breaking news
-
విమానాల్లో వన్యప్రాణులు
సాక్షి, విశాఖపట్నం: మూఢ నమ్మకాలతో కొందరు..! హోదా కోసం మరికొందరు..! కారణమేదైనా అరుదైన వన్యప్రాణులు సంపన్నుల ఇళ్లల్లో తారసపడుతున్నాయి. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి విమానాల్లో ఖండాతరాలు దాటి వస్తున్నాయి. ఇవి స్మగ్లర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై కస్టమ్స్ నిఘా పెరగడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త ఎయిర్‌పోర్టులను అన్వేíÙస్తున్నారు. థాయ్‌లాండ్, మలేíÙయా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వన్యప్రాణుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఓడలలో వీటిని అక్రమంగా తరలించగా ఇప్పుడు వైమానిక మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు వైమానిక రంగాన్ని వినియోగిస్తున్న టాప్ 10 దేశాల్లో భారత్ ఉండటంపై ఐక్యరాజ్యసమితి (యూఎన్ఈపీ) ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైలో అధికంవివిధ దేశాల నుంచి భారత్‌కు అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తుండగా పట్టుబడిన కేసుల్లో మూడొంతులు చెన్నై ఎయిర్‌పోర్టుల్లో నమోదైనవే కావడం గమనార్హం. ఇక్కడ నిఘా పెరగడంతో తాజాగా బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు విశాఖ ఎయిర్‌పోర్టులను ప్రత్యామ్నాయాలుగా స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. చెన్నై, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులు అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆదాయం పెరుగుతుందనే మూఢ నమ్మకంతో..తాబేళ్లు, అరుదైన బల్లులను పెంచితే ఆదాయం పెరుగుతుందని కొందరి మూఢనమ్మకం. పాములను పెంచితే కష్టాలు తొలగిపోతాయని మరికొందరి విశ్వాసం. స్మగ్లర్లకు ఇది కాసులు కురిపిస్తోంది. ఇగ్వానాలు, మార్మోసెట్లు, కంగారూలు, విదేశీ తాబేళ్లు, విషపూరిత పాములు, యాలిగేటర్లు, అరుదైన పక్షులను కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వీటిని ఎలా పెంచాలనే విషయాలపై సోషల్ మీడియాలో సమాచారం సేకరిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, కౌలాలంపూర్, ఆ్రస్టేలియా, ఆఫ్రికా నుంచి ఎక్కువగా వీటి అక్రమ రవాణా జరుగుతోంది.యూఎన్ ఈపీ ట్రాఫిక్ తాజా నివేదిక ప్రకారం 2011– 2020 మధ్య 70,000 రకాల అరుదైన జీవజాతులు 18 భారతీయ విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరిగాయి. వీటిలో సరీçసృపాలు 46 శాతం ఉండగా 18 శాతం క్షీరదాలున్నాయి. ఇండియన్ స్టార్ టార్టాయిస్, బ్లాక్ పాండ్ తాబేళ్లు, జలగలు, ఇగ్వానాలు వీటిలో ఉన్నాయి. దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 2023–24లో అక్రమ రవాణాకు సంబంధించి 18 కేసులను నమోదు చేయగా 230 వన్యప్రాణుల్ని స్వా«దీనం చేసుకున్నారు.పాములు నుంచి బల్లుల దాకా సజీవంగా.. గతంలో ఏనుగు దంతాలు, పాంగోలిన్ పొలుసులు, పులి చర్మాలు, జంతు చర్మాలు, గోళ్లు అక్రమంగా తరలించగా ఇప్పుడు ఏకంగా సజీవంగా ఉన్న వన్య ప్రాణులనే స్మగ్లింగ్ చేయడం విస్తుగొలుపుతోంది. 2019లో చెన్నై విమానాశ్రయంలో స్వా«దీనం చేసుకున్న ఆఫ్రికన్ హార్న్ పిట్ వైపర్లు, ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన తాచుపాములు, విశాఖ ఎయిర్‌పోర్టులో లభ్యమైన ప్రమాదకరమైన బల్లులు.. ఇలా సజీవంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధపడుతున్నారు. కట్టుదిట్టంగా తనిఖీలు విమానాశ్రయంలో నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయి. బ్యాగేజ్ తనిఖీల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. డీఆర్ఐ, కస్టమ్స్ సహా అన్ని విభాగాల ఆధ్వర్యంలో ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వన్యప్రాణుల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. చెక్‌లిస్ట్‌లు, తనిఖీ కేంద్రాల వద్ద ప్రయాణికులకు అవగాహన కలి్పస్తున్నాం. – రాజారెడ్డి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
ప్రాణాలు తీసిన ప్రమాదం
అందరూ 30 ఏళ్ల వయస్సు లోపువారే. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నవారు. ఆమెరికా నుంచి వస్తున్న మేనమామను తీసుకొచ్చేందుకు వెళ్తూ ఒకరు.. పరీక్ష రాసేందుకు వెళ్తున్న భార్య, తోడుగా వెళ్తున్న భర్త.. పొట్టకూటికోసం పనిచేసే డ్రైవర్.. అందరి ప్రాణాలను రోడ్డు ప్రమాదం గాలిలో కలిపేసింది. వారి కుటుంబాలకు కన్నీటిశోకాన్ని మిగిల్చింది. భోగాపురం/శ్రీకాకుళం క్రైమ్: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారి వద్ద శనివారం ఉదయం 8:12 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం నగరానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఫార్చూనర్ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపు ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో శ్రీకాకుళం నగరానికి చెందిన గవిడి కౌశిక్ (27), వడ్డి అభినవ్ (27), అతని భార్య మణిమాల (24)తో పాటు కారు డ్రైవర్ ఎం.జయే‹Ù(20) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం నాలుగంటే నాలుగే క్షణాల్లో జరిగిపోయింది. ఫ్రంట్ బోనెట్ పై నుండే గ్లాస్, ఇంజిన్లే కాక స్పీడోమీటర్ రీడింగ్ ముక్కముక్కలైందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మేనమామ కోసం.. మృతుల్లో ఒకరైన గవిడి కౌశిక్ శ్రీకాకుళంలోని ఇందిరా జ్యుయలర్స్ యజమాని గవిడి వాసుదేవ్ కుమారుడు. బంగారు వ్యాపారి లంక బావాజీ నాయుడుకి మనుమడు. నాయుడు జ్యుయలర్స్ యజమాని లంక గాంధీ పెద్దకుమార్తె నిహారికతో కౌశిక్‌కు 2023లో వివాహమైంది. ఈ జంటకు ఇంకా పిల్లలు లేరు. కౌశిక్ పిన్ని కుమారుడికి ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఈ శుభ కార్యానికి హాజరు కావడానికి కౌశిక్ మేనమామ బాలాజీ అమెరికా నుంచి శనివారం రానున్నారు. ఆయనను రిసీవ్ చేసుకోవడం కోసమే కౌశిక్ తన మామ గాంధీ కారులో విశాఖ బయలుదేరారు. పరీక్ష రాసేందుకు.. శ్రీకాకుళంలోనే లియో మెడికల్ ల్యాబ్ సెంటర్ నడుపుతున్న మన్మథరావు పెద్ద కుమారుడు వడ్డి అభినవ్ కౌశిక్‌కు మంచి స్నేహితుడు. అభినవ్‌కు నాలుగేళ్ల కిందట హిరమండలానికి చెందిన మణిమాలతో వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు మమకార్ ఉన్నాడు. మణిమాల బ్యాంక్ ఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నారు. ఆమెకు శనివారం విశాఖలో పరీక్ష ఉంది. దీంతో భార్యాభర్తలు కౌశిక్‌తో కలిసి కారులో విశాఖ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గురువారమే అభినవ్ పుట్టిన రోజు కూడా జరిగింది. జయేష్ డ్రైవర్‌గా.. ఏడాది కిందటే లంక గాంధీ ఫార్చూనర్ కారు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎం.జయేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో కలిసే కౌశిక్, అభినవ్, మణిమాల విశాఖ బయల్దేరారు. జయేష్ తండ్రి మరణించడంతో తల్లి, చెల్లితో కలిసి శ్రీకాకుళానికి అనుసరించి ఉన్న కుశాలపురంలో ఉంటున్నారు. వీరి స్థిర నివాసం కృష్ణాపార్కు వద్ద సున్నపువీధి. తల్లి టీకొట్టు నడుపుతుండగా జయేష్‌కు డ్రైవింగ్ రావడంతో స్థానిక ట్రావెల్స్‌లో కొన్నాళ్లు పనిచేసి ఇటీవలే గాంధీ వద్ద డ్రైవర్‌గా చేరారు. జయేష్ చనిపోవడంతో ఇప్పుడు వారి కుటుంబానికి ఆధారం పోయింది. ప్రమాదం జరిగిందిలా..? శనివారం ఉదయం వీరు కారులో విశాఖ బయల్దేరారు. అప్పటికే చినుకులు పడుతుండడంతో రోడ్డు తడిగా ఉంది. నాతవలస టోల్గేట్ దాటిన తర్వాత సుందరపేట వద్ద కారు నిలిపి టీ తాగారు. టీ తాగి బయల్దేరిన నిమిషాల వ్యవధిలోనే భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే రహదారిపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీ కారును బలంగా ఢీకొట్టడంతో రెప్పపాటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రదేశమంతా హాహాకారాలతో నిండిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్నుక్రమబద్ధీకరించారు. కౌశిక్ బాబాయ్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎన్.వి.ప్రభాకర్ తెలిపారు. మూడేళ్ల కిందట... పోలిపల్లి వద్ద జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మూడేళ్ల కిందట ఇదే ప్రాంతం వద్ద తీర్థయాత్ర బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనకాలే వచ్చిన మరో వాహనం బస్సును ఢీకొట్టడంతో 39 మంది యాత్రికుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. ఆ ఘటన మరచిపోకముందే మళ్లీ రోడ్డు ప్రమాదంలో అదే స్థలంలో నలుగురు మృతిచెందారంటూ స్థానికులు విచారం వ్యక్తంచేస్తున్నారు. -
విశాఖలో దారుణం.. భార్యకు మత్తు మందు ఇచ్చి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి, ఆపై నిప్పంటించి భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మత్తులోకి జారుకున్న తర్వాత ఒంటిపై భర్త నిప్పు అంటించాడు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికి బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆమె కోలుకోవడంతో అసలు బండారం బయటపడింది. విశాఖలోని మురళీనగర్ సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకటరమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల క్రితం పెళ్లయి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులున్నాయి. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని భావించిన వెంకటరమణ.. 16వ తేదీ రాత్రి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. అనంతరం నిప్పంటించాడు. మత్తుమందు ప్రభావం నుంచి కోలుకున్నాక.. కృష్ణవేణి కేకలు వేయడంతో స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం
చీమకుర్తి: గంజాయి రవాణా విషయంలో పదో తరగతి విద్యార్థి కిడ్నాప్ వ్యవహారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన యాసిన్, నరసరావుపేటకు చెందిన సంతోష్, చిలకలూరిపేటకు చెందిన అమీర్లు గంజాయి వ్యాపారంలో ఆరితేరారు. ఇందు కోసం వారు తరచూ అరకు ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వారికి అల్లూరి జిల్లా అరకు మండలం మాడగడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి పరిచయం అయ్యాడు. ఈ విద్యార్థి చదువుకుంటూనే ఓ గంజాయి ఏజెంట్ వద్ద పని చేస్తున్నాడు.ఈ విషయం తెలుసుకున్న వారు ఆ విద్యార్థితో పరిచయం పెంచుకుని గంజాయి కావాలని అడిగారు. ఆ విద్యార్థి తన బంధువుకు తొలి విడతగా రూ.50 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం వారికి గంజాయి పంపలేదు. డబ్బులు పోగా, గంజాయి కూడా రాకపోవడంతో వారు నేరుగా అరకు ప్రాంతానికి వెళ్లి ఆ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. తమకు రూ.లక్ష ఇస్తే విడిచి పెడతామని చెప్పారు. ఇందుకు ఆ విద్యార్థి సమ్మతించక పోవడంతో శుక్రవారం చీమకుర్తి మీదుగా కారులో వినుకొండ తీసుకెళ్లారు. రాత్రి అక్కడి గాంధీనగర్‌లోని శ్రీనాథ్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్లారు.బాడుగ కోసం కారు డ్రైవర్ గొడవ చేయడంతో అతన్ని పంపించేశారు. అనంతరం కిడ్నాపర్లు మద్యం తాగి, మత్తులో ఉండటాన్ని గమనించిన ఈ విద్యార్థి తప్పించుకున్నాడు. రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యార్థి చెప్పిన వివరాల మేరకు పోలీసులు కిడ్నాపర్లు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అంతలో వారు ఆటోలో పరారయ్యారు. పోలీసులు వెంట పడిన క్రమంలో ఆటో ఒక చోట బోల్తా పడింది. యాసిన్ పోలీసులకు పట్టుబడగా, మిగతా ఇద్దరు పారిపోయారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరకు పోలీసులు శనివారం చీమకుర్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి విద్యార్థిని, కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని అరకు తీసుకెళ్లారు. కాగా, ముగ్గురు కిడ్నాపర్లపై ఇప్పటికే ఒక్కొక్కరిపై 15–20 కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. -
బాలికపై సవతి తండ్రి లైంగికదాడి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసిన సవతి తండ్రి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో.. ఆ బాలిక రెండు వారాల క్రితం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని 59వ డివిజన్ లూనాసెంటర్కు చెందిన మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిత్రం అతనితో విడిపోయి కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్‌దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్‌దాస్ కలిసి నివసిస్తున్నారు. శంకర్‌దాస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా.. ఆ మహిళ హౌస్‌కీపింగ్ పనులకు వెళ్తోంది. ప్రస్తుతం బాలిక (16) సింగ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి హౌస్‌కీపింగ్ పనులకు ఇతర ఊర్లకు వెళ్లి అక్కడే పది, పదిహేను రోజులుండేది. నాలుగు నెలల క్రితం బాలిక తనకు కడుపులో బాగా నొప్పి వస్తోందని, వాంతులవుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో ఆమె బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరో నెల వచ్చిందని చెప్పడంతో ఆమె తన కుమార్తెను అప్పటి నుంచి స్కూల్‌కు పంపకుండా ఖమ్మంలోని తన బంధువుల ఇంటివద్దే ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తోంది. బాలికను నిలదీయగా అమ్మా.. నువ్వు ఊరు వెళ్లినప్పుడల్లా శంకర్ దాస్ తనను బెదిరించి లైంగికదాడికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో శంకర్దాస్ను నిలదీయగా అతడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నవంబర్ 18న బాలిక ఆడ శిశువుకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శంకర్‌దాస్ కోసం గాలిస్తున్నారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కథనాల వల్ల తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌లకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు లీగల్ నోటీసు పంపారు.ఇదీ చదవండి: సెకితో ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన వైఎస్ జగన్ -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, కృష్ణాజిల్లా: కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల వ్యాన్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను మచిలీపట్నం బలరాంపేటకు చెందిన చీలి ప్రభు(30) ,భానుప్రకాశ్ (26), చింత బాబీ(36)గా గుర్తించారు.కారు మచిలీపట్నం వైపు వెళ్తుండగా, చేపల లోడుతో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు బొలేరో వ్యాన్ వెళ్తుంది. టైరు పేలడంతో డివైడర్ దాటుకుని వెళ్లి చేపల వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. చేపల వ్యాన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,విజయనగరంజిల్లా: భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం(నవంబర్30) ఘోర ప్రమాదం జరిగింది.శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు అదుపుతప్పింది.దీంతో కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్కరోడ్డుపైకి దూసుకెళ్లింది.అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
మంటల్లో కాలేజీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి,బాపట్లజిల్లా: చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ప్రైవేటు కాలేజి బస్సు దగ్ధమైంది. రేపల్లెకు నర్సింగ్ కాలేజీ విద్యార్థులను తీసుకువెళ్తుండగా బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అప్రమత్తమై బస్సును డ్రైవర్ ఆపేశారు. వెంటనే విద్యార్థులను బస్సు డ్రైవర్ దింపేశారు. విద్యార్థులందరూ దిగిన తర్వాత కాలేజీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తత వల్లే తాము పప్రాణాలతో మిగిలామని విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదీ చదవండి: మా పాపకు అన్యాయం జరిగింది -
మా ఆశలు చచ్చిపోయాయి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఏఎన్‌యూలో బ్యాచిలర్ ఆఫ్ అర్కిటెక్చర్ (బీఆర్క్) చదువుతూ, 2015 జూలై 14న బాలికల వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్, వేధింపులవల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు అప్పట్లో పెదకాకాని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులపై మోపిన నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడంతో కేసును కొట్టేస్తూ గుంటూరు ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమా తీర్పు వెలువరించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం: ‘కోర్టు తీర్పుతో మా ఆశలు చచ్చిపోయాయి. మాకు పూడ్చలేని బాధను మిగిల్చారు. న్యాయం జరుగుతుందని తొమ్మిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగాం. సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొట్టేశామని చెప్పడం ఎంతో బాధగా ఉంది. మా కుమార్తె తన డైరీని స్వయంగా రాసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరినే రాసిందని తేల్చిచెప్పింది. అయినా మా కుమార్తెకు అన్యాయం జరిగింది. ఇందులో 170 మంది సాక్షులున్నారు. కానీ, ఏ ఒక్కరూ వారికి కని పించలేదు. మాకింక దిక్కెవరు? గంగలో దూకడమే శరణ్యం. పాప రాసిన డైరీలను ఎందుకు సాక్ష్యంగా తీసుకోలేదో అర్థంకావడంలేదు. గతంలో సీఎం చంద్రబాబు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీకి డైరీ కాపీలు అందజేసినా పరిగణలోకి తీసుకోలేదు’.. ఆచార్య నాగార్జున వర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు అనంతరం మృతురాలి తల్లిదండ్రులు దుర్గాబాయి, మురళీకృష్ణ ఆవేదన ఇది. తీర్పు వెలువడగానే కోర్టు ప్రాంగణంలో కన్నీరుమున్నీరైన వారిని చూసి అందరి గుండెలు బరువెక్కాయి.కేసు పూర్వాపరాలు..రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థిని బలవన్మరణానికి కారణమైన వర్సిటీ అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.బాబు రావుతోపాటు వర్సిటీ ఉన్నతాధికారులపై కేసు న మోదు చేయాలని, ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా, విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఉద్యమం చేశాయి. చంద్రబాబు నిర్లక్ష్యం వీడాలని అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి.. ఈ పోరాటాల ఫలితంగా టీడీపీ ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకుని, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం విచారణ జరిగిన అనంతరం శుక్రవారం గుంటూరు కోర్టు కేసును కొట్టివేసింది. అన్నీ సమర్పించాం, అప్పీలుకు వెళ్లాలి..రిషితేశ్వరి డైరీల్లో ఎవరెవరు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు, మానసికంగా వేధించిన వారి పేర్లు స్పష్టంగా ఉ న్నాయి. ఈ తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నాం. హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తాం. పోలీసులు అప్పీల్ చేయాలి. – వై.కోటేశ్వరరావు, స్పెషల్ పీపీగుండెఘోషకు రిషితేశ్వరి అక్షర రూపం ఇదే..రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఆమె గదిలో డైరీ లభించింది. అందులో రిషితేశ్వరి స్వహస్తాలతో రాసుకున్న కొన్ని ఘటనలు, తాను ఎదుర్కొన్న ఆవేదన, గుండెఘోషను కూలంకషంగా అక్షర రూపంలో వివరించింది. ‘మై లాస్ట్ నోట్’ పేరుతో తన స్వహస్తాలతో రిషితేశ్వరి రాసిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..⇒ నవ్వు!!! నవ్వు!!! నవ్వు!!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటా. అందరిని నవ్విస్తూ ఉంటా. కానీ, ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది.⇒ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచాడు మా నాన్న. నాకు చదువు అంటే ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వదిలి ఇక్కడకొచ్చా. ⇒ ఇలా వచ్చిన నన్ను.. నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమవైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ క్రియేట్ చేశారు. అది వింటేనే నా మొహంలో నవ్వు మాయమై పోయేది.. ఏడుపు కూడా వచ్చేది.⇒ నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు.. కాని ఇక్కడకు వచ్చాక చెబితే ఏమైపోతారో అని దాయాల్సి వస్తోంది. నాకు నరకయాతన కనిపిస్తోంది. ⇒ నా ఆఖరి కోరిక ఒక్కటే. నా చావుకు కారణం ఎవరో వాళ్లకు తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంకెవ్వరినీ ఇలా (నాలా) బాధపెట్టకుంటే చాలు.⇒ ఏ అమ్మాయిలూ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదని అనుకోవద్దు. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచవద్దు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక నరకం కనిపిస్తుంది.⇒ అమ్మా, నాన్న జాగ్రత్త! నాన్న ప్లీజ్ ఏడవకండి. నేను ఎప్పుడూ మీ దగ్గర్లోనే ఉంటా. ట్రై టూ డొనేట్ మై ఆర్గాన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్.. (నా అవయవాలు పనిచేసే స్థితిలో ఉంటే వాటిని దానం చేయడానికి ప్రయత్నించండి) అంటూ చాలా అంశాలు రాసింది. -
‘మా పాపకు అన్యాయం జరిగింది..’ రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఈ కేసులో న్యాయం కోసం పోరాడతామని రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.రిషితేశ్వరి స్వస్థలం వరంగల్. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన ఆమె.. 2015 జులై 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ర్యాగింగ్ వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు .. తొమ్మిదేళ్ల విచారణ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసింది.‘‘మా పాప కేసులో మాకు అన్యాయం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మా పాప రాసిన డైరీ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మాకు న్యాయం చేయమని అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడిని, అప్పటి ఎస్పీ త్రిపాఠిని కలిశాం. మా పాపను ర్యాగింగ్ పేరుతో ఎలా వేధించారు రాసిన డైరీ ని కూడా ఒక కాపీ ఇచ్చాం. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు. మా అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్‌ను ప్రతీ అధికారికి వాటిని సమర్పించాం. పది సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం.. .. కానీ, మేమిచ్చిన సాక్ష్యాన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం కావట్లేదు. న్యాయం కోసం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంలను కలుస్తాం. మాకు పైకోర్టుల్లో పోరాడే ఆర్థిక శక్తి లేదు. ప్రభుత్వమే సాయం చేయాలి. కేసులో న్యాయం జరగకపోతే మాకు మరణమే శరణ్యం’’ అని రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు పెట్టకుంది.‘‘రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయి. ఆమె ఏ విధంగా వేధింపులకు గురైందో డైరీ ల్లో ఉన్నాయి. అవి అన్నీ కోర్టు ముందు ఉన్నాయి. తోటి విద్యార్థులు, సీనియర్లు ఏ విధంగా వేధించారో స్పష్టంగా ఉంది. ప్రిన్సిపాల్ బాబురావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. హాయ్ ల్యాండ్ లో ప్రెషర్స్ పార్టీలో లైంగికంగా వేధించారు. నిందితులకు శిక్ష పడుతుందని భావించాం. కానీ, కోర్టు కేసు కొట్టేసింది. ఈ తీర్పు న్యాయమైనది కాదని భావిస్తున్నాం. తీర్పుపై అప్పీల్ కు వెళ్ళాలన్నది నా నిర్ణయం. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తాను.::: రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీ వైకే -
మడకశిరలో మిస్సింగ్.. కర్ణాటకలో బాలుడి మృతదేహం
శ్రీ సత్యసాయి జిల్లా: జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం అదృశ్యమైన బాలుడు చేతన్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహాన్ని కర్ణాటక అటవీ ప్రాంతంలో గుర్తించారు.వివరాల ప్రకారం.. మడకశిర నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిన్నటి నుంచి చేతన్ కనిపించకపోవడంతో బాలుడు పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో చేతన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో, చేతన్ పేరెంట్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ప్రియుణ్ణి కిడ్నాప్ చేసిన ప్రియురాలు!
తిరుపతి క్రైమ్: ఓ ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి ఈస్ట్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయమైంది. ఈ క్రమంలో వారు గత ఎనిమిది నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు.అయితే మూడు నెలల నుంచి నాని భానును పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో నలుగురు సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కార్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్ ఘటన సమాచారం పోలీసులకు అందడంతో.. వాయల్పాడు వద్ద వారిని అడ్డగించి నానిని సురక్షితంగా కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరార్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తల్లిని హత్య చేసిన కానిస్టేబుల్
చిత్తూరు అర్బన్: నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని ఓ కుమారుడు హత్య చేశాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదంలో తల్లిని కాలితో తన్నడంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. తలను గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ తల్లి... మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది. చిత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు... చిత్తూరు దుర్గానగర్ సమీపంలోని రోసీనగర్‌లో ఉంటున్న వసంతమ్మ (63)కు ఇద్దరు కుమారులు.భర్త పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. పెద్ద కొడుకు శంకర్ చిత్తూరు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా, మరో కొడుకు జ్యోతికుమార్ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. శంకర్ ప్రవర్తన నచ్చని తండ్రి బాలసుబ్రమణ్యం రెండేళ్ల క్రితం తన సోదరి ఊరికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. పనిచేసిన స్టేషన్లో ఆరోపణలు రావడంతో శంకర్ కొన్నాళ్లుగా వేకెంట్ రిజర్వు (ఏఆర్)లో ఉన్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం శంకర్ మద్యం మత్తులో తన తల్లితో గొడవకు దిగాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని సతాయించాడు. తల్లితో మాటా మాటా పెరిగి వాగ్వావాదానికి దిగాడు. ఒక్కసారిగా కోపానికిలోనైన శంకర్.. వసంతమ్మను చావ బాదాడు. తలను గోడకేసి కొట్టాడు. కింద పడేసి కాలితో తన్నుతూ, మొహంపై దాడి చేశాడు. ఒక్కసారిగా స్పృహతప్పిన వసంతమ్మ కిందపడిపోయింది. అప్పటికే కేకలు విన్న ఇరుగుపొరుగువాళ్లు ఆమెను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షల అనంతరం వసంతమ్మ మెదడులో రక్తం గడ్డకట్టిందని, కాలుతో తన్నడంతో పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు.ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె మృతి చెందారు. వసంతమ్మ రెండో కుమారుడు జ్యోతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తొలుత దాడి కేసు నమోదుచేసి, ఆపై హత్య కేసుగా మార్చారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
లైంగిక దాడి ముద్దాయికి 25 ఏళ్ల శిక్ష
విశాఖ–లీగల్: వావి వరసలు మరిచి వరుసకు కూతురయ్యే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది గురువారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. ప్రభుత్వం రూ.4 లక్షలు బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఆర్ మూర్తి అందించిన వివరాలు.పశ్చిమగోదావరి జిల్లా రాజఒమ్మంగి మండలం పాక గ్రామానికి చెందిన కుర్ర ఇమాన్యుయేల్ ప్రస్తుతం ఏఎస్ఆర్ జిల్లా లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఉంటున్నాడు. వృత్తి రీత్యా అతడు చర్చి ఫాదర్. బాధితురాలి తల్లి నందినికి ఆయన రెండో భర్త. నిందితుడు రోజూ కొంతమందితో అడవిలోని మోదుగ ఆకులు ఏరించి, పట్టణ ప్రాంతాలకు విక్రయించేవా డు. 2021 ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అడవిలోని ఒక నిర్జన ప్రదేశంలో నందిని కుమార్తెపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు. -
రౌడీ షీటర్ భార్యతో వివాహేతర సంబంధం..
వాకాడు: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిన ఘటన వాకాడు మండలం, దుగ్గరాజపట్నం సమీపంలో ఈ నెల 17న చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. వాకాడు సీఐ హుస్సేబాషా విలేకరులతో మాట్లాడుతూ గూడూరు పట్టణం, శివాలయం ప్రాంతానికి చెందిన కొండా అనిత్కుమార్రెడ్డి (25)కు గూడూరులోని కనుపూరు శ్రీహరి అలియాస్ జెమిని అనే రౌడీ షీటర్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శ్రీహరి దృష్టికి రావడంతో అనిత్రెడ్డిపై పగ పెంచుకున్నాడు. పట్టణంలోని మరో రౌడీ షీటర్ బాసం నరేష్ అలియాస్ చిన్నప్రేమ్, కోట మండలం, విశ్వనాథ అగ్రహారానికి చెందిన పేనాటి అలియాస్ పేర్నాటి చందు, గూడూరు చవటపాళెంకు చెందిన షేక్ కాలేషా, గూడూరు గాంధీనగర్‌కు చెందిన జావీదులతో కలసి అనిత్‌రెడ్డిని హత్య చేసేందుకు పథకం రూపొందించారు. ఈ నేపథ్యంలో చిల్లకూరు చుట్టుగుంట సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబాను కేంద్రంగా చేసుకున్నారు. అనిత్రెడ్డికి మద్యం పార్టీ ఉందని నమ్మించి గూడూరు హైవే రోడ్డు నుంచి దాబా వద్దకు తన స్నేహితులు స్కూటీపై తీసుకొచ్చారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం ఐదుగురూ కలసి అనిత్‌రెడ్డిని కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత టిమ్మర్‌తో తల వెంట్రుకలు, మీసాలు తీసి ఆనవా ళ్లు గుర్తుపట్టని విధంగా చెరిపేశారు. ఆపై మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచుకుని దుగ్గరాజపట్నం సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లారు. స్థానికుల సమాచాంతో వాకాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించినట్టు సీఐ తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి శ్రీహరి(జెమిని), నరేష్(చిన్నా ప్రేమ్)తోపాటు, పేనేటి చందు, షేక్ కాలేషా, షేక్ జావీదులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వారిచ్చిన సమాచారం మేరకు గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని రోడ్డు వద్ద మిగిలిన ఇద్దర్నీ అరెస్టు చేశామన్నారు. అనంతరం ఐదుగురు నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. మొదటి ముద్దాయి శ్రీహరిపై గూడూరు 1వ పట్టణ స్టేషన్లో, రెండో ముద్దాయి షేక్ కాలేషాపై రూరల్ పోలీస్టేషన్లో 5 క్రిమినల్ కేసులు, రౌడీ షీట్లు ఉన్నట్లు సీఐ తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన గూడూరు డీఎస్పీ రమణ్కుమార్ని అభినందించారు. ఎస్ఐలు నాగబాబు, పవన్‌కుమార్, చిన బలరామయ్య పాల్గొన్నారు. -
పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. గుండెపోటుతో వీఆర్వో మృతి
రాజానగరం: తీవ్ర పని ఒత్తిడి, జీతాలందక ఆర్థిక ఇబ్బందులు ఒక వీఆర్వో ప్రాణాలు తీసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), వీఆర్వోల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి పెనుమాక గనిరాజు (47) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి వరకు పనిచేసిన ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. కడియం మండలం జేగురుపాడుకు చెందిన గనిరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పని ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో గనిరాజు గుండెపోటుకు గురై మృతిచెందారని మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జాన్, ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రికి లేఖ రాశారు. అధికారులు అనేక పనులు పురమాయిస్తున్నారని తెలిపారు. దీనికితోడు టార్గెట్లు పూర్తిచేసే వరకు జీతాలు కూడా నిలిపేయడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. ఇంతవరకు అక్టోబర్ నెల జీతాలు రాలేదని తెలిపారు. దీంతో కుమార్తెల ఫీజు, ఇంటి అద్దె సకాలంలో చెల్లించలేక ఆవేదనతో ఉన్న గనిరాజు.. నీటిపన్నుల కలెక్షన్ డేటాను త్వరగా ఎంట్రీ చేయాలని అధికారులు ఫోన్లో ఆదేశించడంతో మంగళవారం అర్ధరాత్రి వరకు అదేపనిలో నిమగ్నమై గుండెపోటుకు గురయ్యారని వారు పేర్కొన్నారు. -
పాపం ఏ కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వివాహిత అనుమానాస్పద మృతిమరో ఘటనలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆత్మకూరులోని స్థానిక బీసీకాలనీలో నివాసముంటున్న శ్రావణి(30) సోమవారం మధ్యాహ్నం 3:30గంటల సమయంలో చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.విషయాన్ని గమనించిన భర్త పరశురాములు ఆమెను కిందకి దించి చుట్టుపక్కలవారికి, భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతిరాలికి ఒక కుమారుడు, ఒక కూతరు ఉన్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.భర్తే హతమార్చాడంటూ ఫిర్యాదు తమ కూతురు శ్రావణిని భర్త పరశురాములే హతమార్చాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివమాల దీక్షలో ఉన్న అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు. -
సినీ ఫక్కీలో హత్య.. ఫిషింగ్ హార్బర్లో మృతదేహం
సాక్షి,విశాఖపట్నం: సినీ తరహాలో జరిగిన దారుణ హత్య విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కాలికి బరువైన బండరాయి కట్టేసిన ఓ వ్యక్తిని సముద్రంలో పడేసి హత్య చేశారు. ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 10 వద్ద మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని మంగళవారం(నవంబర్ 26) బయటికి తీశారు.మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: అనారోగ్యంతో భార్యాభర్తల ఆత్మహత్య -
26 ఏళ్లుగా పరారీ.. పెళ్లి పత్రిక పట్టించింది
పుట్టపర్తి టౌన్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరకు కన్నకొడుకును హతమార్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఒకటి.. రెండేళ్లు కాదు.. ఏకంగా 26 ఏళ్ల తర్వాత చేసిన పాపం పండింది. పేరు మార్చుకుని కర్ణాటకలో తలదాచుకున్న నిందితుడి ఆచూకీని పోలీసులు పసిగట్టి సోమవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రత్న వెల్లడించారు. ఏం జరిగింది? శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నేహట్టి గ్రామానికి చెందిన గొల్ల తిప్పేస్వామికి అదే గ్రామంలో నివాసముంటున్న మేనత్త పల్లెమ్మ కుమార్తె కరియమ్మతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. 1998 ఏప్రిల్‌లో జని్మంచిన రెండో కుమారుడికి శివలింగమయ్య అనే పేరు పెట్టి పెంచుకోసాగారు. ఈ క్రమంలో కరియమ్మ ప్రవర్తనపై తిప్పేస్వామికి అనుమానం మొదలైంది. రెండో కుమారుడు తనకు పుట్టలేదని, ఎలాగైనా ఆ పసివాడిని మట్టుబెట్టాలని అనుకున్నాడు. 1998 అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా ఉదయం కులాచారం మేరకు ఆరు నెలల పసికందును కరియమ్మ ఎత్తుకుని మారెమ్మ జమ్మి చెట్టు వద్ద ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో తిప్పేస్వామి బలవంతంగా లాక్కొని పక్కనే ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపేశాడు. అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టి పారిపోయాడు. ఘటనపై కరియమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పేరు మార్చుకుని.. పెళ్లి చేసుకుని.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయిన తిప్పేస్వామి కర్ణాటకలోని హసన్ జిల్లా న్యామనహళ్లిలో స్థిరపడ్డాడు. తన పేరును కృష్ణగౌడ్‌గా మార్చుకుని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా, ఇటీవల తన పెద్ద కుమార్తె పెళ్లి కుదరడంతో ఆహా్వన పత్రికను దిన్నేహట్టిలోని తన స్నేహితుడు నాగరాజుకు తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ్ పంపాడు. ఎస్పీ రత్న ఆదేశాలతో పాత కేసుల దర్యాప్తు చేపట్టిన పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు.. విచారణలో భాగంగా కొన్ని రోజుల క్రితం దిన్నేహట్టి గ్రామానికి వెళ్లి తిప్పేస్వామి గురించి ఆరా తీశారు. ఆ సమయంలో నాగరాజు ఇంట్లో తిప్పేస్వామి కుమార్తె వివాహ ఆహా్వన పత్రిక లభ్యమైంది. దీని ఆధారంగా తిప్పేస్వామి ఆచూకీని పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డాడు ఇలా... తిప్పేస్వామి ఆచూకీని పసిగట్టిన తర్వాత న్యామనహళ్లికి వెళ్లి అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే..తన తమ్ముడు చిత్తప్పతో భూమి భాగ పరిష్కారం కోసం స్వగ్రామానికి వచ్చిన తిప్పేస్వామి సోమవారం ఉదయం పెద్ద మనుషుల కోసం మందలపల్లి బస్టాండ్ వద్ద వేచి ఉండగా సీఐ రాజ్‌కుమార్ గుర్తించి అదుపులోకి తీసుకుని ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. 26 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐ మునిప్రతాప్, కానిస్టేబుళ్లు మల్లికార్జున, పోతన్న, నరేష్ మహమ్మద్‌రఫీ, హరికృష్ణను ఎస్పీ రత్న అభినందించి, రివార్డులు అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్ఐ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. -
అనారోగ్యంతో భార్యభర్తల ఆత్మహత్య
పుంగనూరు: అనారోగ్యంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మేలుందొడ్డిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మేలుందొడ్డి గ్రామంలో నివాసం ఉన్న శ్రీనివాసులు(46), అతని భార్య నీలమ్మ(43) టైలర్లుగా పనిచేస్తున్నారు. గతంలో బెంగళూరులో ఉంటూ ఇటీవలే గ్రామానికి వచ్చి నివాసం ఉన్నారు. ఇలా ఉండగా శ్రీనివాసులు కిడ్నీ వ్యాధి ఉండడంతో అప్పులు చేసి చికిత్స చేయించారు. కానీ ఫలితం లేకపోయింది. ఇలా ఉండగా భార్యభర్తలు ఇరువురు మాట్లాడుకుని ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని బైరేబండకు వెళ్లే మార్గంలో చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం గ్రామస్తులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు , ఎస్ఐ లోకేష్ సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించి, , మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు
పుట్టపర్తి టౌన్: అవ్వతాత చేస్తున్న బలవంతపు పెళ్లి ప్రయత్నాల నుంచి తనను కాపాడి ఉన్నత చదువులు అభ్యసించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రత్న వద్ద ఓ విద్యార్థిని మొరపెట్టుకుంది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్య వేదికలో ఎస్పీని కనగానపల్లికి చెందిన విద్యార్థిని సాయి కలసి వినతి పత్రాన్ని అందజేసింది. బాధితురాలు తెలిపిన మేరకు... కనగానపల్లికి చెందిన చెన్నప్నకు ముగ్గురు కుమార్తెలున్నారు. తండ్రి అవిటివాడు కావడంతో తాత పాపన్న, అవ్వ వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అక్కచెళ్లెళ్లు చదువులు కొనసాగించారు. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించిన సాయి... ఇంటర్లో 950 మార్కులతో టాపర్‌గా నిలిచింది. డిగ్రీ కళాశాలలో చేరాలని అనుకుంటుండగా అవ్వ, తాత, ఇతర కుటుంబసభ్యులు తన సర్టిఫికెట్లు లాక్కొని బలవంతంగా బంధువుల అబ్బాయితో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తల్లిదండ్రలు సైతం ఏమి చేయలేని అసహాయ స్థితిలో ఉన్నారు. సర్టిఫికెట్లు ఇప్పించి తన విద్యాభ్యాసానికి మార్గం సుగమమం చేయడంతో పాటు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఎస్పీని బాధితురాలు వేడుకుంది. స్పందించిన ఎస్పీ తక్షణమే సంబంధిత పీఎస్ సీఐతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వయిజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గృహ ప్రవేశానికి వస్తూ తిరిగిరాని లోకాలకు..
మైదుకూరు/కాశినాయన: బంధువుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆదివారం మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెకు సమీపంలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కాశినాయన మండలం చిన్నాయపల్లెకు చెందిన గుర్రాల శ్రీనివాసులరెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. ఈయనకు భార్య అరుణ, కుమార్తె పవిత్ర, కుమారుడు జగదీష్‌రెడ్డి ఉన్నారు. జగదీష్‌రెడ్డి ఖాజీపేటలో అవ్వగారి ఇంటి వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం శ్రీనివాసులురెడ్డి భార్య కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంలో మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లెలో సోమవారం జరిగే తమ బంధువుల గృహ ప్రవేశానికి బయలుదేరారు. ముదిరెడ్డిపల్లెకు సమీపంలో ఎద్దడుగు కనుమ వద్ద వెనుక వైపు నుంచి లారీ బైక్‌ను ఢీకొంది. \ఈ సంఘటనలో బైక్‌పై ఉన్న శ్రీనివాసులరెడ్డి, భార్య, కుమార్తె కిందపడిపోయారు. వారిపై నుంచి లారీ వేగంగా దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులు, చెల్లెలు మృతి చెందడంతో జగదీష్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. చుట్టుపక్కల ఉన్న వారు గట్టిగా కేకలు వేస్తున్నా లారీ ఆపకుండా వెళ్లినట్టు తెలుస్తోంది. శుభకార్యానికి వెళుతూ ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో చిన్నాయపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ సీఐ సయ్యద్ హాసం పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
జింక చర్మాల అక్రమ రవాణా
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడి
తిరుపతి క్రైమ్: ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్‌పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బాలాజీ నగర్‌లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరి ఇంటికి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. పది రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలికకు జ్వరం, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం చెప్పింది.దీంతో తల్లిదండ్రులు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పనిచేస్తుండటంతో అతను పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక బంధువులు, కుటుంబీకులు దాడిచేసేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.