‌పై బురద చల్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు తాజాగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు అంటూ చేసిన హంగామా ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. గతంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్ట్‌కు ఉయ్యాలవాడ పేరును ప్రకటించడంతో పాటు, అధికారికంగా ఉత్తర్వులు జారీ జారీ చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసు.మార్చి 25, 2021న ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తూ విమానాశ్రయానికి బ్రిటీష్ వారిపై పోరు సల్పిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు బహిరంగ సభలో ప్రకటించారు. దీనిని అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతేకాకుండా దీనిపై మే 16, 2021న నాటి వైయస్ జగన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 21ని విడుదల చేసింది.వాస్తవానికి రాష్ట్రంలో కేవలం 6 విమానాశ్రయాలుంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి వాటి పేర్లు కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. స్వాతంత్ర కాంక్షను ప్రజల్లో రగిలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఓర్వకల్లు విమానాశ్రయంకు పెట్టి నాలుగేళ్లు అయ్యిందని తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లింది. చివరికి తన ప్రచార యావ, వైఎస్ జగన్‌పై విషప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో మహనీయుల పట్ల కూడా అగౌరవంగా వ్యవహరించిన చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎప్పుడైనా జాతికి మార్గదర్శకులుగా వ్యవహరించిన మహనీయుల విషయంలో స్పందించే సమయంలో వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ముఖ్యమంత్రి హోదాకు ఉన్న గౌరవాన్ని దిగజార్చకూడదని సూచిస్తున్నాం -
14 ఏళ్లు సీఎం.. 54 సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర బాబుది: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. అలాగే, 14 ఏళ్ళు సీఎంగా పనిచేసి 54 సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. రైతులను దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా? అని ప్రశ్నించారు.నెల్లూరులోని జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎకరాకి లక్ష రూపాయలు అదనంగా వస్తే.. ఇప్పుడు ఎకరానికి 40 వేలు దాకా రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటల్లో తప్ప.. చేతల్లో లేదు. టీడీపీ హయాంలోనే రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు.టీడీపీ గెజిట్ పత్రికల్లోనే వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మిర్చి రైతులు ధరలు లేక అల్లాడిపోతున్నారు. ఆరు వేల కోట్ల రూపాయలు మేర మిర్చి రైతులు నష్టపోతున్నారు. దళారులు దోచుకుంటుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం అమలు చెయ్యకపోవడం వల్ల.. అప్పులు తెచ్చుకుని రైతులు వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి.. రాబడి తగ్గడంతో రైతులు అప్పులు ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు.వైఎస్ జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలు ఉండకూడదనే కక్షతో.. రైతులను చంద్రబాబు రోడ్డున పడేస్తున్నాడు. 14 ఏళ్ళు సీఎంగా పని చేసి 54 సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కింది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోతే అన్నదాతలను కలుపుకుని ఆందోళనకు శ్రీకారం చూడతాం’ అని హెచ్చరించారు. -
కిరణ్ రాయల్ పరమ నీచుడు.. నాకే పార్టీతో సంబంధం లేదు: లక్ష్మి
తిరుపతి, సాక్షి: అమ్మాయిలను మోసం చేసి వాళ్ల డబ్బుతో విలాసజీవితం గడిపే పరమనీచుడు వ్యక్తి కిరణ్ రాయల్ అని, జనసేన అధినేత పవన్ మద్దతు చూసుకునే రెచ్చిపోతున్నారని, అలాంటి వాడిపై తన పోరాటం కొనసాగుతుందని లక్ష్మి మరోసారి ఉద్ఘాటించారు. తిరుపతిలో శనివారం ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చి.. కిరణ్ రాయల్‌పై మరికొన్ని సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘‘కిరణ్ రాయల్(Kiran Royal) అనే వ్యక్తి ఎవరు?. అతనేం బిజినెస్ చేస్తున్నాడు?. జనాన్ని మోసం చేయడం తప్ప ఎలాంటి వ్యాపారం చేయడు. అమ్మాయిలను మోసం చేసి విలాసజీవితం గడిపే వ్యక్తి. ఆడవాళ్ల దగ్గర డబ్బులు దోచుకుని రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. అతనిలా మేం మోసాలు చేసి బతకలేదు. నా డబ్బుతో నేను బతుకుతున్నా. కిరణ్ రాయల్ బాధితులు ఎందరో ఉన్నారు. పరమ నీచుడైన కిరణ్ రాయల్.. కొందరిని దుర్మార్గంగా కొట్టాడు. అందుకు అతని భార్య రేణుక, కూతురే సాక్ష్యం. త్వరలో మరింత మంది బాధితులు బయటకు వస్తారు.నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు. నిజాలు బయటపెడతానని నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. కిరణ్ రాయల్ వ్యవహారాలపై అన్నింటికి ఆధారాలు ఇచ్చాం. నేను న్యాయపోరాటం చేస్తుంటే.. వైఎస్సార్సీపీ నేతలకు అంటకడుతున్నారు. భూమన కుటుంబంతో నాకేం సంబంధం?. నాకు, భూమన కుటుంబ సభ్యులకు సంబంధం అంటగట్టి కిరణ్ రాయల్ నీచ ప్రచారం చేస్తున్నారు. నాకు అండగా ఎవరూ లేరనే భయం ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది.మా అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) నా వెనక ఉన్నాడని కిరణ్ రాయల్ తరచూ నాతో చెప్తుండేవాడు. ఆ మద్దతు చూసుకునే చెలరేగిపోతున్నారు. ఇది నిజమో కాదో.. పవనే చెప్పాలి. కిరణ్ రాయల్ ఎంతో మంది ఆడవాళ్లను వేధించాడు. ఆ అరాచకాలపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో కిరణ్ రాయల్ అరెస్ట్ అయితే.. తన భర్తను బయటకు రప్పించాలని ఓ బాధితురాలిని రేణుక బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు’’ అని లక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు.తన డబ్బు తనకు వచ్చేదాకా పోరాటం ఆగదని, ఆయన వెనకాల ఉన్నవారిపై దర్యాప్తు చేయాలని, కిరణ్ రాయల్లాంటి నీచుడ్ని ఎవరూ నమ్మొద్దని లక్ష్మి(Laxmi) విజ్ఞప్తి చేశారు. -
బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మంత్రి అయిన లోకేష్‌లు తమ కక్ష తీర్చుకున్నారు. కాకపోతే వారు ధైర్యంగా కాకుండా చాటుమాటు కేసులు పెట్టి ప్రత్యర్ధులను దెబ్బతీసే యత్నం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించి వారు ఆనందపడుతుండొచ్చు. దావోస్‌లో తాను చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ మూడును ప్రయోగించానని లోకేష్ సంతోషపడుతుండొచ్చు. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. రాజకీయాలలో ఇది ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇంతకాలం ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా.. తనకేమీ సంబంధం లేదన్నట్లు నటించేవారు. లోకేష్ అలాకాకుండా పచ్చిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనను తాను రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. ఆ సంగతిని గుర్తు పెట్టుకోవడం మంచిదని హితవు చెప్పినా.. అధికార కైపులో ఉన్న ఆయనకు వినిపించకపోవచ్చు. రెచ్చగొట్టే మీడియా, భజంత్రీగాళ్ల మాటలు సమ్మగా ఉంటాయి. కాని అవి ఎక్కువకాలం ఉపయోగపడవు. వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ఇక్కడ చర్చకాదు. తప్పు చేసి ఉంటే అరెస్టు చేయడం, జైలులో పెట్టడం సాధారణంగా జరిగేవి. కాని అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం మాత్రం ఏపీ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వాటివల్ల జనంలో ఫస్ట్రేషన్ పెరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సంగతిని అంతా గుర్తుంచుకోవాలి. వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం కావొచ్చు. అంతవరకు కేసు పెడితే పెట్టవచ్చు. కాని అంతకుముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే.. టీడీపీ ముఖ్యనేతల కుటుంబాలలోని వారిని ఎవరైనా ఏమైనా అంటే గోలగోలగా ప్రచారం చేసే ఆ పార్టీవారు.. ఎదుటివారి కుటుంబాలపై నీచంగా కామెంట్స్ పెడుతుంటారు. టీడీపీ చంద్రబాబు కబ్జాలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని వ్యక్తిగత హననం చేయడం ఒక లక్షణంగా మార్చుకుంది. చంద్రబాబు తాను సత్యసంధుడనైనట్లు, ప్రత్యర్దులు విలువలు లేని వ్యక్తులన్నట్లు మాట్లాడుతూ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవడంలో నేర్పరి అని చెప్పాలి. తొలుత ఆయనే రెచ్చగొడతారు. లేదా ఆయన పార్టీవారితో రెచ్చగొట్టిస్తారు. దానికి ప్రతిస్పందనగా ప్రత్యర్ధి పార్టీవారు తీవ్ర స్థాయిలో స్పందిస్తే.. దానినే విస్తారంగా వ్యాప్తి చేసి.. ‘చూశారా!నన్ను అంత మాట అన్నారో?’ అంటూ సానుభూతి పొందే యత్నం చేస్తుంటారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా తాన అంటే తందానా అంటాయి. గత సీఎం జగన్‌ను చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎన్నేసి మాటలు అన్నారు!. ‘సైకో’ అనే పదంతో మొదలు పెడితే.. అనేక అభ్యంతరకర పదాలు వాడడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అయినా అప్పటి ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆరోజుల్లో రెడ్ బుక్ పేరుతో అనేక చోట్ల పోలీసు అధికారులను, ఆయా నేతలను లోకేష్ బెదిరించిన వైనంపైనే ఎన్నో కేసులు పెట్టి ఉండవచ్చు. కాని అప్పుడు దానికి సంబంధించిన కేసులే పెట్టలేదు. పోలీసు అధికారులు కోర్టులో దీనిపై పిటిషన్ వేసినా అది విచారణకే వచ్చినట్లు లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్(Lokesh) పేరుతో సాగుతున్న ఈ అరాచకం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వచ్చేసారి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ టీడీపీవారికి చుట్టుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దీనిని వైఎస్సార్సీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అన్యాయంగా ,అక్రమంగా తమ పార్టీవారిని వేధించేవారందరి సంగతి తేల్చుతామని జగన్ చెబుతున్నారు. చట్టబద్దంగానే చేస్తామని ఆయన కూడా అన్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కాని ఆయన చేతిలో ఏమి ఉన్నట్లు లేదు. లోకేష్ బ్యాచ్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా.. వారించలేకపోతున్నారు. ఫలితంగా ఆయన కూడా బాధ్యత వహించవలసి వస్తోంది. తద్వారా ఏపీ ఇమేజీనే చంద్రబాబు, లోకేష్‌లు నాశనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. వీరి కక్షలకు తోడు ఎల్లో మీడియా పనిలో పనిగా తమ కక్షలు తీర్చుకుని టీడీపీని మరింత గబ్బు పట్టిస్తోంది. ఎల్లో మీడియా రాసే చెత్త వార్తలకు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో వాస్తవం ఉంటే తప్పు లేదు. కాని వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా.. కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు లేదంటే ఆ ప్రతినిధులు ఆడించినట్లు ఆడక తప్పడం లేదు. వంశీ విషయానికి వస్తే ఆయనపై ఏ కేసు పెట్టాలి. చంద్రబాబు,లోకేష్ లు నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ పాయింట్‌ను తమ రాజకీయ అవసరాల కోసం అదే పనిగా వాడుకున్నారు కనుక. ఆ క్రమంలో తమ కుటుంబానికి ఇబ్బంది అని తెలిసినా పదే,పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఎవరో ఏదో అన్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు కుటుంబానికి జరిగిన పరువు నష్టంపై మనోభావాలు దెబ్బతిన్నాయా, లేదా? దీనిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. నిజంగానే ఆ పాయింట్‌ను పైకి తీసుకువస్తే.. వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుంది. టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మీదట కారణం ఏమైనా కాని దాడి కేసు ఫిర్యాదుదారు అసలు తనకు సంబంధం లేదని, తనను ఎవరూ దూషించలేదని కోర్టులో అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం పరువు పోయింది. నిజానికి చాలా కేసులలో రెడ్ బుక్ ఆదేశాల ప్రకారం ఎవరో ఒకరితో బలవంతంగా కేసులు పెట్టించి విపక్షంవారిని అరెస్టులు చేస్తుంటారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు-లోకేష్ రెడ్‌బుక్ సర్కార్ హుటాహుటిన పోలీసులపై గుడ్లురిమి, ఫిర్యాదుదారు సోదరుడు ఒకరిని పట్టుకుని వంశీపై కిడ్నాప్ తదితర కేసులు పెట్టించి ఆగమేఘాలపై అరెస్టు చేసింది. తద్వారా తన అహాన్ని లోకేష్ తీర్చుకుని ఉండవచ్చు. కాని అది చట్టబద్దంగా చేయాలి తప్ప మొరటుగా ఇలా చేస్తే అది ఫ్యాక్షన్ రాజకీయంగా మారుతుంది. రాయలసీమలోనే ఈ తరహా ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని అనుకుంటారు. కాని దానిని ప్రభుత్వమే కృష్ణా జిల్లాకు కూడా తీసుకు వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారట. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ ఓటమి వరకు ఆయన ఆ పార్టీ తరపునే పని చేశారు కదా!. ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. తదుపరి రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ పక్షాన గెలిచారు కదా?. మరి అన్ని కేసుల వ్యక్తిని ఎందుకు టీడీపీ ప్రోత్సహించింది?.. అంటే దానికి జవాబు ఉండదు. టీడీపీ నేతలు కొందరు ఆయనను పశువు అని, అదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక టీడీపీ-జనసేన కూటమికి నేతలు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ అది పోయిన రోజు వారిపై కూడా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కదా!. పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వంశీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టువారు ఎలా స్పందిస్తారో తెలియదు. ఏది ఏమైనా వంశీని ఇప్పుడు అరెస్టు చేసినా.. రేపు కొడాలి నాని ,పేర్ని నాని వంటివారిపై రెడ్ బుక్ ప్రయోగించినా అది తాత్కాలికమే అవుతుంది. మరి జగన్ ప్రభుత్వం(Jagan Government) కూడా టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కదా? అని అనవచ్చు. వాటిలో మెజార్టీ కేసులు పూర్తి ఆధారాలతో పెట్టినవే. దర్యాప్తులో వాస్తవం అని తేలిన తర్వాతే ఆ కేసులు పెట్టారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించిందా? లేదా?. దానిపై ఇంతవరకు నోరు తెరిచారా?. అలాగే రాజధానికి సంబంధించిన అనేక కేసులలో సాక్ష్యాలు సేకరించడానికే కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఆ తర్వాతే చర్యలు చేపట్టారు. అంతే తప్ప ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరినిపడితే వారిని అరెస్టు చేయలేదు. అయినా ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారే. ఇప్పుడు అసలు వాస్తవాలు,విచారణలతో నిమిత్తం లేకుండా.. ఏదో రకంగా కేసులు పెట్టడం, విధ్వంసాలకు పాల్పడడం, వేధింపులకు గురి చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారే. పైగా రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభించామని ఏ మాత్రం భీతి లేకుండా చెప్పుకున్నారే!. ఇదేనా ప్రజాస్వామ్యం. సూపర్ సిక్స్,ఇతర హామీలు నెరవేర్చలేక.. ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం. అసలు పని మానేసి ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ రాక్షసపాలన సాగిస్తే ఏదో ఒక రోజు అదేవారి పతనానికి హేతువు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు: వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం:యువతిపై ప్రేమోన్మాది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఈ మేరకు కళ్యాణి శుక్రవారం(ఫిబ్రవరి14) మీడియాతో మాట్లాడారు. ‘కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. యువతిపై యాసిడ్ దాడి చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.యాసిడ్ బాధిత మహిళకు ప్రభుత్వం అండగా నిలబడాలి.యువతకు మెరుగైన వైద్యం అందించాలి.రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికి వదిలేశారు.జనసేన నేత కిరణ్ రాయల్ వలన మహిళకు అన్యాయం జరిగితే తిరిగి అదే మహిళ మీద కేసు పెట్టారు’అని కళ్యాణి గుర్తుచేశారు. -
పోలీసుల దన్నుతో ‘టీడీపీ’ అరాచకాలు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల దన్నుతో అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈనెల 17న జరగబోయే ఉప ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే ఈ దౌర్జన్యకాండకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి నాలుగేళ్ళ కిందట జరిగిన ఎన్నికల్లో ఉన్న మొత్తం 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఏకగ్రీవంగా గెలుపును అందించారు. మున్సిపల్ చైర్మన్ గా వైశ్య సామాజికవర్గానికి చెందిన సుబ్బారావు, వైస్ చైర్మన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన ముక్కంటి, మైనార్టీల నుంచి జిలానీకి వైస్ చైర్మన్ పదవులను ఇచ్చాం.గత ఏడాది జనరల్ ఎలక్షన్స్ తరువాత వైస్ చైర్మన్ ముక్కంటి చనిపోవడంతో దానికి గానూ ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. మొత్తం 33 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు గానూ అన్నింటినీ వైఎస్సార్సీపీ గెలుచుకోగా, తాజాగా ఒకరు మాత్రం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం 32 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి ఉన్నారు. సంఖ్యబలం చాలా స్పష్టంగా ఉండటంతో ఏకపక్షంగా ఉప ఎన్నికను తెలుగుదేశం కుట్రపూరితంగా అడ్డుకుంటోంది.గతంలో వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులను బెదిరించి వాయిదా వేయించారు. బీఫారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేస్తున్నామంటూ అధికారులు కుంటిసాకులు చెప్పారు. మరుసటి రోజు వాయిదా వేయడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెడుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసుల సహకారంతోనే కిడ్నాప్ చేసేందుకు తెగబడ్డారు. అన్యాయాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది. ఆరోజు జరిగిన దారుణాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టడంతో మళ్లీ వాయిదా వేశారు.ఉప ఎన్నిక కోసం ఇంతగా దిగజారుతారా?ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ పోలీస్ యంత్రాంగంను ఉపయోగించుకుని చేస్తున్న దౌర్జన్యాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు భయాందోళనకు గురవుతున్నారు. సాక్షాత్తు పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారు, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు, ఇక మాకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిని భరించలేక కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈలోగానే మళ్లీ తెలుగుదేశం నేతలు, పోలీసులు కలిసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై దాడులకు, కిడ్నాప్‌లకు తెగబడ్డారు.తాజాగా తెలుగుదేశం నేతల బెదిరింపులకు భయపడి పక్కనే ఉన్న మాచవరం గ్రామంలో తన తల్లి ఇంట్లో తలదాచుకున్న కౌన్సిలర్ ను టీడీపీ నాయకులు, పోలీసులు కిడ్నాప్ చేశారని ఒక కౌన్సిలర్ భార్య సోషల్ మీడియాలో వీడియో ద్వారా బయటపెట్టారు. తన భర్తకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అలాగే మరో కౌన్సిలర్ ఈ బాధ పడలేక హైదరాబాద్ లో తలదాచుకుంటే, అయన సోదరులను పోలీస్ స్టేషన్ లో కూర్చోబోట్టి మర్యాదగా పిడుగురాళ్ళకు వచ్చి, తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ బెదిరించారు.ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరపాల్సిన ప్రభుత్వం చిన్న ఎన్నికలో కూడా ఇలా దౌర్జన్యాలతో బెదిరింపులకు గురి చేయడం దారుణం. గతంలో దర్శి, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆరోజు అధికారం ఉందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా దౌర్జన్యాలకు పాల్పడితే ఆ రెండింటిలో కూడా వైఎస్సార్సీపీకే అధికారం దక్కేది కాదా? కానీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ అటువంటి విధానాలకు మనం వ్యతిరేకం, ప్రజాతీర్పుకు గౌరవం ఇవ్వాలని స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి దానిని స్వయంగా అంగీకరించారు. వైఎస్ జగన్ తలుచుకుంటే తాను మున్సిపల్ చైర్మన్ అయి ఉండేవాడిని కాదు అని ఒప్పుకున్నారు.పార్టీ మారకపోతే అంతుచూస్తామని బెదిరిస్తున్నారుపిడుగురాళ్ళ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావుకు చెందిన ఫ్యాక్టరీకి తెలుగుదేశం నేతలు తాళాలు వేశారు. నీ వ్యాపారాలు అడ్డుకుంటాం, పార్టీ మారాలంటూ బెదిరిస్తున్నారు. లేకపోతే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల పిడుగురాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన నేపథ్యంలో కోర్టులో హెబియస్ కార్ఫస్ పిటీషన్ దాఖలు చేశాం. వెంటనే సదరు కౌన్సిలర్‌ను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా తానను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాలని లేకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా బెదిరించారు.దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపైనా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంకు పాల్పడ్డారు. తిరిగి అబ్బయ్య చౌదరిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం చూస్తే ఇంత దుర్మార్గమైన పాలన మరెవరూ చేయలేరని అనిపిస్తోంది. తెలుగుదేశం చేస్తున్న ఈ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు -
వల్లభనేని వంశీపై కేసులో కుట్రకోణం: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టులో కచ్చితంగా కుట్ర కోణం ఉందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు వెనుకుండి నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. సాంకేతికంగా చూస్తే హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్‌ను విచారించలేదని పేర్కొన్నారు. టీడీపీ కక్షసాధింపులకు వత్తాసు పలుకుతున్న పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దాదాపు 90 మందిని అక్రమంగా ఇరికించారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరి 10వ తారీఖున కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చారు.కేసు వెనక్కి తీసుకోవాలని నిన్ను ఎవరైనా బెదిరించారా అని జడ్జి ప్రశ్నించినప్పుడు కూడా నా అంతట నేనే ఇష్టపూర్వకంగానే వచ్చానని సత్యవర్ధన్ చెప్పిన మాటలను జడ్జి రికార్డు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ కేసులో ఎలాగైనా ఇరికించాలని భావించిన తెలుగుదేశం నేతలు సత్యవర్ధన్ వాగ్మూలంతో ఉలిక్కిపడ్డారు. సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రలోభాలు పెట్టారు. ఫిబ్రవరి 12న సత్యవర్ధన్ సోదరుడితో నా తమ్ముడ్ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేయించి మరో కేసు పెట్టారు. ఈ కేసు ఆధారంగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ వెళ్లి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ అడిగితే చిత్తు పేపర్ మీద అక్కడిక్కడే పెన్నుతో రాసి ఒక నోటీస్ ఆయన చేతుల్లో పెట్టారు.విశాఖలో సత్యవర్థన్‌ను కాపాడామంటూ కొత్త డ్రామాఫిబ్రవరి 13వ తేదీన సత్యవర్ధన్‌ను విశాఖలో కాపాడామని పోలీసులు కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ సీసీ టీవీ వీడియో చూస్తే సత్యవర్ధన్‌ను బెదిరించి పోలీసులే లాక్కుని వెళ్తున్నట్టు ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో పోలీసుల పాత్రపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే సత్యవర్ధన్‌ను పోలీసులు విశాఖ నుంచి తీసుకొచ్చారు. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సెక్షన్లు నమోదు చేయాలి. కానీ సాంకేతికంగా చూస్తే సత్యవర్ధన్‌ను విచారించకుండానే వంశీకి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఇదీ చదవండి: అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే పోలీసులు విశాఖలో సత్యవర్ధన్‌ను పట్టుకొచ్చారని అర్థమవుతోంది. ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్‌గా వంశీని కేసులో ఇరికించడానికే టీడీపీ పన్నాగం పన్నింది. ముందుగా అనుకున్నట్టుగా నాన్ బెయిలబుల్, జీవితఖైదుకు సంబంధించిన సెక్షన్లతో పోలీసులు కేసులు సిద్దం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వంశీని విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు, నోటీస్ ఇవ్వడం తప్ప.. ఏ కేసులో, ఎందుకు తీసుకొచ్చింది, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదు. నాలుగైదు స్టేషన్లలో తిప్పి రాత్రి 11.45గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చి, 12 గంటలకు ఎఫ్ఐఆర్ రాశారు. ఈ మధ్యలో వంశీని ఎలా ఇబ్బంది పెట్టాలో చంద్రబాబు, లోకేష్, డీజీపీ చర్చించుకున్నట్టుగా అర్థం అవుతోంది.చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే..ఈ తతంగమంతా చూస్తుంటే న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టుగానే పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. ఎలా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు అధికారులుగా ఎవరుండాలి, దర్యాప్తు చేసి ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరెవర్ని సాక్ష్యులుగా తీసుకోవాలి, ఎవర్ని కేసుల్లో ఇరికించాలి, ఇలాంటివన్నీ కూటమి నాయకులే చెప్పడం దానిని పోలీసులు తుచ తప్పకుండా అమలు పరచడం కనిపిస్తోంది.ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పోలీసులకు ఇదే పని. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, సానుభూతి పరులను అక్రమ కేసులతో వేధించి జైలు పాలు చేయడం, వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం చేస్తున్నారు. న్యాయస్థానాలంటే గౌరవం లేదుచట్టాలన్నా, న్యాయస్థానాలన్నా కూటమి ప్రభుత్వానికి భయం కానీ, గౌరవం కానీ లేదని ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన ఎన్నో ఘటనలు రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల్లో పోలీస్ స్టేషన్లకు చెందిన సీసీ టీవీ ఫుటేజ్‌లు అడిగితే ఇవ్వనందుకు సాక్షాత్తు హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఎప్పుడడిగినా ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటున్నారని, మా ఆదేశాలను ధిక్కరిస్తే డీజీపీనే కోర్టుకు రప్పిస్తామని గట్టిగా హెచ్చరించింది. హైకోర్టు ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం లెక్క చేయడం లేదంటే న్యాయస్థానాల మీద వారికున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దెందులూరులో ఒక పెళ్లి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తన కారుకు అడ్డం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితోపాటు ఆయన డ్రైవర్, ఇతర అనుచరుల మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. ఎమ్మెల్యేనే దారుణంగా దుర్భాషలాడి తిరిగి ఆతనే వైయస్సార్సీపీ నాయకుల మీద కేసులు పెట్టించాడు. నిందితులే బాధితులపై కేసులు పెడుతున్న దారుణాలు నిత్యం జరుగుతున్నాయి.తాము అనుసరిస్తున్న విధానాలు కరెక్టో కాదో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మేం చేయబోయే పోరాటంలో పోలీసులే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. డీజీపీ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు తప్పు చేసింది ఎవరైనా వదిలే ప్రసక్తే ఉండదు. చీఫ్ సెక్రటరీ దగ్గర్నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందర్నీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం. -
సెల్ఫీ వీడియో.. తన చావుకు టీడీపీ నేతలే కారణమంటూ..
నంద్యాల: జిల్లాలో కూటమి నేతల అరాచకాలు ఆగడం లేదు. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్త పుల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పని చేశాననే అక్కసుతో తనను టీడీపీ నాయకులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగాడు. పుల్లయ్య పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, రామలింగారెడ్డి ఇతర టీడీపీ నాయకులు తన అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియోలో పుల్లయ్య తెలిపారు.టీడీపీ వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని.. తన చావుకు టీడీపీ నాయకులు కారణం అంటూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ.. అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi ) అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరిపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై తాజాగా ఆయన స్పందించారు. .. వంశీ విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్(Kutami Prabhutvam) వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా?. మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ‘నాకు వీళ్ల నుంచి ప్రాణ హాని ఉంది..’ జడ్జితో వల్లభనేని వంశీ.. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి(Kotaru Abbaya Chowdary)పై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి.. తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి?. తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? చంద్రబాబుగారూ! .. ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు(Illegal Arrests) దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం అని ఎక్స్‌లో వైఎస్ జగన్(YS Jagan) పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం -
వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీపై దాడికి యత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. పెదకూరపాడు మండలం గార్లపాడులో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ స్వర్ణకుమారి దంపతులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లగా.. వారిపై దాడి చేయడానికి టీడీపీ గూండాలు ఆలయాన్ని చుట్టుముట్టారు. గుడి నుంచి బయటికి వస్తే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రెండు గంటల పాటు జడ్పీటీసీ దంపతులు గుళ్లోనే ఉండిపోయారు. మరోవైపు, పిడుగురాళ్లలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. పోలీసులతో కుమ్మక్కై అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరించి భయపెడుతున్నారు. 14వ వార్డు కౌన్సిలర్ పులి బాల కాశీని రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసుల చెరలో ఉన్న తన భర్తను విడిపించాలని కాశీ భార్య రమణ వేడుకుంటోంది.టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులు భరించలేక 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగ రజిని భర్తను జూలకంటి శ్రీనివాసరెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పార్టీ మారాలంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసులు వేధిస్తున్నారు. -
సత్యవర్థన్ని పోలీసులే వేధించి నిర్బంధించారు: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుందని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలు, అరచకాలు పెచ్చరిల్లాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారని ఘాలు విమర్శలు చేశారు. గన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావటం లేదు. కూటమి ప్రభుతం ఏర్పడిన తర్వాత దుర్మార్గాలు, అరాచకాలు పెరిగాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ దుర్మార్గానికి లక్ష్మి అనే మహిళ బలైంది. చివరికి ఆమె మీదనే రివర్స్ కేసు పెట్టించి పక్క రాష్ట్రాల పోలీసులతో అరెస్టు చేయించారు. రాష్ట్రంలో అరెస్టులే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారుగన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారు. సత్యవర్ధన్ నిజంగా కిడ్నాప్ అయితే పోలీసులకు ఎలా దొరికాడు?. గన్నవరం కేసులో తనను సాక్షిగా పిలిచి, ఫిర్యాదుదారుడిగా చేశారంటూ సత్యవర్ధనే జడ్జికి చెప్పాడు. దీన్ని తట్టుకోలేక వల్లభనేని వంశీ మీద అక్రమంగా మరో కేసు పెట్టి జైలులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుంది. కూటమి నేతలకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. చట్టం, న్యాయం అంటే వీరికి గౌరవం లేదు.గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వారిని పట్టించుకోవడం లేదు. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలే తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసుకున్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి ఏకంగా పోలీసుల మీద దాడులు చేయించాడు. వారి చేతిలో సీఐ కనకారావు గాయపడ్డారు. తర్వాత కేసు మొత్తాన్ని మార్చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసు మీద దాడి జరగటం, దగ్గర్లోనే అగ్ని ప్రమాదాలు జరగటంపై మాకు అనుమానాలు ఉన్నాయి. దోషులపై కనీస చర్యలు కూడా తీసుకోని చేతగాని ప్రభుత్వం ఇది. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం దగ్గర్నుంచి జైలు పాలు చేయటం వరకు అన్నీ ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. -
పవన్ గాలి మళ్లిందా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరలేపిన కొత్త డ్రామా ఆసక్తికరంగా ఉంది. దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాల సందర్శన పేరుతో ఆయన చేస్తున్న యాత్ర భక్తితో చేస్తున్నదా?లేక రాజకీయ ఉద్దేశాలతోనా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ యాత్ర సాగుతోందా? లేక చంద్రబాబు ముందు తన ప్రాధాన్యతను నిరూపించుకునేందుకు ఆయన చేస్తున్నారా? అని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలియకుండా పవన్ ఈ యాత్ర చేపట్టడం... ఆయన ఫోన్లకూ స్పందించకపోవడం కచ్చితంగా గమనించదగ్గ అంశాలే. పవన్ బాబుల మధ్య భేటీ జరిగి ఇరవై రోజులవుతోందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. తనకు ఎదురైన అవమానాన్ని, అసమ్మతిని వ్యక్తం చేసేందుకే పవన్ మౌనవ్రతం చేపట్టారా? అన్న అభిప్రాయమూ కొందరు వ్యక్తం చేస్తున్నారు.తిరుమల లడ్డూ వ్యవహారంలో పవన్ తాను, చంద్రబాబు సమానమే అన్న చందంగా ప్రవర్తించడం టీడీపీకి నచ్చలేదు. ఎల్లో మీడియాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కథనాలు రావడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో పవన్ ఆయా సందర్భాల్లో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడం కూడా జనసేనకు అంతగా రుచించలేదు. పవన్ కళ్యాణ్ మరీ అంతగా అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదన్నది జనసేన కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. అంతేకాకుండా.. లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశం టీడీపీ నుంచి వ్యక్తం కావడం... దాంతో తమ నేతకు ప్రాధాన్యం తగ్గిపోతుందని, భవిష్యత్తులో లోకేషే ముఖ్యమంత్రి అయితే పవన్ ఎన్నటికీ ఆ స్థానానికి ఎదగలేడని వీరు ఆందోళన చెందారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా యుద్ధమూ సాగింది. పవన్ అన్న అయిన నాగబాబును మంత్రిని చేయబోతున్నట్లు ప్రకటించి నెలలు గడుస్తున్నా, ఇంతవరకు దాని గురించి చంద్రబాబు మాట్లాడుతున్నట్లు లేరు. ఇది కూడా మిస్టరీగానే ఉంది.అయితే... తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ అపచారానికి పాల్పడ్డారనడంలో సందేహం లేదు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతుకొవ్వు కలిసిందన్న చంద్రబాబు మాటను పవన్ గుడ్డిగా నమ్మి అదే అబద్ధాన్ని చెప్పడం ద్వారా తప్పులో కాలేశారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, మంత్రి లోకేష్‌లు అసలు పవన్ కళ్యాణ్ ఎవరన్నట్టుగా వ్యవహరించారు. తొక్కిసలాటకు బాధ్యత వహించి టీటీడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో పవన్ పరువు పోయినట్లయింది. ఆ తర్వాత చంద్రబాబు మంత్రులకు ప్రకటించిన ర్యాంకుల్లో పవన్‌కు పదో స్థానం దక్కడం పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. ఫైళ్ల పరిష్కారంలో వెనుకబడ్డ ప్రాతిపదికన ర్యాంకులిచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే పవన్ అప్పటికే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరైన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ నిజంగానే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమోలే, అందుకే రాలేదేమోలే అని పలువురు అనుకున్నారు. కానీ చంద్రబాబు కీలకంగా పరిగణించిన ప్రభుత్వ కార్యదర్శుల, మంత్రుల సమావేశానికి కూడా పవన్ రాకపోవడంతో వీరిద్దిరి మధ్య ఏదో గొడవ జరుగుతోందన్న చర్చ మొదలైంది.ఆ సమావేశంలోనే చంద్రబాబు డిప్యూటీ సీఎం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆరా తీయగా నడుంనొప్పి వల్ల రాలేకపోయారన్న సమాధానం వచ్చింది. తాను పోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాలేదని చంద్రబాబు అనడం, ఆ విషయం తెలుగుదేశం పత్రిక ఈనాడులోనే రావడం సంచలనమైంది. టీడీపీ వర్గాలే ఈ సమాచారాన్ని ఎల్లో మీడియాలో వచ్చేలా చేశారా అన్న సందేహమూ వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ సీఎంతో పద్ధతిగా వ్యవహరించలేదన్న సంగతి ప్రజలకు చెప్పాలని అనుకుని ఉండవచ్చు. దానివల్ల భవిష్యత్తులో పవన్ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకున్నా, తప్పు ఆయన వైపే ఉండేలా చేయడం లక్ష్యంగా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్లే చంద్రబాబు కార్యదర్శుల సమావేశంలో ఫైళ్ల అంశాన్ని ప్రస్తావించి, పైళ్ల పరిష్కారానికి ఆరు నెలలు, ఏడాదా అని ప్రశ్నించారు. నిజానికి ఫైళ్లు కేవలం కార్యదర్శులు మాత్రమే క్లియర్ చేస్తే సరిపోదని, మంత్రులు, సీఎం కూడా ఆమోదించాలని చంద్రబాబుకు తెలియంది కాదు. పవన్‌ను ఇరుకున పెట్టడానికి మాత్రమే ఈ సంగతిని ప్రస్తావించారు.గత నెల రోజులుగా పవన్ కళ్యాణ్ పేషీలో వందల కొద్ది ఫైళ్లు పేరుకుపోయాయని చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఫైళ్లు ఎప్పుడూ పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే సొంత శాఖలో ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఇతర శాఖలలో జోక్యం చేసుకోవడాన్ని టీడీపీ తెలివిగా వాడుకుంది. దీనిని టీడీపీ ఎక్స్ పోజ్ చేసిందని చెప్పాలి. జనసేన కు చెందిన ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్‌కు, కందుల దుర్గేష్‌కు మంచి ర్యాంకులు ఇచ్చి, పవన్ కళ్యాణ్‌ను పదో ర్యాంకుకు పడవేయడం ద్వారా టీడీపీ ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేసినట్లయింది. అంతకు ముందు హోం శాఖ, టూరిజం, సివిల్ సప్లయిస్ మొదలైన శాఖలలో వేలు పెట్టిన పవన్ వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయిన విషయాన్ని, సీజ్ ద షిప్ ఘటనలో ప్రభుత్వ అసమర్థతను టీటీడీ యాజమాన్యం చేతకానీతనాన్ని ఆయన తనకు తెలియకుండానే బయట పెట్టేశారు. మరో వైపు మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తూ ఢిఫ్యాక్టో సీఎంగా ఉన్నారన్న భావన ఉంది. ఇది కూడా పవన్ కు నచ్చడం లేదు. తన పేషీలో అధికారులను కూడా లోకేష్ నియమించారని ఆయన ఆగ్రహం చెందినట్లు వార్తలు వచ్చాయి.ప్రస్తుతం పోలీసు శాఖ మొత్తం లోకేష్ చెప్పినట్లే వింటోందన్న భావన ఏపీ అంతటా ఉంది. ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా పిఠాపురంలో పోలీసుల పనితీరును, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయని పవన్ తప్పుపట్టారు. లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కూడా ఏపీలో గందరగోళం సృష్టిస్తోంది. లోకేష్ శైలిపై పవన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఇవన్ని ఒక ఎత్తయితే చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికపై నోరు విప్పలేని పరిస్థితి పవన్‌కు ఏర్పడింది. అసలు ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఏమి చేయాలో తోచక ఈ తీర్థయాత్ర పెట్టుకుని ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.అయితే సీఎంకు చెప్పకపోవడం, ఫోన్‌కు కూడా స్పందించకపోవడంతో పాత ఘటనలన్నిటికి ప్రాధాన్యత ఏర్పడింది. నడుం నొప్పి నిజంగానే అంత తీవ్రంగా ఉండి ఉంటే, కేరళ పర్యటనలో ఎక్కడా అలసట లేకుండా తిరుగుతారా అన్న డౌటు వస్తుంది. ఈ పరిణామాలతో ఇప్పటికిప్పుడు టీడీపీ, జనసేనల మధ్య ఏదో జరిగిపోతుందని చెప్పలేం .చంద్రబాబు, పవన్ ల మధ్య ఉప్పు, నిప్పులా పరిస్థితి మారిందని అనలేం. కాకపోతే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా నడుస్తోంది వెల్లడైంది. పవన్ ప్రస్తుతం పవర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో కొంతకాలం అలిగి, తనకు కావల్సినవి సాధించుకోవడానికి ఏమైనా ఇలా చేస్తుండవచ్చు.మరో వైపు బీజేపీ పవన్ కళ్యాణ్‌ను దక్షిణాది రాష్ట్రాలలో తిప్పి, రాజకీయ ప్రయోజనాల కోసం యత్నిస్తుందా అన్న సందేహం కూడా చాలామందిలో ఉంది. భవిష్యత్తులో దక్షిణాదిలో బీజేపీ ఎదగడానికి ఇలాంటి సినీ నటులు కొందరిని వాడుకుంటే వాడుకోవచ్చని చెబుతున్నారు. కేరళలో ఇప్పటికే ప్రముఖ నటుడు గోపికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఏపీలో పవన్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తమవైపు ఉన్నట్లు చూపించే యత్నం చేస్తోంది. ఇవన్ని కూడా రాజకీయాలలో కీలకమైన అంశాలే అవుతాయి. పవన్ కళ్యాణ్‌కు భక్తి విశ్వాసాల మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఒకసారి క్రైస్తవ మతానికి, మరోసారి ముస్లిం మతానికి అనుకూలంగా మాట్లాడడం, తన కుటుంబంలోనే తన పిల్లలే క్రైస్తవం తీసుకోవడం వంటి అంశాలు ఆయనపై విమర్శలకు దారి తీస్తుంటాయి. అధికారం వచ్చాక తిరుమల లడ్డూ ఘటన సమయంలో సనాతని వేషం కట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు మామూలుగానే కనిపించినా, దక్షిణాది తీర్థయాత్రలో మళ్లీ సనాతని వేషంలోకి రావడం అంతా నాటకీయంగా ఉంది.తన కుమారుడు అఖిరా నందన్‌ను ప్రమోట్ చేయడానికి కూడా ఈ యాత్రను ఆయన వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.రాజకీయంగా అయినా, భక్తిపరంగా అయినా ఆయన చిత్తశుద్దితో చేస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రతిదానిని డ్రామా చేస్తూ పబ్బం గడుపుకుంటూ పోతే మాత్రం పవన్ కళ్యాణ్ కే నష్టం జరగవచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో దౌర్జన్యకాండ.. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఖాకీల సెల్యూట్!
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అధికార మదంతో అక్రమ కేసులు, అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు సైతం పనిచేస్తున్నారు. తాజాగా దెందులూరులో సైతం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారు. చింతమనేని ఆదేశాలంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు.దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెండు రోజుల క్రితమే వట్లూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అతని అనుచరులపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేసి అసభ్య పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వారే దాడి చేసి రివర్స్‌లో బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయించారు చింతమనేని. తాజాగా ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.చింతమనేని గన్ మ్యాన్ వద్ద గన్ లాక్కుని దాడి చేసేందుకు ప్రయత్నించారని కట్టుకథలతో చింతమనేని ఫిర్యాదు చేయించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో పాటుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో చింతమనేని దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు దాడులు చేసి తమపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది. కేసు ఏంటో చెప్పకుండా హైదరాబాద్ వరకు వెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సర్కార్ తమకు చట్టం, న్యాయం, రాజ్యాంగాలతో పనిలేదని రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తోంది. ఇప్పటికే కేసుల విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు సామాన్యుల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. -
‘డీజీపీ అపాయింట్మెంట్ ఇచ్చారు.. కానీ వచ్చాక కలవలేదు’
మంగళగిరి: వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదని, ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయ త్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు వంశీ. ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు.దీనిపై డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. డీజీపీ ఆఫీస్ కు అపాయింట్ మెంట్ ఇస్తే వచ్చాం.. అయినా వారిని కలవలేదు. రిప్రజెంటేషన్ఇ వ్వడానికి ఈరోజు(గురువారం) సాయంత్రం 4.35కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మేము 4.30కే డీజీపీ ఆఫీస్ కి వచ్చాం. అప్పుడు డీజీపీ ఉన్నారు.. కానీ కాసేపటికి వెళ్లిపోయారని చెప్పారు. మరి మా రిప్రంజటేషన్ ఎవ్వరూ తీసుకోలేదు. ఇదేంటో అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి డీజీపీ ఎవరినైనా పంపిస్తారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలా? అని అంబటి మీడియా ముఖంగా ప్రశ్నించారు.