-
నెల్లూరులో ఘోరం.. ముచ్చుమర్రి తరహా ఘటన
సాక్షి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముచ్చుమర్రి ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. అటవీ ప్రాంతంలో చిన్నారిని హత్య చేశాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామ సమీపంలో బీహార్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం, చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. -
విశాఖలో కత్తి దూసిన ప్రేమోన్మాదం.. చేతులెత్తేసిన పోలీసులు
విశాఖపట్నం, సాక్షి: అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది కత్తి దూశాడు. అయితే ఈ ఘటనలోనూ పోలీసుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్ధూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాలేజ్ వద్ద ఆ యువతితో సిద్ధూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్ కావడంతో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్ట్ చేశాడు. అయితే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం రాత్రి ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. టపాసులు పేల్చి హ్యాపీ బర్త్‌డే అంటూ నానా హంగామా చేశాడు. ఆపై ఇంట్లోకి దూరి ఫర్నీచర్‌ను పగలకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను చంపాలని ప్రయత్నించాడు. అయితే అది గమనించి ఆమె పారిపోయింది. ఈ క్రమంలో ఆమె తల్లి సావిత్రి అడ్డురావడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీకూతుళ్లు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో సిద్ధూ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సిద్ధూ కోసం గాలిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు.. దాడి తరువాత పరారీ అయిన సిద్ధూ ఆచూకీని 24 గంటలు గడిచినా కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే.. ఈ ఫోటో లో వ్యక్తి కనిపిస్తే, సమాచారం ఇవ్వండి అంటూ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. అటు అనకాపల్లి ఘటనలోనూ.. ఇటు ఇప్పుడు పోలీసులు నిందితుల విషయంలో ఇలా ఆలస్యంగా స్పందించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు
ప్రత్తిపాడు/ఫిరంగిపురం/టి.నరసాపురం: బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు కేసులు.. ఏలూరు జిల్లాలో ఓ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు గ్రామానికి చెందిన దళిత బాలిక (13) నడింపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ నెల 12న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గండికోట వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకట్ పాఠశాలకు సమీపంలోని పంట పొలాల్లోకి బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్ఐ రవీంద్ర వెంకట్‌పై పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు.వేధింపులతో బాలిక ఆత్మహత్య ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉంటుంది. ఈమెకు కొన్నాళ్ల కిందట బంధువుల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో ఫిరంగిపురం తిరునాళ్లకు వచ్చింది.ఆ సమయంలో ఆ యువకుడు తన మిత్రులతో వెళ్లి బాలిక గురించి అసభ్యంగా మాట్లాడటంతో బాలిక తండ్రి యువకుడిని మందలించాడు. ఆ యువకుడు మరికొంతమందితో ఆ గ్రామానికి వెళ్లి బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుమందు తాగింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు బంధువులు తరలించగా..చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడితో పాటు మరికొంతమందిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, బాలికను వేధిస్తున్న యువకుడు ఆదివారం అర్థరాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.హోటల్ గదిలో బంధించి లైంగిక దాడిబాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై టి.నరసాపురం పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలేనికి చెందిన బాలిక (16) జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 6న బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు దర్యాప్తు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఈ నెల 15న టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి నలుగురు యువకులు బాధ్యులని చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో అదృశ్యం కేసును పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మార్పు చేశారు. ఆమె ఫిర్యాదు వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. బాలిక హైసూ్కల్లో చదువుతున్న సమయంలోనే గ్రామానికి చెందిన యువకుడు (20) ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఆమెను వేధించేవాడని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను జంగారెడ్డిగూడెంలోని ఓ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఆ హాస్టల్ నుంచే బాలిక ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 6 నుంచి కనిపించలేదు. ప్రేమిస్తున్నానన్న యువకుడికి మరో ముగ్గురు యువకులు సహకరించడంతో..వారంతా కలిసి బాలికను కిడ్నాప్ చేసి విశాఖకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ హోటల్ గదిలో బాలికను బంధించిన యువకుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
ఇన్‌స్టాలో లైక్‌ల కోసం వన్యప్రాణుల వేట
వేంపల్లె: ఇన్‌స్ట్రాగామ్‌లో లైక్‌ల కోసం ఓ యువకుడు పెంపుడు కుక్కలతో వేటకు వెళ్లి అడవిలో జంతువులను చంపి, ఆ వీడియోలను అప్లోడ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని గమనించిన తెలంగాణ జంతు ప్రేమికులు ఆ యువకుడికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. కట్‌చేస్తే వేంపల్లి ఫారెస్ట్ అధికారులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం వడ్డేపల్లెలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలం, వడ్డేపల్లికి చెందిన బత్తల చిరంజీవి పెంపుడు కుక్కలతో సమీపంలోని కొండల్లోకి వెళ్లి, అడవి జంతువులను వేటాడి, వాటిని చంపి, లైకుల కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అతను చేసే వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిని తెలంగాణ జంతు ప్రేమికులు గమనించి, వెంటనే కడప జిల్లా డీఎఫ్‌వో సందీప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వేంపల్లె ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చి అతడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వేంపల్లె ఫారెస్టు అధికారి బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో వెళ్లి బత్తల చిరంజీవిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు. -
కూటమి పాలనలో ఆగని అఘాయిత్యాలు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. నెలల పసిపాప మొదలుకొని ఆడవారిపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కొస్తాంధ్ర ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్నిచోట్ల జరుగుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనుమానాస్పద మారణాలతో ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇక.. జరుగుతున్న ఘటనలను నిలువరించలేకపోయినా.. కనీసం నిగ్గు తేల్చలేకపోతున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటన, విజయనగరం జిల్లా జిలకవలస ఘటన, గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డి పాలెం ఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమరి మైనర్ బాలికి అదృశ్యమై నేటికి 10 రోజులు గడుస్తున్నా కేసు ఇంకా వీడలేదు. నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారిమళ్లిందా? అని అనుమానం వ్యక్తమవుతోంది. బాలిక ఆచూకీ తేలేదెప్పుడూ.. నిందితులకు శిక్ష పడేదెప్పుడూ అని ప్రశ్నిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నేతలు. ఇక.. ఈ కేసులో ముగ్గురిన అరెస్ట్ చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పినా.. ఆ జిల్లా పోలీసులు మాత్రం నిన్నరాత్రి వరకు అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులకు జిల్లా టీడీపీ పెద్దలు కొమ్ముకాస్తున్నారని, అందుకే పోలీసులు కేసు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు, బాలికపై అఘాయిత్యాల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నానాయాగి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ఉండి కూడా నంద్యాల ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక అదృశ్యంపై నోరు మెదపకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో? లేదో? ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే నిందితులను శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి చెబుతున్నారు. కానీ, ఆడపిల్లలపరై అఘాయిత్యాల కేసుల్లో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించకపోవటంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ? -
ముచ్చుమర్రి కేసు ఇంకా విచారణ జరుగుతోంది: ఎస్పీ
నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు. ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్‌పై తీసుకెళ్లి.. బాలిక డెడ్‌బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు. వాళ్లను అలా వదిలేయొద్దు‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’:::బాలిక తల్లిదండ్రులుఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ? -
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు దగ్ధం
సాక్షి,మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో సోమవారం(జులై 15) తెల్లవారుజామున 2 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై భూరెడ్డి పల్లి వద్ద ఏపీలోని ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొని దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బస్సు ధర్మవరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
తెల్లారితే గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం
విడపనకల్లు : తెల్లారితే నూతన గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పాత మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కోనప్పగారి మారెప్ప(42), లక్ష్మి(38) దంపతులు. వీరికి అంజి, హేమంత్ అనే ఇద్దరు కుమారులు, కుమార్తె మానస(మూగ) ఉన్నారు. మారెప్ప పెద్దలు దాదాపు 60 ఏళ్ల క్రితం మట్టితో కట్టించిన ఇంట్లోనే ఉండేవారు. అయితే.. భార్యాభర్త కాయాకష్టం చేసుకుని సంపాదించిన డబ్బుతో ఇటీవల నూతన గృహాన్ని నిరి్మంచుకున్నారు. ఆదివారం గృహ ప్రవేశం పెట్టుకున్నారు. కాగా, శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే మారెప్ప, లక్ష్మి దంపతులు కుమార్తెతో కలసి పాత మట్టి మిద్దెలో పడుకున్నారు. వీరితో పాటు లక్ష్మి తమ్ముడు రాము కూడా అదే ఇంట్లో నిద్రించాడు. ఇద్దరు కుమారులు మాత్రం ఇంటి ఆరుబయట మంచంపై పడుకున్నారు. వర్షానికి తడిసిన కారణంగా మట్టి మిద్దె ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడి లేచారు. మారెప్ప ఇల్లు కూలిపోయిందని గమనించి అరుపులు, కేకలు వేయడంతో కాలనీవాసులంతా వచ్చి మట్టి కింద పూడుకునిపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే మారెప్ప, భార్య లక్ష్మి ప్రాణాలు విడిచారు. కుమార్తె మానసకు చేయి విరిగింది. రాముకు చేతులు, వేళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని 108లో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై ఎస్ఐ ఖాజా హుస్సేన్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. -
ఆగని టీడీపీ విధ్వంసాలు
సాక్షి నెట్వర్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంస చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇష్టారీతిన వ్యవహరించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంçÜం చేశారు. వీఆర్వో కుటుంబంపై దాడిచేశారు. » పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలోని గ్రామ సచివాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని శనివారం రాత్రి విరగ్గొట్టారు. విగ్రహం ధ్వంసంపై వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నాయకుడు కానాల పుల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోగుల అంజిబాబు, నేతలు చిమటా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి అయ్యప్ప, షేక్ దమ్మాలపాటి బుజ్జి, గంటా శ్రీనివాసరావు, షేక్ మస్తాన్‌వలి, ఇందూరి వెంకటరెడ్డి, మహంకాళిరావు, జయరావు, బి.రాజు కోరారు. » ఏలూరు జిల్లా దెందులూరులోని లైబ్రరీ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతుల్ని విరగ్గొట్టారు. ఈ విధ్వంసంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. » కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామ వీఆర్వో తిరుపాల్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. వీఆర్వో కథనం మేరకు.. మండలంలోని తిమ్మందొడ్డి గ్రామ ఎస్సీ కాలనీలో వీఆర్వో తిరుపాల్ తన కుటుంబంతో నివాసముంటున్నారు. అదే గ్రామంలో బీసీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వీఆర్వో కుటుంబసభ్యుల్ని కులం పేరుతో దూషించి, కించపరిచారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపాల్ భార్య దేవమ్మ తిట్టిన వారిని ప్రశి్నంచడంతో ‘ఎస్సీ కులానికి చెందినదానవు, నీవు మా ఇళ్ల దగ్గరకు వస్తావా..’ అంటూ మరోసారి దూషించారు. అంతటితో ఆగకుండా ఇంటిమీదకు వెళ్లి తిరుపాల్, దేవమ్మ దంపతులపైన, వారి కుమారుడు జానుపైన దాడిచేశారు. తమపై టీడీపీకి చెందిన పెద్దశేషన్న కుమారుడు హరి, ముత్యాలు కుమారులు వెంకన్న, గిడ్డయ్య, గౌరన్న కుమారుడు హరి దాడిచేసినట్లు వీఆర్వో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కలి్పంచి, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వో కోరారు. ఈ విషయమై ఎస్.ఐ. తిమ్మరెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై తనకు సమాచారం వచి్చందని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఊయలలో పసికందుపై అఘాయిత్యం
రామభద్రపురం: రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. విజయనగరం జిల్లాలో 6 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే.. విజయనగరం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయతీ మధుర గ్రామ పరిధిలోని జీలికవలసలో శనివారం 6 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో పసి పాపకు స్నానం చేయించిన తల్లి ఊయలలో నిద్ర పుచ్చి0ది. గ్రామంలోకి నిత్యావసర సరుకులు రావడంతో.. కొనుగోలు చేసేందుకు తల్లి వీధిలోకి వెళ్లింది. ఇంతలో అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన నేరళ్లవలసకు చెందిన.. బాధిత చిన్నారికి తాత వరసైన బోయిన ఎరకన్నదొర (40) ఊయలలో నిద్రలో ఉన్న పాపపై లైంగిక దాడి చేయడంతో ఏడ్చింది. పక్కింటి వారు పాప ఏడుస్తున్న విషయాన్ని తల్లికి కేక వేసి చెప్పగా.. బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడమని తన పెద్ద కుమార్తెకు చెప్పింది. పెద్ద కుమార్తె చూసి ‘చెల్లిని తాతయ్య ఎత్తుకున్నాడు. రక్తం వస్తోంది’ అని తల్లికి చెప్పింది. తల్లి పరుగున వచ్చేసరికి ఎరకన్నదొర పాపను ఊయలలో వేసేసి పారిపోయాడు. పసిపాపకు రక్తస్రావం కావడాన్ని చూసిన తల్లి ఎరకన్నదొరను వెంబడించి అతడిపైకి కర్ర విసిరింది. ఆమె వెంబడించడం చూసి గ్రామస్తులు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా.. ఎరకన్నదొర తప్పించుకుపోయాడు. పాపను బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విజయనగరంలోని ఘోషాస్పత్రికి తరలించారు. బాడంగి వైద్యాధికారులు పోలీసులను సంప్రదించాలని సూచించడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్లూస్‌టీం సహాయంతో జీలికవలస గ్రామానికి వెళ్లి పాప దుస్తులను సీజ్ చేశారు. ఆదివారం వేకువజామున నేరళ్లవలసలో నిందితుడు ఎరకన్నదొరను అదుపులోకి తీసుకుని అతని దుస్తులపై ఉన్న రక్తపు మరకలను సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇటువంటి ఘటనలకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం పాప విజయనగరం ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. డీఎస్పీ వెంట సీఐ తిరుమలరావు, ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఉన్నారు.బాలల హక్కుల కమిషన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ఆరు నెలల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఘోషాస్పత్రి పర్యవేక్షణ అధికారిణి అరుణ శుభశ్రీతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. కాగా.. ఈ ఘటనను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు ఖండించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిండితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రభుత్వాస్పత్రిలో శిశువు అపహరణ
మచిలీపట్నం టౌన్: బందరు ప్రభుత్వాస్పత్రిలో తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరుతున్న ఐదు రోజుల శిశువును ఓ మహిళ అపహరించింది. నర్సు వేషంలో వచ్చి.. తల్లితో మాటలు కలిపి.. ఆమె నిద్రపోగానే శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన మచిలీపట్నంలో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన చిట్టూరి స్వరూపరాణి ఈ నెల 8వ తేదీన డెలివరీ కోసం మచిలీపట్నంలోని సర్వజనాస్పత్రిలో చేరింది. 9వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ.. స్వరూపరాణితో మాటలు కలిపింది. కొద్దిసేపటికి స్వరూపరాణి నిద్రలోకి జారుకోగా.. ఆ మహిళ శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాలకు స్వరూపరాణి మెలుకువ వచ్చి లేచి చూడగా.. పొత్తిళ్లలోని శిశువు కనిపించలేదు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు సమాచారం ఇచ్చింది. వారు ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సీసీ టీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. స్వరూపరాణికి సహాయం చేసినట్లు నటించిన నర్సు వేషంలో ఉన్న మహిళే శిశువును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో..కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో సెల్ఫోన్లు చోరీకి గురవ్వడంతో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిందితుడికి.. శిశువును కిడ్నాప్ చేసిన మహిళే బెయిల్ ఇచ్చిందని ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ రాజు పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆమె వివరాలు సేకరించారు. గంటల వ్యవధిలోనే ఆమె ఇంటికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటలకల్లా పోలీసులు శిశువును క్షేమంగా తల్లి స్వరూపరాణి చెంతకు చేర్చారు. దీంతో స్వరూపరాణి సంతోషం వ్యక్తం చేసింది. ఆడబిడ్డ కోసమని..!నిందితురాలిని తమ్మిశెట్టి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక రామానాయుడుపేట సెంటర్లో కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆడబిడ్డ కోసమని తాను శిశువును అపహరించానని నిందితురాలు విచారణలో తెలిపింది. తాను ఎత్తుకొచ్చింది మగ శిశువనే విషయాన్ని గమనించలేదని వెల్లడించింది. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్సు దీవెన, సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ఎస్ఎన్సీయూ విభాగంలోని ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎఫ్ఎన్ఓ, సెక్యూరిటీ గార్డులకు చార్జ్ మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
పోదొడ్డిలో బరితెగించిన టీడీపీ శ్రేణులు
డోన్: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తి తదితరులపై శుక్రవారం మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ సమీపంలోని వశిష్ట క్రషర్ మిషన్‌లో పనులు జరగకుండా టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ నారాయణ, ఆయన అనుచరులు కూలీలను అడ్డుకుంటూ దాడులకు తెగబడుతున్నారు. క్రషర్ నడవాలంటే స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుమతి తీసుకోవాలని, కప్పం కట్టాలని నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శుక్రవారం మూడోసారి క్రషర్ దగ్గరకు వెళ్లి మూసేయాలని బెదిరించారు. క్రషర్ మిషన్ ఏర్పాటుకు సహకరించిన వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తిని దుర్భాషలాడటమేగాక ఆయన అంతుచూస్తామంటూ హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి క్రషర్ మిషన్ వద్దకు వెళ్తుండగా గ్రామంలోని ఓ హోటల్ వద్ద ఉన్న టీడీపీ నాయకుడు నారాయణ, అతడి అనుచరులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో కృష్ణమూర్తి, రామరంగడు, శేషు, ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బంధువులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సందర్భంగా కృష్ణమూర్తి అనుచరులు ప్రతిఘటించడంతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ, నడిపి ఓబులేసు, శ్రీనివాసులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ అనుమతులతోపాటు ప్రభుత్వపరమైన అనుమతులు ఉన్నా వశిష్ట క్రషర్ నిర్వాహకులు, కూలీలు భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోంది. ఈ క్రషర్ నిర్వాహకులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు బంధువులనే కారణంతో.. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో మండల, గ్రామ టీడీపీ నాయకులు క్రషర్‌పై దాడులకు దిగుతుండటం గమనార్హం. చెలరేగుతున్న తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనివిధంగా కోట్ల ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేస్తున్నారు. ఇటీవల డోన్ మండలం వెంకటనాయునిపల్లిలో రెండు కుటుంబాల మధ్య పొలం గట్టు తగాదాలో ఒక వర్గానికి చెందిన మాధవయ్యపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేసి గాయపరిచారు. అతడు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. మాధవయ్య అనుచరులు ప్రత్యర్థుల ఇళ్లపై దాడిచేసి ద్విచక్రవాహనాలు, టీవీలు, నిత్యావసర వస్తువులు ధ్వంసం చేయడమేగాక పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారికి గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు మద్దతునిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెపాన్ని వైఎస్సార్సీపీ నాయకులపైకి నెట్టేందుకు ప్రయతి్నంచడం పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్వారీ నాది కాదు...అయినా టీడీపీ గూండాలు దాడి చేస్తున్నారుక్వారీ అక్రమమో.. సక్రమమో? తేల్చాల్సింది ప్రభుత్వమేమాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టీకరణ సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లాలో ప్యాపిలి మండలం పోదొడ్డిలోని కంకర క్వారీ తనది కాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన దగ్గర నుంచి స్థానిక టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ.. క్వారీపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం వేటకొడవళ్లతో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారని.. వేయింగ్ బ్రిడ్జిని లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల తీరుతో పోదొడ్డి గ్రామంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో చివరకు గ్రామంలోని మరొక వర్గం టీడీపీ అరాచకాలను ప్రశ్నించడంతో ఘర్షణ తలెత్తిందని చెప్పారు. తనకు సంబంధం లేకపోయినా.. తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్వారీ సక్రమమా? లేదా అక్రమమా? అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే గానీ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు, ఆ పారీ్టకి చెందిన గూండాలు కాదన్నారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్న టీడీపీ గూండాల తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. -
టీడీపీ నేత గంజాయి సాగు
సాక్షి టాస్క్‌ఫోర్స్: గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు నిత్యం ప్రచార పటాటోపం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతలే గంజాయి పండిస్తున్నారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన టీడీపీ నేత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం మండలం టి.వీరాపురంలో టీడీపీ నాయకుడు చిలకరి వన్నూరుస్వామి మామిడి తోటలో గంజాయి మొక్కలు పెంచుతూ పట్టుబడ్డాడు. వన్నూరుస్వామి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ముఖ్య అనుచరుడు.టి.వీరాపురం గ్రామ సమీపాన కణేకల్లు క్రాస్‌కు చెందిన రవి అనే రైతు 9.5 ఎకరాల భూమిలో మామిడి, అల్ల నేరేడు పెంపకం చేపట్టాడు. ఈ తోట కాపరిగా టీడీపీ నాయకుడు వన్నూరుస్వామి కొంతకాలంగా ఉంటున్నాడు. పండ్ల తోటల మధ్య బంతి, కనకాంబరాల సాగు మొదలుపెట్టాడు. అందులోనే గుట్టుగా గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించి.. జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటలక్ష్మమ్మకు సమాచారాన్ని చేరవేశాడు. ఆమె సెబ్ పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగారు. 7.25 కిలోల బరువు ఉన్న నాలుగు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని.. నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. శుక్రవారమే గంజాయి పట్టుబడగా 24 గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిచ్చింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.21 వేలు ఉంటుందని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. నిందితుడికి గంజాయి తీసుకునే అలవాటు ఉందని, ఈ కారణంగానే నాలుగు మొక్కలు పెంచుకున్నాడనే విషయం తమ దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. -
ఇంకా మిస్టరీగానే నంద్యాల ముచ్చుమర్రి కేసు!
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఆరో రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి కనిపిచటం లేదు. ఒక్క బోటుతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక తల్లిదండ్రులను ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. వారం గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబం, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా? లేక పోలీసులు ఛేదిస్తారా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ లభించపోవటంతో ముచ్చుమర్రి ప్రజలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎదురు చూపులు చూస్తున్నారు. అభం శుభం తెలియని తొమిదేళ్ళ చిన్నారి అదృశ్యంపై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటన స్థలానికి చేరుకుని సీను రికస్టక్షన్ చేసినా కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు.చదవండి: రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు! -
ఆగని టీడీపీ విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. గురు, శుక్రవారాల్లో అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్లు, ఇళ్ల పునాదుల్ని ధ్వంసం చేయించారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తీయించేశారు. డివైడర్‌ను, బస్ షెల్టర్‌ను, పిల్లర్లను ధ్వంసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పగులగొట్టారు. » తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీకి చెందిన నిరుపేద వంకా సుధాకర్ నిర్మిస్తున్న ఇంటిని టీడీపీ ఒత్తిడితో అధికారులు కూల్చేశారు. స్థానిక చెరువులో సుధాకర్ అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇప్పటికే సుమారు రూ.8 లక్షలు వెచ్చించి గోడలు కట్టుకున్నాడు. కొందరు టీడీపీ నాయకులు, కొంత మీడియా వారు అది కూల్చేయాల్సిందేనని అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడున్న మిగిలిన ఇళ్లనుగానీ, పట్టణంలో ఉన్న పలు ఆక్రమణలనుగానీ పట్టించుకోని అధికారులు సుధాకర్ నిర్మించుకుంటున్న ఇంటిని జేసీబీతో కూల్చేశారు. » ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. వైఎస్సార్ïÜపీ ప్రభుత్వ హయాంలో కోనేటి చెరువు వద్ద రోడ్డును వెడల్పు చేసి ఆర్అండ్బీ ఆధ్వర్యంలో డివైడర్ నిర్మించారు. ఈ డివైడర్‌ను టీడీపీ వారు పొక్లెయిన్‌తో ధ్వంసం చేసి తొలగించారు. దీంతోపాటు పాత బస్ షెల్టర్‌ను, నూతనంగా నిర్మిస్తున్న బస్ షెల్టర్ పిల్లర్లను కూల్చేశారు. » శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు చెన్నేకొత్తపల్లి చేరుకుని వైఎస్సార్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు నిరసన తెలుపుతున్న వారివద్దకు చేరుకుని.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ శివాంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దుండగులు ధ్వంసం చేసిన వైఎస్సార్ విగ్రహం స్థానంలో ఒకటిరెండు రోజుల్లో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు.» శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీ జగనన్న కాలనీలో పునాదులను అధికార పార్టీ నాయకులు ధ్వంసం చేయించారు. జగనన్న ఇళ్ల కోసం ఈ సచివాలయం పరిధిలోని కొయ్య మోహిని, త్రివేణీ బడియా, బాకి భవానీ, కొండ మోహిని, నందికి శ్రావణి, లండ చందరమ్మ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 30న అప్పటి తహసీల్దార్ పి.మీనాదేవి అనుమతి ఇచ్చారు. వారు ఆ స్థలాల్లో పునాదులు వేసుకున్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు అక్రమ కట్టడాలు అంటూ రెవెన్యూ అధికారులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఇళ్లపై గత నెల 25న ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆ కట్టడాలను పరిశీలించి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. ఈ క్రమంలోనే శుక్రవారం రెవెన్యూ అధికారులు చూడామణిరెడ్డి, వీఆర్వో సాలిన కృష్ణ, మండల సర్వేయర్ తవిటినాయుడు ఆధ్వర్యంలో జేసీబీతో పునాదులను నేలమట్టం చేశారు.విషయం తెలుసుకున్న సర్పంచ్ ప్రతినిధి ఇసురు తులíÜరాం, బాధిత లబ్ధిదారులు అక్కడికి చేరుకుని కూల్చివేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ అంశంపై స్థానిక తహసీల్దార్ ఎం.భాస్కర అప్పారావును వివరణ కోరగా.. గతంలో పనిచేసిన తహసీల్దార్ ఇళ్లను మంజూరు చేయడం వాస్తవమేనని చెప్పారు. వారికి వారం రోజుల్లో మరోచోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. -
జీపుతో ఢీకొట్టి కిడ్నాప్..
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పట్టణ నడిబొడ్డున అందరూ చూస్తుండగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త చాకలి శ్రీనును జీపుతో ఢీకొట్టి.. ఆపై కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇంట్లో.. ఆమె సమక్షంలో తీవ్రంగా కొట్టి పట్టణ శివారులో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డికి లింగందిన్నెకు చెందిన చాకలి శ్రీను అనుచరుడు. శుక్రవారం ఆరోగ్యం సరిగాలేదని ఆళ్లగడ్డలోని మెడికల్ స్టోర్‌కు వచ్చి, మందులు తీసుకుని మరో యువకుడితో కలిసి బైక్‌పై లింగందిన్నెకు బయలుదేరాడు. వారిని వాహనంలో వెంబడిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బైక్‌ను ఢీకొట్టారు. దీంతో శ్రీను, మరో యువకుడు కిందపడ్డారు. వెంటనే కర్రలు, రాడ్లతో వాహనంలోంచి దిగిన టీడీపీ రౌడీ మూకలు శ్రీనును కొట్టుకుంటూ వాహనంలో వేసుకుని ఎమ్మెల్యే ఇంట్లోకి తీసుకెళ్లారు. మరో యువకుడు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించారని పోలీసులకు చెప్పినా ఫలితం లేదు. తుదకు శ్రీనును చంపొద్దని బతిమాలడంతో స్పృహ కోల్పోయేలా కొట్టి పొలాల్లో పడేశారు. ఆపై పోలీసులు 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 3 గంటలకు పైగా ఉత్కంఠ శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించిన విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించింది. టీవీ చానళ్లలో ప్రముఖంగా ప్రసారమైంది. అయినా పోలీసులు చలనం లేకుండాపోయింది. సుమారు 3 గంటలకు పైగా బాధితుడిని ఇంట్లో ఉంచి కొడుతున్నా.. అరుపులు బయటకు వినిపిస్తున్నా.. పోలీసులు మౌనం వహించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే.. విడిచి పెట్టాలని కోరుతున్నామని చెప్పారే తప్ప కనీసం ఆ ఇంటి వద్దకు కూడా వెళ్లక పోవడం విమర్శలకు తావిస్తోంది. విషయం వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. టీడీపీ శ్రేణులతో చర్చలు కొనసాగించినట్లు తెలుస్తోంది. కొట్టి పొలాల్లో పడేస్తామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ముందుగానే పోలీసులు 108 వాహనాన్ని సిద్ధం చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడికి ఆళ్లగడ్డలో ప్రథమ చికిత్స కూడా చేయించకుండా 50 కి.మీ దూరంలోని నంద్యాల వైద్యశాలకు తరలించడం గమనార్హం. -
రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు!
సాక్షి, నంద్యాల/పగిడ్యాల/నందికొట్కూరు : అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారి అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియక పోవడం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత బాలురు చెబుతుండటంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు నిద్ర కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో పోలీసుల విచారణ నత్త నడకను తలపిస్తోంది. దీంతో తమ బిడ్డ ఆచూకీ తెలియజేయండని బాలిక తల్లిదండ్రులు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. బాలిక ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సోమవారం రాత్రి పోలీసులు మేల్కొన్నారు. మంగళవారం ఉదయం ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు కొత్త ముచ్చుమర్రి పార్క్‌లో పనిచేసే సిబ్బందిని విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని చోట్లా వెతికినా ఫలితం శూన్యం నిందితులు ఇచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన సుమారు 30 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను కృష్ణా నది నుంచి ముచ్చుమర్రి పంప్‌హౌజ్ వరకు ఉన్న లింక్ చానల్లో పడేశామని చెప్పడంతో పోలీసు సిబ్బంది కాలువను జల్లెడ పట్టారు. స్పీడ్ బోట్లతో కాలువ మొత్తం గాలించారు. గజ ఈత గాళ్ల సాయం తీసుకున్నారు. వలలు వేసి వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి నిందితులను మరోసారి విచారించగా లింక్ చానల్లో కాదు.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌లో పడేశామని చెప్పారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరూ నేరం తాను చేయలేదని వాడే చేశాడంటూ ఒకరిపై ఒకరు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తనకేమీ తెలియదని, బాలికను వారిద్దరే చంపేశారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు ఆచితూచి విచారిస్తున్నారు. నీటి కుక్కలు తినేశాయా? చిన్నారిని ఆదివారం రాత్రే గొంతు నులిమి విద్యార్థులు హత్య చేసినట్లు సమాచారం. వీరికి పెద్దలు ఎవరైనా సహకారం అందించారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ లింక్ చానల్లో పడేసినట్లయితే మూడు రోజులకే మృతదేహం నీటిపై తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న నీటి కుక్కలు శవాన్ని పీక్కుతినేశాయా అనే అనుమానం పోలీసులను వేధిస్తోంది. శుక్రవారం సీన్ రీ కన్స్ట్రక్షన్ (బాలికను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు.. ఎక్కడ రేప్ చేశారు.. ఎలా గొంతు నులిమి చంపేశారు.. అన్న వివరాలను నిందితుల నుంచి స్పాట్‌కు తీసుకెళ్లి రాబట్టడం) చేసినట్లు తెలిసింది. అయినా బాలిక ఆచూకీ తెలుసుకోలేక పోవడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ విజయరావు ఘటనా స్థలికి ఇలా వచి్చ.. అలా వెళ్లారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మైనర్ బాలిక ఫ్లెక్సీతో బంధువులంతా రోడ్డెక్కి ‘వుయ్ వాంట్ జస్టిస్’ అని నినదించారు. కొత్త ముచ్చుమర్రి నుంచి పాత ముచ్చుమర్రి క్రాస్ రోడ్డుకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి స్టేషన్‌ను ముట్టడించి రోడ్డుపై బైఠాయించారు. ఆరు రోజులైనా తమ పాప ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఐజీ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఎస్ఐ జయశేఖర్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, సంయమనం పాటించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకీయా బేగం పరామర్శించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులుబాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు బ్రాహ్మణకొట్కూరు వద్ద అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితుల వద్దకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఎట్టకేలకు బాధిత చిన్నారి తండ్రినే అక్కడికి పిలిపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బీహార్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ప్రతిపక్ష పార్టీల నాయకులను బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంపిస్తున్నారన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిళ్లతో ఇలా చేస్తున్నారని ప్రశి్నంచారు. తన సొంత గ్రామంలో బాలిక హత్య జరిగితే, ఆ కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా అని పోలీసులపై మండిపడ్డారు. ముచ్చుమర్రికి తాను వెళితే నిజాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారా అని నిలదీశారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, చంద్రమౌళి, రవియాదవ్, తులసిరెడ్డి, రమే‹Ùనాయుడు, ఉపేంద్రారెడ్డి, శివనాగిరెడ్డి, ఓంకార్‌రెడ్డి, శ్రీకాంత్, నాగభూషణంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి నెట్వర్క్:ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు నెల రోజులు దాటినా నేటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇళ్లు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటేయలేదనే అనుమానంతో ఓటర్లపైన.. వైఎస్సార్సీపీకి ఓటేయించారనే నెపంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైన ప్రతాపం చూపిస్తున్నారు. చివరకు మధ్యాహ్న భోజన పథకం వంట మహిళలనూ టీడీపీ నేతలు వదలటం లేదు.ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాడనే కక్షతో దాడిచిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగసముద్రం గంగమ్మ జాతరలో టీడీపీ నేతలు బుధవారం రాత్రి మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అశోక్, అతడి బావమరిది విఘ్నేష్ (సుబ్రహ్మణ్యం)లను తీవ్రంగా గాయపరిచారు. బాధితుల కథనం ప్రకారం.. సింగసముద్రం గ్రామానికి చెందిన అశోక్ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేయించాడని అతడిపై కక్ష పెంచుకున్నారు. బుధవారం గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా అశోక్ బావమరిది విఘ్నేష్‌ని టీడీపీ నేతలు కొడుతున్నారన్న సమాచారం తెలియడంతో అశోక్ జాతర వద్దకు వెళ్లాడు. దీంతో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం ఆగ్రహంతో ఊగిపోతూ ‘అశోక్ వచ్చాడు. వీడే మన టార్గెట్’ అంటూ 40 మందితో కలిసి అశోక్‌పై మూకుమ్మడిగా దాడిచేశాడు. గాయపడిన అశోక్ గురువారం ఉదయం రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్, విఘ్నేష్ భయపడి గ్రామం వదిలి కుప్పం వెళ్లిపోయారు. దాడులతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.పులివెందులలో మామా అల్లుళ్లపై..వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్త అబ్దుల్, ఆయన మామ కుల్లాయప్పపై టీడీపీ కార్యకర్తలు శ్రీను, సంజీవ్, ఫయాజ్, సుమంత్ బుధవారం రాత్రి దాడి చేశారు. అబ్దుల్‌కు, కుల్లాయప్ప ఇంట్లో ఉండగా టీడీపీ కార్యకర్తలు దాడి జరిపి గాయపరిచారు. క్షతగాత్రులిద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించి.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన అబ్దుల్, కుల్లాయప్పను పార్టీ మునిసిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నప్ప పరామర్శించారు. అనపర్తి మండలంలో బీజేపీ, టీడీపీ కలిసి..తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు కూటేశ్వరస్వామి కాలనీలో వైఎస్సార్సీపీ కార్యకర్త కర్రి కోటేశ్వరరెడ్డిపై రామవరం, కుతుకులూరు గ్రామాలకు చెందిన బీజేపీ, టీడీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరెడ్డి అనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి కారణంగా కోటేశ్వరరెడ్డి చెవి కర్ణభేరికి రంధ్రం పడినట్టు గుర్తించారు. దాడితో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటేశ్వరరెడ్డి గతంలో గుండె ఆపరేషన్ చేయించుకుని అనారోగ్యంతో ఉన్నారని, దాడి సమయంలో ఆందోళనకు గురై అతడు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అన్యాయంగా దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ నాయకుడి వాహనం ధ్వంసంవైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బంగారు నాగేంద్ర కారును బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో ఉంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు బంగారు నాగేంద్ర తన కారును ఇంటి బయట పార్క్ చేసి ఉంచాడు. బుధవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ బ్యానర్లను చించివేశారు. ఘటనపై బాధితుడు పెనమలూరు పోలీసులకు నాగేంద్ర బుధవారం ఫిర్యాదు చేశారు. వంట మహిళపైనా టీడీపీ దౌర్జన్యంఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలిపై టీడీపీ నాయకులు గురువారం దౌర్జన్యం చేశారు. కుదప గ్రామానికి చెందిన పోతురాజు పద్మావతి 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థుల కోసం వంట చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని మార్చాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. పాఠశాల హెడ్మాస్టర్ బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం జరపగా.. మెజార్టీ సభ్యులు పద్మావతి వంట ఏజెన్సీ నిర్వహించేందుకు అంగీకరించారు. అయితే.. టీడీపీ నాయకులు ‘మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ఇష్టం వచ్చిన మనుషుల్ని మేం పెట్టుకుంటాం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో. వంట చేయడానికి వీల్లేదు’ అంటూ తనపై దౌర్జన్యం చేశారని పద్మావతి వాపోయారు. ఈ ఘటనపై ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. రాడ్లు, కర్రలతో దాడిఅన్నమయ్య జిల్లా ములకలచెరువులో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి తెగబడ్డారు. మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేతలు దిన్నెపాటి రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు గురువారం రాత్రి మండల కేంద్రానికి రాగా.. టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ, చిన్ని కృష్ణ, శివకుమార్ తదితరులు వారిపై రాడ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు టీడీపీ నేతలను ప్రతిఘటించి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పంచాయతీపై టీడీపీ ఫ్లెక్సీఅనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం నీలిగుంటలో పంచాయతీ కార్యాలయంపై టీడీపీ నాయకుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటుపై సర్పంచ్ కన్నంరెడ్డి వరహాలబాబు ఎంపీడీవో కాశీవిశ్వనాథరావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే రాజకీయ పరమైన ఫ్లెక్సీని పంచాయతీ కార్యాలయం నుంచి తొలగించాలని కోరారు. ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం వల్ల గ్రామంలో ఇరుపార్టీల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇళ్లలో శుభకార్యానికి హాజరైన వైఎస్సార్సీపీ దళిత నాయకుడు వినోద్‌పై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. అతడిని అడ్డగించి ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారు. ఇంటికి తాళం వేసి మహిళ నిర్బంధంవైఎస్సార్ సీపీకి ఓటేసిందనే అనుమానంతో నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఇంట్లో ఉండగా.. ఆ ఇంటికి తాళం వేసి నిర్బంధించిన ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మిట్టమీదకండ్రిగలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, మరో 10 మందికి వైఎస్సార్సీపీ హయాంలో ఇంటి పట్టాలు ఇచ్చారు. నాగేశ్వరరావు కుటుంబం గృహం నిర్మించుకుని అందులోనే కాపురం ఉంటోంది. ఈ క్రమంలో నాగేశ్వరరావు కుటుంబం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేసిందనే అనుమానంతో ఓ టీడీపీ నాయకుడు కక్షపూరితంగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించారని రెవెన్యూ అధికారుల ద్వారా గురువారం నాగేశ్వరరావు ఇంటికి తాళం వేయించాడు. నడవలేని స్థితిలో ఇంటిలో ఉన్న మునెమ్మ కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా తాళం వేసి నిర్బంధించారు. ఈ విషయంపై తహసీల్దార్ ఉదయ్భాస్కర్రాజును వివరణ కోరగా.. వీఆర్వో లోకేశ్వరి పొరబాటుగా ఇంటికి తాళం వేయడంతో మందలించినట్టు చెప్పారు. ఇల్లు ధ్వంసం చేసి.. ఇద్దరిపై దాడిపల్నాడు జిల్లా శ్రీరామపురం తండాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కేతావత్ గోవిందు నాయక్, కేతావత్ అంజి నాయక్‌లకు చెందిన గృహాన్ని బుధవారం రాత్రి టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ పాత్లావత్ అంజి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన కేతావత్ గోవిందు నాయక్, కేతావత్ అంజి నాయక్‌పై టీడీపీ నేత పాత్లావత్ అంజి, మరో 10 మంది రాడ్లు, కర్రలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయపడిన గోవిందు నాయక్, అంజి నాయక్‌లను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.ముస్లింలపై విరుచుకుపడిన టీడీపీ శ్రేణులువక్ఫ్ బోర్డు అధికారి లెక్కలు చూస్తుండగా ముస్లింలపై దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం దాదేపల్లెలో గురువారం చోటుచేసుకుంది. ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని మసీదు మరమ్మతు పనులకు సంబంధించిన నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం వచ్చిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గౌస్ మొహిద్దీన్ గ్రామానికి చేరుకుని లెక్కలు పరిశీలిస్తుండగా.. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఘటనలో ఎస్.బావాజాన్, ఎస్.సనావుల్లా, పి.షేర్‌ఖాన్, ఎస్.మషాయక్, ఎస్.మహమ్మద్ ఖైఫ్, ఎస్.జహీర్లకు గాయాలయ్యాయి. బావాజాన్ ఎముకలు విరగడంతో అపరస్మారక స్థితికి చేరాడు. సనావుల్లాకు ముఖం, ఛాతిపై బలమైన గాయాలయ్యాఇ. ఈ ఘటనతో దాదేపల్లెలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధితులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించి, ఘర్షణకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నంపొలంలో నిద్రిస్తుండగా కత్తులతో దాడి చేసిన టీడీపీ నాయకులుతీవ్ర గాయాలతో అటవీ ప్రాంతంలోకి పారిపోయి ప్రాణం దక్కించుకున్న బాధితుడుపీలేరు ఆస్పత్రిలో చికిత్ససాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద పంచాయతీ ఎగువపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత కిరణ్ గురువారం పొలంలో నిద్రించగా..టీడీపీ నాయకులు కత్తులతో విరుచుకుపడి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణభయంతో అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసి అన్నమయ్య జిల్లా పీలేరుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఎగువపల్లెకు చెందిన కిరణ్ వైఎస్సార్సీపీ మండల స్థాయి నాయకుడు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. గురువారం మధ్యాహ్నం కిరణ్ ఎగువపల్లెలోని తన టమాటా తోటలో పడుకుని ఉండగా.. టీడీపీ నాయకులు కిరణ్‌పై కత్తులు, కర్రలతో ఒక్కసారిగా దాడి చేశారు. కిరణ్ తలపై కత్తులతో నరికారు. ఛాతీపై కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్ ప్రాణ భయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాడు. అక్కడ నుంచి అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో కొంత తేరుకున్నాక పుంగనూరు నియోజకవర్గ నాయకులకు ఫోన్‌చేసి తన పరిస్థితిని వివరించాడు. నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒకచోట దాడులు జరగడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నాయి. -
ప్రేమోన్మాది ఆత్మహత్య
రాంబిల్లి (అచ్యుతాపురం): తన ప్రేమను నిరాకరించి, జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను ఐదురోజుల క్రితం హతమార్చిన ప్రేమోన్మాది చివరకు శవమై కనిపించాడు. అతని మృతదేహం బాలిక ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బుల్లో లభ్యమైంది. అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొప్పుగొండుపాలెంలో బద్ది దర్శిని(14) అనే బాలికను ఈనెల 6వ తేదీ రాత్రి కశింకోట మండలానికి చెందిన సురేశ్ గొంతు కోసి హతమార్చాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతనిపై దర్శిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. బాలికను రాంబిల్లి మండలంలో అమ్మమ్మ ఇంట చదివిస్తున్నారు. బెయిల్‌పై వచ్చిన సురేశ్, తనను జైలుకు పంపిందన్న కక్షతో దర్శినిని హతమార్చాడు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన లేఖలో ‘ఇద్దరం కలిసి ఉండాలి.. లేదా ఇద్దరం చనిపోవాలి’ అని పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంటికి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో కొండలాంటి ప్రాంతంలో గడ్డిదుబ్బుల మాటున సురేశ్ శవమై కనిపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి సమీపంలోని రైతులకు దుర్వాసన వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు నేతృత్వంలోని బృందం శవాన్ని పరిశీలించి లభించిన ఆధారం మేరకు సురేశ్‌గా నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. సురేశ్ జేబులో కొంత నగదు, రాసిన లేఖ జిరాక్స్ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో ఆ వాహనాన్ని దర్శిని కుటుంబీకులు అడ్డుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించి, బాలిక కుటుంబాన్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడు మళ్లీ బాలిక వెంట పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘటన జరిగిన మర్నాడు అనకాపల్లిలో హోంమంత్రి అనితను విలేకరులు ప్రశ్నించగా, అలాంటిది జరిగినట్టు తన దృష్టికి రాలేదని, అదే నిజమైతే సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. చివరకు రాంబిల్లి ఎస్ఐ ముకుందరావును బుధవారం వీఆర్‌పై పంపారు. ఇంత జరిగినా బాలిక కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పని ఒత్తిడి, ఆపై జ్వరం.. ఆశ వర్కర్ మృతి
ఎ.కొండూరు (తిరువూరు): తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆశ వర్కర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో గురువారం చోటుచేసుకుంది. ఎ.కొండూరు గ్రామానికి చెందిన తోట రాధ (42) సుమారు 18 ఏళ్లుగా ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. వారం క్రితం జ్వరం బారిన పడ్డారు. రాధ జ్వరంతో బాధపడుతూనే ఫీవర్ సర్వే నిర్వహించారు. పని ఒత్తిడి పెరగడం, తీవ్ర జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్నప్పటికీ నయంకాలేదు. దీంతో తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చినఅవుటపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాధ మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. న్యాయం చేయాలని ధర్నా తోట రాధ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఐటీయూ, ఆశ వర్కర్లు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గురువారం ధర్నా చేశారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.కమల, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైద్యాధికారులు నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన రాధ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతురాలి కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రాధకు సెలవు ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా జ్వరంతో సర్వేలు చేయొద్దు.. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని ఎ.కొండూరు పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి కె.శ్రీనివాసరావు చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని ఆదేశాల మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేశామని వివరించారు. -
టీడీపీ నేతల బెదిరింపులకు ‘ఉపాధి’ ఉద్యోగి బలి
చిలకలూరిపేట: టీడీపీ నాయకుల బెదిరింపులు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యోగి ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్(38) గత 18 సంవత్సరాలుగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆనంద్‌ను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ గురువారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకురాగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఆనంద్‌కు భార్య రత్నకుమారి, కుమార్తెలు దివ్య(10వ తరగతి), అర్షిత(8వ తరగతి), మహి(7వ తరగతి) ఉన్నారు. తన భర్త మృతికి గోపాళంవారిపాలెం గ్రామానికి చెందిన చిన్నం రవిబాబు, గోపాళం సాగర్‌బాబు, గోరంట్ల బుజ్జి, గోపాళం శ్రీధర్, మిన్నకంటి వీరబాబు, మానుకొండ బాలయ్య తదితరుల వేధింపులే కారణమని రత్నకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదు రోజులైనా దొరకని బాలిక ఆచూకీ.. మృతదేహం కోసం విస్తృత గాలింపు
నంద్యాల: పగిడ్యాల, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న బాలిక అదృశ్యం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. రోజులు గడుస్తున్నాయే తప్పా బాలిక మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. గురువారం వైజాగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ రెండు బృందాలను రప్పించి ప్రత్యేక కెమెరాలతో ముచ్చుమర్రి పంప్‌హౌస్ నీటిలో గాలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన గాలింపులో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.‘దృశ్యం’ సినిమాలాగా నిందితులు రోజుకో సమాచారం చెప్పి పోలీసులను విచారణలో తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఘటన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. క్షణం.. క్షణం ఉత్కంఠతో బాలిక బంధువులు, కుటుంబీకులు ఎదురుచూస్తూ పంప్‌హౌస్ వద్ద విషాదంలో మునిగిపోయారు. గాలింపు చర్యలను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ రఘువీర్‌రెడ్డి పర్యవేక్షించారు.అనంతరం బాధిత కుటుంబాన్ని కలెక్టర్ పరామర్శించారు. నేర నిర్ధారణ అయితే నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ఐదు రోజులైనా తమ పాప ఆచూకీని కనిపెట్టలేదని, పోలీసుల అదుపులో ఉన్న నిందితులను చూపించాలని డిమాండ్ చేశారు. సాయంత్రంలోగా మృతదేహం ఆచూకీ కనిపెట్టాలని, ఎన్నాళ్లు సాగదీస్తారని అధికారులపై బాలిక బంధు వులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిందితుల కుటుంబీకులను పిలిచి పోలీసులకు ఎందుకు విచారించడం లేదని, మృతదేహం మాయంలో వారి హస్తం ఉంటుందని అనుమానాలను వ్యక్తం చేశారు. నిందితులు మైనర్లు కావడం వలన అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ బాధితులకు తెలిపారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్‌ను కలిసి బాలిక మృతదేహాం ఆచూకీని తొందరగా గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న బాలిక కుటుంబీకులు, బంధువులు నేరం రుజువైతే కఠిన చర్యలు..బాలిక హత్య కేసులో మైనర్లు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోందని, నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో బాలిక మృతదేహాం ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాల చేపట్టిన గాలింపు చర్యలను కలెక్టర్ పర్యవేక్షించారు.అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల గాలింపులో పురోగతి సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామన్నారు. అనంతరం సీపీఐ జిల్లా నాయకులు రమేష్‌బాబు, జిల్లా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న, తాలుకా అధ్యక్షులు బోయ వెంకటరమణ నాయుడు, లాయర్ వెంకటరాముడు, ఎంఆర్పీఎస్ నాయకులు బాధితులను శిక్షించాలని వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ దాసు, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగేశ్వరరావు ఉన్నారు.నిందితుల తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలి..నందికొట్కూరు: కొత్త ఎల్లాల గ్రామంలో బాలికను దారుణంగా హత్య చేసిన నిందితులు మైనర్లు కావడంతో వారి తల్లిదండ్రులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు, కుటుంబీకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పోలీసు స్టేషన్‌కు ఎదురుగా వారు ధర్నా చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఐదు రోజులు గడిచినా తమ అమ్మాయి ఆచూకీ గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో నిందితుల తల్లిదండ్రుల పాత్ర ఉందని, వారిని ఇంత వరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అనకాపల్లి: బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులుగా నిందితుడు కోసం 12 బృందాలు గాలిస్తున్నారు. రాంబిల్లి మండలం కొప్పు గుండుపాలెంలో సురేష్ మృతదేహాం దొరికింది.కాగా, నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాంబిల్లి మండలంలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ పాత, ప్రస్తుత ఫొటోలు విడుదల చేశారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు హత్యకు ముందు.. తరువాత నిందితుడు బట్టలు మార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విశాఖపట్నం జైలులో ఉన్న సమయంలో ఎవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలోనూ పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. -
టీడీపీ నేతల నిర్వాకానికి తల్లి, కూతురు బలి
కళ్యాణదుర్గం: టీడీపీ నాయకుల కక్ష సాధింపులకు తల్లి, కుమార్తె బలయ్యారు. తన భర్తపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడంతో తీవ్ర మనస్తాపం, ఆందోళనకు గురైన గొల్ల మమత (24).. తన 8 నెలల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లికార్జునపల్లికి చెందిన గొల్ల శాంతకుమార్ వైఎస్సార్సీపీ కార్యకర్తగా పార్టీ తరఫున గ్రామంలో చురుగ్గా పనిచేశారు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ కిరాణా దుకాణం వద్ద జగన్‌కు అనుకూలంగా మాట్లాడాడు. అనంతరం గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శాంతకుమార్‌ను మందలించేందుకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టారు. శాంతకుమార్‌ను ఎలాగైనా కేసులో ఇరికించి జైలుకు పంపాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన హనుమంతు అనే టీడీపీ కార్యకర్తను ఉసిగొల్పి శాంతకుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ విషయంపై బుధవారం పోలీసులు శాంతకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించారు. భర్త జైలుకు వెళ్తాడన్న భయంతో.. తన భర్త శాంతకుమార్‌ను స్థానిక టీడీపీ నాయకులు అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని, అతన్ని జైలులో పెట్టిస్తారన్న భయంతో అతడి భార్య మమత తీవ్రంగా కుంగిపోయింది. ముందుగా తన 8 నెలల కుమార్తెను ఇంటి ఆవరణలోని నీటి తొట్టెలో ముంచి ప్రాణం పోయాక.. బాత్రూంలో ఉన్న ఇనుప కడ్డీలకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించేసరికే చిన్నారితో పాటు మమత మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకుమార్తె మృతితో మల్లికార్జునపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలివచ్చారు. తల్లీకుమార్తె మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. ఇవి రాజకీయ హత్యలే: వైఎస్సార్సీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే వారి అధికార దాహానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి అన్నారు. కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి, పార్టీ నేతలు రామచంద్ర, హనుమంతరెడ్డి, చిత్తప్ప, తలారి సత్యప్ప, కృష్ణమూర్తి, ఆంజనేయులు తదితరులతో కలిసి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ఇద్దరి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇవి అధికార పార్టీ చేసిన రాజకీయ హత్యలని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న కారణంతో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడం, అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇక్కడ విష సంస్కృతికి తెర లేపారని విమర్శించారు. తల్లీకూతురు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు రూ.40,000 జరిమానా చెల్లించాలని, ఆ మొత్తాన్ని బాలికకు ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిహారం కింద రూ.3.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ కృష్ణ అందించిన వివరాలు.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి తోటగురువు దగ్గర బీఎన్ఆర్ నగర్లో నివాసముంటున్న గుండెల సాయికుమార్.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆరిలోవ సెక్టార్–2 శివాజీనగర్‌లో తన ఇద్దరు మైనర్ కుమార్తెలతో తండ్రి నివాసముంటున్నాడు. గతేడాది ఏప్రిల్ 9న తన కుమార్తెలను టిఫిన్ తీసుకురమ్మని హోటల్‌కు తండ్రి పంపాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న సాయికుమార్.. ఓ బాలికను ఎత్తుకుని తన బండిపై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.సోమశేఖర్.. సాయికుమార్‌పై కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు.