Top Stories
ప్రధాన వార్తలు

IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం
ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం ⇒ పాకిస్తాన్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు హతంశనివారం రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ జమ్మూ బారాముల్లా, శ్రనగర్ టార్గెట్‌గా పాక్ డ్రోన్ల దాడులుపంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్, రాజస్తాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌గుజరాత్‌లోని కచ్‌లో పూరిస్థాయిలో బ్లాకౌట్‌డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్‌లోని ఆర్మీ చినార్ కోర్స్‌లో హెడ్‌క్వార్టర్ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విదించాలని ఆదేశాలుపాక్ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్ జరిపిన ఈ చర్యకు భారత్ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్‌ఫైర్ ఇక లేనట్లే.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్ అవుట్3 గంట్లల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో కాల్పులుపాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్‌జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్

రెడ్‌బుక్ అండతో ‘ఖాకీ’ కావరం.. 'కారు లోంచి లాగి.. తోసేసి'..
చిలకలూరిపేట: పాలకులు రెడ్‌బుక్ మంత్రం జపిస్తుంటే కొంత మంది పోలీసు అధికారులు అందుకు వంత పాడుతూ సభ్యత సంస్కారాలు మరచి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, బీసీ నేత, వైఎస్సార్సీపీ నాయకురాలు అని కూడా చూడకుండా విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు రెచ్చిపోయి అనుచితంగా ప్రవర్తించారు. ఎక్కువగా మాట్లాడితే నీపైనా కేసు పెడతానంటూ బెదిరించారు. చెబుతుంటే అర్థం కావడం లేదా.. పక్కకు తప్పుకోండంటూ హూంకరించారు. ఓ దశలో రజినిని కారులోంచి పక్కకు లాగి తోసేసి.. ఆయన కారులోకి ఎక్కారు. నడిరోడ్డుపై సీఐ బరితెగింపు చూసి ప్రజలు విస్తుపోయారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, గ్రామ సర్పంచ్ బత్తుల సీతారామిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఆయనను పరామర్శించేందుకు శనివారం మధ్యాహ్నం విడదల రజిని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాగానే.. చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు, పోలీసు సిబ్బంది ఆమె కారును చుట్టుముట్టారు. తన కారు వద్ద ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఆమె రూరల్ సీఐని ప్రశ్నించారు. మీ అనుచరుడు మానుకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఉన్నాయని, అతన్ని అరెస్టు చేయడానికి వచ్చామని సీఐ బదులిచ్చారు. ఎఫ్ఐఆర్ లేదా అరెస్టు వారంట్‌ను చూపాలని రజనీ కోరగా.. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సీఐ దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె తన కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, సీఐ వెంటనే ఆమెను కారులో నుంచి దురుసుగా బయటకు లాగారు. కారులోకి ఎక్కి శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. ‘సీఐ గారూ.. ఏమిటీ దురుసు ప్రవర్తన.. ఎఫ్ఐఆర్ లేదా ఇతర ఆధారాలు చూపి అరెస్టు చేయండి’ అని విడదల రజినీ కోరగా.. సీఐ మరింత రెచ్చిపోయి పక్కకు తప్పుకోవాలని హూంకరించారు. ‘చెబుతుంటే అర్థం కావడం లేదా.. ఎక్కువ మాట్లాడితే నా విధులకు ఆటంకం కల్పించినందుకు నీపై కూడా కేసు పెడతా’ అని బెదిరించారు. ఆమెను పక్కకు నెట్టివేసి శ్రీకాంత్‌రెడ్డిని తీసుకెళ్లిపోయారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డిని ప్రకాశం జిల్లా వైపు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై రూరల్ సీఐ సుబ్బానాయడును వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా.. రాష్ట్రంలో మహిళ పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు శృతిమించుతున్నాయి. సభ్యతా సంస్కారాలు మరిచి పోలీసులు వారి పట్ల సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో రాత్రిపూట నైటీలో ఉన్న ఎస్సీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు వి.కల్పనను విచక్షణ మరచి అరెస్ట్ చేశారు. రెండు నిమిషాల్లో చీర కట్టుకుని వస్తానన్నా కూడా వినిపించుకోకుండా నైటీ మీదుగానే జీప్ ఎక్కించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరుకు అద్దం పడుతున్నాయి. ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం దారుణం అని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని రెచ్చిపోతే మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని కొందరు పోలీసులు మరచిపోయి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

విరమణ సరే, విధానం సంగతి!
భారత్ – పాకిస్తాన్ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే అభిప్రాయం ఇండియాకు ఏర్పడింది. పాక్, భారత్‌ల మధ్య రెండు కీలకమైన ఒప్పందాలున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్ డిక్లరేషన్. రెండు దేశాల నడుమ ఏ వివాదం తలెత్తినా ఈ రెండు ఒప్పందాల పరిధిలో, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ చాలా కాలంగా దృఢమైన వైఖరితో ఉండేది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు.ఇందుకు భిన్నంగా రెండు దేశాల వివాదంలో ఇప్పుడు మూడో పక్షం తలదూర్చిందా? కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయనీ, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా సాయంత్రం 5.30కి ప్రకటించారు. అమెరికా మధ్య వర్తిత్వం వహించి, రాత్రంతా చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైందని కూడా ఆయన వెల్లడించారు. కామన్ సెన్స్‌నూ, తెలివిడినీ ఉపయోగించినందుకు రెండు దేశాలనూ ఆయన అభినందించారు.ఆ తర్వాత అరగంటకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ఆయన ధ్రువీకరించారు. సాయంత్రం ఐదు గంటలకే అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఆయన ట్రంప్ ట్వీట్ ప్రస్తావన గానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి గానీ మాట్లాడలేదు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో), ఇండియా డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ చెప్పారు.మూడో పక్షం జోక్యం లేకుండానే ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయనే విధంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్వీట్ చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంగానే దీన్ని అభివర్ణించారు. రేపు సోమవారం నాడు రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతు న్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. రెండు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవడానికి ముందు నుంచే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నిర్వహించిన పాత్రేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతల సడలింపునకు కాల్పులు విరమణ పాటించాలని స్నేహపూర్వక సలహా మాత్రమే రెండు దేశాలకు ఇచ్చిందా? లేక చర్చల ప్రాతిపదికను తయారు చేసే మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందా? ఒకవేళ మధ్యవర్తిగానే చర్చల ప్రాతిపదికను కూడా సిద్ధం చేసి ఉంటే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చినట్టే భావించాయుద్ధం అమానుషమై నది. అనాగరికమైనది. యుద్ధం కారణంగా దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడం వివేకవంతమైన చర్యే! కాల్పుల విరమణ ఆహ్వానించదగ్గదే! అయితే ఈ విరమణ వల్ల దేశం సాధించేది ఏమిటి? పోగొట్టుకునేదేమిటనే విశ్లేషణ కూడా అవసరం. యుద్ధం భారత్ ప్రారంభించలేదు. ఉగ్రవాదాన్ని ప్రయోగించి పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. బదులుగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్ దాడులు చేసింది. నూరు శాతం కచ్చితత్వంతో చేసిన ఈ దాడులు పదును దేలిన భారత రణ వ్యూహానికీ, అద్భుతమైన సైనిక పాటవానికీ అద్దం పట్టాయి.భారత దాడులకు పాక్ నివ్వెరపోయింది. అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. జనావాసాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు దిగింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగినట్టు కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా అంగీకరించారు. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కంటే జమ్మూకశ్మీర్ ఈ దారుణాన్ని ఎక్కువగా భరించవలసి వచ్చింది. పసిపిల్లలతో సహా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న మహమ్మారి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కశ్మీర్ ప్రతిపక్ష నేత మెహబూబా ముఫ్తీ కన్నీళ్ళతో వేడుకున్నారు.యుద్ధాలను వేగిరపడి ప్రారంభించడం కాకుండా పూర్తి ప్రణాళికను రచించుకొని మొదలుపెట్టాలనీ, వీలైనంత వేగంగా ముగించాలనీ, శత్రువు ప్రతిఘటనా శక్తిని దెబ్బకొట్టి పోరాడకుండానే యుద్ధాలను గెలిచే మార్గాలను అన్వేషించాలనీ సన్‌షూ తన యుద్ధతంత్ర గ్రంథమైన ‘ఆర్ట్ ఆఫ్ వార్’లో చెబుతాడు. ఈ నాలుగు రోజుల భారత దాడుల్లో సన్‌షూ చెప్పిన ‘ఆర్ట్ ఆఫ్ వార్’ కనిపించింది. ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా, సరిహద్దులు దాటకుండా దాడి చేయడం, పలువురిని మట్టు పెట్టడంతోనే భారత్ సగం యుద్ధాన్ని గెలిచింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం, ఎనిమిది కీలకమైన ఎయిర్ బేస్‌లను దెబ్బతీయటం, బాలిస్టిక్ మిసైల్‌ను గాల్లోనే పేల్చేయడంతో పాకిస్తాన్ దాదాపుగా చేతు లెత్తేసింది.ఈ దశలోనే పాక్ నేతలు అమెరికా శరణు కోరి ఉంటారనీ, అవమానకరమైన ఓటమి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసి ఉంటారనీ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా జోక్యం చేసుకున్న విషయం యథార్థం. అది ఏ మేరకు అన్నది తేలవలసి ఉన్నది. సాధారణ ప్రజలపై మారణ హోమం చేయడం తప్ప పాకిస్తాన్ సాధించిందేమీ లేదు. భారత్ సాధించిన ఈ వేగవంతమైన విజయం రేపు జరిగే చర్చల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలి. భారత్ కోరుతున్న విధంగా ఉగ్ర హంతకులకు స్థావరం లేకుండా చేస్తామని అంగీకరించాలి. భారత్‌లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించాలి. భారత కశ్మీర్లో వేలు పెట్టబోమని అంగీ కరించే విధంగా పాక్‌పై ఒత్తిడి తేవాలి. సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో పునఃసమీక్షకు అంగీకరించరాదు. అప్పుడే ఇది విజేత షరతుల మేరకు జరిగే ద్వైపాక్షిక చర్చలుగా పరిగణించవలసి ఉంటుంది. లేకుంటే మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న చారిత్రక విధానానికి వీడ్కోలు పలికినట్లవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల తర్వాత సరిహద్దుల వెంబటి పాకిస్తాన్ ఆర్మీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగంపై కాల్పులు జరుపుతున్నాయి. ఇది పాకిస్తాన్ రాజకీయ నాయకత్వానికీ, ఆర్మీ నాయకత్వానికీ మధ్య సమన్వయ లోపమా? లేక రేపటి చర్చల్లో బేరమాడేందుకు తమ శక్తిని పెంచు కోవడానికి ఆ దేశం ఆడుతున్న నాటకమా? అదీ త్వరలోనే తేలుతుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...పనులలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృషభం...చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. పారిశ్రామికవర్గాలకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మిథునం...ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఏ మాత్రం అలసత్వం చూపక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత మేరకు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.సింహం....ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం, నమ్మకమే మీ ఆయుధాలుగా నిలుస్తాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు అనుకోని విధంగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.కన్య...కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగాలలో ప్రశాంతత చేకూరుతుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.తుల....పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. కొన్ని వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...అనుకున్న పనులు కొంత నిదానంగా సాగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు ఆశించిరీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం.ఆరోగ్యం మందగిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదోవిధంగా కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులు, మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలు సైతం మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.కుంభం...కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.మీనం...కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

పాక్ రెక్కలు కత్తిరించాం
యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.వైమానిక స్థావరాలుచకాలానూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్–78 విమానాలకు స్థావరం. పాక్ ఎయిర్ మొబిలిటీ కమాండ్‌కు ప్రధాన కేంద్రం కూడా. భారత్‌తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్‌పై జరిపిన డ్రోన్ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్. పాక్ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్లకు అడ్డా. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్ వైమానిక దళ (పీఏఎఫ్) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్‌బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్‌బేస్‌పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్‌లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.రఫీకీపంజాబ్ ప్రావిన్స్‌లో జాంగ్ జిల్లాలోని షోర్కోట్లో ఇస్లామాబాద్‌కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్కోట్ బేస్‌గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ సర్ఫరాజ్ అహ్మద్ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన జేఎఫ్–17, మిరాజ్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్‌బేస్ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్ పంజాబ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్‌వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్ రక్షణ నెట్‌వర్క్‌లో అతి కీలకమైన భాగమిది.మురీద్‌చక్వాల్ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్‌పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్ డ్రోన్ వార్ఫేర్కు చక్వాల్ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్ దాడులకు ప్రతి చర్యగా మురీద్ ఎయిర్ బేస్‌ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.రహీం యార్‌ఖాన్‌దక్షిణ పంజాబ్‌లో రహీం యార్ఖాన్ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్, జైసల్మేర్ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్‌తో పాటు ఇక్కడి రన్‌వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.సుక్కుర్‌భొలారీ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. సింధ్ ప్రావిన్స్‌లో కరాచీ, హైదరాబాద్ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేశారు. సదరన్ ఎయిర్ కమాండ్ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్ కన్వర్షన్ యూనిట్ తాలూకు 19 స్క్వాడ్రన్‌కు కేంద్రం. ఎఫ్–15ఏ, ఎఫ్–16, కొన్ని జేఎఫ్–17లతో పాటు ఏడీఎఫ్ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్ఏఏబీ 2000 ఎయిర్‌బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్) ఉంది.రాడార్ కేంద్రాలుసియాల్‌కోట్‌పంజాబ్‌లోని సియాల్కోట్ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్ కేంద్రం వైమానికంగా పాక్‌కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.పస్రూర్‌ఇది కూడా పంజాబ్‌లోనే సియాల్కోట్ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.చునియన్‌పంజాబ్ ప్రావిన్స్‌లో లాహోర్‌కు 70 కి.మీ. దూరంలో చునియన్ వద్ద ఉంటుంది. పాక్‌లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్

ఫేక్ న్యూస్‌తో జాగ్రత్త సుమా!
దేశం యుద్ధ పరిస్థితుల్లో కూరుకుపోయిన సమయంలో శత్రువులు మన ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికీ, తమదే పైచేయి అని చెప్పడానికీ అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. అదే సమయంలో కొందరు భారతీయులూ సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇష్టమొచ్చినట్లు రాశారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ హక్కును అనుసరించి ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను, నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని దుర్వినియోగపరచడం క్షంతవ్యం కాదు. పహెల్గామ్లో పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. పాక్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో అందుబాటులో లేకుండా నిలిపి వేసింది. పలువురు పాక్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించింది. తప్పుడు, రెచ్చ గొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లపై కూడా నిషేధం విధించింది. ఇందులో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉంది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్,ద పాకిస్తాన్ రిఫరెన్స్ తదితర యూ ట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను కూడా నిలిపివేసింది. అలాగే పాక్ సినిమాల ప్రదర్శనపైనా నిషే«దం అమలులోకి వచ్చింది. అలాగే భారత్‌లోని అనేక వెబ్సైట్లనూ, యూట్యూబ్ చానళ్లనూ ప్రభుత్వం బ్లాక్ చేసింది. అందులో ‘ద వైర్’ న్యూస్ పోర్టల్ ఒకటి. ఇటువంటి వెబ్‌సైట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం న్యాయం కాదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ డి.రాజా ఖండించారు. ‘ద వైర్’ వంటి వెబ్‌సైట్‌ను నిషేధించవలసిన అవసరం లేదు. ఆ పేరుమీద పత్రికా స్వేచ్ఛను నిలిపివేయడం న్యాయం కాదు. జాతీయ సమగ్రత కోసం పహెల్గామ్లో ఉగ్రవాదుల చర్యను ఖండించడం మంచిదే కాని, వైర్‌ను నిషేధించడం న్యాయం కాదని ‘ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్’ న్యాయవాదీ, ఫౌండర్ డైరెక్టర్ అయిన అపర్ గుప్తా అన్నారు. ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడం పరోక్ష యుద్ధంలో భాగం. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై సూసైడ్ దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏడు వీడియోలు పరిశీలించి అన్నీ అబద్ధాలే అని తేల్చింది. పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు వచ్చిన వార్త కూడా కల్పితమే అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓ పాత వీడియోపై కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆ క్షిపణి దాడి 2020లో లెబనాన్‌లోని బీరూట్‌లో జరిగిన పేలుడు ఘటన అని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్... ఆర్మీ కంటోన్మెంట్‌పై ఫిదాయీ సూసైడ్ దాడి జరగ లేదని చాలా స్పష్టంగా వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ పోస్టును పాకిస్తానీ దళాలు ధ్వంసం చేసినట్లు ప్రచారం అయిన మరో వీడియో కూడా ఫేక్ అని ప్రభుత్వం తేల్చింది. భారతీయ సైన్యంలో 20 రాజ్ బెటాలి యన్ అనే యూనిట్ లేనే లేదని ఫ్యాక్ట్ చెక్ పేర్కొన్నది. పాకిస్తాన్‌లోని ప్రధాన మీడియాతో పాటు కొందరు సోషల్ మీడియాలో భారత ప్రజల్లో భయాందోళనలు కలిగించే లక్ష్యంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేశారు. ఏది వాస్తవమో, ఏదికాదో తేల్చుకోవలసింది మనమే!మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్

వ్యూహాత్మకమా.. వెనకడుగా!
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కీలక స్థావరాల్లోకి దూసుకెళ్లి, గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఇప్పటివరకు పదుల సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టిన కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు ప్రస్తుతం వెనక్కి తగ్గాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో వేలాది మంది సాయుధ పోలీస్ బలగాలతో భారీ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ వేసింది. సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం (మే 11న)లోపు సరిహద్దు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కేంద్ర బలగాల వ్యూహాత్మక ఎత్తుగడా? లేక మావోయిస్టులు ఇప్పటికే చర్చలకు సిద్ధమని ప్రకటించడం, శాంతి చర్చల కోసం పౌరహక్కుల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేయడం, ఇందుకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం ‘కగార్’పై పునరాలోచనలో పడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అడవుల్లో అణువణువూ గాలిస్తూ.. దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ, స్థానిక పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో తెలంగాణ వైపు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ వైపు సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని కర్రిగుట్ట అడవులు మావోయిస్టులకు కీలక స్థావరంగా ఉన్నాయని గుర్తించాయి. సీఆర్పీఎఫ్, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ కలిపి సుమారు 24 వేలమంది భద్రతా బలగాలు ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో వారంలో ఆ ప్రాంతంలో ఆపరేషన్ మొదలుపెట్టాయి. డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్లు, స్మోక్ బాంబులు, ఫ్లాష్ బాంబులను వినియోగిస్తూ లోనికి దూసుకెళ్లాయి. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మైన్లు, బీర్ బాటిల్ బాంబులు వంటి పేలుడు పదార్థాలను బాంబు స్క్వాడ్లు నిర్వీర్యం చేశాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్ఓబీ) ఏర్పాటుతో పాటు ఐదు బేస్ క్యాంపులను స్థాపించారు. మావోయిస్టుల సొరంగాలు, గుహలు ఉన్నట్టుగా గుర్తించాయి. ఏప్రిల్ 24 నుంచి మే 7 మధ్య సుమారు 30 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. కీలక నేతలు లక్ష్యంగా.. కర్రిగుట్టలు మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆ«దీనంలోని మావోయిస్టు స్థావరాలకు కేంద్రంగా ఉన్నాయని భద్రతా బలగాలు గుర్తించాయి. హిడ్మాతో పాటు ఇతర మావోయిస్టు నాయకులైన గణపతి, బసవరాజు, ఆనంద్ వంటి వారిని కూడా ఈ ఆపరేషన్‌లో భాగంగా టార్గెట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. భద్రతాబలగాలు అధికారికంగా ఈ విషయాలు చెప్పనప్పటికీ ఆదే దిశగా ముమ్మరంగా ఆపరేషన్ చేపట్టాయి. కానీ కర్రిగుట్టలపై మావోయిస్టులకు పూర్తి పట్టుండడంతో వారు కొన్ని సమయంల్లో బలగాల కంటే వేగంగా కదలగలిగారు. ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే శాంతి చర్చలు తెరపైకి వచ్చాయి. మరోవైపు మావోయిస్టులను ఏరివేయాలన్న లక్ష్యంతో ముమ్మర ఆపరేషన్లు చేపట్టినా ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం బలగాలను వెనక్కి రప్పించడానికి మరో కారణంగా చెబుతున్నారు. మావోయిస్టుల వ్యూహం ఫలించిందా? కేంద్ర సాయుధ బలగాలకు చిక్కకుండా మావోయిస్టు అగ్రనాయత్వం తప్పించుకుంటూ సేఫ్ షెల్టర్ జోన్లకు వెళ్లడంతో పాటు శాంతి చర్చల పేరిట మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కర్రిగుట్టల చుట్టూ ఐఈడీ బాంబులు అమర్చినట్టు ముందుగానే పెద్దయెత్తున ప్రకటనలు జారీ చేసిన మావోయిస్టు పార్టీ.. సాయుధ బలగాల ఆపరేషన్ మొదలైన కొద్ది రోజుల్లోనే శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖ విడుదల చేసింది. ఇది రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు, మావోయిస్టు అగ్ర నాయత్వం తప్పించుకునిషెల్టర్ జోన్లకు వెళ్లేందుకు, ప్రజల మద్దతు పొందేందుకు ఎంచుకున్న ఒక వ్యూహంగా చెబుతున్నారు. శాంతిచర్చలకు వీలుగా తాము ఆరు నెలలపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో విడుదల అయ్యింది. మరోవైపు సీపీఎం, బీఆర్ఎస్, తెలంగాణ జన సమితి వంటి పార్టీలు, పౌర హక్కుల సంఘాలు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మావోయిస్టులతో చర్చలే ఉత్తమమన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనితో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఒత్తిడి సైతం కేంద్రం సాయుధ బలగాలను వెనక్కి రప్పించేలా చేసిందనే చర్చ జరుగుతోంది.

మిగులుపై గుబులు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు గుబులు రేపుతోంది. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ మేరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే, గత ప్రభుత్వంలో చేసిన జీవో 117ను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా విడుదల చేసిన పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ నిబంధనలతో రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయులు మిగులు (సర్ప్లస్) ఏర్పడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల మేరకు ప్రస్తుతం ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాలలోనే ఎనిమిదేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిలకడలేని కొత్త నిబంధనలతో మిగులు సమస్య ఏర్పడింది. 2023లో ఉపాధ్యాయ బదిలీల్లో ఈ సమస్య లేదని, జీవో నంబర్ 47 ప్రకారం మిగులు ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపులో సమన్యాయం పాటించి న్యాయం చేశారని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. జీవో నంబర్ 117 అమల్లో భాగంగా మిగులు ఉపాధ్యాయులకు పాత పాఠశాలలో పనిచేసిన కాలాన్ని, కొత్త పాఠశాలలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని (పాత, కొత్త స్టేషన్) రేషనలైజేషన్ పాయింట్లు కేటాయించారు. కానీ, ఇటీవల విద్యా శాఖ విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో అనేక లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పాత పాఠశాలలో పనిచేసిన కాలానికి ఇచ్చే పాయింట్లు కోరుకుంటే వారికి ప్రస్తుత రేషనలైజేషన్ పాయింట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన బదిలీలలో మిగులు ఉపాధ్యాయులకు పాత, కొత్త స్టేషన్ల (పాఠశాల)లో పని చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్ల వరకు సర్వీసు పాయింట్లు కేటాయించారు. దీనికి అదనంగా రేషనలైజేషన్ పాయింట్లు కూడా ఇచ్చి న్యాయం చేశారు. అంతేగాక సర్ప్లస్ ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్లు (స్పౌజ్ వంటివి) ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మిగులు ఉపాధ్యాయులకు నష్టం జరగలేదు.ఇప్పుడంతా గందరగోళంజీవో 117 రద్దులో భాగంగా చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. పాఠశాలల మెర్జింగ్, సబ్జెక్టు టీచర్ల తొలగింపుతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పెంచడంతో దాదాపు 10 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు (సర్ ప్లస్) ఏర్పడుతున్నారు. విద్యాశాఖ కొత్త నిబంధనలతో సర్ ప్లస్ అయిన ఈ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలల కంటే మెరుగైన స్థానాలకు బదిలీ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రక్రియ నడుస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పాఠశాలలో పని చేసిన కాలానికి ఇచ్చే స్టేషన్ పాయింట్లను కోరుకునే వారికి రేషనలైజేషన్ పాయింట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. కొత్త పాఠశాలలో పని చేసిన కాలానికి స్టేషన్ పాయింట్లు కోరుకున్న వారికి మాత్రమే రేషనలైజేషన్ పాయింట్లు ఇస్తామనడంతో మిగులు టీచర్లకు అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం కొత్త పాఠశాలల్లో రెండు నుంచి నాలుగేళ్ల సర్వీసు గలవారే మిగులుగా మారుతున్నారు. వీరు పాత పాఠశాలలో ఎనిమిది నుంచి పదేళ్ల కాలం పని చేశారు. ప్రస్తుత బదిలీల్లో వీరే నష్టపోతున్నట్టు తెలుస్తోంది. 2023లో ఇచ్చినట్టుగా పాత, కొత్త పాఠశాలల సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్లకు స్టేషన్ పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వమే బలవంతంగా బదిలీ చేస్తున్నందున న్యాయం చేయాలని మిగులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉపాధ్యాయ చర్చల్లో కొందరికే ప్రాధాన్యంబదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విద్యా శాఖ గత ఎనిమిది నెలలుగా ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందులో కేవలం 9 గుర్తింపు సంఘాలకే ప్రాతినిధ్యం కల్పించారు. కీలకమైన 34 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను దూరం పెట్టారు. దీంతో రిజిస్టర్డ్ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉపాధ్యాయ సమస్యలపై నిర్వహించే సమావేశాల్లో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలేగానీ, కొందరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటని ఆ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం సమావేశాల్లో ఐదు నెలల క్రితం ఒకసారి అవకాశం కల్పించారు. తాజాగా శనివారం నిర్వహించిన సమావేశానికి మాత్రమే గుర్తింపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. అయితే, అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాక నిర్వహించిన ఈ సమావేశంపై విమర్శలు వెల్లువెత్తాయి.

అందం.. ఆత్మవిశ్వాసం
సాక్షి, హైదరాబాద్: శనివారం సాయంత్రం.. భాగ్యనగరం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం.. అందం.. ఆత్మవిశ్వాసం.. అభినయం.. కలిసి కవాతు చేశాయి..ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలను సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి 109 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పోటీదారులైన అందగత్తెలు లయబద్ధమైన పాశ్చాత్య సంగీత హోరుకు తగ్గట్టుగా అభినయిస్తూ తమను తాము పరిచయం చేసుకోగా, ఆయా సుందరీమణుల బృందాన్ని తెలంగాణ సంప్రదాయ కళాకారుల బృందం నర్తిస్తూ వేదిక మీదకు స్వాగతించింది. ఒకవైపు పాశ్చాత్య సంగీతం.. మరోవైపు తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం.. వెరసి ఓ జుగల్బందీగా ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశాయి. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం ప్రేక్షకులను ఆసాంతం అలరించింది. జయ జయహే తెలంగాణ ఆలాపనతో.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పరిమిత సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మధ్య ప్రపంచ సుందరి పోటీల పరిచయ కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం ఆరున్నరకు తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. గాయకుడు సంగీత శిక్షకుడు రామాచారి శిష్యులు 50 మంది ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించి ఆకట్టుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన సంగీత శిక్షణ కేంద్రాల కళాకారిణులు 250 మంది పేరిణి నృత్య రూపాన్ని ప్రదర్శించారు. ‘హంస నడకలతో అందమే సాగెనే... అరవిరిసిన..’ అంటూ ప్రపంచ సుందరి పోటీలకు సరిపోయే గీతాన్ని ఎంచుకున్న తీరు ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగా కళాకారిణులు నర్తించి పరవశింపజేశారు. అంత పెద్ద సంఖ్యలో కళాకారిణులు స్టేడియం మొత్తం కలిగి తిరుగుతూ నర్తించటం, మధ్యలో సీతాకోకచిలుక, నక్షత్రం, మిస్ వరల్డ్ లోగో ఆకృతిని ఆవిష్కరించడం అబ్బురపరిచింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఈ నృత్య కార్యక్రమానికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహించగా, ఫణి నారాయణ స్వరాలు సమకూర్చారు. ఖండాల వారీగా నాలుగు బృందాలుగా.. ప్రారంభ వేడుకల్లో 109 దేశాల సుందరీమణులు పాల్గొన్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వీరిని ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించారు. తొలుత తెలంగాణకు చెందిన ఒక్కో సంప్రదాయ కళా బృందం ప్రదర్శన ఇవ్వగా, ఆ వెంటనే ఒక్కో బృందం చొప్పున సుందరీమణులు స్టేడియంలోకి వచ్చి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ ఆధ్వర్యంలో కొమ్ము కోయ బృందం కోయ డప్పు నృత్యం ప్రదర్శించారు. ఆ వెంటనే అమెరికా–కరేబియన్ దేశాలకు చెందిన తొలి సుందరీమణుల బృందం వచ్చింది. నిర్వాహకులు దేశాల వారీగా పిలవగానే ఆయా దేశాల ప్రతినిధులు ఒక్కొక్కరు పాశ్చాత్య బీట్‌కు తగ్గట్టుగా నర్తిస్తూ అభివాదం చేసుకుంటూ పరిచయం చేసుకున్నారు. తొలుత అర్జెంటీనా సుందరీమణి రాగా, చివరగా వెనిజువెలా అందెగత్తె వచ్చింది. అనంతరం గోండు గుస్సాడీ కళాకారులు శ్రీధర్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే ఆప్రికా ఖండానికి చెందిన దేశాల సుందరీమణులు వచ్చి పరిచయం చేసుకున్నారు. అంగోలా సుందరీమణి ముందు రాగా, చివరగా జింబాబ్వే దేశానికి చెందిన పోటీదారు వచ్చింది. అనంతరం 14 మంది లంబాడీ డప్పు కళాకారులు స్వప్న, అందె భాస్కర్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే యూరప్ ఖండానికి చెందిన దేశాల పోటీదారులు వచ్చి పరిచయం చేసుకున్నారు. చివరగా ఒగ్గు డోలు బృందం కళాకారులు 18 మంది ఒగ్గు రవికుమార్ ఆధ్వర్యంలో కళారూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా హ్యూమన్ పిరమిడ్ ఏర్పాటు చేసి పైకి ఎక్కిన కళాకారుడు జాతీయ జెండాను రెపరెపలాడేలా చేసిన తీరు ఆకట్టుకుంది. అనంతరం ఆసియా–ఓíÙయానా దేశాల ప్రతినిధులు స్టేడియంలోకి వచ్చి పరిచయం చేసుకున్నారు. మిస్ ఇండియా నందినీ గుప్తా రాగానే మార్మోగిన స్టేడియం.. చివరి బృందంలో భాగంగా మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వచ్చినప్పుడు స్డేడియం చప్పట్లు, ఈలలు, కేరింతలతో మార్మోగింది. గోకులంలో గోపిక వస్త్రధారణతో నందినీ గుప్తా స్టేడియంలోకి వచ్చారు. వేషధారణకు తగ్గట్టు తన పరిచయంలో భాగంగా ఆమె కవ్వంతో వెన్న చిలికే అభినయంతో రావటం విశేషం. నేపాల్‌కు చెందిన సుందరీమణి గులాబీ డిజైన్, అదే రంగు రవికతో తెలుపు రంగు చీరకట్టుతో రావటం ఆకట్టుకుంది. బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులు కూడా హాజరుకాగా.. థాయిలాండ్ సుందరీమణి చీరకట్టును పోలిన వస్త్రధారణతో వచ్చింది. శ్రీలంక యువతి నమస్కార ముద్రతో పరిచయం చేసుకుంది. చివరలో వచ్చిన వియత్నాం సుందరి వేగంగా నర్తిస్తూ ఆకట్టుకుంది. ఆ్రస్టేలియా యువతి కౌబాయ్ గెటప్‌లో వచ్చింది. పోటీలు ప్రారంభమైనట్టు ప్రకటించిన సీఎం పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవాలు పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. అనంతరం ఆ ఇద్దరితో కలిసి ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహూతులు, పోటీదారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత పోటీదారులు అందరూ స్టేడియంలోకి వారివారి జాతీయ జెండాలు చేతపట్టుకుని ఊపుతూ వచ్చారు. చివరగా భారత పతాకాన్ని చేతబూని మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వచ్చారు. అప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అంతా ప్రపంచ శాంతిని కాంక్షించే మిస్ వరల్డ్ గీతాన్ని బృంద గానంగా ఆలపించారు. – భారత దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అసమాన ప్రదర్శన చాటిన సైనికులకు వందనం సమరి్పస్తున్నట్టు వ్యాఖ్యాత ప్రకటించినప్పుడు ‘జైహింద్’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. చివరకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ప్రారంభ వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నగర మేయర్ విజయలక్ష్మిమ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప నగరంలో ఉన్నందుకు పులకిస్తున్నాం: మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా ‘నమస్తే హైదరాబాద్.. నమస్తే తెలంగాణ. ఈ అద్భుతమైన నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో మీ అందరితో కలిసి పాల్గొనటం నాకు గర్వంగా ఉంది. ఈ అద్భుత దేశం, గొప్ప సాంస్కృతిక కేంద్రంలో మేము ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే అద్భుత కార్యక్రమంలో ఐక్యతను చాటుతూ పాల్గొంటున్నాం. తెలంగాణ సంప్రదాయాలు, గొప్ప చరిత్ర, అద్భుత ఆతిథ్యం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మిస్ వరల్డ్ అనేది కేవలం అందం గురించి మాత్రమే కాదు. ఇది ప్రపంచంలో ఓ మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో సాగుతుంది. విద్య, సాధికారత, సమాజ సేవ ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచడం ఇందులో భాగం. 109 దేశాల నుంచి వచ్చిన మహిళలు గొప్ప లక్ష్యంతో ఒక్కటిగా ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇప్పుడు హైదరాబాద్ సరైన వేదికగా నిలి చింది. ఈ నగరంలో సంప్రదాయం–ఆధునికత ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఇక్కడి ఆతిథ్యానికి, ,హృదయపూర్వక స్వాగతానికి ధన్యవాదాలు..’ అని మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా అన్నారు.

పాక్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ ప్రజలు, జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం శనివారం దాడులకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ చెప్పారు. భారత్‌లో పలు సైనిక స్థావరాలను, ఎస్–400 క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. పాక్ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. మిస్రీ శనివారం సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను ఏమార్చడం పాక్ ప్రభుత్వానికి అలవాటేనని మండిపడ్డారు. ఇండియా వైమానిక, సైనిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఉద్ఘాటించారు. దేశంలో కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్, సైబర్ వ్యవస్థలపై దాడి చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారాన్ని విక్రం మిస్రీ తిప్పికొట్టారు. వాటిపై దాడిచేసే సత్తా పాక్ సైన్యానికి లేదని పేర్కొన్నారు. దుష్ప్రచారంతో మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు సాగిస్తోందని దాయాది దేశంపై ధ్వజమెత్తారు. అమృత్సర్ సాహిబ్ వైపు భారత సైన్యం క్షిపణులు ప్రయోగించిందని పాక్ ప్రకటించడం పట్ల మిస్రీ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారతదేశాన్ని విభజించే కుట్రలు సాగవని తేల్చిచెప్పారు. భారత సైన్యం అఫ్గానిస్తాన్‌పై ఎలాంటి దాడి చేయలేదని అన్నారు. భారత ప్రభుత్వాన్ని సొంత ప్రజలే విమర్శిస్తున్నారంటూ పాక్ మరో తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే దూషిస్తున్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ దాడుల్లో ఆరుగురు మరణించారని చెప్పారు. పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. వాటిని సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొంటోదని వివరించారు. 26 ప్రాంతాలపై దాడులకు పాక్ యత్నం పాక్ సైన్యం శుక్రవారం రాత్రి ఎయిర్‌బేస్‌లు, రవాణా కేంద్రాలు సహా 26 కీలక ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పంజాబ్‌లోని ఎయిర్ బేస్‌పై హైస్పీడ్ మిస్సైల్ ప్రయోగించిందని అన్నారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్ సమీపంలో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో దాడులు జరిగాయని తెలిపారు. పాక్ సైన్యం డ్రోన్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు వెల్లడించారు. భారత సైన్యం మాత్రం ముందుగా గుర్తించిన టార్గెట్లపైనే దాడికి దిగినట్లు స్పష్టంచేశారు. ప్రధానంగా పాక్ సైన్యానికి సంబంధించిన టెక్నికల్ సదుపాయాలు, కమాండ్, కంట్రోల్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు, ఆయుధాగారాలపై దాడి చేసినట్లు వెల్లడించారు. భారత సైనిక దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. పాక్ దాడులను గట్టిగా తిప్పికొట్టినట్లు స్పష్టంచేశారు. భారత్‌కు భారీ నష్టం కలిగించామంటూ పాక్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, వాస్తవాలు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం సిర్సా, సూరత్‌గఢ్, అజంగఢ్ ఎయిర్ బేస్‌ల ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. ఈ ఫొటోలపై తేదీ, సమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.8 పాక్ సైనిక స్థావరాలు ధ్వంసంనాలుగు భారత వైమానిక స్థావరాలపై దాడికి పాక్ విఫలయత్నం చేసినట్టు ఖురేషీ తెలిపారు. ‘‘ఉదంపూర్, పఠాన్‌కోట్, అదంపూర్, భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లపై దాడులకు పాక్ ప్రయత్నించింది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు స్వల్పనష్టం వాటిల్లింది. ఆ దాడులను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. బదులుగా ఆరు పాక్ వైమానిక స్థావరాలు, రెండు రాడార్ కేంద్రాలపై దాడులు చేసింది. వాటిని చాలావరకు ధ్వంసం చేసి భారీ నష్టం మిగిల్చింది. కేవలం పాక్ ఎయిర్‌బేస్‌లపైనే దాడి చేశాం. సామాన్య జనావాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అని వివరించారు. హరియాణాలోని సిర్సాలో పాక్ క్షిపణి ఫతే–2ను భారత సైన్యం విజయవంతంగా నేలమట్టం చేసిందన్నారు.
ట్రిపుల్ ఐటీలకు జూన్ 30 వరకు వేసవి సెలవులు
మన వెలుగులు భద్రం
ఐటీలో మళ్లీ నియామకాల జోరు
రూటు మార్చిన కేటుగాళ్లు
పేదల ‘ఉపాధి’పై దెబ్బ
ఉగ్గుపాలతో దేశభక్తి.. మాధవరం వీరుల స్ఫూర్తి!
పెళ్లి ఇంట మృత్యు గంట!
నేటి నుంచి పాడేరులో మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు
వావ్.. మైగ్రేట్ ‘వే’
కళ తప్పిన గాందీగంజ్ !
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
ఆపరేషన్ సిందూర్
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా?
ట్రిపుల్ ఐటీలకు జూన్ 30 వరకు వేసవి సెలవులు
మన వెలుగులు భద్రం
ఐటీలో మళ్లీ నియామకాల జోరు
రూటు మార్చిన కేటుగాళ్లు
పేదల ‘ఉపాధి’పై దెబ్బ
ఉగ్గుపాలతో దేశభక్తి.. మాధవరం వీరుల స్ఫూర్తి!
పెళ్లి ఇంట మృత్యు గంట!
నేటి నుంచి పాడేరులో మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు
వావ్.. మైగ్రేట్ ‘వే’
కళ తప్పిన గాందీగంజ్ !
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
ఆపరేషన్ సిందూర్
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా?
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
సినిమా

క్రైమ్ థ్రిల్లర్ షురూ
బ్రహ్మాజీ, యశ్వంత్ పెండ్యాల ప్రధానపాత్రల్లో ‘కథకళి’ అనే సినిమా షురూ అయింది. ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా, నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్‌కి డైరెక్టర్ ప్రసన్నకుమార్ నాని దర్శకత్వం వహించగా, బ్రహ్మాజీ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు.అనంతరం ప్రసన్న కుమార్ నాని మాట్లాడుతూ– ‘‘ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కథకళి’ ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో కథే హీరో’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘బ్రహ్మాజీగారు ఈ చిత్రంలో ముఖ్యమైనపాత్ర చేస్తున్నారు. మంచి టీమ్‌తో కలిసి ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు రవికిరణ్ కలిదిండి. ‘‘ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ ఉండరు. కథను నడిపించేపాత్రలు ఉంటాయి’’ అని యశ్వంత్ పెండ్యాల చెప్పారు. మధు దామరాజు, మైమ్ మధు కీలకపాత్రలుపోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమేరా: జితిన్ మోహన్.

వీర చంద్రహాస రెడీ
‘‘వీర చంద్రహాస’ టైటిల్‌తోపాటు ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది. రవి బస్రూర్ ఇప్పటివరకు తనదైన సంగీతంతో అలరించగా, ఈ సినిమాతో డైరెక్టర్‌గానూ నిరూపించుకున్నారు. ఎమ్వీ రాధాకృష్ణగారు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అని హీరో విశ్వక్ సేన్ చెప్పారు. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వీర చంద్రహాస’. శివ రాజ్‌కుమార్ కీలకపాత్రపోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్ ప్రధానపాత్రలుపోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై, హిట్‌గా నిలిచింది.ఈ సినిమాని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్‌పై ఎమ్వీ రాధాకృష్ణ త్వరలో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఎమ్వీ రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘వీర చంద్రహాస’ చిత్రం కన్నడలో హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని రవి బస్రూర్ తెలిపారు.

ఇప్పుడు అంతా బోనస్: ‘వెన్నెల’ కిశోర్
‘‘నా కెరీర్లో కామెడీపాత్రలు చాలా చేశాను. వీటిలో నా ఫేవరెట్ రోల్స్ చాలానే ఉన్నాయి. కానీ ‘వెన్నెల, బిందాస్, దూకుడు’ సినిమాల్లో చేసినపాత్రలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏవీ లేవు. ‘దూకుడు’ సినిమాలో నేను చేసిన రోల్ (ఎమ్ఎస్. రామానుజమ్ శాస్త్రి)తోనే నా డ్రీమ్ నెరవేరిపోయింది. ఇప్పుడు అంతా బోనస్’’ అన్నారు ‘వెన్నెల’ కిశోర్. శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగిల్’లో ‘వెన్నెల’ కిశోర్ ఓ కీలకపాత్ర చేశారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న (శుక్రవారం) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో ‘వెన్నెల’ కిశోర్ మాట్లాడుతూ – ‘‘సింగిల్’లో నేను చేసిన అరవింద్పాత్రకు మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సినిమాలను నేనెక్కువగా థియేటర్స్‌లో చూసుకోను. కానీ ఈ సినిమాను థియేటర్స్‌లో చూశాను. నాపాత్రను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న తీరు నాకు సంతోషాన్నిచ్చింది. నేను ఏపాత్ర చేసినా ఆపాత్ర వల్ల సినిమా కథ ముందుకెళితే చాలు.ప్రస్తుతం రచయితలకు సరైన గౌరవం,పారితోషికం లభించడం లేదు. అందుకే వాళ్లు డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఇక హీరోగా ఒకట్రెండు సినిమాలు చేశాను. కానీ ఎక్కువగా లవ్‌స్టోరీ సినిమాలు వస్తున్నాయి. రొమాన్స్, సాంగ్స్ నాకు నప్పవు. అలాగే నాపాత్ర చనిపోయే కథలు కూడా వచ్చాయి. కానీ అలాంటిపాత్ర చేయడం నాకు ఇష్టం లేదు. ఇక మంచి కామెడీ కథ కుదిరితే హీరోగా చేస్తా. ‘జఫ్ఫా’ సినిమాతో దర్శకుడిగా ఫెయిల్ అయ్యాను. భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తాను. థ్రిల్లర్ మూవీస్ చేయాలని ఉంది’’ అన్నారు.

ఈ స్థాయి విజయాన్ని ఊహించలేదు: నాని
‘‘హిట్ 3’ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాను. కానీ... ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’.యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో నాని మాట్లాడుతూ– ‘‘శైలేష్‌తో నేను చేయబోయే తర్వాతి సినిమా మంచి వినోదాత్మక చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ ఆలోచన చెప్పాడు... చాలా బాగుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌ని ఆదరిస్తారని ‘హిట్ 3’తో ప్రేక్షకులు మరోసారి నిరూపించినందుకు వారందరికీ «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు.‘‘హిట్ 3’లో నేను చేసిన అతిథిపాత్రకి ప్రశంసలు రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అడివి శేష్. ‘‘నాని ఎప్పటి కప్పుడు తనని కొత్తగా మలుచుకుంటున్నందుకు గర్వంగా ఉంది’’ అని నిర్మాత దీప్తి చెప్పారు. ‘‘ఈ చిత్రంలో మృదులపాత్రకి నన్ను ఎంచుకున్నందుకు శైలేష్‌కి ధన్యవాదాలు’’ అని శ్రీనిధీ శెట్టి చెప్పారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం
క్రీడలు

భారత్ ‘పాంచ్ పటాకా’
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత కాంపౌండ్ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్‌గా మూడు పతకాలు గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ దేవ్‌తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్‌లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్‌పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో మధుర–అభిõÙక్ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్ నూర్‌ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్‌కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. స్వింగ్ కింగ్‌కు పిలుపు? భారత జట్టు ఇదే?
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్‌తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్‌కు పయనం కానుంది.ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది. దీంతో బలమైన టీమ్‌ను ఇంగ్లండ్‌కు పంపించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగంపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైట్ బాల్ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌కు పిలుపునివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. గత కొనేళ్ల నుంచి భారత టెస్టు జట్టులో ఎడమచేతి వాటం పేసర్ లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఆ లోటు అర్ష్‌దీప్‌తో భర్తీ చేయాలని అగర్కాకర్ అండ్ కో యోచిస్తున్నట్లు వినికిడి. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యూలర్‌గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్‌కు రాలేదు. తన కెరీర్లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా 26 ఏళ్ల అర్ష్‌దీప్‌కు ఉంది. 2023లో కౌంటీ సీజన్లో కెంట్ తరపున సింగ్ ఆడాడు. ఒకవేళ అర్ష్‌దీప్ ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైతే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లతో బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ప్రసిద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ పేర్లను కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రోహిత్ శర్మ స్దానాన్ని తమిళనాడు బ్యాటర్ సాయిసుదర్శన్‌తో భర్తీ చేయనున్నట్లు సమాచారం.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ తిరిగి ప్రారంభం?
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి వచ్చే వారం ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో త్వరలోనే ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పోర్ట్స్ టాక్ తమ కథనంలో పేర్కొంది. పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్ధావరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సాయుధ దళాలు మట్టుబెట్టాయి. అనంతరం పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి కాల్పులు జరపడం, అందుకు భారత్ ధీటుగా బదులివ్వడం వంటి చర్యలు జరిగాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే శనివారం ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌కు ఒప్పుకొన్నాయి. ఈ విషయాన్ని భారత్-పాకిస్తాన్ అధికారికంగా ధ్రువీకరించాయి. మే 10 సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. మే 12న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ మళ్లీ తొలి బంతి నుంచి ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. రెండు మూడు రోజుల్లో కొత్త షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలకమండలి ఖారారు చేసే అవకాశముంది.చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు

'ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది'
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. టెస్టు క్రికెట్ నుంచి రిటైరవ్వాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లి లేఖ రాసాడన్న వార్త కలకలం రేపుతోంది. అయితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు వరకు కొనసాగాలని కోహ్లిని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పకటించాడు. ఇప్పుడు కోహ్లి కూడా టెస్టుల నుంచి తప్పుకుంటే అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక సూచనలు చేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విరాట్‌ను రాయుడు కోరాడు."విరాట్ కోహ్లి.. దయచేసి రిటైర్ అవ్వొద్దు. భారత జట్టుకు మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది. ప్రస్తుతం మీలో ఆడే సత్తా ఇంకా ఉంది. ఇప్పటికీ చాలా ఫిట్‌గా కన్పిస్తున్నారు. మీరు టీమిండియా తరుపున పోరాడేందుకు బరిలోకి దిగకపోతే టెస్టు క్రికెట్ స్వరూపమే మారిపోతుంది. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి" అని రాయుడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. అయితే టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై మాత్రం కోహ్లికి మంచి రికార్డులేదు. ఇంగ్లండ్‌లో 17 టెస్టులు ఆడిన విరాట్.. 33.21 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లి తన టెస్టు కెరీర్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతని సగటు 50 కంటే తక్కువగా ఉంది. కాగా ఇంగ్లండ్ టూర్‌కు మే 23న భారత జట్టుతో పాటు కొత్త టెస్టు జట్టు కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది.
బిజినెస్

వార్ టెన్షన్.. నిత్యావసరాల కొరత భయం..
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అధిక ప్రభావం పడేది నిత్యావసరాల సరఫరా మీదే. అందుకే పాకిస్తాన్‌తో యుద్ద పరిస్థితులు తీవ్రమవుతున్న క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నిత్యావసరాల కొరత భయం సామాన్య ప్రజల్లో నెలకొంది. జమ్మూ, జైపూర్, శ్రీనగర్ వంటి కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న యుద్ధ ప్రయత్నాల కారణంగా కొరత వస్తుందనే భయంతో ప్రజలు వస్తువులను నిల్వ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఆందోళన వద్దు..నిత్యావసరాల కొరత భయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశంలో ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి అన్ని నిత్యావసర సరుకుల నిల్వలు తగినంత ఉన్నాయని వెల్లడించింది. ధరలపై ఎటువంటి ప్రభావం లేకుండా దేశవ్యాప్తంగా సరఫరా లైన్లు నిరాటంకంగా పనిచేస్తున్నాయని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించిన తర్వాత అధికారులు తెలిపారు. రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో సరుకుల రవాణాకు ఎలాంటి అంతరాయం లేదని, దేశంలోని దాదాపు 500 మార్కెట్లలో కీలక వస్తువుల ధరల స్థాయిలు స్థిరంగానే ఉన్నాయని ఆందోళన చెందవద్దని ప్రజలను కోరారు.పుష్కలంగా ఇంధన నిల్వలుపెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి ఇంధనాల కొరత ఆందోళనలపై ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తాజాగా స్పందించింది. ఇండియన్ ఆయిల్ కు దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తమ సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఆహార భద్రతకు కీలకమైన ఖరీఫ్ లేదా వేసవిలో పంటలను వేయడానికి లక్షలాది మంది రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎరువులు, ఇతర ఇన్పుట్స్ లభ్యతను ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ సమీక్షించింది. దేశంలో ఆహార, నిత్యావసర వస్తువుల నిల్వలు, ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో ఇదివరకే చర్చించారు. ప్రభుత్వ సంస్థలు ఇటీవలే 25 మిలియన్ టన్నుల గోధుమలను కొనుగోలు చేశాయని ఆహార మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలిసింది.నిల్వ చేస్తే కఠిన చర్యలుఆహార కొరతకు సంబంధించిన ఫేక్ వార్తలను, అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రజలను కోరారు. దేశంలో అవసరానికి మించి ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ అసత్య ప్రచారాన్ని వాడుకుని ట్రేడర్లు, హోల్‌సేలర్లు, రిటైలర్లు లేదా వ్యాపారులు నిత్యావసర సరుకులను నిల్వ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు.Don’t believe in propaganda messages regarding food stocks in the country. We have ample food stocks, far exceeding required norms. DONT PAY HEED TO SUCH MESSAGES.Traders, wholesalers, retailers or business entities which engage in trading of Essential Commodities are directed… pic.twitter.com/KTK68qw85T— Pralhad Joshi (@JoshiPralhad) May 9, 2025

ఎస్బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారీ జరిమానా
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనలు పాటించలేదనే కారణంతో ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై జరిమానా విధించింది. ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, నిర్దేశించిన మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండేలా ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.బ్యాంకుల రుణాలు, అడ్వాన్స్‌లు, అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన అంశాలు, కరెంట్ అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేయడంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. దాంతో ఎస్బీఐకి రూ.1.72 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1 కోటి జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. ఈ జరిమానాలు బ్యాంకింగ్ రంగంలో మరింత జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి దిద్దుబాటు చర్యగా పనిచేస్తాయని పేర్కొంది.ఇదీ చదవండి: సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంబ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావంరెగ్యులేటరీ నిబంధనల అమలు ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ కఠినమైన పర్యవేక్షణను ప్రతిబింబిస్తుంది. అంతర్గత నియంత్రణలను బలోపేతం చేయడానికి, కస్టమర్ రక్షణ యంత్రాంగాలను మెరుగుపరచడానికి బ్యాంకులను ప్రోత్సహిస్తుంది. ఈ చర్యలు ఇతర బ్యాంకులకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయని కొందరు భావిస్తున్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని, వాటిని పాటించడంలో లోపాలను నివారించాలని కోరుతున్నారు.

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు సరిహద్దు రాష్ట్రాల్లోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇరు దేశాల పరస్పర దాడులకు ప్రతిస్పందనగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఈవై ఇండియా సూచించింది. యుద్ధ కార్యకలాపాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ఎన్సీఆర్, ఛండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్‌లోని సిబ్బంది ఈ మేరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.డెలాయిట్, కేపీఎంజీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా ఇతర ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అత్యవసరం కాని ప్రయాణాలపై ఆంక్షలు విధించామని, సరిహద్దు రాష్ట్రాల్లోని ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్లలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ విధించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?సమస్యాత్మక జిల్లాల్లో తాత్కాలిక పాఠశాలల మూసివేతలు, విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన పలు డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి.

బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో బాస్మతి బియ్యం ధరలు పెరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్(ఏఐఆర్ఈఏ) స్పందించింది. ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఇటీవల బాస్మతి బియ్యం ధరలు పెరగడానికి భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ డిమాండ్ పెరగడమే ధరలు పెరిగేందుకు కారణమవుతుందని తెలిపింది. ధరల పెరుగుదల మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ నుంచి బలమైన డిమాండ్ నెలకొందని వివరించింది.అంతర్జాతీయ డిమాండ్బాస్మతి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మిడిల్ఈస్ట్రన్ దేశాల్లో ఈ బియ్యానికి ఆదరణ అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఆ ప్రాంతాల్లో పెరిగిన దిగుమతి డిమాండ్ ధరలపై ఒత్తిడిని పెంచింది. ఇది దేశంలోని బాస్మతి బియ్యం ఎగుమతి ప్రాంతాల్లో ఒక మోస్తరు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సరఫరాకు ఒప్పందం1509, 1718తో సహా ప్రసిద్ధ బాస్మతి రకాల ధర ఇటీవల పెరిగింది. ఇది ఫిబ్రవరి 2025లో కేజీ రూ.52గా ఉండేది. ఇటీవల దీని ధర పెరిగి కేజీ రూ.58కు చేరింది. కానీ ఇది 2024 సెప్టెంబర్‌లో రూ.62గా ఉంది. అప్పటి ధరల కంటే ప్రస్తుత ధరలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయగా, పాకిస్థాన్ 1 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది.
ఫ్యామిలీ

ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?
రిలయన్స్ సామ్రాజ్యానికి వారసురాలు, ఫ్యాషన్ ఐకాన్ బిడ్డ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ న్యూయార్క్ లో జరిగిన ప్రతిష్టాత్మక మెట్ గాలా 2025లో తళుక్కున మెరిసింది. ష్యాషన్, స్టైల్లో తన ప్రత్యేకతను చాటుకునే ఇషా మెగా ఈవెంట్లో తన ఫ్యాన్స్‌ను ఎక్కడా నిరాశపర్చలేదు. ఆమె ధరించిన దుస్తులు, నగలు, చివరికి ఆమె నెయిల్ పాలిష్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్, దాని ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. పదండి మరి ఆ షాకింగ్ సంగతులేంటో తెలుసుకుందాం. డిజైనర్ అనామిక ఖన్నా రూ పొందించిన ఇషా డైమండ్ హారాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దాని ధర ఎంత, దాని మూలాలేంటి అనేది ఇంటర్నెట్ లో ఆసక్తిని రేకెత్తించింది.భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా ధరించిన హారం ధర రూ. 1,267 కోట్లు (150 మిలియన్ డార్లు) అని అంటున్నారు నెటిజన్లు.అంతేకాదు 2018 నాటి సెన్సేషన్ మూవీ ‘ఓషన్స్ 8’ లో దీన్ని ప్రదర్శించారని అంటున్నారు. ఈ సినిమాలో దొంగతనం కోసం అన్నే హాత్వే పాత్ర ధరించిన ఈ హారం. ఇది ఒకప్పుడు నవానగర్ మహారాజుకు చెందినది.కార్టియర్ డైమండ్ నెక్లెస్‌ను ఒకప్పుడు నవానగర్ మహారాజు ధరించారంటూ వ్యాఖ్యానించారు. ఇషా అంబానీ ఏమన్నారు?సోషల్ మీడియా వినియోగదారులు అది నిజంగా ఓషన్స్ 8 నెక్లెస్ అవునా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఇషా అంబానీ "ఇది మా అమ్మది" అని సింపుల్‌గా తేల్చి చెప్పేసింది. టిఫనీ ఉంగరాలు తప్ప, ఆ రాత్రి తాను ధరించిన దాదాపు ప్రతి నగ తన తల్లి నీతా అంబానీవేనని తెలిపింది. అయితే నవానగర్ మహారాజు ప్రేరణతో ఇషా అంబానీ తల్లి నీతా అంబానీ ఖరీదైన నెక్లెస్‌ను స్టేట్మెంట్ లేయర్డ్ పెర్ల్ , డైమండ్ నెక్లెస్‌తో మరింత స్టైల్ చేసింది. దీనిబరువు దాదాపు 136.25 క్యారెట్లు.ఇషా తన దుస్తులను 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్ ఆధారంగా స్టైల్ చేసింది. ఇక మేకప్, డిఫైన్డ్ ఐబ్రోస్, న్యూడ్-టోన్డ్ లిప్ స్టిక్ తో ఇషా తన లుక్ ని అందంగా తీర్చిదిద్దింది. దీంతోపాటు ప్రత్యేకమైన నెయిల్ ఆర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ఫ్యాన్సీ నెయిల్ ఎక్స్ టెన్షన్ ని ఎంచుకోవడానికి బదులుగా, ఇషా ట్విస్ట్ తో కూడిన షీక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ ని ఎంచుకుంది. తన క్రిస్పీ లుక్కు బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్‌తో జతచేసింది. ఆమె నెయిల్స్ ని సెలబ్రిటీ మానిక్యూరిస్ట్ జూలియా స్టైల్ చేసింది. అప్రెస్ నెయిల్ రాసిన జెల్ కూలర్ ని ఉపయోగించినట్లు జూలియా వెల్లడించింది. ఆమె రెండు షేడ్స్ ని ఎంచుకుంది: ఒకటి 'ఫర్గాటెన్ ఫిల్మ్' అనే న్యూడ్ షేర్డ్, , మరొకటి 'ఫ్రెంచ్ బ్లాక్'. ప్రతి నెయిల్ లక్కర్ ధర 14.99 అమెరికా డాలర్లు. అంటే రూ. 1,252 రూపాయలు. రెండు షేడ్స్ కలిసి మొత్తం ఇషా అంబానీ నెయిల్ ఆర్ట్ ధర రూ. 2,504 లన్నమాట.

ఈ సమ్మర్లో చిన్నారులకు కథ రాయడం నేర్పండిలా..!
ఒక హీరో, ఒక విలన్, ఒక క్లయిమాక్స్... అంతే కథ. చెడు మీద మంచి గెలవడం... ప్రాబ్లమ్ మీద పరిష్కారం గెలవడంభయం మీద ధైర్యం గెలవడం... ఇదే కథ రాయడం అంటే.కథలు రాస్తే మీరు క్రియేటర్ అవుతారు. క్యారెక్టర్స్‌ను క్రియేట్ చేసి గేమ్ ఆడతారు. ఇది చాలా ఫన్‌గా ఉంటుంది. ‘రైటర్’, ‘ఆథర్’ అనిపించుకోవాలంటే కథలు రాయాలి. ఈజీగా రాయగలరు. ఎలాగో వినండి.కథ రాయడం భలే వీజీ. చిట్టి చిలకమ్మ ఒక రోజు అల్లరి చేసింది. అల్లరి చేస్తే అమ్మ చిన్న దెబ్బ కొట్టింది. చిట్టి చిలకమ్మ బుంగమూతి పెట్టింది. అలిగి తోటకు వెళ్లింది. అక్కడ పండిన జాంకాయ కనిపించింది. దానిని తెచ్చుకుని తీరిగ్గా కొరికి గుటుక్కున మింగింది. అలకా గిలకా అన్నీ పోయాయి. మళ్లీ హాయిగా ఆటల్లో పడింది. చూశారా ఇంతే కథ. చిన్నప్పుడు మనం విన్న రైమ్... ‘చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా... తోట కెళ్లావా... పండు తెచ్చావా... గూట్లో పెట్టావా... గుటుక్కున మింగావా’... దానినేగా మనం పైన కథగా రాసింది. ప్రతి కథలో చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇవి రెండూ ఉంటే అది కథ. పైన కథలో అమ్మ కొట్టడం ప్రాబ్లమ్. పండు తిని ఆ సంగతి మర్చిపోవడం సొల్యూషన్.ఇప్పుడు చెప్పబోయే కథలో ప్రాబ్లమ్’, ‘సొల్యూషన్ ’ కనిపెట్టండి.ఒక ఆవు దారి తప్పి అడవిలోకి వెళ్లిపోతే పులి పట్టుకుంది. ‘పులి బ్రో.. పులి బ్రో... ఇంటి దగ్గర నాకు చంటి దూడ ఉంది. దానికి పాలివ్వకపోతే ఏడుస్తుంది. వెళ్లి పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను కిల్ చేసి తినెయ్’ అంది. ‘నో. వదల్ను. నువ్వు వెళితే రావు’ అంది పులి. ‘వస్తాను. ప్రామిస్’ అంది ఆవు. పులికి జాలి పుట్టి వస్తే వస్తుంది రాక΄ోతే రాదు అని పంపింది. పాపం ఆవు ఇంటికి వెళ్లి ఇచ్చిన ప్రామిస్‌కు కట్టుబడి తిరిగి పులి దగ్గరకు వచ్చింది. పులి చాలా ఇంప్రెస్ అయ్యింది. నీలాంటి గుడ్ కౌను నేను చూడలేదు. నిన్ను వదిలేస్తున్నా. వెళ్లు’ అంది.పులి ఆవును పట్టుకోవడం ప్రాబ్లమ్. తన నిజాయితీతో ఆవు ఆ ప్రాబ్లం నుంచి బయట పడటం సొల్యూషన్ . చిన్న కథైనా ఎంత బాగుందో చూడండి. పంచతంత్రంలో ఈ కథ మీరు చదివే ఉంటారుగా.మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగులో కథలు రాయడం ప్రాక్టీసు చేయాలి. తెలుగు బాగా రాకపోతే పర్వాలేదు.. ఇంగ్లిష్‌లో కథలు రాయొచ్చు. ఆ భాష ఈ భాష ఏదీ సరిగ్గా రాలేదంటే కొంచెం ప్రాబ్లమే. కథలు ఎందుకు రాయాలంటే వాటి ద్వారా మన థాట్స్ షేర్ చేసుకోవచ్చు. అవేర్నెస్ తేవచ్చు. సెన్సిటైజ్ చేయొచ్చు. చూడండి... ఇది సమ్మర్. ఎంత వేడిగా ఉంటోంది. ఫారెస్ట్లు పెంచడం ఎంత అవసరమో చెప్తూ ఒక కథ రాయొచ్చు. ఒక అడవిలో చెట్లు కొట్టేయడం వల్ల ఒక పక్షికి గూడు పెట్టుకునే చోటు దొరకదు. అది సిటీకి వస్తుంది. చాలా కష్టాలు పడుతుంది. చివరకు ఒక అపార్ట్మెంట్ కిటికీ దగ్గర గూడు ఏర్పాటు చేసుకుంటుంది. నాలుగురోజులు గడుస్తాయో లేదో వేడి గాలి దాని గూడు మీదకు వస్తూ ఉంటుంది. కారణం ఏమిటని చూస్తే ఏసి ఔట్‌డోర్ యూనిట్ నుంచి ఆ గాలి వస్తుంటుంది. ఆ ఔట్ డోర్ యూనిట్ ఆగదు. పక్షి ఆ గూటిలో ఉండలేదు... ఇలా ఒక స్టోరీ రాయొచ్చు.కథలు రాయాలంటే ముందు కథలు చదవాలి. స్టోరీ బుక్స్ చదివితే కథలు ఎలా రాయాలో తెలుస్తుంది. స్టోరీలు చదివి బెడ్ మీదకు చేరితే మీకూ రకరకాల స్టోరీ ఐడియాస్ వస్తాయి. వాటిని బాగా స్కీమ్ చేసుకుని పేపర్ మీద రాయాలి అంతే. కథ రాసి దానికో టైటిల్ పెట్టాలి. ‘మేకపిల్ల హోమ్‌వర్క్’, ‘ఆక్సిజన్ ట్యాంకర్ దొంగలు’, ‘ఫ్లయింగ్ బైస్కిల్’... ఇలా. కథలు రాస్తే మిమ్మల్ని రైటర్ అంటారు. రైటర్ గారూ అని పిలుస్తారు. చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కదా. ఆ యుద్ధాన్ని చూసి క్లౌడ్స్ ఏమనుకుంటాయి? బ్లూ కలర్ క్లౌడ్, వైట్ కలర్ క్లౌడ్‌ను కేరెక్టర్లుగా చేసి కథ రాయాలి. రాయండి. అలాంటి కథలు రాయడమే ఈ సమ్మర్లో మీకు సరైన హోమ్‌వర్క్. చివరగా కథలు లేకుండా లోకం ఉండదు. ఎప్పుడూ అందరికీ కథలు కావాలి. ఆ కథల్లో ఎంత గట్టి ప్రాబ్లమ్ ఉంటే అంత బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్‌లో చిక్కుకుపోయింది. ఆమెను క్యారెక్టర్‌గా తీసుకుని ఒక స్టోరీ రాయొచ్చు. ఎంత ధైర్యంగా ఆమె అన్నాళ్లు స్పేస్‌లో ఉందో చెప్పి ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియకపోవడం వల్ల టెన్షన్ బిల్డప్ చేసి క్లయిమాక్స్‌లో స్పేస్‌షిప్ వెళ్లి ఆమెను తీసుకురావడంతో హ్యాపీ ఎండింగ్ చేస్తే అది కథ. – కె.(చదవండి: అలనాటి వేసివి ముచ్చట్లు..! చిన్నారులు తప్పక తెలుసుకోవాల్సిన సరదాలు..)

బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ డైట్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..
ఎముకల ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనది. వయసు పెరిగేకొద్దీ ఎముకలు సాంద్రతను కోలపోతాయి. పైగా పగుళ్లు ఏర్పడి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఎముకలను బలహీనపర్చడాన్ని వేగవంతం చేస్తాయి. తరుచుగా గాయలయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా వేలల్లో ఉంటుందోని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైద్యలు మాత్రం ఇండియన్ డైట్‌తోనే నివారించుకోవచ్చని చెబుతున్నారు. ఎముక ఆరోగ్యాన్నికాపాడంలో భారతీయ ఆహారాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయిని చెబుతున్నారు. పైగా అవి అందుబాటులో ఉండే ఆహారాలేనని అంటున్నారు. అంతేకాదండోయ్ బలమైన ఎముకల బెస్ట్ ఇండియన్ ఫుడ్ గైడ్ ఏంటో కూడా వివరించారు. మరీ అవేంటో తెలుసుకుందామా..!.కాల్షియం అధికంగా ఉండే ఆహారాలుఎముకల బలానికి కాల్షియం అత్యంత ముఖ్యమైన ఖనిజం. పెద్దలకు రోజుకు 1000–1200 mg కాల్షియం అవసరం. భారతీయ ఆహారంలో సహజంగానే అనేక కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు ఉన్నాయి.పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్ , మజ్జిగ వంటివి కాల్షియం అద్భుతమైన వనరులు.ఆకుకూరలు: పాలకూర (పాలక్), మెంతులు (మేథి), ఉసిరి వంటి మొక్కల ఆధారిత కాల్షియంనువ్వులు: భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే నువ్వులు (టిల్) గింజలు కాల్షియంతో సమృద్ధిగా ఉంటాయి.రాగి: సాంప్రదాయ భారతీయ ధాన్యం, రాగులు కాల్షియంతో నిండి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనవి.అంటే పైన చెప్పిన వాటిల్లో కనీసం ఒక గ్లాసు పాలు లేదా మజ్జిగ తీసుకున్నాచాలు కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.మెరుగైన కాల్షియం శోషణకు విటమిన్ డికాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం. సూర్యరశ్మికి గురికావడం ఉత్తమ సహజ వనరులే కానీ ఫుడ్ పరంగా ఏవంటే..గుడ్డు పచ్చసొనసాల్మన్, సార్డిన్ వంటి కొవ్వు చేపలుబలవర్థకమైన పాల ఉత్పత్తులుపుట్టగొడుగులుఇక్కడ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే సూర్యరశ్మిలో గడిపే యత్నం చేయటం వంటివి చేస్తే చాలు.ఎముక ద్రవ్యరాశికి ప్రోటీన్ప్రోటీన్లు ఎముకల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ ఆహారాంలో ప్రోటీన్‌ని జోడిస్తే ఈ ఎముకల సమస్యను అధిగమించొచ్చు.పప్పుధాన్యాలు, కాయధాన్యాలు (పప్పు, రాజ్మా, శనగ, మూంగ్)పాల ఉత్పత్తులుబాదం, వాల్నట్లు, అవిసె గింజలు, విత్తనాలులీన్ మాంసాలు, గుడ్లుప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఎముక సాంద్రతను పెంచుతుంది, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు వైద్యులుఎముక సాంద్రతకు మెగ్నీషియం, ఫాస్ఫరస్ఎముకల నిర్మాణాన్ని నిర్వహించడానికి కాల్షియంతో పాటు మెగ్నీషియం, పాస్ఫరస్ కూడా కీలకమే. ఈ ఖనిజాలు అధికంగా ఉండే భారతీయ ఆహారాలలో ఇవి ఉన్నాయి:అరటిపండ్లు, అంజూర పండ్లు, ఖర్జూరాలుగోధుమ బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాలుజీడిపప్పు, వేరుశెనగ వంటి గింజలుగుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలుఎముకలకు హాని కలిగించే ఆహారాలు..పోషకాలు అధికంగా ఉండే ఆహారం కీలకం అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయని విషయం గ్రహించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులుతినకూడనవి..చక్కెర పానీయాలుశీతల పానీయాలుఎముకల నుంచి కాల్షియం లీక్ అయ్యే అధిక ఉప్పుఅధిక మొత్తంలో కెఫిన్నడక, జాగింగ్, బరువు మోసే వ్యాయామాలు, సమతుల్య ఆహారం తదితరాలు జీవితాంతం ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందువల మనకు అందుబాటులో ఉండే ఈ సాధారణ ఆహారాలతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)

హైదరాబాద్ టు హనోయ్.. ఎగిరిపోదామా!
హైదరాబాద్ నుంచి హనోయ్‌లోని నోయ్‌బాయ్ విమానాశ్రయానికి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు వియట్‌జైట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండగా కొత్తగా వియత్నాం ఎయిర్‌లైన్స్ సర్వీసులు మొదలయ్యాయి. నగరం నుంచి వియత్నాం వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో విమాన సర్వీసులకు సైతం భారీ డిమాండ్ నెలకొంది. కొత్తగా ప్రారంభించిన వియత్నాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (వీఎన్–984) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి ఆది, బుధ, శుక్ర వారాల్లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. హనోయ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.25 గంటలకు అక్కడికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వియత్నాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (వీఎన్–985) హనోయ్ నుంచి ప్రతి ఆది, బుధ, శుక్ర వారాల్లో సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. మారుతోంది డెస్టినేషన్.. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు దుబాయ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియా తదితర దేశాలకు రాకపోకలు సాగిస్తారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 12 వేల మందికిపైగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఉంటే వారిలో 60 శాతానికి పైగా ఈ నాలుగైదు దేశాలకు రాకపోకలు సాగించే వాళ్లే ఎక్కువ. కాగా.. కొంతకాలంగా సిటీ టూరిస్టుల డెస్టినేషన్లు మారుతున్నాయి. కొత్త ప్రదేశాల్లో పర్యటించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సోలోగా వెళ్లే వారికి, కుటుంబాలతో సహా కలిసి వెళ్లాలనుకొనే వాళ్లను వియత్నాం విశేషంగా ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం భారత్ నుంచి సుమారు 5 లక్షల మంది వియత్నాం సందర్శించినట్లు అంచనా. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించినవాళ్లు లక్ష మందికిపైగా ఉంటారని అమీర్‌పేట్‌కు చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్ సంస్థ వెల్లడించింది. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీవియత్నాంకు పర్యాటక ప్యాకేజీలను అందజేస్తున్న సంస్థలకు సైతం డిమాండ్ పెరిగింది, సులభంగా వీసాలు లభించడం, విమాన చార్జీలు, పర్యాటక ఖర్చులు కూడా తక్కువ మొత్తంలోనే ఉండడం వల్ల ఎక్కువ మంది వియత్నాంను సందర్శిస్తున్నారు. ‘ఆ దేశంలో వందల కొద్దీ పర్యాటక స్థలాలు ఉన్నాయి. చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఆ దేశంలోని ఒక్క డానాంగ్ ప్రాంతాన్నే సుమారు 2.22 లక్షల మంది భారతీయ పర్యాటకులు గత సంవత్సరం సందర్శించారు.’అని వాల్మీకి ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకులు హరికిషన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ పెరగడంతో ఎక్కువ మంది సందర్శించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ఒక అందమైన దేశం.. సహజమైన దీవులు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ దేశంలోని హనోయ్, హోచిమిన్ సిటీ, హాలోంగ్ బే, హోయి ఆన్, సాపా, హ్యూ,పాంగ్‌న, బిన్‌తన్, మయిచావ్, కావోబాంగ్ వంటి సుమారు 45 ప్రముఖ పర్యాటక స్థలాలను ఎక్కువ మంది సందర్శిస్తున్నారు.
ఫొటోలు


సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)


లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)


పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)


‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)


హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)


HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)


ట్రెడిషనల్ + వెస్ట్రన్... లాపతా లేడీ సరికొత్త స్లైల్ (ఫొటోలు)


ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

భారత్-పాక్ యుద్ధం.. మరోసారి స్పందించిన చైనా
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని గట్టిగా కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ సమస్యను ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్రిక్తత పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా.. నిన్న కూడా(శుక్రవారం) స్పందించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’ అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే.. భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు

భారత్‌తో యుద్ధం.. పాక్ ఆర్మీ చీఫ్‌కు అమెరికా ఫోన్ కాల్
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక, తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco rubio) ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్ (India)తో తక్షణం చర్చలు జరపాలని సూచనలు చేసినట్టు చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడినట్లు విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. భారత్, పాక్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని రూబియో పాక్‌కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించినట్లు వెల్లడించింది.మరోవైపు.. ఇటీవల రూబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు.US secy of State Marco Rubio calls Pak FM Ishaq Dar and Army Chief Gen Asim Munir. Urged Pak and India to de-escalate, offered US assistance in starting constructive talks to avoid future conflicts. Dar told Geo News that he told Mr Rubio Pak is ready to talk if India stop its… pic.twitter.com/OFSXe7Qe31— Azhar Abbas (@AzharAbbas3) May 10, 2025అంతకుముందు.. భారత్-పాక్ మధ్య జరిగే యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. జేడీ వాన్స్ మాట్లాడుతూ.. భారత్, పాక్ ఆయుధాలు వదిలేయాలని అమెరికా చెప్పదు. కానీ, దీనికి ఉన్న ఏకైక మార్గం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే. మేము దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. ఇరుదేశాల మధ్య ఘర్షణలు అణు సంఘర్షణగా మారకూడదని మా ఆశ. యుద్ధం వినాశకరమైంది. అందుకే రెండు దేశాలు సంయమనం పాటించాలి’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. భారత్-పాక్‌లు సంయమనం పాటించాలని జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. పహల్గాం ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. భారత్-పాక్‌లలోని పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని, శాంతి స్థాపన కోసం ఇరు దేశాలు చర్చలు జరపాలని ప్రతిపాదించాయి.

కరాచీ ఎయిర్‌పోర్టు లాక్డౌన్.. పెట్రోల్ బంక్‌లు బంద్!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా భారత్ దాడుల కారణంగా కరాచీ ఎయిర్‌పోర్టులో లాక్డౌన్ విధించారు. కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణీకుల తరలిస్తున్నట్టు సమాచారం. బ్లాక్ అవుట్ ప్రకటించారు. అలాగే, పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు.. భారత్ ముప్పెట దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలం మూసివేశారు. అలాగే, భారత్‌తో యుద్ధం కారణంగా పాకిస్తాన్లో కొరత మొదలైంది. తాజాగా ఇస్లామాబాద్‌లో 48 గంటలపాటు పెట్రోల్‌బంక్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ప్రజలు అల్లాడిపోతున్నారు.All PETROL PUMPS in Islamabad SHUTDOWN for 48 hrsPaaijaan tel khatam hogya 😭#IndiaPakistanWar pic.twitter.com/D9hkvnEuQM— Dev Madan Chronicles (@DMC_0001) May 10, 2025 🚨#BREAKING!!! Completely BLACKED OUT, this is the scene at Karachi Airport after Pakistani airspace cleared,RT pic.twitter.com/Vpt8evRQFG— G7 News (@G7NEWSX) May 10, 2025ఇదిలా ఉండగా.. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, మిస్సైల్‌తో పాక్ దాడి చేయడంతో.. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో భారత్ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది.Pakistani airspace is reportedly closed again. A friend is stuck at Karachi Airport — complete blackout, no updates. Situation tense pic.twitter.com/tww6jVWSG2— Nasir (@khan_nasir19) May 9, 2025 So now it's in Karachi.. blasts are happening in air..Near old airport..#Pakistan #IndiaPakistanWar #PakistanZindabad pic.twitter.com/3gKbLY9lqn— Sarah Peracha (@sarahperacha) May 10, 2025 ఇక, రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భారత్‌పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. ఇక తాజాగా శనివారం తెల్లవారుజాము నుంచి పాక్ తిరిగి దాడులు చేయడంతో భారత్ తిప్పికొట్టింది. Seems so drones are being hit towards Karachi airport. Hug blasts heard towards Karachi airport. pic.twitter.com/ikFvyMHpsg— Nazim Abbas (@NazimAbbas_1) May 10, 2025 Visuals Coming From Karachi.کراچی Malir airport سے مناظر۔ pic.twitter.com/PgGmfsGY5M— The Awazaar Sain (@adeelzsiddiqui) May 10, 2025

తుర్కియే సోంగర్లు
భారత త్రివిధ దళాల ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. కొత్త కుయుక్తులతో యుద్ధానికి దిగుతోంది. సంప్రదాయ ఆయుధాలకు బదులుగా అత్యాధునిక డ్రోన్లతో భారత్‌పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిలో పాక్ మిత్రదేశం తుర్కియే తయారుచేసిన అత్యంత ప్రమాదకరమైన అసిస్‌గార్డ్ సోంగర్ సాయుధ యూఏవీలు ఉండటం కాస్త కలవరపెడుతోంది. ఎందుకంటే ఆధునిక యుద్ధ పద్ధతుల్లో సోంగర్ డ్రోన్లు సమర్థవంతమైనవిగా నిరూపించుకున్నాయి. వీటిని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. గురువారం రాత్రి భారత్‌లోని 36 మిలిటరీ, పౌర లక్ష్యాలపై సోంగర్ డ్రోన్లతోనే పాక్ దాడిచేసినట్లు మన రక్షణ శాఖ ప్రకటించింది. వాటిని సమర్థంగా కూల్చేసినట్లు శుక్రవారం మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. సోంగర్ డ్రోన్లను సమర్థంగా అడ్డుకోగల గగనతల రక్షణ వ్యవస్థలు మనకు ఉన్నప్పటికీ.. వాటిని తక్కువగా అంచనా వేయకూడదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సోంగర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవీ.. → సోంగర్ డ్రోన్లను తుర్కియేలోని అంకారా కేంద్రంగా పనిచేస్తున్న అసిస్‌గార్డ్ సంస్థ తయారుచేసింది. వీటిని 2019 నుంచి వినియోగిస్తున్నారు. → ఈ డ్రోన్లు స్వయంచాలితంగా ప్రయాణించి లక్ష్యాలపై దాడులు చేసి తిరిగి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కు చేరుకోగలవు. రిమోట్ కంట్రోల్‌తో కూడా నియంత్రించవచ్చు. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇవి కీలకంగా పనిచేయగలవు. సరిహద్దులు దాటి దాడులు చేయటంలో వీటికి మంచి రికార్డు ఉంది. ప్రమాదకర సాయుధ డ్రోన్సోంగర్ డ్రోన్‌కు ఒక అత్యాధునిక ఆటోమేటిక్ మెషీన్ గన్ అమర్చబడి ఉంటుంది. చిన్నపాటి క్షిపణులను కూడా ఇది ప్రయోగించగలదు. 81 ఎంఎం మోరా్టర్ రౌండ్స్‌ను పేల్చగలదు. వ్యక్తులు, వాహనాలు, ఎంపికచేసిన చిన్నపాటి లక్ష్యాలపై సమర్థంగా దాడి చేయగలదు. ఫ్లైట్ పెర్ఫార్మెన్స్సోంగర్ డ్రోన్లు 45 కిలోల బరువును మోసుకెళ్లగలవు. పేలోడ్ లేకుండా ఏకబిగిన 25 నుంచి 30 నిమిషాల వరకు గగనతలంలో ఎగరగలవు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషననుంచి 3–5 కిలోమీటర్ల దూరం వరకు ఇవి దాడులు చేయగలవు. సముద్రమట్టం నుంచి 2,800 మీటర్లు, భూ మట్టం నుంచి 400 మీటర్ల ఎత్తువరకు ఇవి ఎగరగలవు. రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్లక్ష్యాలపై నిఘా పెట్టడంలో కూడా సోంగర్ డ్రోన్లది అందెవేసిన చెయ్యి. ఇవి గగనతలంలో ఎగురుతూ గ్రౌండ్ స్టేషన్‌కు రియల్‌టైమ్ (ప్రత్యక్షంగా)లో వీడియోలు, చిత్రాలను పంపగలవు. దాడుల తర్వాత జరిగిన నష్టాన్ని కూడా విశ్లేషించి వెంటనే గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతాయి. రాత్రి– పగలు అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా ఈ డ్రోన్లు నిఘా పెట్టగలవు. రాత్రిపూట వీడియోలు, చిత్రాలు తీసేందుకు వీటిలో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయి. స్వయంచాలితం ఈ డ్రోన్లను గ్రౌండ్ స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. అవసరమైతే వాటికవే స్వయంగా ఎగురుతూ నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేయగలవు. గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినా వాటికవే తిరిగి స్టేషన్‌ను వెతుక్కుంటూ తిరిగి రాగలవు. బ్యాటరీలో చార్జింగ్ తగ్గిపోయినా వెంటనే గ్రౌండ్ స్టేషన్‌కు వచ్చేస్తాయి. దీంతో వీటిని నియంత్రించేవారికి పని సులువు అవుతుంది. గుంపుగా దాడిచేయగల సామర్థ్యం సోంగర్ డ్రోన్లు ఒక్కొక్కటిగా నిర్దేశించిన లక్ష్యాలతోపాటు దాడులు చేయటంతోపాటు గుంపులుగా కూడా వెళ్లి దాడులు చేయగలవు. పదుల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు స్వయంగా సమన్వయం చేసుకుంటూ లక్ష్యంపై నలు దిక్కుల నుంచి దాడి చేస్తాయి. శత్రువు రక్షణ వ్యవస్థను గందరగోళపర్చి సమర్థంగా దాడులు చేయగల సత్తా వీటికి ఉంది. గురువారం భారత్‌లోని పలు లక్ష్యాలపై ఇలాగే దాడులు చేసినట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

కాల్పులకు విరమణ: కీలక పాత్ర వీరిదే!
పహాల్గమ్ ఉగ్రదాడి తరువాత.. భారత్ ప్రతీకారదాడులకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పాక్ ప్రతిదాడులకు ప్రయత్నించినప్పటికీ.. ఇండియన్ ఆర్మీ ముందు నిలబడలేకపోయింది. చేసేదేమీ లేక ఉద్రిక్తతలు తగ్గించాలని వేసుకోవడంతో.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసారు.భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో డీజీఎంవో (డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) అధికారులే కీలక పాత్ర పోషించారు. కాల్పుల విరమణ ప్రకటన రావడానికి ముందు పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉన్నత సైనిక అధికారి భారతదేశానికి ఫోన్ చేశారని, ఆ తర్వాత రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.కాల్పుల విరమణ ప్రకటన రావడానికి గంట ముందు, పాకిస్తాన్ భవిష్యత్తులో చేసే ఏదైనా ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామని, భారతదేశం దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని భారతదేశం తెలిపింది. గత మూడు రాత్రులుగా ఉత్తర భారతదేశంలోని సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపైకి పాకిస్తాన్ డ్రోన్ & క్షిపణి దాడులకు పాల్పడినప్పటికి వాటన్నింటినీ భారత వైమానిక రక్షణ శాఖ విజయవంతంగా అడ్డుకుంది.సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం వంటి వాటిలో.. డీజీఎంఓల పాత్ర చాలా కీలకం. ఆర్మీలో సీనియర్ అధికారి స్థాయిలో ఉండే వీరు.. సైనిక ఆపరేషన్లలో వ్యూహాత్మక, కార్యాచరణలను అమలు చేస్తుంటారు. ఆర్మీ చీఫ్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. అంతే కాకుండా ప్రత్యర్థులపై దాడులు, శత్రుమూకలను దీటుగా ఎదుర్కొనే సైనిక ఆపరేషన్లకు సంబంధించిన వ్యూహాలు కూడా రచిస్తుంటారు.బలగాలను సిద్ధం చేయడం మాత్రమే కాకుండా.. వాటిని రంగంలోకి దించడం వంటి విధులతో పాటు శాంతి పరిరక్షణలోనూ డీజీఎంఓలు కీలకంగా వ్యవహరిస్తారు. ఒకవైపు నిఘా వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకుంటూ.. మరోవైపు వ్యూహాలు రచిస్తారు. మనదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలు, సరిహద్దు ఉద్రిక్తతల వేళ కూడా డీజీఎంవోదే ప్రధాన పాత్ర అని చెప్పాల్సిందే. ఎందుకంటే కాల్పుల విరమణకు ముందు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విరమణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు.

యుద్దానికి బ్రేక్!.. స్పందించిన జమ్మూ కాశ్మీర్ సీఎం
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా ఉండటానికి ఇది ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే పాక్ కాల్పుల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.గత నాలుగు రోజుల్లో పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో 19 మంది గ్రామస్తులు మరణించారు. బుధవారం పూంచ్‌లో 12 మంది పౌరులు మరణించగా.. శుక్రవారం ఉరి, పూంచ్‌లో మరో ఇద్దరు మరణించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారితో సహా మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.ఘర్షణ సమయంలో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల జరిగిన విస్తృతమైన నష్టాన్ని ఎత్తిచూపుతూ, నష్ట అంచనాలను ఖరారు చేయవలసిన ఆవశ్యకతను అబ్దుల్లా నొక్కి చెప్పారు. ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడం ప్రారంభించడానికి వీలుగా వెంటనే తుది సర్వేలు నిర్వహించి నివేదికలు పంపాలని డీసీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మా విమానాశ్రయం చాలా రోజులుగా మూసివేయడం జరిగింది. కాల్పుల విరమణ తర్వాత అది తిరిగి ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు.#WATCH | On the India- Pakistan ceasefire agreement, Jammu and Kashmir CM Omar Abdullah says, "I welcome the ceasefire. If it had happened 2-3 days ago, the lives we lost would not have been lost. Pakistan's DGMO called our DGMO and the ceasefire was implemented. It is the… pic.twitter.com/uXxlTfnRzJ— ANI (@ANI) May 10, 2025కాల్పుల విరమణభారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.

దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం: భారత ఆర్మీ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈరోజు(శనివారం) సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయగా, దీన్ని భారత కూడా ధృవీకరించడంతో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ముగింపు దొరికింది.అనంతరం ఇండియన్ ఆర్మీ.. ప్రెస్ మీట్ నిర్వహించింది. ‘ దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల యుద్ధంలో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాక్ తప్పుడు కథనాలు ప్రచారం చేసింది. భారత్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు అసత్య ప్రచారం చేశారు. పాక్ చెప్పినట్లు.. భారత్ ఆర్మీకి ఏమీ నష్టం జరగలేదు. భారత సైన్యం.. పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది. భారత్ పై కవ్వింపు చర్యలకు దిగి, పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఎల్ఓసీ దగ్గర పాక్ తీవ్రంగా నష్టపోయింది. బారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది’ అని భారత ఆర్మీ స్పష్టం చేసింది.భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణభారత్-పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం(శనివారం, మే10) 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.ట్రంప్ పెద్దన్న పాత్రఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్రలో ఇరు దేశాల మధ్య రాజీ కోసం ప్రయత్నించారు. కాల్పుల విరమణకు అమెరికాను పాకిస్తాన్ ఆశ్రయించడంతో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి భారత్‌తో చర్చించారు. దీనికి భారత్ కూడా అంగీకరించి మే 12వ తేదీన పాక్‌తో చర్చలకు సిద్ధమైంది.

వార్ జోన్.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం
పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దుకావడంతో అంతా విధుల్లోకి తిరిగి హాజరయ్యే పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలోనే పెళ్లైన ఓ జవాన్ విధుల్లోకి హాజరయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ మే 5వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పారామిలటరీ బలగాలు అంతా విధులకు హాజరు కావాలనే ఆదేశాల నేపథ్యంలో మనోజ్ పాటిల్ తిరిగి విధుల్లో చేరాడు. పెళ్లైన మూడు రోజులకే విధులకు హాజరయ్యాడు. అయితే నవ వధువు తన భర్తను దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి పంపి అందరికీ ఆదర్శంగా నిలవగా.. ఈ నూతన వధూవరుణ కథే దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఆ నవ వధువు దేశ భక్తిని అంతా కొనియాడుతున్నారు. తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపిన వనిత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.सगळ काही भारत मातेसाठी...लग्नाच्या तीन दिवसांनंतर महाराष्ट्राचे सुपूत्र मनोज पाटील देश सेवेसाठी रवाना... #oprationsindoor #IndianNavyAction #IndiaPakistanTensions #jalgaonnews #India #army #manojpatil #देशसेवा pic.twitter.com/1gmbhYcoTD— Ganesh Pokale... (@P_Ganesh_07) May 9, 2025
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

బావతో సహజీవనం చేస్తోందంటూ..
నెల్లూరు సిటీ: మహిళపై కొడవలితో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన శేషమ్మ అనే మహిళను 20 ఏళ్ల క్రితం భర్త వదిలేశాడు. ప్రస్తుతం ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటూ కేజీకే కల్యాణ మండపం వద్ద పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన కరుణాకరన్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. అతను ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం శేషమ్మ వద్ద ఉండటం అతడి బావమరిది శ్రీనివాసులుకు తెలిసింది. తన సోదరికి అన్యాయం జరుగుతోందని అతను శేషమ్మపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం పండ్ల దుకాణం వద్ద శ్రీనివాసులు కొడవలితో శేషమ్మ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సై‘బరి’ తెగింపు
‘విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్‌కు ఓ వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వచ్చాయి. వెంటనే ఓ ఆగంతకుడి నుంచి కాల్ వచ్చింది. పొరపాటున మీ నంబర్‌కు నాకు సంబంధించిన కోడ్, ఓటీపీ వచ్చిందని, దయచేసి దాన్ని తనకు చెప్పాలని ఆగంతకుడు అభ్యర్ధించాడు. ఫోన్లలో ఇలాంటి పొరపాటు మెసేజ్‌లు రావడం సహజమేనని నమ్మి. ఆ ఆగంతకుడికి ఆ వ్యక్తి కోడ్, ఓటీపీ చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే గుడ్‌మార్నింగ్ మెసేజ్ తన స్నేహితులకు పంపేందుకు ఆ వ్యక్తి విఫలయత్నం చేశాడు. 12 గంటల పాటు తన వాట్సాప్‌కు ఎలాంటి మెసేజ్‌లు, ఫొటోలు రావడం లేదని, తన నుంచి ఎవరికీ మెసేజ్‌లు వెళ్లడం లేదని గ్రహించాడు. ఎట్టకేలకు తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయిందని గ్రహించి హుటాహుటిన సైబర్ పోలీస్ స్టేషన్‌కు పరుగు పెట్టాడు’.విజయవాడస్పోర్ట్స్: డిజిటల్ అరెస్ట్, జాబ్‌ఫ్రాడ్, హనీ ట్రాప్, ఫిషింగ్, డేటా బ్రీచ్ తదితర వందకుపైగా స్కామ్‌లతో ప్రజలను ఆరి్ధక దోపిడీ చేసిన సైబర్ నేరగాళ్లు.., తాజాగా రూటు మార్చారు. ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్తో వ్యక్తిగత సమాచార మార్పిడికి రక్షణగా ఉన్న వాట్సాప్పైనా కేటుగాళ్లు కన్నేశారు. వాస్తవ ఖాతాదారులను బురిడీ కొట్టించి హ్యాక్ చేస్తూ సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ఒకే నంబర్‌తో వేర్వేరు ఫోన్లలో ఎన్నైనా వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసుకునే వెసులుబాటును సైబర్ నేరస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘‘ నేరగాళ్లు వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వాట్సాప్‌కు మీ నంబర్ ఇస్తారు. దీంతో వాట్సాప్ సంస్థ నుంచి మీ మొబైల్‌కు వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వస్తుంది. ఈ రెండూ తెలుసుకునేందుకు మిమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తారు. పొరపాటున కోడ్, ఓటీపీ మీ నంబర్‌కు వచ్చిందని, దాన్ని కాస్త చెప్పాలని అభ్యర్థిస్తారు. కోచ్, ఓటీపీ వారికి చెప్పగానే మీ వాట్సాప్ ఖాతా వారి ఫోన్లో ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిజెప్పీరింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తారు. మీ వాట్సాప్ వచ్చే అన్ని మెసేజ్, ఫోటోలు పూర్తిగా వారి ఫోన్‌కు వెళ్లేలా సెట్టింగ్స్ చేసి హ్యాక్ చేస్తారు. వాట్సాప్ సంభాషణ పూర్తిగా వారి ఆ«దీనంలోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యక్తిగత హననానికి, ఆర్థిక దోపిడీకి పాల్పడతారు. హ్యాకింగ్‌తో అపరిమితమైన నేరాలువాట్సాప్లో చాటింగ్, గ్రూప్‌ల ఆధారంగా ఆ వాట్సాప్ వినియోగించే వ్యక్తి మనస్తత్వాన్ని నేరగాళ్లు అంచనా వేస్తున్నారు. ఏయే గ్రూప్‌లకు మెసేజ్‌లు పార్వాడ్ చేస్తున్నారో.., ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నారో.., ఎలాంటి సంభాషణలు చేస్తున్నారో.., క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని ఆధారంగా స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములను వాట్సాప్ ద్వారా డబ్బులు అభ్యర్థిస్తారు. వాస్తవ ఖాతాదారుడికి తెలియకుండానే అతని పేరుతో చాటింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. వాట్సాప్ బ్యాంకింగ్ వ్యాలెట్‌లో ఉన్న నగదునూ లూటీ చేస్తారు. డీపీ (డిస్ప్లే పిక్చర్) ఫొటోను మారి్ఫంగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరిస్తారు. వాట్సాప్ కాంటాక్ట్, గ్రూప్‌లలో ఉన్న మహిళల డీపీలను మారి్ఫంగ్ చేస్తారు. మహిళలకు అసభ్య మెసేజ్‌లు పంపి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. డేటింగ్, బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను వినియోగించడమే కాకుండా గ్రూప్‌లలో ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటారు. వాట్సాప్ గ్రూప్లలోకి, వ్యక్తిగత నంబర్లకు ఏపీకే ఫైల్స్, మాల్వేర్లను పంపిస్తారు. పొరపాటున వాటిని క్లిక్ చేసిన వ్యక్తుల అకౌంట్లను హ్యాక్ చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫి, పోర్న్ వీడియోలను, న్యూడ్ ఫొటోలను వాట్సాప్ అకౌంట్ ద్వారా ఇతరులకు షేర్ చేస్తారు. స్త్రీ/పురుషు వ్యభిచారుల(మేల్ ఎస్కార్ట్ సర్వీస్, ఫిమేల్ ఎస్కార్ట్ సర్వీస్) వివరాలను ఇతరులకు షేర్ చేసేందుకు ఈ వాట్సాప్‌ను వినియోగిస్తారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచార మారి్పడికి హ్యాక్ చేసిన అకౌంట్లను వినియోగిస్తారు. వాట్సాప్ చానల్ ద్వారా సంఘ వ్యతిరేక, అసభ్య సమాచార మార్పిడి చేసి కేసుల్లో ఇరికిస్తారు.లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండికీ ప్యాడ్ ఫోన్ వినియోగించే వారు సైబర్ నేరస్తుల ట్రాప్‌లో అత్యధికంగా పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ఉన్నత విద్యావంతులూ బాధితులుగా ఉన్నారు. వాట్సాప్ మాత్రమే కాకుండా ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ ఖాతాలకు సంబంధించిన వెరిఫికేషన్ కోడ్, ఓటీపీలను ఇతరులకు చెప్పడం, షేర్ చేయడం చేయరాదు. సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ హ్యాకింగ్‌కు గురైతే వెంటనే లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. గూగుల్లోకి వెళ్లి లా ఎన్ఫోర్స్మెంట్ అని టైప్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో ‘మీరు పోలీసా’ అని అడుగుతుంది, ‘నో’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయగానే కొత్త ఫారం ఓపెన్ అవుతుంది. అందులోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఇష్యూష్ ఆప్షన్లో హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ఫిర్యాదు ఆన్లైన్లో రికార్డవుతుంది. ఫిర్యాదు చేయడంలో ఏమైనా సందేహాలుంటే సైబర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి. –శ్రీరామచంద్రమూర్తి రాళ్లపల్లి, ఎస్ఐ, సైబర్ క్రైం, ఎన్టీఆర్ జిల్లా

రూ.50 లక్షల ఆభరణాలు : చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసిన కిలాడీ
గచ్చిబౌలి: సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు తెలుసని బిల్డప్ ఇస్తూ విలువైన నగలను ఆర్డర్ చేసి ఉడాయించిన ఓ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాయమాటలు చెప్పి రూ.50 లక్షల విలువ చేసే నగలను తీసుకుని బిల్లులు చెల్లించకుండా తిరుగుతున్న మహిళ కోసం రాయదుర్గం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల క్రితం అబిడ్స్‌లోని ఓ నగలు షాపు యజమానికి రమాదేవి అనే మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసి వివిధ డిజైన్ల నగలను ఎంపిక చేసుకుంది. దాదాపు రూ.50 లక్షల విలువైన నలను రాయదుర్గం పీఎస్ పరిధిలోని తాను నివాసం ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీకి తెప్పించుకుంది. చెక్ ఇచ్చి కొంత డబ్బు తక్కువగా ఉందని రెండు రోజుల తర్వాత బ్యాంకులో వేసుకోవాలని సూచించింది. అయితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేసింది. బాధితులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రమాదేవి కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండా గతంలో ఇదే తరహాలో నగలు కాజేసిన ఆమెపై నార్సింగి పీఎస్ పరిధిలో ఒకటి, రాయదుర్గం పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అయినా తన తీరుమార్చుకోని సదరు మహిళ సినీ ప్రముఖులు, రాజకీయనాయకులతో దిగిన ఫొటోలు చూపిస్తూ, తాను ధనవంతురాలినని బిల్డప్ ఇస్తూ జ్యువెల్లర్ షాపుల యజమానులతో పరిచయం చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నమ్మకంగా ఉన్నట్లు నమ్మిస్తుంది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో విలువైన నగలు తీసుకుని మోసాలకు పాల్పడుతోంది. గతంలో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చినన పోలీసులు ఈ సారి ఆమెను అరెస్ట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోగొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ

నకిలీకి ‘అసలు సీఐ’ తోడు
పీఎం పాలెం (విశాఖపట్నం): మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ ఏసీబీ సీఐ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తిన బలగ సుధాకర్.. ‘సీఐ’గా పనిచేస్తున్న స్వర్ణలతను ‘ఏసీబీ ఎస్పీ’గా పేర్కొంటూ సబ్ రిజిస్ట్రార్ (sub registrar) చక్రపాణిని మభ్యపెట్టాడు. ‘ఏసీబీ దాడుల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే సుధాకర్ కోరినట్లుగా రూ. 5 లక్షలు ఇచ్చేయండి’ అంటూ ఆమె కూడా చక్రపాణికి ఫోన్లో తెలిపారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న సుధాకర్ ఫోన్ నంబరు ఆధారంగా చేసిన దర్యాప్తులో తాజా అంశం బట్టబయలైంది. దీంతో గతంలో వైజాగ్‌లో పనిచేసి ప్రస్తుతం బాపట్ల (Bapatla) రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ప్రమేయం ఈ కేసులో ఉందని పోలీసులు తేల్చారు. ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన సుధాకర్‌తోపాటు, సీఐ స్వర్ణలతను రిమాండ్ నిమిత్తం భీమిలి కోర్టుకు తరలించామని స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపారు.అసలేం జరిగింది? బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బలగ సుధాకర్ వచ్చాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి, తనను ఏసీబీ సీఐగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో మీ ఆఫీసులో రైడ్ జరగబోతోందని, తనకు 5 లక్షల రూపాయలు ఇస్తే దాడుల ముప్పు నుంచి మిమ్మల్ని కాపాడతానని నమ్మబలికాడు. అతడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పీఎం పాలెం పోలీసులకు చక్రపాణి సమాచారం ఇచ్చారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చదవండి: అంతుచూసిన అనుమానం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య
వీడియోలు


కాల్పుల విరమణ వెనుక కండీషన్స్..!


Vikram Misri : కాల్పుల విరమణ


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన


ఒకే దెబ్బ.... 14 మంది పాక్ సైనికులు ఖతం


దేశాన్ని రక్షించడానికి నా సిందూరాన్ని పంపుతున్నా


26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులు.. నేలమట్టం చేసిన భారత సైన్యం


ప్రజలకు ఇవ్వాల్సింది పోయి వారి దగ్గర నుంచే దోచుకుంటున్నారు: Karumuri Nageswara


గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్


సీమ రాజాకు ఇక చుక్కలే. .. అంబటి సంచలన నిర్ణయం


నడిరోడ్డుపై ఒక మహిళను.. వీళ్లు పోలీసులేనా..!