breaking news
-
‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు’
సాక్షి,నెల్లూరు: రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చి యార్డులో రైతు సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటే.. గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్ లేఖ రాసిన సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్ లేఖ రాసిన సీఎం చంద్రబాబు, మరోసారి రైతులను దారుణంగా వంచించారని స్పష్టం చేశారు. మిర్చి రైతులపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్)లో రైతులను ఆదుకోవాలని కోరేవారని ఆయన వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదు కాబట్టే, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ గురించి పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారన్న ఆయన, జగన్ పర్యటనలను అడ్డుకునే ఉద్దేశంతోనే, గుంటూరు మిర్చియార్డు సందర్శనలో ఏ మాత్రం భద్రత కల్పించలేదని అన్నారు. జగన్ పర్యటనతోనే రైతుల సమస్యలపై ప్రభుత్వంలో చలనం మొదలైందని చెప్పారు.ప్రశ్నిస్తే కేసులు పెడతారా?:రైతుల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడితే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. రైతులకు అండగా నిలవాలని జగన్ వెళితే, వాస్తవాలను మరుగుపర్చి ప్రజల దృష్టి మళ్లించేందుకు విష ప్రచారం చేస్తోంది. ‘మమ్మల్ని ప్రశ్నిస్తే మీపై బురద జల్లుతాం’.. అన్నట్లుంది ప్రభుత్వ వ్యవహారం. ఆఖరుకి రైతులను కూడా అవమానించే విధంగా ప్రభుత్వం, ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది.ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించ లేదు:‘జగన్ జనంలోకి వెళ్లకూడదు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. తమ వైఫల్యాలు ప్రజల వద్ద ఎండగట్టొద్దు’.. అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. అందుకే జగన్ జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నా, ఆయన గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో కనీస భద్రత కూడా కల్పించలేదు. చివరకు రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయలేదు. ‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు. ఆయన్ను సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించకూడదు. రైతుల సమస్యలపై అస్సలు అడగకూడదు. ఏమడిగినా అధికారం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెడతాం’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్‌పైనా కేసు పెట్టారు.ఇదే నా ఛాలెంజ్:జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. రైతుల సమస్యలపై కనీసం చర్చ మొదలైంది. ప్రభుత్వం రైతులను గాలికొదిలేసినప్పుడు, వారి బాధ్యతను గుర్తు చేయడానికి మాజీ సీఎం జగన్ పర్యటిస్తే, దానిపై ఆక్రోషం వెళ్లగక్కుతున్న చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నాయకులకు నా ఓపెన్ ఛాలెంజ్. మీరు నేరుగా మిర్చి యార్డుకు వెళ్లి రైతుల సమస్యల గురించి అడిగి రాగలరా? మిర్చి రైతులు మిమ్మల్ని కారం దంచినట్టు దంచకుండా వదిలిపెట్టరు.నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు పచ్చి అబద్ధం:అచ్చెన్నాయుడి ప్రెస్‌మీట్ చూస్తే.. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన పేపర్ చదవడం తప్ప, ఆయనకు రైతుల సమస్యలపై ఏ మాత్రమైనా అవగాహన ఉందా? అనే అనుమానం కలిగింది. అలాంటి వ్యక్తి వ్యవసాయ మంత్రి కావడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. రైతుల కోసం నడుం బిగించినట్లు, నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ఒక బోగస్ లేఖ రాసి చేతులు దులిపేసుకున్నారు. ఈ లేఖ ద్వారా ఆయన రైతులను మరోసారి వంచించారు.గతంలో ఎప్పుడూ నాఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయడం జరగలేదు. మరి అలాంటప్పుడు మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, నాఫెడ్‌కు చంద్రబాబు లేఖలు రాయడం మిర్చి రైతులను మోసం చేయడం కాదా?.అది కూడా వాస్తవం కాదా?:మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఉద్యానవన శాఖ అధికారులిచ్చిన నివేదికలో, క్వింటాలుకు రూ.11,600 చొప్పున మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇస్తూ కనీసం 25 శాతం పంటను కొనుగోలు చేయాలని, ఇందుకోసం రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవుతుందని చెప్పారు. ఆ మొత్తం భరించడానికి ఇష్టపడని చంద్రబాబు, ఆ ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టిన మాట వాస్తవం కాదా? మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కాకుండా మార్కెట్ ప్రైస్ సపోర్ట్ కింద నాఫెడ్ తరఫున కొనుగోలు చేయాలని లేఖ రాయడం చేతులు దులిపేసుకోవమే. చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖ ప్రకారం చూసినా గత మా ప్రభుత్వంలో రైతుకు రూ.20 వేలకు తగ్గకుండా మద్దతు ధర లభించింది. ఒకవేళ గతం కంటే ఎక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేసి ఉంటే, దావోస్‌లో మాట్లాడి నేనే చేయించానని చంద్రబాబు ప్రచారం చేసుకునే వాడు.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు:కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం మిర్చికి మాత్రమే కాదు, ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితి. గత వైయస్సార్సీపీ పాలనలో దళారీ వ్యవస్థకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం మిర్చి పంటకే కాదు.. పసుపు, పత్తి, అరటి, ఉల్లి, పెసర, మినుము పంటలకు మద్దతు ధర కల్పించాం. కానీ నేడు చంద్రబాబు ఇస్తామన్నవి ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు కూడా లేకుండా చేశారని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. -
జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లు
వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఎక్కడకు వెళుతున్నా.. ఆయనను చూడడానికి ,మద్దతు ఇవ్వడానికి తరలివస్తున్న జనతరంగాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎనిమిది నెలలకే ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇంతగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోందా? అనే ప్రశ్న సహజంగానే కలగనమానదు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తమ గుండెకాయగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంటుంది. అలాంటి జిల్లాలలో ఒక సునామీలా వచ్చిన ప్రజలు.. జగన్‌కు జేజేలు కొట్టడం టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైళ్లు పరిగెత్తిస్తుందేమో!. తప్పుడు కేసులో విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ మరుసటి రోజు గుంటూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతాంగం కష్టాలను ఆయన విన్నారు. ప్రత్యేక రవాణా ఏర్పాట్లు ఏమీ లేకుండానే ప్రజలు వారంతట వారే జగన్ కోసం వస్తున్న తీరును గమనిస్తే.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలలో వెల్లువెత్తుతున్న నిరసనే అని స్పష్టమవుతోంది. కూటమి సర్కార్ అమలు చేస్తున్న రెడ్ బుక్ పిచ్చికుక్క రాజ్యాంగంపై ప్రజల తిరుగుబాటా? అనే భావన కలుగుతోంది. గుంటూరులో పోలీసులు సరైన భద్రత కల్పించకపోయినా, జగన్ ప్రజల మధ్యనుంచే రైతుల వద్దకు వెళ్లి వారి బాధల గాధలు విన్నారు. విజయవాడలో జగన్ మీడియాతో చెప్పిన విషయాలు చూస్తే ఆయనలో ధైర్యం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని జగన్ నిర్ణయించుకున్నారని అనిపిస్తోంది. అలాగే పార్టీ క్యాడర్ లో కాని, లీడర్లలోకాని జగన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. చచ్చేంతవరకు జగన్ తోనే అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక రకంగా.. ఇందుకు లోకేష్ పిచ్చి రెడ్ బుక్, చంద్రబాబు అబద్దాల సూపర్ సిక్స్, పవన్ కల్యాణ్ ఫెయిల్ కావడం.. ఇలా అన్ని కలిసి జగన్ పై ప్రజలలో మరింత ఆదరణ పెంచాయనిపిస్తోంది. వంశీని పలకరించి బయటకు వచ్చాక జగన్ మాట్లాడుతూ కూటమి సర్కార్ పైన, పోలీసు యంత్రాంగం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కమ్మ సామాజికవర్గంలో నాయకులుగా ఎదుగుతున్న కొడాలి నాని, వంశీ, దేవినేని అవినాశ్, శంకరరావు ,బ్రహ్మనాయుడు వంటి వారిని అణచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమకు పోటీ వస్తారనుకునేవారిని దెబ్బతీయడానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నది వాస్తవం. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు లేకపోలేదు. 👉చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు 1986 ప్రాంతంలో మంత్రిగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబు కర్షక పరిషత్ ఛైర్మన్ గా ఉండేవారు. వీరిద్దరూ కలిసి జిల్లాలో ఏదైనా సభలో పాల్గొన్నప్పుడు ముద్దు కృష్ణమకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు సహించేవారు కాదట. ఈ విషయాన్ని ముద్దే చెప్పేవారు. 👉అంతెందుకు.. ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసినప్పుడు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. తీరా పని పూర్తి అయి తాను ముఖ్యమంత్రి అవ్వగానే దగ్గుబాటికి మొండిచేయి చూపించి ఆయన పార్టీలోనే ఉండలేని స్థితి కల్పించారు. 👉జూనియర్ ఎన్.టి.ఆర్.ను 2009 లో ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. తదుపరి ఆయన లోకేష్‌కు పోటీ అవుతారని తలచి పక్కనబెట్టేశారు. ఇలా.. చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. కమ్మ సామాజికవర్గాన్ని తన రాజకీయం కోసం పూర్తిగా వాడుకుంటారు. అదే టైంలో తన సామాజిక వర్గంలో ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. పేరు రాకుండా జాగ్రత్తపడతారు. టీడీపీలో ఇప్పుడు ఎందరో సీనియర్లు ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర తదితరుల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక.. పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు ఉన్న అధికారాలు అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇది ఒక కోణం అయితే వంశీ కేసును ప్రస్తావించి ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు. వంశీపై ఏ రకంగా తప్పుడు కేసు పెట్టారో ఆయన సాక్ష్యాధారాలతో సహా వివరించారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్దన్ అనే వ్యక్తి పదో తేదీన కోర్టులో తనకు ఫిర్యాదుకు సంబంధం లేదని చెబితే.. ఆ మరుసటి రోజు వంశీ అతనిని కిడ్నాప్ చేశారని పోలీసులు కేసుపెట్టారట. దీనికి మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడో ఒక లిఫ్ట్ లో వీరిద్దరు ఉన్న ఏదో వీడియోని చూపించి మభ్య పెట్టే యత్నం చేసినట్లుగా ఉంది. వంశీని జగన్ కలవడం, అక్కడకు వేలాదిగా అభిమానులు తరలిరావడం తో రెడ్ బుక్ బాధితులందరికి నైతిక స్థైర్యం ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా పోలీసులను ఆయన తప్పు పట్టిన తీరుపై కొందరు ఆక్షేపణ చెబుతున్నారు. విశేషం ఏమిటంటే గత కొద్ది రోజులుగా హైకోర్టు కూడా ఆయా కేసులలో విచారణ చేస్తూ ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. కేసు పెట్టడం, లోపల వేయడం, కొట్టడం తప్ప ఏమైనా చేస్తున్నారా? అని పోలీసు అధికారులను ప్రశ్నించిన తీరుకు నిజంగా ఆ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. జగన్ ప్రభుత్వ టైమ్ లో చంద్రబాబు,లోకేష్ లు అప్పటి ప్రభుత్వంలోని వారిపైనే కాకుండా, పోలీసు అధికారులపై కూడా ఇష్టం వచ్చినట్లు దూషణలు చేసేవారు. రెడ్ బుక్ లో పేరు రాసుకున్నామని.. వారి సంగతి చూస్తామని బెదిరించేవారు. అయినా అప్పట్లో పోలీసు అదికారుల సంఘం కాని, ఐపీఎస్ అధికారుల సంఘం వారుకాని తప్పు పట్టలేదు. పుంగనూరు వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోయేలా టిడిపి వారు దాడి చేశారు. అయినా ఆ ఘటనపై పోలీస్ సంఘం గట్టిగా స్పందించలేదు. ఆ తర్వాత ఈ ఎనిమిది నెలల్లో పోలీసుల కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతుంటే.. కర్రలు,కత్తులతో దాడులు చూస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఘట్టాలను చూసినవారంతా పోలీసు శాఖ అసమర్ధతను చూసి అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. అంతదాకా ఎందుకు?.. తునిలో కౌన్సిలర్లను టీడీపీవారు వెంబడిస్తే పోలీసులు ఏమి చేస్తున్నారు?. తిరుపతిలో బస్ లో వెళుతున్న కార్పొరేటర్లపై దాడి చేసి కొంతమందిని బలవంతంగా కిడ్నాప్ చేస్తే పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోయారే!. కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఈ అంశాలను ప్రస్తావించి ఢిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. మరో వైపు వేధింపులకు గురైన వైఎస్సార్సీపీ పైనే ఎదురు కేసులు పెట్టడానికి ఏ రాజ్యాంగం అవకాశం ఇస్తుంది? అందుకే వారు ఖాకీ బట్టలు తీసేసి.. పచ్చ బట్టలు వేసుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీయించివేస్తామని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించవలసి వచ్చింది. గతంలో పోలీసులు అకృత్యాలకు పాల్పడితే.. జనంలో తిరగుబాటు వస్తుండేది. 1978-83 మధ్య హైదరాబాద్ లో రమీజాబి అనే మహిళ పోలీస్ స్టేషన్లో మానభంగానికి గురై మరణిస్తే, ఆ విషయం తెలిసిన రాష్ట్ర ప్రజలంతా భగ్గుమన్నారు. రోజుల తరబడి కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే గుంటూరు జిల్లాలో షకీలా అనే మహిళ కూడా పోలీస్ స్టేషన్ లో మరణించినప్పుడు కూడా ప్రజలు తీవ్రంగా స్పందించారు. గన్నవరంలో అప్పట్లో ఒక మహిళను హింసించారన్న సమాచారంతో ప్రజలు పోలీస్ స్టేషన్ లోకి చొరబడ్డారు. ఆ మహిళను పోలీసులు స్టేషన్ బయట ఉన్న వంటగదిలో దాచిన విషయం కూడా కనిపెట్టారు. ఆ రోజుల్లో ప్రజలలో ఉన్న చైతన్యంతో పోల్చితే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలు స్పందిస్తున్నట్లు లేదు. అలాగని వారిలో నిరసన లేదని కాదు.కాని మారిన రాజకీయాలు,ఇతర కారణాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక నాయకుడు జనం తరపున ముందుకు వస్తే ఎలా తిరుగుబాటుకు సిద్దం అవుతారో జగన్ పర్యటనలు తెలియచేస్తున్నాయి. గుంటూరు మిర్చియార్డులో గిట్టుబాటు ధరలు రాక ఆవేదనలో ఉన్న రైతులను పరామర్శకు జగన్ వెళితే అక్కడ పోలీసులు సహకరించకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. పైగా కేసులు కూడా పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెబుతున్నారు. అసలు అక్కడ వైఎస్సార్సీపీనే పోటీలో లేదు. ఎన్నికల ప్రచారం చేయలేదు. ర్యాలీలు తీయలేదు. మీటింగులు పెట్టలేదు. కేవలం మిర్చి యార్డులో రైతుల వద్దకు వెళితే ఏ రకంగా కోడ్ కు ఇబ్బంది కలిగిందో చంద్రబాబు పోలీసులే చెప్పాలి. రైతులు ఎన్ని కష్టాలలో ఉన్నా ఎవరూ పలకరించకూడదా?. జగన్ టూర్ చేయబట్టే కదా? కనీసం చంద్రబాబు కేంద్రానికి మిర్చి ధరల పతనంపై లేఖ రాశారు. కాని అది కంటితుడుపు చర్య. రాష్ట్రప్రభుత్వం మిర్చి కొనుగోలుకు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోకుండా ఈ లేఖల వల్ల ఏమి జరుగుతుందో తెలియదు.గుంటూరు యార్డుకు వెళ్లినప్పుడు జగన్‌కు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదు?అది వారి వైఫల్యం కాదా! పోలీసులు ఈ విధంగా చేయవచ్చా? అనేదానికి ఆ శాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీవారు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కలవకుండా వెళ్లిపోయిన డీజీపీ నాయకత్వంలో ఇంతకన్నా భిన్నమైన పరి్స్థితిని ఆశించడం తప్పవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నప్పటికీ నోరు మెదపలేని స్థితిలో పోలీసు అధికారుల సంఘాలు ఉన్నాయి. రైతుల సమస్యలకన్నా టీడీపీ భజనే తమకు ముఖ్యమన్నట్లుగా ఎల్లో మీడియా వ్యవహరించడం దురదృష్టకరం. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం జనంలో పెల్లుబుకుతున్న అసమ్మతిని తొక్కిపెట్టాలని చూస్తోంది. అయినా అణచేకొద్ది పైకి లేచి తిరగబడతామని ప్రజలు బ్యారికేడ్లు తోసేసి మరీ జగన్ పర్యటనలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏమిటంటే ఒక పదేళ్ల వయసున్న బాలిక జగన్ ను కలవడానికి పడిన తాపత్రయం, ఆ బాలికను ఆ జనంలో తనవద్దకు తీసుకుని ఆశీర్వదించిన తీరు మొత్తం టూర్ లో హైలైట్ గా మారింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు: బొత్స
విజయవాడ, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎంగా వైఎస్ జగన్(YS Jagan Security) కు జెడ్ ఫస్ల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది. మా ఆందోళనను గవర్నర్‌కు తెలియజేశాం. ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరాం. మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. .. చట్టం తను పని తాను చేసుకునేలా చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు. జగన్‌ను ఇబ్బందిట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు. మా హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా?’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స నిలదీశారు. ఎన్నికల కోడ్ల్లే భద్రతల్పించలేకపోయామన్న ప్రభుత్వ వాదనను బొత్స తప్పుబట్టారు. జెడ్ ఫ్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని అన్నారాయన. ఒకవేళ, ఎన్నికల కోడ్ ఉంటే జడ్ ప్లస్ భద్రత కల్పించడం కుదరదు అని ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?. ఇదే ఎన్నికల కోడ్ విజయవాడలో జరిగిన సంగీత విభావరీ సందర్బంగా ఎందుకు అమలు చేయలేదు? రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మిర్చియార్డ్ కు వైయస్ జగన్ వెడితే ఎన్నికల కోడ్ పేరుతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు అని బొత్స మండిపడ్డారు. దయనీయంగా రాష్ట్ర రైతాంగంవైఎస్సార్సీపీ హయాంలో రైతులకు మేలు జరగలేదన్న కూటమి నేతల ఆరోపణలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. దాదాపు రూ.20 వేలు ఉన్న క్వింటా మిర్చి నేడు రూ.10 వేల దిగువకు పడిపోయింది. రైతులకు అండగా ఉండేందుకు వెడితే దానిని రాజకీయం చేస్తారా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుభరోసాను క్రమం తప్పకుండా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయ్యింది. రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చింది కూడా రైతులకు ఇవ్వలేదు. ఆర్బీకేల ద్వారా మా హయంలో విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఉన్నాం. నేడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. నేడు దళారీలు రైతులను దోచుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదని.. వీటన్నింటి వల్ల రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.బాబు వక్రబుద్ధి బయటపడింది: మేకపాటివైఎస్ జగన్ భద్రతా వ్యవహారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు తన వక్ర బుద్దిని బయట పెడుతున్నారని మండిపడ్డారాయన. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము భద్రత ఇవ్వకపోయి ఉంటే.. అయన కనీసం బయట తిరిగే వారు కాదు. జెడ్ ఫ్లస్ కేటగిరి ఉన్న ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యింది. జగన్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అయన క్రేజ్ తగ్గదు. దేశ రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నేత జగన్. -
చిన్నారిపై లోకేష్ సైకో టీం విషప్రచారం
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్‌పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్‌ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్‌కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్‌లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!. -
‘రైతుల గోడు వింటే కేసు పెడతారా?’
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరదీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అసలు ఆ పర్యటనకు రాకపోయినా కేసు నమోదు చేయడం. వైఎస్ జగన్, పేర్ని నానితో పాటు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, గుంటూరు మేయర్ కావట్టి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మిర్చి రైతుల(Mirchi Farmers) కష్టాలుపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే కక్ష కట్టి చంద్రబాబు ప్రభుత్వం తమ నేతలపై కేసు పెట్టిందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
తాడిపత్రిలో టెన్షన్.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై...
సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తాజాగా వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులే దాడి చేసినట్టు బాధితులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. అనంతపురంలోని పెద్దవడగూరు మండలం అప్పేచర్లలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం సృష్టించారు. గురువారం ఉదయం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తల తలకు బలమైన గాయం కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడి విషయాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్త భాస్కర రెడ్డి సెల్ఫీ వీడియోలో వివరించారు.ఇదిలా ఉండగా.. తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై దళిత సంఘం నేత రాంపుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను ఫోన్లో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరించిన జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు చెప్పాలని సమాచార చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వివరాలను పంపించారు. -
రైతు బతికే పరిస్థితి లేదు!: వైఎస్ జగన్
ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయానికి... ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని వైఎస్సార్ సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఏ రైతన్నా సంతోషంగా లేడు. అన్నదాతల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు’’ అని మండిపడ్డారు. ‘ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మరోవైపు దిగుబడులు పడిపోయాయి. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. దళారులకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీకి స్వస్తి పలికారు. ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఇక ఇస్తామన్న దాన్నీ ఎగ్గొట్టారు. సూపర్ సిక్స్‌లో చెప్పినవన్నీ విస్మరించారు. సున్నా వడ్డీ రాయితీ అందడం లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే విధానానికి తిలోదకాలిచ్చారు. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకుంటే నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులోని మిర్చి యార్డుకు వచ్చిన వైఎస్ జగన్ రైతులను కలిసి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మిర్చి రైతులు ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. వారి కష్టాలు, బాధలు తెలుసుకుని చలించిపోయారు. సావధానంగా సమస్యలు ఆలకించి ధైర్యం చెప్పారు. అనంతరం మిర్చి యార్డు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలోనూ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. రైతన్నలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చి యార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని.. అందువల్ల మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయానని.. అన్ని అంశాలను ట్వీట్లో పొందుపరుస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులో భారీగా హాజరైన జన సందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఏ పంట చూసినా ‘మద్దతు’ కరువు..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. అమ్ముకుందామన్నా కొనేవారు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలు పెట్టారు. అటు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడం.. ఇటు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితులతో అన్నదాతల బతుకు దుర్భరంగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి దయనీయంగా ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ప్రభుత్వం తరఫున రైతులను పలకరించేవారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నా రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబుకు వినిపించడంలేదు. సీఎం చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడు. మిర్చి రైతన్న కుదేలు..మన ప్రభుత్వంలో నిరుడు అత్యధికంగా క్వింటాలు రూ.21 – 27 వేల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.8 – 11 వేలకు పడిపోయింది. పంట బాగుంటే మిర్చి ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. ఇక పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు కనీసం రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్క మిర్చే కాదు.. కంది పండిస్తున్న రైతులు కూడా ధరలు లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే ఇప్పుడు రూ.5,500 కూడా రావడం లేదు. కానీ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 పైనే ఉంది. అదే గతేడాది రూ.9–10 వేల మధ్య ధర వచ్చేది. గత ఏడాది క్వింటాలు పత్తి రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.5 వేలు కూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558 కాగా ఇప్పుడు రూ.6 వేలు రావడం కూడా కష్టంగా ఉంది. మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలు మినుములు రూ.10 వేలు పలకగా ఇప్పుడు రూ.7 వేలు కూడా రావడం లేదు. టమాటా రైతులకు కిలోకి రూ.3–5 కూడా దక్కడం లేదు. పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అని కూడా అన్నారు. రైతుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాతా సుఖీభవ కింద తాము రూ.20 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసాను కొనసాగించకుండా రద్దు చేశారు. మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు అందచేశాం. ఇప్పుడు పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ధరల స్థిరీకరణ నిధికి ఎగనామంఉచిత పంటల బీమాను కూడా చంద్రబాబు రద్దు చేశారు. ఒక సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఈ–క్రాప్ లేకుండా చేసేశారు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. కనీసం ఎరువుల పంపిణీలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం దారుణం. చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజు అని గుర్తించండి. అన్నదాత కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికే అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు..‘ఇవాళ రైతులు ప్రతి విషయంలోనూ దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పటిౖకైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి. చంద్రబాబు కళ్లు తెరిచి గుంటూరు మిర్చి యార్డుకు రావాలి. రైతుల కష్టాలను తెలుసుకుని వారికి గిట్టుబాటు ధర లభించే విధంగా అండగా నిలబడకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలుంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నా’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్టీ పరిశీలకుడు మోదుగుల, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేతలు వనమా బాలవజ్రబాబు, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయం చేయకపోగా.. వ్యవస్థలు నిర్వీర్యంచంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు సాయం చేయకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. ఆర్బీకేలను, ఈ–క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను నీరుగార్చారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నా వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువులకు సైతం నాణ్యతకు ఆర్బీకేల్లో గ్యారంటీ.. ఇలా మేం తెచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదు.. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఉద్దేశమే లేదు. ఓ నెంబరుకు ఫోన్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతన్నల్లో కనిపించడం లేదు. ఆర్బీకేలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లతో సహా ప్రతి వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోయాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిపివేసింది. రైతులు ప్రైవేట్ డీలర్ల దగ్గర ఎరువులు కొనాల్సి వస్తోంది. వాళ్లు కనీసం రూ.100 నుంచి రూ.400 అధిక ధరలకు బ్లాకులో అమ్ముతున్నారు. క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించిన పరిస్థితి ఉంటే.. ఇవాళ నాణ్యమైనవేవీ అన్నదాతలకు అందని దుస్థితి నెలకొంది. ఇక పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా తాము ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతలను దారుణంగా మోసం చేసింది.గొప్ప మార్పులతో రైతన్నకు అండగా..⇒ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు.. మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించి, రైతులకు ఎమ్మెస్పీ ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే... ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,773 కోట్లు వెచ్చించి మన ప్రభుత్వం నాడు రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు నిద్రపోతున్నాడు.⇒ మన ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ అనే గొప్ప మార్పును తెచ్చి ఏపీలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో యాప్ తో సమాచారం సేకరించాం. ఆర్బీకేల సిబ్బంది రైతులకు అందుతున్న ధరలపై ఎప్పటికప్పుడు యాప్‌లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకున్నాం. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశాం. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి 14400, 1907 టోల్‌ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు ఈ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.⇒ ఇప్పుడు మిర్చికి సోకిన మాదిరిగా పంటలకు వ్యాధులు వస్తే మన హయాంలో ఆర్బీకేల సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసి తగిన చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు మెరుగైన అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించాం.⇒ రైతులకు అందించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై మన హయాంలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం నెలకొల్పిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌ల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఆ ల్యాబ్‌లను గాలికొదిలేశారు. ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.⇒ మన ప్రభుత్వంలో మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. కలెక్టర్లు, ఎస్పీలు ఈ తనిఖీల మీద, తీసుకుంటున్న చర్యల మీద క్రమం తప్పకుండా రిపోర్టులు ఇస్తూ గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్ట పడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. ⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూ లేని విధంగా చాలా గొప్పగా పంటల బీమా అందించాం. 2019–20లో రూ.90.24 కోట్లు.. 2020–21లో రూ.36.02 కోట్లు... 2021–22లో రూ.439.79 కోట్లు చొప్పున రైతులకు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసి 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్ట పరిహారం కింద చెల్లించాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులపై భారాన్ని మోపారు. -
జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని, మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరులోని ఆ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చినా, ఆయనకు భద్రత కల్పనను అస్సలు పట్టించుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందని వారు ఆక్షేపించారు.మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే గుంటూరు పోలీసులు బందోబస్త్‌ను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటిసాకులు చెబుతున్నారని వారు ధ్వజమెత్తారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్ రోడ్డు మీదకు వస్తే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటుందో తెలిసి కూడా.. ఆయన మిర్చి రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని విఫలం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీవైఎస్ జగన్‌కు భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంపై గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయనుంది. రేపు ఉదయం 11 గంటకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు గవర్నర్‌ను కలవనున్నారు.వ్యవసాయ మంత్రి పచ్చి అబద్ధాలు: అంబటి రాంబాబుమిర్చి రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు. ధర లేక కునారిల్లుతున్న మార్కెట్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రైతులతో మాట్లాడి వెళ్లగానే, వ్యవసాయ మంత్రితో పాటు పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ఒకటి, రెండుసార్లు తప్ప ఎప్పుడూ క్వింటా మిర్చి రూ.13 వేలకే విక్రయిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారు.మరో వైపు హడావిడిగా సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌కు లేఖ రాశారు. మిర్చిపంటకు రేటు పడిపోయింది, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంత సీనియారిటీ ఉన్న సీఎం ఇలాగేనా సమస్యపై స్పందించేది? వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అయిదేళ్లలో పంటలకు ఎప్పుడు మద్దతు ధర రాకపోయినా, రైతు నష్టపోతున్నారని గ్రహించినా వారిని ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. పత్తి, ధాన్యం, పొగాకు ఇలా అనేక పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు.కళ్లు మూసుకున్న ప్రభుత్వం:కానీ, నేడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? మిర్చి పంటకు పెట్టుబడులు పెరిగిపోయి, పండిన మిర్చికి కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టాల పాలైతే, కూటమి ప్రభుత్వ స్పందన అత్యంత దారుణం. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా? నాడు మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఆనాడు రూ.65 వేల కోట్లు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పత్తి, కంది, ధాన్యం, మిర్చికి మద్దతు ధర లేదు. ధాన్యాన్ని అతి తక్కవ రేటుకు దళారీలకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. రైతు నట్టేట మునుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.జగన్ మిర్చి మార్కెట్‌కు రాకుండా కుట్ర:జగన్ మిర్చి మార్కెట్‌కు రాకుండా చూసేందుకు కుట్ర చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించాలని అనుకోవడం తప్పా? కనీస పోలీస్ బందోబస్త్ కల్పించకుండా ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటిసాకులు చెప్పించారు. అది కూడా పోలీసులు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి చేతులు దులుపుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంది. వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పడు ఓట్ల కోసం ప్రచారం చేసుకునే వారు. ఊరేగింపులు, బహిరంగ సభలు పెట్టే వారు అనుమతులు తీసుకోవాలి. వైఎస్ జగన్ మిర్చి యార్డ్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం ప్రచారం కోసం వెళ్ళారా? రైతులను పరామర్శించడం ఎన్నికల ప్రచారం కిందకు వస్తుందా? కోడ్ ఉంటే దానిపైన పోలీసులు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు?అయినా కోడ్ ఉల్లంఘించే ఉద్దేశం మాకు లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శించేందుకు అవకాశం ఉంటుంది. నిన్ననే జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఈ ఎన్నికల కోడ్ ఉన్నట్లు పోలీసులకు గుర్తు రాలేదా? అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరింప చేశారు. అంటే విజయవాడలో ఒక నిబంధన, గుంటూరులో మరో నిబంధన ఉంటుందా? గుంటూరు మిర్చి మార్కెట్లో రైతులతో జగన్ మాట్లాడితే, వారి కష్టాలు ప్రజలకు తెలుస్తాయని, అందుకే ఆ పర్యటన అడ్డుకోవాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది.మఫ్టీలో పోలీసులు డ్రోన్లు ఎగరేశారు:జగన్‌కు మాజీ సీఎంగా జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉంది. కానీ ఈ రోజు కనిపించలేదు. ఎందుకని ప్రశ్నిస్తే అనుమతి తీసుకోలేదని సమాధానం చెబుతున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు డ్రోన్లు ఎగరేసి, ఈ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారో చిత్రీకరించి వారిపై కేసులు పెట్టాలని కుట్ర పన్నారు. నారా లోకేష్ వికృతానందం కోసం, ఆయన ఆదేశాల మేరకు పోలీసులు ఇటువంటి పనులు చేశారు. కోడ్ పేరుతో పోలీసులు ఎవరూ జగన్ గారి కార్యక్రమం వైపు వెళ్ళవద్దని చెప్పారు. జగన్ రోడ్డు మీదికి వస్తే పెద్ద ఎత్తున జనం వస్తారు. అటువంటి ప్రజాదరణ జగన్ సొంతం. మిర్చియార్డ్ వద్ద పోలీసులు లేక తోపులాటలు జరిగాయి. దీంతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులే జనాన్ని నియంత్రించారు. చివరికి జగన్ మీడియాతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేయాలని కుట్రపన్నారు.జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు తరలి వస్తున్న జనాన్ని నియంత్రించేందుకు ఒక్క పోలీస్‌ను కూడా నియమించకుండా చేయడం నారా లోకేష్‌కు సమంజసమా? అధికారం శాశ్వతమని వారు భావిస్తున్నారు. జగన్‌కి భద్రత లేకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఈ కుట్రలో పోలీస్ యంత్రాంగం భాగస్వామి అవుతోంది. ఏదైనా జరిగితే దానికి ఎవరు భాధ్యత వహిస్తారు? జెడ్ ప్లస్ సెక్యూరిటీని కూడా ఇవ్వకుండా చేశారంటే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం జగన్ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారు: మేరుగు నాగార్జునగుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటించిన తర్వాతే ప్రభుత్వం కళ్లు తెరిచింది. కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై దృష్టి లేదు. జగన్ వచ్చి రైతు కష్టాలను, వారి వెతలను బయటపెడితే ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి కేంద్రానికి మిర్చి రైతుల గురించి లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఒక్క పోలీస్ కూడా మిర్చియార్డ్ వద్ద లేరు. అంటే వైఎస్ జగన్‌పై ఎలాంటి కక్ష సాధింపు, కుట్రలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా మా నాయకుడిని కాపాడుకునేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తారు. పోలీసులు లేకపోతే జగన్ కార్యక్రమం జరగదని కుట్ర పన్నారు. అయినా కూడా పార్టీ కార్యకర్తలే వాలంటీర్లుగా పని చేశారు.చిల్లర రాజకీయాలు మానుకోవాలి: నందిగం సురేష్గుంటూరు మిర్చియార్డ్‌కు వచ్చిన జగన్‌కు ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు. ఈ రోజు ధర లేక మిర్చి రైతులు పెడుతున్న ఆక్రందనలు కూటమి ప్రభుత్వం చెవులకు సోకడం లేదు. జగన్ మిర్చి రైతుల కోసం గుంటూరుకు వస్తే కనీసం ఒక్క పోలీస్‌ను కూడా బందోబస్తు కోసం నియమించకుండా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసి ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్.. సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించే వారేనా?. రైతుల ఇబ్బందులను గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీపై పగ తీర్చుకునేందుకే పని చేస్తున్నారు. ప్రజలు ఇందుకేనా మీకు అధికారంను కట్టబెట్టింది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి పార్టీలకు కనీసం సింగిల్ డిజిట్ కూడా రాదు.ప్రభుత్వ విధానాలు చూస్తూ ఊరుకోం: మోదుగుల వేణుగోపాల్రెడ్డిమాజీ సీఎం గుంటూరు మిర్చియార్డ్‌కు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎంగా చంద్రబాబు కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాము. ఈ రోజు మిర్చియార్డ్ వద్ద కనీస పోలీస్ బందోబస్త్ కూడా లేకుండా గుంటూరు ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రేపు మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేస్తారు? మీరు చేసిందే మమ్మల్ని కూడా చేయమని పరోక్షంగా చెబుతున్నారా? కక్ష సాధింపులకు చూపుతున్న శ్రద్ద రైతు సమస్యలపై చూపించలేరా? వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో చూపించిన ప్రాధాన్యత మిర్చి రైతులపై ఎందుకు చూపించలేదు? జగన్ కార్యక్రమంపై ఈ రోజు ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలాంటి విధానాన్నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తామంటే వైఎస్సార్సీపీ శ్రేణులు చూస్తూ ఊర్కోవు.డీజీపీ సమాధానం చెప్పాలి: విడదల రజినికూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో క్వింటా మిర్చికి కనీసం రూ.25 వేలు వస్తే, నేడు క్వింటా రూ.12 వేలకు కూడా కొనుగోలు చేయడం లేదు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు గుంటూరు మిర్చి మార్కెట్‌కు జగన్ వచ్చారు. రైతులతో మాట్లాడారు. రైతులు తమ గోడును జగన్‌తో వెళ్లబోసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు ఆనాడు మా ప్రభుత్వం అండగా నిలిచిందని రైతులే గుర్తు చేశారు.జగన్ మిర్చిమార్కెట్కు వస్తే పోలీసులు చూపిన నిర్లక్ష్యం చూస్తుంటే, వారు చట్టప్రకారం కాకుండా తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తున్నట్లు అర్థమయ్యింది. కనీస భద్రత కూడా కల్పించలేదు. పెద్ద సంఖ్యలో జనం వస్తుంటే నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఏదైనా తొక్కిసలాట జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వేల సంఖ్యలో తరలి వచ్చిన రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనిపై డీజీపీ నుంచి జిల్లా ఎస్సీ వరకు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేయడం లేదు. కేవలం రైతుల గురించి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే, దానికి కుంటిసాకులు చెప్పడం దారుణం. -
వల్లభనేని వంశీ కేసులో అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. సత్యవర్థన్‌ను వంశీ బెదిరించి దాడి చేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఓ వీడియో విడుదల చేశారు. సత్యవర్థన్‌ను బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి చూపిస్తున్న వీడియో ఫిబ్రవరి 11వ తేదీ సీసీటీవీ ఫుటేజ్‌గా నిర్థారణ అయ్యింది. గన్నవరం కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం లేదని.. ఫిబ్రవరి 10వ తేదీనే జడ్జి ముందు సత్యవర్థన్ వాంగ్మూలం ఇచ్చాడు. టీడీపీ కార్యాలయం కేంద్రంగానే కుట్రలు జరిగినట్లు మంత్రి ప్రెస్‌మీట్ తేల్చినట్లయింది. దీంతో వంశీని కుట్రపూరితంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.కస్టడీ పిటిషన్‌పై విచారణకాగా, వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది. దర్యాప్తు కోసం మొబైల్ , బ్లాక్ కలర్ క్రెటా కారును స్వాధీన పరచాలని పోలీసులు కోరారు. విచారణ తర్వాత కస్టడీకి ఇవ్వాలో లేదో న్యాయమూర్తి తీర్పునివ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకి సంబంధం లేదని ఆయన సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్లో వంశీ పేర్కొన్నారు.వంశీకి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు..వంశీ కేసులో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారని పొన్నవోలు తెలిపారు. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.‘‘సీన్ రీకన స్ట్రక్ట్ కోసం సత్య వర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన. కేసుతో నాకు ఏ సంబంధమూ లేదని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారు. కారుకి, నాకు సంబంధం లేదని అఫిడవిట్లో వంశీ తెలిపారు. ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉంది. కేసు వెనక్కి తీసుకుంటూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇస్తే అతనిపై ఈ నెల 11న కేసు నమోదు చేశారు’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఆళ్లగడ్డలో హైటెన్షన్.. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వెనుక ఉన్న మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ తిష్ట వేసింది. మోహన్‌రెడ్డి నివాసంలో సాయంత్రం కార్యకర్తల సమావేశానికి రావాలంటూ అఖిల ప్రియ పిలుపు నిచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే ఏవీ సుబ్బారెడ్డికి ,అఖిల ప్రియ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే మోహరించారు. సంఘటన స్థలంలో పరిస్థితిని డీఎస్పీ ప్రమోద్ పర్యవేక్షిస్తున్నారు. -
జగన్ రైతులను కలిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి?: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: కనీస గిట్టుబాటు ధర లేక నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. అసలు జగన్ కదిలే వరకు, రైతులను ఆదుకోవాలన్న కనీస ఆలోచన సీఎం చంద్రబాబు ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు.జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ మంత్రి వెల్లడించారు. జగన్ పర్యటనలో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసులను మోహరించలేదని, అదే అనుమానాన్ని చివరకు రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ తెలిపారు.శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:జగన్ కదిలితే తప్ప..:చంద్రబాబు అధికారంలో ఉండగా ఏరోజూ రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే తప్ప, చంద్రబాబుకి మిర్చి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదు. మిర్చి రైతులకు మద్ధతు ధర కల్పించాలంటూ ఆయన హడావుడిగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. మిర్చి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకే జగన్ గుంటూరు మిర్చి యార్డు సందర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతులకు న్యాయం చేయడానికే ఆయన అక్కడ పర్యటించారు.భద్రత కల్పించలేదు:రైతులను పరామర్శించడానికి వైయస్ జగన్ వెళితే, యార్డు వద్ద కావాలనే రక్షణ వలయం ఏర్పాటు చేయలేదని మిర్చి రైతులే చెబుతున్నారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రైతులతో మాట్లాడటానికి వస్తుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం దేనికి నిదర్శనం?. అసలు జగన్ రైతులతో మాట్లాడితే, చంద్రబాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా..:టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను కూడా పార్టీ కార్యకర్తలను చూసినట్లే చూస్తున్నారు. పొలీస్ వ్యవస్థను పార్టీల పరంగా విడకొట్టే విష సంస్కృతికి చంద్రబాబు తెర తీశారు. పోలీస్ వ్యవస్థ వేధింపుల గురించి హైకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చంద్రబాబుకి చీమ కుట్టినట్లు అయినా లేదు. పాలనలో చంద్రబాబు విఫలం:9 నెలల్లోనే పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉండి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు తెచ్చుకోవడం ఆయనకు చేతకావడం లేదు. చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత పాలన పుణ్యమా అని రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రతి మంగళవారం అప్పులు చేయడం తప్ప, 9 నెలల కాలంలో చంద్రబాబు నెరవేర్చిన హామీ ఒక్కటైనా ఉంటే చూపించాలి. ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌తోనే కాలం గడుపుతున్నారు. విపక్ష వైఎస్సార్సీపీ నాయకుల మీద కేసులు బనాయించడం మినహా, చంద్రబాబు పాలనలో ప్రజలకు జరిగిన మేలు శూన్యం అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. -
అభినయ్ ఓటమి కంటే.. అదే ఎక్కువ బాధించింది: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో పేదల కోసం పాటుపడే వ్యక్తి వైఎస్ జగన్ అయితే, పేదల ఓట్లు వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో అధికారం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతారా? అని ప్రశ్నించారు. కుట్రలకు తెరలేపిన వాళ్ళను జైలుకు పంపిస్తాం. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం చేస్తాం అని హెచ్చరికలు జారీ చేశారు.తిరుపతి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీనియర్ నాయకులు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, కూటమి సర్కార్ పాలనపై వైఎస్సార్పీ నేతలు మండిపడ్డారు.తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘జగనన్నను గెలిపించుకోవాలని పేద ప్రజలు అందరూ భావిస్తున్నారు. మనం పోగొట్టుకున్నాం అనే భావన వారిలో ఉంది. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియ సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. వారిని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని సమాచారం తెలుసుకుని జన ప్రవాహం తరలివచ్చింది. నిన్న విజయవాడలో వంశీని పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ప్రజలకు చేసిందేమీ లేదు. పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్ అయితే, పేదల ఓట్లు వాడుకునే వ్యక్తి చంద్రబాబు. నేను కార్యకర్తలు కోసమే పనిచేస్తాను అని చాలా స్పష్టంగా జగన్ చెప్పారు. ఆయన అనుచరులుగా, శిష్యులుగా మేము గర్వపడుతున్నాము. డిప్యూటి మేయర్ ఎన్నిక సందర్భంగా నమ్మకద్రోహం చేసిన వాళ్లం చూశాం. నా కొడుకు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు బాధ కంటే, నేను నమ్మిన నాయకులు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వెళ్ళిపోయినప్పుడు బాధ పడ్డాను. అధికారం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతారా?. నెత్తిన పైసా పెడితే మారని వ్యక్తుల్ని నాయకుల్ని చేశాను. రాజారెడ్డి సింహం లాంటి వ్యక్తితో నడిచా, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి యుద్ధ వీరుడుతో పనిచేశా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడితో పని చేస్తున్నాను. మేయర్ పదవి కోసం అవిశ్వాసం పెడితే త్యాగం చేసైనా కాపాడుకుంటాం. అవసరమైతే జగన్‌ను తిరుపతికి రప్పిస్తాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం చేసేంత వరకు కష్టపడి పనిచేస్తామన్నారు.భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు తుని మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ పోరాటానికి తిరుపతి పార్టీ నేతలే స్పూర్తి. స్థానిక సమస్యలపైన రానున్న రోజుల్లో మరింత ఉద్యమం చేస్తాం. మీ పాలనలో తిరుపతి టౌన్ బ్యాంక్ అప్పుల్లో కూరుకు పోయింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలపై జరిగిన దాడి ఘటనపై ప్రధాని, హ్యూమన్ రైట్స్, కేంద్ర ఎన్నికలు సంఘం, లోక్‌సభలో ప్రివిలేజ్ మోషన్ కింద పెడతామన్నారు.తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు గడిపేలా తిరుపతి నుంచి కరుణాకరరెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన మరింత పోరాటం చేస్తాం. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా పోలీసులు, రౌడీలు కలిసి పోయి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి చేశారు. కుట్రలు తెరలేపిన వాళ్లను జైలుకు పంపిస్తాం. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్య వేదికలు, రాజ్యాంగ హక్కుల వేదికల దృష్టికి తీసుకు వెళ్తాం. కుట్రలో భాగస్వామ్యం అయిన వారు అందరికీ బుద్ధి చెబుతాం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని అన్నారు.తిరుపతి మేయర్ శిరీష మాట్లాడుతూ.. కూటమి పాలనలో ఎవరిని అరెస్ట్ చేస్తారు అనే చర్చ జరుగుతోంది. సంక్షేమం, అభివృద్ధి అనేది రాష్ట్రంలో చర్చ లేదు. ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలి.. ఎలా వేధించాలి అనేది చర్చ జరుగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
జగన్ ఎఫెక్ట్.. కొత్త డ్రామాకు తెర తీసిన చంద్రబాబు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ గుంటూరుకు వెళ్లి మరీ మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నాటకానికి తెర తీశారు. మిర్చి రైతుల సమస్యలంటూ కేంద్రానికి ఓ లేఖ రాశారాయన. గుంటూరు మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టారు కూడా. అయితే.. సీఎం హోదాలో చంద్రబాబు(CM Chandrababu) ఇన్నాళ్లు మిర్చి రైతుల కన్నీళ్లను పట్టించుకుంది లేదు. గిట్టుబాటు ధరల కోసం ఒక్క సమీక్ష జరిపిందీ లేదు. కనీసం మంత్రులను కూడా అక్కడికి పంపించలేదు. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్(YS Jagan) స్వయంగా వెళ్లి పరామర్శించాలనుకోగా.. ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించబోయింది. అయినా కూడా ఆయన ముందుకు వెళ్లారు. రైతులను కలిసి జగన్ వాళ్ల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. మీడియా ముఖంగా వాటిని వినిపించారు కూడా. మిర్చి రైతుల గోడు విన్న జగన్‌కు పేరు దక్కవద్దనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. జగన్ పర్యటన వేళ.. ఆగమేఘాల మీద మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాసింది. మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం నుండి మాత్రం రైతులకు ఎటువంటి మద్దతు అందిస్తున్నారో తెలియజేకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఇకనైనా కళ్లు తెరిచి రైతుల్ని పట్టించుకో -
యనమల రామకృష్ణుడికి కృష్ణుడి కౌంటర్
సాక్షి, కాకినాడ: టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నేత యనమల కృష్ణుడు. టీడీపీకి బలం లేకపోయినా అధికార జులుంతో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ పదవి గెలవాలని భావించారు. యనమల చెత్త రాజకీయంలో భాగంగానే ఇదంతా జరిగింది అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నాయకుడు యనమల కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పది మంది కౌన్సిలర్లతో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ పదవి గెలవాలని యనమల రామకృష్ణుడు భావించారు. టీడీపీ బలం లేకపోయినా.. అధికారం జులుంతో గెలవాలని అనుకున్నారు. దీనిని బట్టి యనమలకు ప్రజాస్వామ్యం ఎంత వరకు తెలుసు అనేది తుని ప్రజలకు అర్ధమైంది. యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి లెక్కలే చూపించి ఎన్టీఆర్‌ను పదవిలో నుంచి దించేశారు. ఆయన కన్నీరు పెట్టుకునేలా చేశారా? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించినా.. ఇప్పటికీ వైఎస్సార్సీపీ బలం 17 మంది కౌన్సిలర్లు, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది. పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనుకున్నారు. జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మున్సిపల్ చైర్మన్ సుధారాణిపై అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూశారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
బాబూ మీరు చేస్తున్నది కరెక్టేనా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan) గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఆయన పర్యటన సందర్బంగా ఎక్కడా పోలీసులు కనిపించలేదు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ బుధవారం గుంటూరు(Guntur) మిర్చి యార్డులో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల వద్దకు వెళ్తున్న సమయంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతో జనసందోహం మధ్యే ఆయన వారిని కలిశారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు?. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.అంతకుముందు.. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో పెద్దగా పోలీసులు ఎక్కడా కనిపించలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనను కలిసేందుకు మిర్చి యార్డ్ వద్దకు భారీగా ప్రజలు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
కేంద్రంలో చంద్రబాబు పరపతి బండారం ఇది!
‘ఐఏఎస్ అధికారులను పంపండి మహాప్రభో!’. డిప్యుటేషన్‌పై ఇవ్వాలని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం వినతులు. అధికారుల కొరత ఉందని రెండుసార్లు లేఖలు రాసిన సీఎం చంద్రబాబు.. అయినా స్పందించని కేంద్రం.. ఇది కొన్నాళ్ల క్రితం తెలుగుదేశం అధికార మీడియా ‘ఈనాడు’లో ప్రముఖంగా వచ్చిన వార్త.‘ఏపీ కేడర్‌పై కక్ష.. నాన్ ఏపీ కేడర్‌పై ఆపేక్ష’.. ఐదుగురు ఐఎఎస్, తొమ్మిది మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వని కూటమి ప్రభుత్వం.. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం.ఈ రెండు వార్తలు చదివితే ఏం అర్థమవుతోంది?. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వద్ద ఉన్న సీనియర్ అధికారులను వాడుకోకపోగా.. కొత్తగా అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని అడుగుతున్నారూ అని!. అంతేకాదు.. కేంద్రంలో కాని, ఆయా రాష్ట్రాలలో కాని పని చేస్తున్న నాన్ కేడర్ అంటే అఖిల భారత సర్వీస్ కానీ తమ వాళ్లను ఏపీకి తీసుకురావాలని ప్రయత్నించడమే కదా! ఇందులో మతలబు ఏమిటి? ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏ ప్రభుత్వం ఉన్నా, విధానాలకు అనుగుణంగా పని చేయవలసి ఉంటుంది. నిబంధనలు, రాజ్యాంగంలోని అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.అయితే, ఏపీలో ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి బదులు సొంత రెడ్ బుక్ అమలుకే ప్రాధాన్యత ఇస్తోంది. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసిన అధికారులపై కక్ష తీర్చు కోవడం, ఇష్టం లేని అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించడం చేస్తోంది. ఒక వైపు ఉన్న అధికారులను వాడుకోకపోగా మరోవైపు కేంద్రం తమకు కావల్సిన అధికారులను ఇవ్వడం లేదని వార్తలు రాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 239 మంది ఉన్నతాధికారులు అవసరమైతే ప్రస్తుతం 191 మందే ఉన్నారని ఈనాడు కథనం. నలుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్, నలుగురు ఐఆర్ఎస్లు కలిపి పది మందిని డిప్యుటేషన్‌పై పంపాలని చంద్రబాబు ఇప్పటికీ రెండుసార్లు లేఖలు రాసినా కేంద్రం నుంచి జవాబు రాలేదట. చిత్రం ఏమిటంటే ఏదైనా అనుకూల నిర్ణయం జరిగితే అదంతా చంద్రబాబు విజయం, గొప్పదనం అని డబ్బా కొట్టే ఈనాడు, కేంద్రం డిప్యుటేషన్‌పై అధికారులను పంపకపోవడాన్ని మాత్రం ఉన్నతాధికారుల వైఫల్యమని చెబుతోంది.ఉన్నతాధికారులను కేటాయించగల స్థాయి ఉన్న వారి వద్దకు అధికారుల కంటే ముఖ్యమంత్రే వెళ్లగలరన్నది అందరికీ తెలిసిన విషయం. అయినా సరే తమ బాబును వెనకేసుకొచ్చేందుకు ఈనాడు ఈ రకమైన కథనాలు రాస్తూంటుంది. నైపుణ్యమున్న అధికారుల కొరత ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఈ నైపుణ్యం తమ సామాజిక వర్గం వారు లేదా రాజకీయంగా తమకు ఉపయోగపడగలిగే వారు అని సీఎం అర్థం?. ఈ నియామకాలు ప్రతిభ ఆధారంగా జరుగుతాయా అని ప్రశ్నిస్తే.. ఎక్కువ సందర్భాలలో వ్యక్తిగత ఇష్టాఇష్టాలపైనే జరుగుతుంటాయన్నది వాస్తవం.ఏపీలో కూటమి సర్కార్ తీరు మరీ ఘోరం. గత టర్మ్‌లో ఆదాయపన్ను శాఖలో పనిచేసే ఒక అధికారిని డిప్యుటేషన్‌పై తెచ్చుకుని ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డులో నియమించుకున్నారు. దానికి కారణం ఆయనలో ఉన్న నైపుణ్యం కంటే, ఐటి శాఖలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌ను ఇబ్బంది పెట్టే నివేదికలు తయారు చేశారన్న అభిమానమే కారణమని అప్పట్లో చెప్పుకునేవారు. అలాగే ఇదే సంస్థలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి కుమార్తెను కూడా భారీ జీతానికి నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది 2014 టర్మ్‌లో జరిగిన సంగతి. తాజాగా జరిగిన ఒక డిప్యుటేషన్‌ను పరిశీలిద్దాం.గత టర్మ్‌లో డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన వెంకయ్య చౌదరి అనే అధికారిని ఈసారి ప్రభుత్వం రావడంతోనే టీటీడీ అదనపు ఈవోగా నియమించారు. గనుల శాఖ నైపుణ్యానికి, టీటీడీలో అవసరమైన నైపుణ్యానికి సంబంధం ఉంటుందా అంటే ఎవరూ చెప్పలేరు. జగన్ ప్రభుత్వం ధర్మారెడ్డి అనే రక్షణ శాఖ అధికారిని డిప్యుటేషన్‌పై టీటీడీకి తెచ్చి నియమిస్తే ఇదే తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసేది. మరి ఇప్పుడు వెంకన్న చౌదరిని ఎందుకు పెట్టుకున్నారు? తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడును తిరుపతి జిల్లా ఎస్పీగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటన నేపథ్యంలో వీరిద్దరిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. సుబ్బరాయుడిని మాత్రం బదిలీ చేసినట్లు చేసి, తిరిగి తిరుపతిలోనే ఎర్ర చందనం టాస్క్‌ఫోర్స్ అధికారిగా నియమించారు. ఈయనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో సిట్‌లో కూడా సభ్యుడిని చేశారు.అంటే ప్రభుత్వ పెద్దలు కోరినట్లుగా రెడ్ బుక్ అమలు బాధ్యతను పెడుతున్నారన్నమాట. తిరుమలలో పెత్తనం చేయడానికి వెంకయ్యకు పోస్టింగ్ ఇచ్చారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళిని తెచ్చుకుని సీఎంవోలో పెట్టుకున్నారట. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏపీలో శ్రీలక్ష్మి, మురళీధర్ రెడ్డి, ముత్యాల రాజు, నీలకంఠా రెడ్డి, మాధవీలత వంటి ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లే ఇవ్వకపోవడం. ఇష్టం లేని అధికారులు అనుకుంటే వారికి ప్రాధాన్యంలేని పోస్టులు ఇస్తుంటారు. వీరికి మాత్రం ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. అలాగే ఐపీఎస్ అధికారులు నలుగురిని కొన్ని పిచ్చి కేసులలో సస్పెండ్ చేశారు. స్కిల్ స్కామ్ కేసు, మార్గదర్శి డిపాజిట్లు, ఇతర అక్రమాల కేసులను దర్యాప్తు చేసి పలు అంశాలను వెలుగులోకి తెచ్చారన్న కోపంతో మరికొందరు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇవ్వలేదు.వీరిలో కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, సునీల్ కుమార్, జాషువా అనేవారు ఉన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ ఐపీఎస్‌లు రోజూ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి అటెండెన్స్ వేసుకుని, సాయంత్రం వరకు అక్కడే ఖాళీగా కూర్చోవాలట. బహుశా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన నడపలేదు. ఒకవైపు ఇలా సీనియర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా, లేదా వారిపై స్పష్టమైన అభియోగాలు మోపకుండా చేస్తున్న తీరు సహజంగానే కేంద్రం దృష్టికి కూడా వెళ్లే అవకాశం ఉంది. మరి అడ్డగోలుగా రాజకీయ పాలనే కేంద్ర ప్రభుత్వంలో కూడా జరుగుతున్న సందర్భాలలో చంద్రబాబు వంటివారు ఏం అడిగితే అది ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పాలన ఉంటే ఎలాంటి లేఖలు వచ్చినా స్పందించకుండా ఉంటారా?.అయినా కేంద్రంలో తమ పార్టీ ఎంపీల సంఖ్యతోనే చక్రం తిప్పుతున్నామని టీడీపీ చెబుతుంది. చంద్రబాబుకు ఉన్న పరపతిపై ఈనాడు మీడియా హోరెత్తిస్తుంటుంది. అయినా చంద్రబాబు రెండు లేఖలు రాసినా ఆయన కోరిన విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రం పంపించలేదంటే, డిప్యుటేషన్లు ఇవ్వలేదంటే ఏమనుకోవాలి?. చంద్రబాబు ప్రభుత్వం మరీ అధ్వాన్నంగా పాలన సాగిస్తుందని పరోక్షంగా చెప్పడమే అవుతుంది!. అయినా ఏదో రకంగా ప్రధాని మోదీనో, హోం మంత్రి అమిత్ షానో పట్టుకుని తమకు కావాల్సిన వారిని ఏపీకి తెచ్చుకుంటారేమో చూడాలి. కానీ, ఉన్న అధికారులను వాడుకోకుండా వేరే వారిని పంపించాలని అనడంలో హేతుబద్దత ఏమిటో తెలియదు. అదీకాక ఇప్పుడు రెడ్ బుక్ అంటూ సీనియర్ అధికారులను వేటాడుతున్న తీరు ఐఏఎస్, ఐపీఎస్ సర్కిల్స్‌లో తెలియకుండా ఉండదు.గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది తిరిగి డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుని వెళ్లిపోతామంటే కూడా ఏదో రకంగా కూటమి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఎవరైనా డిప్యుటేషన్ పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటే వారిపై కూడా కక్ష పూరితంగా ఆటంకాలు సృష్టిస్తోందట. అదే సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఒక పోలీసు అధికారిని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయనకు ఒక కార్పొరేషన్ పదవి కూడా కట్టబెట్టింది. మరోవైపు తమ అవినీతి కేసులలో తప్పుడు సాక్ష్యాలు ఇవ్వకపోతే రెడ్ బుక్ ప్రయోగిస్తామన్న హెచ్చరికలు పంపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇంకో మాట చెప్పాలి. కూటమి ప్రభుత్వం రావడంతోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి మరింతగా చెలరేగిపోతూ అధికారులు అందరిపై తమదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. వారు ఎవరి మీద ఆరోపణలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలట.తెలుగుదేశం ప్రభుత్వం కక్షతో పాటు ఈ మీడియా కక్ష కూడా అధికంగానే ఉంటున్నట్లుగా కనిపిస్తుంది. ఈనాడు పెత్తనం ఏ స్థాయికి వెళ్లిదంటే చివరికి ఒక జిల్లా కలెక్టర్, ఒక ఎస్పీనే ఈనాడు విలేకరిపై మండిపడాల్సినంతగా పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఈనాడు ఏదో కథనం వండి వార్చుతోంది. దానిపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒక కమిటీని నియమించుకుంది. ఆ కమిటీ అధికారులు విచారణకు వెళితే ఈనాడు విలేకరి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులకు చికాకు తెప్పించారు. దానిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తే, తెల్లవారేసరికల్లా ఆ కలెక్టర్, ఎస్పీలపై మొదటి పేజీలో పెద్ద వార్త రాసేశారు. ఒకప్పుడు మీడియాకు స్వీయ నియంత్రణ ఉండేది. ఇప్పుడేమో స్వీయ బ్లాక్ మెయిలింగ్తో మీడియా అధికార యంత్రాంగాన్ని తానే నడపాలని ప్రయత్నిస్తోంది. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పాలన సాగిస్తున్నది చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. గతంతో వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదు. మిర్చి రైతుల(Mirchi Farmers) అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది... చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే.. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్సీపీ(YSRCP) ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.నినాదాలతో జగన్ ప్రసంగానికి అంతరాయంజగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మిర్చి యార్డ్ బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతుండగా .. సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో వినిపించకుండా పోయింది. ఆపై పక్కకు వచ్చిన ప్రజల నినాదాల నడుమే మీడియాతో బిగ్గరగా మాట్లాడాల్సి వచ్చింది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఈసీ అనుమతి లేదంటూ పోలీసులను ప్రయోగించడం మొదలు.. రైతులతో ఆయన్ని మాట్లాడనీయకుండా చివరిదాకా ప్రయత్నాలెన్నో చేసింది.బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం పోలీసులు చేసిన అతి అంతా ఇంతా కాదు. ఈసీ అనుమతి లేదని చెబుతూ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. వైఎస్సార్సీపీ(YSRCP) నేతల వాదనలతో పోలీసులు దిగొచ్చారు. దీంతో జగన్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు.ఇక పెద్దగా భద్రత లేకుండానే మిర్చి యార్డులో అడుగు పెట్టిన వైఎస్ జగన్(YS Jagan) .. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలోనూ లౌడ్ స్పీకర్లతో అధికారులు ప్రకటనలు చేస్తూ.. ఆయన్ని రైతులతో మాట్లాడకుండా అవాంతరాలు కలిగించబోయారు. కానీ ఆయన మాత్రం మిర్చి రైతుల గోడును ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి వినతి పత్రాలు సైతం స్వీకరించారు. సాధారణంగానే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానం ఎలా వెల్లువెత్తుతుందో తెలియంది కాదు. మిర్చి యార్డులో ఘాటును సైతం పట్టించుకోకుండా జగన్‌ను చూసేందుకు ఇవాళ ఇసుకేస్తే రాలని జనం వచ్చారు. అలాంటిది యార్డులో ఒక్క పోలీసుల కూడా ఉండకుండా చూసుకుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
వైఎస్ జగన్ భద్రతపై కూటమి కుట్ర.. పోలీసులు ఎక్కడ?: అంబటి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). ఎన్నికల కోడ్ అంటూ వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారని అన్నారు. మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని వైఎస్ జగన్‌కు ఇవ్వాల్సిందేనని చెప్పారు.వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతుంది. ఎన్నికల కోడ్ వంక పెట్టి వైఎస్ జగన్ పర్యటనలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, వాళ్లే ఇబ్బంది పడతారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు.. ప్రచారం చేయడం లేదు. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడటం లేదు. వైఎస్ జగన్ మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ వైఎస్ జగన్‌కు ఇచ్చి తీరాల్సిందే. పోలీస్ అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలి.కూటమి సర్కార్ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైఎస్ జగన్ గుంటూరు(Guntur Mirchi Yard) మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. వైఎస్సార్సీపీ హయాంలో గిట్టుబాటు ధర లేని పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసింది’ అని చెప్పుకొచ్చారు. అనంతరం, పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అంబటి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. గుంటూరు మార్కెట్ యార్డు వద్ద ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా జగన్‌కు భద్రతా సమస్యలు సృష్టించాలనే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల గోడు బయటకు రాకూడదనే ప్రభుత్వం కుట్ర చేస్తోంది. భద్రత లేకుండా చేసి సమస్యలు సృష్టించాలని చూస్తోంది. ప్రభుత్వం తీరు చాలా అరాచకంగా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కావాలనే వైఎస్ జగన్‌కు భద్రతను కుదిస్తున్నారు. పాడైపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఇచ్చారు. కనీసం రివ్యూ చేయకుండానే ఉన్న ఫళంగా జగన్ భద్రతను కుదించేశారు. జిల్లాల్లో ఆయన పర్యటనల సమయంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తప్పు చేసినోళ్లు.. ఎక్కడున్నా వదలం: వైఎస్ జగన్
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేటప్పుడు తాను ఏడాదిన్నర తర్వాత రిటైర్ అవుతానని సీఐ అన్నాడట..! రిటైర్ అయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా.. మొత్తం అందరినీ పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. న్యాయం జరిగేటట్లు చేస్తాం.2023లో పోలీసులు సత్యవర్థన్ నుంచి రికార్డు చేసిన 161 స్టేట్ మెంట్లోనూ వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండోసారి తీసుకున్న 161 స్టేట్మెంట్లోనూ తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ లేడని సత్యవర్థన్ స్పష్టంగా చెప్పాడు. న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడూ అదే విషయాలను చెప్పాడు.దీంతో ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి.. తప్పుడు ఫిర్యాదు ఇప్పించి కేసు పెట్టారు. వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే.. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేసి బలవంతంగా పేరు చెప్పించారు. చంద్రబాబు పాలనలో ప్రతి కేసూ ఇల్లీగలే... ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తారు.. మళ్లీ తిరిగి తమను బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడతారు. అసలు ఎవరు.. ఎవరిని బెదిరిస్తున్నారు? రాజకీయ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలనూ వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదిరిస్తూ అవతలి వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ ఊరికే పోవు. వారికి తప్పకుండా చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది.. – మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని.. వారు ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతామని వైఎస్సార్సీపీ(YSRCP)అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. అన్యాయం చేసిన అధికారులు, నాయకులు ఎవరినీ వదిలి పెట్టబోమన్నారు. ‘మీ టోపీలపై కనిపించే మూడు సింహాలకు సెల్యూట్ చేయండి..! టీడీపీ నాయకులకు కాదు..! మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి..’ అని పోలీసులకు హితవు పలికారు. ‘టీడీపీ నాయకులు ఆడించినట్లల్లా ఆడుతూ అన్యాయాలు చేస్తే.. ఎల్లకాలం ఆ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి..! రేపు మేం అధికారంలోకి వస్తాం.. అన్యాయం చేసిన అధికారులు, నాయకులను చట్టం ముందు నిలబెడతా..’ అని హెచ్చరించారు. అక్రమ కేసులో అరెస్టై విజయవాడలోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. వంశీ సతీమణి పంకజశ్రీతో కలిసి జైలు లోపలికి వెళ్లారు. పార్టీ సీనియర్ నేతలు, నాయకులెవరినీ జైలు అధికారులు లోపలకు అనుమతించలేదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం బయటే నిలువరించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో జైలు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వారందరినీ పోలీసులు చాలా దూరంలోనే అడ్డుకున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం జైలు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. విజయవాడ గాందీనగర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూడడానికి తరలివచ్చిన అశేష జనసందోహంలో ఓ భాగం వంశీ ఏ తప్పూ చేయకున్నా.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనిస్తే.. అత్యంత దారుణంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది. ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ(TDP) ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఆ వ్యక్తి సాక్షాత్తూ తానే న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని అందులో ఆయన చెప్పినప్పటికీ తప్పుడు కేసు బనాయించారు. మేం ఏనాడూ ఏకపక్షంగా వ్యవహరించలేదు.. 2023 ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీని భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తిట్టించారు. ‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళ్తా.. ఎవడేం పీకుతాడో చూస్తా... ఆ వంశీ సంగతి చూస్తా... నియోజకవర్గం నుంచి బయటకు విసిరేస్తా..’ అని పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మర్నాడు ఫిబ్రవరి 20న కూడా అదే పట్టాభిని చంద్రబాబు గన్నవరం పంపాడు. అక్కడ పట్టాభి మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి వంశీని తిట్టాడు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోగేసిన మనుషులను వెంట బెట్టుకుని పట్టాభి ఒక ప్రదర్శనగా వైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడికి బయలుదేరాడు. వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్దకు చేరుకుని అక్కడ శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా వారు దాడి చేయడంతో ఆయన తల పగిలింది. ఆయన కూడా దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. టీడీపీ వారు పెద్ద సంఖ్యలో దాడికి సిద్ధం కావడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఇరువైపుల వారిపై కేసులు నమోదు చేశారు. నిజానికి ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదు. పోలీసుల చర్యలను అడ్డుకోలేదు. కేసు నుంచి బయటపడే ప్రయత్నమూ చేయలేదు. ఎక్కడా వంశీ ప్రమేయం, పేరు లేకున్నావైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేతలు మూడు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. అయితే వాటిలో ఎక్కడా వంశీ పేరు లేదు. ఆ ఫిర్యాదుల్లోనూ, పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుల్లోనూ ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం.. ఆ ఘటన జరిగినప్పుడు వంశీ అక్కడ లేరు. అది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని తమ కార్యాలయానికి చంద్రబాబు మనుషులు పిలిపించారు. సత్యవర్థన్‌తో తెల్ల కాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. దాని ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో కూడా వంశీ పేరు లేదు. 2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్మెంట్ రికార్డు చేశారు. అందులోనూ వంశీ పేరు, ప్రసావన లేదు. టార్గెట్ వంశీ... కేసు రీ ఓపెన్ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసును రీ ఓపెన్ చేశారు. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇదే సత్యవర్థన్‌తో రెండోసారి 161 స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే అందులో కూడా తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ లేడని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ ఘటన జరుగుతున్నప్పుడు తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తొలి స్టేట్మెంట్లో చెప్పిందే రిపీట్ చేశాడు. అయినా సరే.. చంద్రబాబు ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే.. ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, ఘటనా స్థలంలో లేకపోయినా కూడా ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు. అయితే ఆ కేసులోవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కుట్రను మరింత ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌ను తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిజానికి అలాంటిది జరగకపోయినా చంద్రబాబు కట్టుకథ అల్లారు. ఎందుకంటే.. ఆ ఆఫీస్ భవనం యజమానులు ఎస్సీ, ఎస్టీలైతే వారితో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించవచ్చని భావించి ఆ భవనం అదే సామాజిక వర్గానికి చెందిన వారిదంటూ దొంగ వాంగ్మూలం కూడా ఇచ్చేశాడు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ బిల్డింగ్ కూడా చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. అంటే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ప్రయత్నమిది అని అర్థమవుతోంది. కుట్రతో బెయిల్‌నూ అడ్డుకుంటున్నారుమొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలల తరబడి వైఎస్సార్సీపీ వారిని వేధించేందుకు ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్ మేజి్రస్టేట్ ముందు హాజరై వాంగ్మూలం ఇస్తే వారికి కూడా బెయిల్ వస్తుందనే ఆందోళనతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే సత్యవర్థన్‌కు 20 సార్లు కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చినా.. ప్రతిసారీ దాటవేస్తూ కోర్టుకు రాలేదు. చివరకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సత్యవర్థన్ తనంతట తానే న్యాయమూర్తి ముందు హాజరయ్యాడు. గతంలో తాను పోలీసులకు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో.. అదే విషయాలను చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తాను లేనని, తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేశాడు. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టుకు మొర పెట్టుకున్నాడు.ప్రజాస్వామ్యం ఖూనీ..ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోంది. పిడుగురాళ్ల మునిసిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటే.. సోమవారం జరిగిన ఉప ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని టీడీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీకి సంఖ్యా బలం లేకున్నా.. ఒక్క సభ్యుడు కూడా లేకున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా తామే ఆ ఎన్నికలో గెల్చామని చెప్పుకుంటోంది. చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం.⇒ తిరుపతి కార్పొరేషన్‌లోని 49 డివిజన్లలో 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందగా కేవలం ఒక్క డివిజన్లో మాత్రమే టీడీపీ నెగ్గింది. అలాంటి చోట.. పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ పీఠాన్ని సాధించామని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది. దీన్నిబట్టి అక్కడ కూడా పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ⇒ తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. మరి అలాంటి చోట టీడీపీ వైస్ ఛైర్మన్ పదవిని ఎలా గెల్చుకుంటుంది? అక్కడ దౌర్జన్యం చేసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి టీడీపీ ఒత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల పరిస్థితి వచ్చే వరకు ఆ ఎన్నిక జరపరు. పోలీసులతో కలసి తండ్రీ కుమారుల కుట్ర..తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకు వచ్చానని, తన స్టేట్మెంట్ వెనక ఎవరి బలవంతమూ లేదని సత్యవర్థన్ మొన్న.. ఫిబ్రవరి 10న న్యాయమూర్తి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మనశ్శాంతి కరువైన చంద్రబాబు, లోకేశ్ మళ్లీ పోలీసులతో కలసి కుట్ర పన్నారు. అందులో భాగంగా ఆ మర్నాడే.. సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించడంతో పాటు తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడంటూ ఫిబ్రవరి 11న విజయవాడ పటమట పీఎస్‌లో ఆయనపై ఒక ఎఫ్ఐఆర్ పెట్టి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 12న.. సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని అతడిని కిడ్నాప్ చేశారని, దాన్ని ఎవరో చూసి తనకు చెప్పారంటూ సత్యవర్థన్ అన్నతో పోలీసులకు ఒక ఫిర్యాదు ఇప్పించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు. ఇక ఆ మర్నాడు.. ఫిబ్రవరి 13 తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేశారు. అందులో వంశీ పేరు చెప్పించారు. అంటే.. ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో అతడి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోకుండానే వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. ఆ సాయంత్రం తాపీగా సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది. ఒక మనిషి తప్పు చేస్తే.. అతడిని శిక్షిస్తే పోలీసులకు గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో ఉంచుతున్నారు. వంశీపై పెట్టిన కేసే దీనికి నిదర్శనం.వంశీ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే..‘‘వంశీని ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే.. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి! చంద్రబాబు, లోకేశ్ కంటే ఆయన గ్లామరస్‌గా ఉన్నారనే..! వల్లభనేని వంశీతో పాటు కొడాలి నానిపై వారికి జీరి్ణంచుకోలేని ఆక్రోశం. ఇక అవినాశ్ కూడా లోకేశ్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు... ఇదీ చంద్రబాబు మనస్తత్వం! ఆ సామాజిక వర్గంలో చంద్రబాబు, ఆయన కుమారుడు మాత్రమే లీడర్లుగా ఉండాలనుకుంటారు! వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలి వేస్తారు..!’’ అని మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అదో మాఫియా సామ్రాజ్యం!‘‘చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కలిసి చేసేవన్నీ కుట్రలు, కుతంత్రాలే..! అది ఒక మాఫియా సామ్రాజ్యం. చంద్రబాబును సీఎంను చేయడం కోసం.. ఆయనకు ఓట్లు వేయించడం కోసం వారు ఒక మాఫియా సామ్రాజ్యంలా తయారయ్యారు. వారి సామాజిక వర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని ఇక అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. బురద చల్లడంతో పాటు దారుణంగా ట్రోలింగ్ చేస్తారు. ఇవన్నీ చంద్రబాబు, లోకేశ్ నైజానికి అద్దం పడుతున్నాయి’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, నల్లగట్ల స్వామిదాసు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తదితరులు ఉన్నారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకే కన్నీళ్లే
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంపై మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను ఓదార్చేందుకు బుధవారం గుంటూరు మిర్చి యార్డ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల్ని ఓదార్చనున్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతుల గోడు వినడానికి వైఎస్ జగన్ రేపు (బుధవారం) మిర్చి యార్డుకు వస్తున్నారు.రైతుల కష్టనష్టాలను తెలుసుకుంటారు. మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యాన్ని రూ.1300 రూపాయలకే అమ్ముకున్నారు. పత్తి నాలుగు వేల రూపాయలకు కొనే దిక్కు లేదు.వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వం నేరుగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధరల స్థిరీకరణ కోసం రూ.3000 కోట్లు కేటాయించాం. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై సిఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. చేతకాని ప్రభుత్వం.మేము అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేని ప్రతి పంట మా ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని వ్యాఖ్యానించారు.ప్రభుత్వం నోరు మెదపదేం మిర్చికు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల్ని కలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్‌కి వస్తున్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఎకరానికి లక్షకు పైగా రైతు అప్పులు ఊబిలో కూలిపోయాడు.దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. మిర్చిపైన ఎందుకు మంత్రులు మాట్లాడట్లేదు’అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
వంశీ కేసులో బట్టబయలైన టీడీపీ పన్నాగం
విజయవాడ: వైఎస్సార్ సీపీ నేత వల్లభనేని వంశీ కేసులో టీడీపీ-పోలీసుల పన్నాగం బట్టబయలైంది. వంశీ కేసులో తప్పుడు సాక్ష్యం ఇచ్చానని కోర్టుకు చెప్పిన సత్యవర్థన్ పై కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర తేటతెల్లమైంది. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని సత్యవర్థన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర పూరిత రాజకీయం మరొకసారి బట్టబయలైంది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సత్యవర్థన్ని బెదిరించేందుకు కేసు నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీన వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ రిజస్టర్ చేశారు పోలీసులు. 84/2025 కేసులో సత్యవర్థన్ ఏ5గా ఉన్నారు. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై కొమ్మాకోట్టు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్థన్లపై కేసు నమోదు చేశారు. 232, 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. సత్యవర్థన్ పై కేసు పెట్టి మరుసటి రోజు అన్న తో ఫిర్యాదు చేయించారు పోలీసులు. ఆ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో వంశీపై కుట్ర పూరితంగా టీడీపీ కేసు పెట్టించిందనే విషయం బహిర్గతమైంది. -
ఇదీ బాబు, లోకేష్‌లు మనస్తతత్వం: వైఎస్ జగన్
ఎన్టీఆర్, సాక్షి: సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుండడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే తప్పుడు కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం. తనకన్నా, లోకేష్ కన్నా గ్లామర్ ఉంటే చంద్రబాబు(Chandrababu) సహించలేరు. తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ తట్టుకోలేరు. అందుకే వంశీ అంటే చంద్రబాబుకి అంత మంట. అలాంటి వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం.. అక్రమ అరెస్టులు, ట్రోల్ చేయించడం వాళ్లిద్దరి నైజం. ఇందుకు చంద్రబాబు కోసమే పని చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. బాబు మాఫియా రాజ్యం(Babu Mafia) నడుస్తోంది. రేపు దేవినేని అవినాష్ లాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టొచ్చు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
సాక్షి, కాకినాడ జిల్లా: నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలతో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు దిగారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సాస్‌పీ వారే. ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మంది టీడీపీ లాక్కుంది. వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడి చేసి.. మున్సిపల్ ఆఫీస్‌లో వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.దీంతో ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గుండాలు.. నాలుగోసారి అడ్డుకున్నారు.తునిలో పోలీస్ బందోబస్తు లేదంటూ వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘‘తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు’’ అని దాడిశెట్టి పేర్కొన్నారు. తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను పిఠాపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. -
వంశీ ఏ తప్పూ చేయలేదు.. ఇది చంద్రబాబు కుట్ర: వైఎస్ జగన్
విజయవాడ, సాక్షి: వల్లభనేని వంశీ అరెస్ట్.. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారాయన. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు పెట్టిన కేసు ఏంటి?. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్ చెప్పారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు. మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office Case) తగలబెట్టే ప్రయత్నం చేశారని, ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు.. ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించింది కాదు. వంశీపై చంద్రబాబు కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టించారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరో 44 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలుఈ రోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్లయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది.ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జ్ గారి సమక్షంలో, జడ్జ్ గారు ఇచ్చిన సమన్లతో, పోలీసుల నుంచి సమన్లు అందుకుని, న్యాయస్థానం ముందుకు వచ్చి జడ్జ్ గారి ముందు హాజరై వాగ్మూలం ఇచ్చారు. ఆ వాగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వంశీపై తప్పుడు కేసును బనాయించారు.ఇదీ కేసు చరిత్ర2023, ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీపై భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తట్టించారు.మర్నాడు ఫిబ్రవరి 20న చంద్రబాబు నేరుగా గన్నవరంకు పట్టాభిని పంపారు. అక్కడ పట్టాభి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టారు. అ తర్వాత అక్కణ్నుంచి ఒక ప్రదర్శనగా వెళ్లి వైయస్సార్సీపీ కార్యాలయం చేరుకుని అక్కడ, శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా టీడీపీ మూకలు దాడి చేశాయి. పట్టాభి, ఆయన అనుయాయులు సీఐ కనకారావు తల పగలగొట్టారు.ఆ ఘటన తర్వాత పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు మేమే అధికారంలో ఉన్నా ఏకపక్షంగా వ్యవహరించలేదు.పోలీసులు సుమోటోగా తెలుగుదేశం వారితో పాటు వైయస్ఆర్ సీపీ వారిపైనా కూడా కేసులు పెట్టారు. అందులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం వంశీ ఘటనా స్థలంలో లేరు.కుట్రపూరితంగా..ఇది జరిగిన రెండు రోజుల తరువాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు మనుషులు పిలిపించారు.అక్కడ సత్యవర్థన్ తో తెల్లకాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. కారణం వంశీ ఆ ఘటనా స్థలంలో లేరు కాబట్టి.2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ స్టేట్మెంట్ లో కూడా ఎక్కడా వంశీ పేరు లేదు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని కూడా చెప్పారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసు రీఓపెన్ చేశారు. వంశీపై చంద్రబాబు పెట్టుకున్న ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే, ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా, ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు.అవన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో, ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదని చంద్రబాబు కుట్రను ఇంకా ముందుకు తీసుకువెళ్లారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. అయినా తప్పుడు కేసు పెట్టారు.ఆ ఆఫీస్ చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. ఆయన ఎస్సీ. అలా వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి, బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ఇది.మొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలలు తరబడి వైయస్ఆర్ సీపీ వారిని వేధించాలని ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు.చంద్రబాబు, లోకేష్ కుట్రఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్థన్ మేజిస్ట్రేట్ ముందు హాజరై వాగ్మూలం ఇస్తే, మిగతా వారికి కూడా బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్రపన్నారు.పలు సమన్ల తర్వాత 2025 ఫిబ్రవరి 10న జడ్జిగారి ముందు హాజరైన సత్యవర్థన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో చంద్రబాబుగారు, లోకేష్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్లీ వీరు పోలీసులకు కలిసి కుట్రపన్నారు.సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ, ఆ మర్నాడే 11న విజయవాడ, పటమట పీఎస్‌లో సత్యవర్థన్ మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి, దాన్ని వారి కుటుంబ సభ్యులకు చూపించి, బెదిరించారు.ఆ మర్నాడు ఫిబ్రవరి 12న సత్యవర్థన్ అన్నతో సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని, అతడిని కిడ్నాప్ చేశారని, దీనిని ఎవరో చూసి తమకు చెప్పారంటూ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు.ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 13వ తేదీ తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు.ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. అదే రోజు 13వ రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేసి, అందులో వంశీపై చెప్పించారు.అంటే కనీసం ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో.. అతడి స్టేట్మెంట్ నమోదు చేయక ముందే, వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది.దొంగ కేసులకు నిదర్శనంఒక మనిషి తప్పు చేస్తే అతడిని శిక్షిస్తే పోలీసులకు ఒక గౌరవం ఉంటుంది. కానీ నేడు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైలులో పెడుతున్నారు.దీనికి వంశీపై పెట్టిన కేసు ఒక నిదర్శనం.దిగజారిన ప్రజాస్వామ్యం:పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్ఠానాలకు గానూ అన్నింటినీ వైయస్ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశంకు ఒక్క కౌన్సిలర్ కూడా లేరు.కానీ, నిన్న జరిగిన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకోవడం చూస్తే చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి నిదర్శనం. తిరుపతి కార్పోరేషన్లో మొత్తం 49 స్థానాలుంటే, అందులో వైయస్ఆర్సీపీ 48 స్థానాలను, తెలుగుదేశం ఒక స్థానంను గెలుచుకుంది. అటువంటి చోట డిప్యూటీ మేయర్ ఎన్నిక పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం వారు కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ ను గెలుచుకున్నామని చెప్పుకున్నారు. అటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలు వైయస్ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశం ఒక్కటి కూడా గెలుచుకోలేదు.అలాంటి చోట తెలుగుదేశం పార్టీ వైస్ ఛైర్మన్‌ను ఎలా గెల్చుకుంటుంది? ఇక్కడ దౌర్జన్యం చేసి వైయస్ఆర్ సీపీ కౌన్సిలర్లను తీసుకువెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి తెలుగుదేశం పార్టీ వత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల వాతావరణం వచ్చే వరకు ఎన్నిక జరపరు. పాలకొండలో వైయస్ఆర్ సీపీకి 17 స్థానాలు ఉంటే, టీడీపీకి కేవలం మూడు స్థానాలు ఉన్నాయి. అక్కడ వైస్ చైర్మన్ పదవి వైయస్ఆర్ సీపీకే వస్తుందని ఎన్నికను వాయిదా వేయించారు.పోలీసులూ గుర్తుంచుకొండిపోలీసులను ఇష్టానుసారంగా వాడుకుని ప్రజాస్వామ్యంకు తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు ప్రతి పోలీస్ కు చెబుతున్నాను, మీ టోపీల కనిపించే ఆ మూడు సింహాలకు సెల్యూట్ కొట్టండి, కానీ తెలుగుదేశం నాయకులకు కాదు. వారు చెప్పినట్లు చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాను.రేపు మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులను బట్టలు ఊడదీసి నిలబెడతామని తెలియచేస్తున్నాను. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేప్పుడు సీఐ అన్నడంట. నేను ఒకటిన్నర సంవత్సరాల తరువాత రిటైర్ అవుతాను అని. రిటైర్ అయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, మొత్తం అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెడతాం. బట్టలు ఊడదీస్తాం.– న్యాయం జరిగేట్టుగా చేస్తామని ప్రతి ఒక్కరికీ తెలియచేస్తున్నాను. ఈ మాదిరిగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు, దేవుడు వీరిని శిక్షించే కార్యక్రమం జరుగుతుందని మరోసారి చెబుతున్నాం. – అన్యాయంలో భాగస్వాములు కావొద్దు. మీ టోపీలపై ఉన్న సింహాలను గౌరవించండి. వాటికి సెల్యూట్ కొట్టండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాం.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..ప్రతి కేసూ ఇల్లీగల్ప్రజాస్వామ్యం కూలిపోతోందనేందు ఇవ్వన్నీ నిదర్శనం. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తున్నారు. తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.అసలు ఎవరు, ఎవరిని బెదరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ వీరే. పారిశ్రామికవేత్తలను, రాజకీయనేతలను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదరించి, అవతలి వారు బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.ఇవ్వన్నీ ఊరికే పోవు. ఇవ్వన్నీ కూడా వీరికి చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్తితి అతి దారుణంగా తయారవుతుంది.వంశీ ఎందుకు టార్గెట్ అంటే..తన సామాజికవర్గం నుంచి ఒక వ్యక్తి (వంశీ) ఎదుగుతున్నాడని.. అతడు తన కంటే, లోకేష్ కంటే గ్లామరస్‌గా ఉన్నాడని చంద్రబాబుకు కోపం. అలాగే కొడాలి నానిపైనా చంద్రబాబుకు జీర్ణించుకోలేని ఆక్రోశం. ఇంకా అవినాశ్ కూడా లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు. ఇదీ చంద్రబాబు మనస్తత్వం.కేవలం తాను, తన కుమారుడు మాత్రమే ఆ సామాజికవర్గంలో లీడర్లుగా ఉండాలని చంద్రబాబు మాట. అందుకే వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలేస్తారు.అదో మాఫియా రాజ్యంచంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి చేసేది. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం.చంద్రబాబును సీఎంను చేయడం కోసం, ఆయనకు ఓట్లు వేయించడం కోసం ఆ మాఫియా సామ్రాజ్యం తయారైంది.వారి సామాజికవర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్. వారిపై బురద చల్లడం. వారిపై ట్రోలింగ్ చేయించడం చేస్తున్నారు. ఇవ్వన్నీ చంద్రబాబు, లోకేష్ నైజానికి అద్దం పడుతున్నాయి.