
సాక్షి మీడియాపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి: ఐజేయూ జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులను వేధించడం సరికాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) హితవు పలికింది. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన ఇంట్లో సోదాలు చేయడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఐజేయూ జాతీయ అధ్యక్షులు వినోద్ కోహ్లీ పేర్కొన్నారు.
సాక్షి మీడియాపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. సాక్షాత్తు పత్రికా సంపాదకులను టార్గెట్ చేసుకుని దాడి చేయడం శోచనీయమన్న కోహ్లీ... ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో వైఖరి మార్చుకోవాలని సూచించారు.