breaking news
-
లైంగిక దాడి కేసులో బతికున్నంతకాలం జైలు
ఏలూరు (టూటౌన్): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్ పవన్‌కుమా ర్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్ పవన్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.విచారణలో పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్ సత్తార్, బీఎస్కే నాగూర్ హుస్సేన్ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
దంపతుల్ని చిదిమేసిన ఐషర్
అనంతపురం: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన నగర శివారు నేషనల్ పార్కు సమీపంలో జరిగింది. వివరాలు.. గుత్తి మండలం అబ్బేదొడ్డికి చెందిన కమతం హనుమంత రెడ్డి (72), కమతం రంగమ్మ (68) దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, కాంతమ్మ, కృష్ణకుమారి, ఒక కుమారుడు నాగేశ్వర రెడ్డి సంతానం. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. నాగేశ్వర రెడ్డి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అనంతపురంలోని చిన్మయనగర్‌లో నివాసముండే కుమార్తెలను చూసేందుకు ప్రతి వారం హనుమంత రెడ్డి, రంగమ్మ వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలోనే సోమవారం వచ్చి తిరిగి స్వగ్రామం బయలుదేరారు. నేషనల్ పార్కు వద్ద వెళ్తున్న సమయంలో ఓ ఐషర్ వాహనం అదుపుతప్పి బైకుపై పడిపోయింది. తీవ్ర గాయాలైన దంపతులిద్దరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాద ధాటికి హనుమంతు రెడ్డి తల తెగిపోయింది. కక్కలపల్లి మండీలో టమాట బాక్సులు లోడు చేసుకున్న ఐషర్ డ్రైవర్ ముంబైకు వెళ్తున్నట్లు తెలిసింది. నేషనల్ పార్కు సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం అదుపు కాకపోవడంతో బోల్తా కొట్టి పక్కనే హనుమంత రెడ్డి, రంగమ్మలు వెళ్తున్న బైకుపై పడినట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మృతుల కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. -
మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మహిళలు అని కూడా చూడకుండా పచ్చ మంద కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా టీడీపీ కార్యకర్తలు మహిళలపై దాడి చేసిన వీడియోను షేర్ చేసింది. ఈ సందర్బంగా.. రాష్ట్రంలో టీడీపీ గూండాలు బరితెగించారు. మార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణం ఐదవ వార్డులోని నవాబుమెట్టలో వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు. వీరి దాడిలో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, పాలనను గాలికి వదిలేసి మహిళలపై దాడులు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. రాష్ట్రంలో బరితెగిస్తున్న @JaiTDP గూండాలుమార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణం ఐదవ వార్డులోని నవాబుమెట్టలో వైయస్ఆర్ సీపీ మహిళా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళలురాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, పాలనను… pic.twitter.com/2c4Q6poQf9— YSR Congress Party (@YSRCParty) September 22, 2024 ఇది కూడా చదవండి: చంద్రబాబు మార్కు ‘కుట్ర’ తప్పు జరిగితే కేసు ఎందుకు పెట్టలేదు? -
బీటెక్ రవి దాష్టీకం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతీ హలు సమీపంలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి శ్రావణి దంపతులపై టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఏకంగా తెలుగు తమ్ముళ్లను ఇంటికి పంపి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆదివారం జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. పులివెందుల పట్టణం మారుతీ హాల్ సమీపంలో రాజగోపాల్‌రెడ్డి దంపతులు దుస్తుల షాపు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధు భార్య లావణ్య దుస్తుల షాపునకు వస్తూ వీరికి పరిచయమైంది. హైదరాబాద్‌లో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్నానని కొంత, రియల్ ఎస్టేట్ కోసమని మరికొంత డబ్బును తీసుకుంది. ఏడాదిలో సుమారు రూ.32 లక్షలు తీసుకుంది. తర్వాత లావణ్యను డబ్బులు అడగడంతో నాలుగు నెలల కిందట రూ.10 లక్షల బ్యాంకు చెక్కులు ఇచ్చింది. కాగా, చెక్ బౌన్స్ అయిందని కోర్టులో రాజగోపాల్‌రెడ్డి, శ్రావణిలు కేసు వేశారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి చెంతకు చేరింది. వారు ఫోన్ చేయడంతో రాజగోపాల్‌రెడ్డి లిఫ్ట్ చేయలేదని తెలుగు తమ్ముళ్లు వాహనాలు వేసుకుని రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి.. మా వాళ్లపైనే కేసు వేస్తావా అంటూ వారిపై దాడి చేశారు. ఆరుగురు టీడీపీ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని కారులోనే కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న బీటెక్ రవి నేతృత్వంలో మరింతగా రెచ్చిపోయారు.రాజగోపాల్‌రెడ్డి సతీమణి శ్రావణి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు టీడీపీ నేతలకు ఫోన్ చేశారు. దీంతోటీడీపీ నేతలు రాజగోపాల్‌రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం లావణ్య తండ్రి సుధాకరరెడ్డి, చిన్నాన్న చంద్రమౌలేశ్వరెడ్డిలతో పాటు మరో నలుగురిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఆదివారం తెల్లవారుజామున వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతులను నెల్లూరు జిల్లా, అనంతపూర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను అతి వేగంలో ఉన్న కారు వచ్చి ఢీకొట్టింది. కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, వీరంతా అరుణాచలం నుంచి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని నెల్లూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.మరోవైపు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఘెర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలో లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మృతులను అనంతపురం స్టాలిన్ నగర్‌కు చెందిన చాకలి పవన్, శ్రీనివాస్, ముస్తాక్, ఎస్. పవన్‌గా గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని అనంతపురం ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి -
బరితెగించిన పచ్చ బ్యాచ్.. మహిళలు, చిన్నారులపై దాడి
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పచ్చ మూక రెచ్చిపోతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎల్లో బ్యాచ్ అరాచకం సృష్టించింది.ప్రకాశం జిల్లాలోని పొదిలిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించి దాడులు చేశారు. పొదిలిలోని నవామిట్టలో వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా క్రూరత్వంతో రాళ్లు, కర్రలతో కొట్టారు. పచ్చ మూక దాడిలో కుటుంబంలోని ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, వారికి వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వారిని అడ్డుకొని వీరంగం సృష్టించారు. ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే.. -
డెహ్రాడూన్‌లో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్ : ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల 13వ తేదీన నటి జత్వాని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే విద్యాసాగర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆ వెంటనే అతడి కోసం ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. డెహ్రాడూన్‌లో ప్రత్యేక బృందాలు అతన్ని పట్టుకున్నాయని, ఈ నెల 20న అరెస్ట్ చేసి.. డెహ్రాడూన్ మూడో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచాయన్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతా రివర్స్: సినీ నటి కాదంబరి జత్వాని తనను మోసం చేసిందని తొలుత కేసు పెట్టిందే కుక్కల విద్యాసాగర్. ఆమె ఫోన్లు వెనక్కు ఇవ్వద్దని, అలా ఇస్తే డేటా తొలగిస్తారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, పోరాడుతున్నది కూడా ఇతనే. పోర్జరీ సంతకాలతో భూమిని కొట్టేసేందుకు యత్నించిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదుతో జత్వానిపై కేసు నమోదు చేసి.. ముంబై నుంచి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా ఎంతో మందిని ఆమె మోసగించిందని విచారణలో తేలింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీడీపీ పెద్దలు ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు దిగారు. ముగ్గురిని సస్పెండ్ కూడా చేశారు. కేసును తిమ్మినిబమ్మి చేసి తమ కక్ష సాధింపునకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్‌పై ఆమెతో ఉల్టా కేసు పెట్టించి, అరెస్ట్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై ఇలా కక్ష సాధిస్తున్నారు. -
నెల్లూరు జిల్లాలో పరువు హత్య
కొడవలూరు: కుమార్తె తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువుకు భంగం కలిగించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి హత్యచేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి కంప వేశారు. 25 రోజుల అనంతరం స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రంలో జరిగింది.కొడవలూరు సీఐ సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభసత్రం పల్లెపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల క్రితమే వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్దిరోజులకే ఆమె భర్తతో విభేదించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వారికి పద్మనాభసత్రం మెయిన్ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉండగా వారికి సహాయంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హత్యకు గురయ్యే పదిరోజుల ముందు శ్రావణి ఆ యువకుడితో వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నార్త్ఆములూరులోనే కాపురం పెట్టారు. వారంరోజుల తర్వాత ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలిసి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని ఆమెపై ఒత్తిడి తేవడంతోపాటు దారుణంగా కొట్టారు. ఇది చుట్టుపక్కల వారు గమనించారు.పూడ్చిపెట్టి.. పైన కంప వేసి.. శ్రావణి మాట వినకపోవడంతో 25 రోజుల క్రితం ఓ రాత్రి ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్యచేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇంటి పక్కనే ఉన్న వారి ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప వేసేశారు. ఈ నేపథ్యంలో.. ఇరవై రోజులు గడిచినా శ్రావణి నుంచి ఫోన్ రాకపోవడంతో షేక్ రబ్బానీ బాషా గ్రామంలో విచారించాడు. తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తులు తెలుపడంతో వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తులకూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా ఖాళీ స్థలంలో పాతి పెట్టిన ఆనవాళ్లు వారి అనుమానానికి బలం చేకూర్చాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే శ్రావణిని హత్యచేసి పాతి పెట్టామని వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.దీంతో తహసీల్దార్ కె. స్ఫూర్తి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, సోదరి, సహకరించిన సోదరుడు, చెంచయ్యపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసుకున్నామని, భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని తెలిపారు. -
ట్రాక్టర్‌తో తొక్కించి దళిత కూలీ హత్య
నాగులుప్పలపాడు: అగ్రవర్ణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు ఓ దళిత కూలీని ట్రాక్టర్ గొర్రుతో తొక్కించి హత్య చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రమాదంగా చిత్రీకరించి, స్టేషన్ బెయిలుపై వచ్చేసిన వైనం వెలుగు చూసింది. కూలి డబ్బు వద్ద తలెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకొని ఈ దురాగతానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కె.తక్కెళ్లపాడుకు చెందిన కొప్పుల రామయ్య (65) రైతుల వద్ద కూలి పనులు చేసుకొనేవాడు. భార్య చనిపోవడంతో కుమార్తె వద్ద ఉంటున్నాడు. అదే గ్రామంలోని అగ్రవర్ణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కురుగుంట్ల రాఘవయ్య వద్ద కూడా కూలి పనిచేసేవాడు. కొద్ది రోజుల క్రితం కూలి విషయంలో రాఘవయ్యతో గొడవ జరిగింది. ఓ దళిత కూలీ నన్ను ప్రశి్నస్తాడా అని రాఘవయ్య కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం నుంచి తక్కెళ్లపాడుకు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న రామయ్యను రాఘవయ్య ట్రాక్టర్ గొర్రుతో తొక్కేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన ట్రాక్టర్‌ను పొలాల్లో దాచిపెట్టాడు. అనంతరం తీవ్ర గాయాలపాలైన రామయ్య వద్దకు అందరితో పాటు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్దాం పదండి అంటూ హడావుడి చేశాడు. రామయ్య ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. దాంతో అధికార పార్టీ అండతో ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయతి్నంచాడు. పోలీసుల విచారణలో రాఘవయ్య ట్రాక్టర్‌తో తొక్కించినట్లు తేలింది. రాఘవయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా పొరపాటున ప్రమాదం జరిగినట్లు ఒప్పుకున్నాడు. అయితే, తన రాజకీయ పలుకుబడితో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించి, వెంటనే స్టేషన్ బెయిల్ తీసుకుని తన ట్రాక్టర్‌ను కూడా విడిపించుకున్నాడు. 15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల బాలికనూ ట్రాక్టర్‌తో తొక్కించి హత్య.. తన తండ్రిది ముమ్మాటికీ హత్యేనని రామయ్య కుమారుడు కొప్పుల కోటయ్య తెలిపాడు. ఇదే రాఘవయ్య అగ్రకుల అహంకారంతో 15 ఏళ్ల క్రితం తమ గ్రామానికే చెందిన 18 ఏళ్ల బాలికను కూడా ఇలాగే ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేసి ఎలాంటి కేసు లేకుండా మాఫీ చేసుకున్నాడని ఆరోపించాడు. రాఘవయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. -
పచ్చ బ్యాచ్ అరాచకం.. వైఎస్సార్సీపీ ఆఫీస్ ధ్వంసం, కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా జిల్లాలో పచ్చ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. భాకరాపేటలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు.వివరాల ప్రకారం... తిరుపతి జిల్లాలోని భాకరాపేటలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఈ సందర్బంగా ఆఫీసులో ఉన్న ఫర్నీచర్, ఇతర సామాన్లు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించింది. దీంతో, ఈ ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త తులసిరెడ్డిని అరెస్ట్ చేశారు.ఇక, పోలీసులు అరెస్ట్ చేయడంతో మరింత ఆగ్రహానికి లోనైన తులసిరెడ్డి కానిస్టేబుల్‌పైనే దాడి చేశాడు. అధికారం మాది నన్నే అరెస్ట్ చేస్తారా? అంటూ రెచ్చిపోయి విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పోలీసు స్టేషన్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు.అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం పొడరాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి స్థలం కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో, వారిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ నేతలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇది కూడా చదవండి: ‘మా కలలు చిదిమేసిన చంద్రబాబు ప్రభుత్వం’ -
ఉపాధ్యాయుని కీచకపర్వం!
రేణిగుంట: సభ్యసమాజం తలదించుకునేలా ఓ ఉపాధ్యాయుడు కీచక అవతారం ఎత్తిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం హైసూ్కల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఆర్.మల్లవరం హైసూ్కల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవి ఇటీవల 10వ తరగతి విద్యార్థినులను పాఠాలు చెప్పే క్రమంలో వారి ప్రైవేటు భాగాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి టీచర్ రవితో వాగ్వాదానికి దిగారు. హెచ్ఎం వెంకటరమణ కలుగజేసుకుని ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని సర్దిచెప్పి పంపారు. అయితే అప్పటి నుంచి తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులపై టీచర్ రవి కక్ష కట్టారు. తన క్లాసుకు రావద్దంటూ విద్యార్థినులను బయటకు పంపారు. దీంతో తమ చదువులు ఏమైపోతాయోనని భయాందోళన చెందుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై టీచర్ రవి మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోపణలను ఖండించారు. హైసూ్కల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వారం రోజుల కిందట ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను టీచర్ రవి తాకరాని చోట తాకినట్లు ఫిర్యాదు చేశారని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని సర్ది చెప్పి పంపించానన్నారు. -
బాలికల హాస్టల్లో కీచకపర్వం
ఏలూరు టౌన్: పేద బాలికల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో ఓ కామాంధుడు కొంతకాలంగా చెలరేగిపోతున్నాడు. వార్డెన్ భర్తగా ఎంటరైన సుమారు 55 ఏళ్ల వయసున్న ఆ కీచకుడు బాలికలను చెరబట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన కోరికను కాదంటే బాలికలను దారుణంగా కొడతాడు. చాలా కాలంగా అతని దుర్మార్గాలను తట్టుకున్న ఆ బాలికలకు ఓపిక నశించింది. సేవాశ్రమంలోని వారంతా మంగళవారం సాయంత్రం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను వేడుకున్నారు. ఆ కామాంధుడి లీలలు వెలుగులోకి రావడంతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఘోరకలికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు అమీనాపేటలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌ను నిర్వహకులు సేవాభావంతో ఏర్పాటు చేయగా.. గత కొంతకాలంగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న మణిశ్రీ భర్త శశికుమార్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా వేధిస్తున్నాడు. శశికుమార్ ఏలూరు ఎన్ఆర్పేటలో మణి ఫొటో స్టూడియో నడుపుతూ, మరోవైపు ఏలూరు జిల్లా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న తన పలుకుబడితో కొంతకాలం క్రితం తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్చాడని సమాచారం. బాలికలపై లైంగిక దాడులుఆ బాలికల సేవాశ్రమంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థినులు వసతి సదుపాయం పొందుతున్నారు. వీరు స్థానికంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేసి సేవాశ్రమంలోకి వార్డెన్ భర్తగా ఎంటరయ్యాడు. పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించినట్టు బాధిత బాలికలు చెబుతున్నారు. ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫొటో షూట్ కోసమని తీసుకువెళ్లిన శశికుమార్.. సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చాడు. రాత్రివేళ ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా సహచర బాలికలు ప్రశ్నించారు. జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు చెప్పిందనే అక్కసుతో అక్కడ ఉన్న బాలికలను అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. రాత్రి బాలికల ఏడుపులు వినిపించాయని స్థానికులు కూడా చెప్పారు. శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనే ఉద్దేశంతో బాలికలు మంగళవారం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికలను భయపెట్టి నీరుగార్చే ప్రయత్నంసేవాశ్రమంలో జరిగిన దారుణాలపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తారా... అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే బాలికలు మీడియాకు జరిగినదంతా వివరించారు. అయినా పోలీసులు మాత్రం బాలికలను భయపెట్టి ఈ దారుణ సంఘటనను నీరుగార్చే ప్రయత్నం చేసు్తన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వార్డెన్ మణిశ్రీకి ఏలూరులోని ఓ ప్రజాప్రతినిధి వత్తాçÜు పలికినట్లు, అలాగే స్థానిక ఎంపీ కార్యాలయానికి చెందిన వ్యక్తులు సైతం రంగంలోకి దిగి పోలీస్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదులో కేవలం వేధింపులకు గురిచేసినట్టుగానే బాలికలతో పోలీసులు రాయించినట్లు తెలుస్తోంది. ఏలూరు డీఎస్పీ దర్యాప్తుఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వెంటనే స్పందించారు. సేవాశ్రమం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం. సుబ్బారావు, ఏలూరు టూటౌన్ సీఐ వైవీ రమణ, బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు చేశారని, వీటిపై విచారణ చేస్తామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఫొటో షూట్లంటూ.. ఫొటో షూట్ల కోసమని శశికుమార్ ఒక్కొక్క బాలికను దూరప్రాంతాలకు తీసుకువెళతాడనీ, అక్కడ కాళ్లూచేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడతాడని, కాదంటే ఇష్టారాజ్యంగా కొడతాడని బాధిత బాలికలు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి వాళ్ల దగ్గరకు మిమ్మల్ని పంపుతాను, రూమ్‌లు ఏర్పాటు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చారు. బయటకు తీసుకెళ్లి టీ, కాఫీ ఇప్పించి సగం తాగిన అనంతరం కప్పు తీసుకుని తాగుతూ వక్రంగా మాట్లాడుతూ పైశాచికత్వాన్ని చూపిస్తాడని వివరించారు. ఇక స్థానికంగా ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ సేవాశ్రమానికి పంపాలంటూ శశికుమార్ ఆయా హాస్టళ్ల వార్డెన్లను కోరతాడని, అతని కోరిక మేరకు ఆ హాస్టళ్ల వార్డెన్లు బాలికలను ఇక్కడకు పంపుతారని తెలిసింది. -
టీడీపీ నేత కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ నేత గోరంట్ల రవికుమార్‌కు చెందిన శ్రీహర్షిణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వడ్డిముక్కల భావన(16) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వడ్డిముక్కల చిన బ్రహ్మయ్య, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె భావన. వినాయక చవితి సెలవుల సందర్భంగా భావన 4వ తేదీన ఇంటికి వెళ్లింది. తిరిగి 16 మధ్యాహ్నం కాలేజీకి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ కళాశాల టెర్రస్‌పై ఉన్న షెడ్డు కప్పునకు ఉన్న ఫ్యాన్‌కు తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉరికి వేలాడుతున్న భావనను మంగళవారం ఉదయం విద్యార్థినులు చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి భావనను కిందకు దింపడంతో అప్పటికే బాలిక మృతి చెందింది. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫీజులు కట్టాలంటూ కాలేజీ యాజమాన్యమే వేధించి తన బిడ్డను పొట్టనపెట్టుకుందని ఆమె కన్నీటిపర్యంతమైంది. బాలిక తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భావన తండ్రి పదేళ్ల కిందట చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలనూ పోషిస్తోంది. కాగా, కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసి కూడా గోరంట్ల రవికుమార్ పత్తా లేకుండా పోయారు. ఆయనతో పాటుగా కళాశాల హెచ్ఆర్ సురే‹Ù, కేర్ టేకర్ చాముండేశ్వరి కూడా కనిపించలేదు. కళాశాల ప్రిన్సిపాల్‌కు బదులుగా డీన్ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా వీరంతా కనిపించకుండా పోవడంపై మృతురాలి సోదరి ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాల చైర్మన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణ లోపాలపై ప్రశి్నంచారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భావన ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
అమలాపురం బాణసంచా కేంద్రంలో పేలుడు.. 14 మందికి గాయాలు
సాక్షి, కోనసీమ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఆరుగురిని కిమ్స్ ఆసుపత్రికి, ఎనిమిది మందిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.కాగా రావుల చెరువోలని ఓ ఇంట్లో అక్రమంగా బాణా సంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఘటన జరిగే సమయంలో భవనంలో బాణాసంచా కేంద్రలో 150 కిలోల పేలుడు పటాస్ ఉన్నట్లు సమాచారం.. ప్రమాదం ధాటికి నలుగురు వ్యక్తులు గాల్లో ఎగిరిపడ్డారు. అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాయపడిన బాధితుల వివరాలుగోపాల్ నాగేశ్వరరావు (60)గోపాల్ నాగలక్ష్మి (58)గోపాల్ రాజు (25)చొల్లంగి మారుతి (18)కట్ట వెంకట్ (17)కట్ట వేణు (35)పేలుడు దాటికి గాయపడిన పక్కన ఉన్న ఇంట్లో వ్యక్తులు...బొక్కా లిల్లీ (12)పాటి దేవి (23)దూనబోయిన సుబ్బలక్ష్మి (48)దునబోయిన గాయత్రి (20)పితాని చంటి (28)పాటి ప్రకాష్ (26)పాటి సుజాత (40)పాటి ప్రభాకర్ ( 45) చదవండి: ముంచేసిన బుడమేరు.. చెరువుల్లా పొలాలు -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్‌ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్‌ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్‌ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఇద్దరు బాలికలపై వైద్యుని అసభ్య ప్రవర్తన
మధురవాడ(విశాఖ): ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవరించిన మధురవాడ మిథి లా పురి వుడా కాలనీలోని మానసిక ఆస్పత్రికి చెందిన ఓ వైద్యునిపై పీఎంపాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారలో ఉంటున్న ఓ సివిల్ కాంట్రాక్టర్‌కు ఇద్దరమ్మాయిలు. చిన్న కుమార్తె (15) ఇంటర్ ప్రథమ సంవత్సరం, పెద్ద కుమార్తె (16) రెండో సంవత్సరం చదువుతున్నారు. చిన్న కుమార్తె ప్రతి విషయానికి భయపడుతుండడంతో మానసిక వైద్యునికి చూపించాలని భావించారు.దీంతో మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఉంటున్న మానసిక వైద్యుడు సతీష్‌కుమార్‌ను సంప్రదించారు. ఈనెల 8వ తేదీన అసభ్యకర బొమ్మలతో క్లాస్ చెబుతున్న క్రమంలో బాలికల పట్ల సతీష్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఈనెల 12వ తేదీన పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కీచకపర్వం.. మంగళగిరిలో ఏం జరుగుతోంది?
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎక్కడా చూసినా అత్యాచారాలు, హత్యలు, దాడులే కనిపిస్తున్నాయి. మొన్నటి ముచ్చమర్రి ఘటనతో మొదలైన అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది.కాగా, ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ దారుణాలపై ట్విట్టర్లో..‘మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం. నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు. నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో శాంతి భద్రతను గాలికొదిలేసి.. కామాంధులకి లైసెన్స్ ఇచ్చేశావా నారా లోకేష్’ అని ప్రశ్నించింది. మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించిన కామాంధులు24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి కామాంధులు యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న…— YSR Congress Party (@YSRCParty) September 14, 2024ఇదిలా ఉండగా.. ఏపీలో రెడ్ బుక్ పాలనలో శాంతి భద్రతల అంశం గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందోననే భయంలో ప్రజలు ఉన్నారు. వరుసగా అఘాయిత్యాల ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ముచ్చుమరి ఘటన నుంచి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ దారుణాల వరకు బాధితులకు న్యాయం చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..
తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొగిలిఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నాం ఈ ప్రమాదం జరిగింది. అయితే, బస్సు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్ రోడ్లో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక, లారీ చిత్తూరు నుంచి ఐరన్ లోడ్‌తో బెంగళూరు వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మనోహర్‌తో పాటు బస్సులో ప్రయాణీకులు మృతి చెందారు. -
నిమజ్జనంలో పచ్చ మంద బరితెగింపు.. రంగులు చల్లుతూ దాడి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చే అనే భావనతో ఎగబడి దాడులకు పాల్పడుతున్నారు. కవ్వింపు చర్యలకు దిగుతూ పచ్చ బ్యాచ్.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలను దారుణానికి ఒడిగట్టారు. యర్రగొండపాలెం పంచాయితీ పందినివానిపల్లి గ్రామంలో గురువారం రాత్రి వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో పచ్చ గూండాలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగారు. ఉద్దేశ్యపూర్వకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రంగులు చల్లారు.అంతటితో ఆగకుండా.. బూతులు తిడుతూ నోటికి పనిచేప్పారు. ఇదేంటని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నించగా పోలీసుల ముందే దాడి చేశారు. ఇక, పోలీసులు దాడి చేస్తున్న వారిని ఆపకపోగా.. పచ్చ బ్యాచ్‌కు వత్తాసు పలికారు. టీడీపీ కార్యకర్తలకు కొమ్ముకాస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పోలీసులు తీరును ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై రంగులు చల్లి గొడవ పెట్టుకున్న టీడీపీ కార్యకర్తలుప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పంచాయితీ పందివానిపల్లి గ్రామంలో వినాయకుని విగ్రహం ఊరేగింపులో టీడీపీ నేతలు బరితెగింపు ఉద్దేశపూర్వకంగానే రంగులు చల్లి కవ్వింపులు.. ప్రశ్నించిన వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై… pic.twitter.com/fFyeiC9tGz— YSR Congress Party (@YSRCParty) September 13, 2024ఇది కూడా చదవండి: ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు! -
రెచ్చిపోయిన పచ్చ మూక.. మాటువేసి వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఇక, తాజాగా జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ కార్యకర్త హనుమంతు రెడ్డిపై దాడి చేశారు.అయితే, జమ్మలమడుగు మండల పరిధిలోని పెద్ద దండ్లూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త హనుమంతు రెడ్డిపై 2018లో కొందరు టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా హనుమంతు రెడ్డి ఈరోజు జమ్మలమడుగు వచ్చాడు.ఈ నేపథ్యంలో ఈ కేసులో రాజీపడాలని హనుమంతుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. హనుమంతు మాత్రం ఒప్పుకోకపోవడంతో ఆయన ఇంటికి వెళ్తుండగా మాటు వేసి మార్గమధ్యంలో టీడీపీ నేతలకు దాడులకు తెగబడ్డారు. పచ్చ మూక దాడిలో హనుమంతుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో నాటకీయ పరిణామాలు.. -
తిరుపతిలో ఘోర ప్రమాదం.. పలువురు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కారు, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు.కాగా, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం భాకరపేట ఘాట్ రోడ్డు కంటైనర్ లారీ అదుపు తప్పింది. ఈ క్రమంలో కారు, బైక్‌ను లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: అనకాపల్లిలో బరితెగించిన టీడీపీ నాయకులు -
వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల బలవన్మరణం
వారణాసి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా ఉంగటూరులోని నారాయణపురానికి చెందిన అన్న దమ్ములు వినోద్, లక్ష్మీనారాయణలు రియల్ ఎస్టేట్,ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపార నిర్వహణకు స్నేహితులు, స్థానికుల వద్ద అప్పులు చేశారు.అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .అనంతరం ఏపీ నుంచి వారణాసికి వెళ్లారు. అక్కడ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉంటున్నారు.ఇదీ చదవండి : ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమఈ తరుణంలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు ఇచ్చిన వారిని నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. సెల్ఫీ వీడియోపై సమాచారం అందుకున్న వారాణాసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదమ్ములిద్దరు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. అన్నదమ్ముల మృతిపై ఏపీలోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com