Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India And Pakistan War Updates1
IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం

పాకిస్తాన్‌ దుర్మార్గ వైఖరిపై భారత్‌ ఆ‍గ్రహం ⇒ పాకిస్తాన్‌ ఫేక్‌ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి ‍వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్‌ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు హతంజమ్మూ బారాముల్లా, శ్రనగర్‌ టార్గెట్‌గా పాక్‌ డ్రోన్ల దాడులుపంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్‌ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్‌, రాజస్తాన్‌, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌గుజరాత్‌లోని కచ్‌లో పూరిస్థాయిలో బ్లాకౌట్‌డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్‌లోని ఆర్మీ చినార్‌ కోర్స్‌లో హెడ్‌క్వార్టర్‌ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌ విదించాలని ఆదేశాలుపాక్‌ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్‌ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్‌ జరిపిన ఈ చర్యకు భారత్‌ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్‌ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్‌ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్‌ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్‌ఫైర్‌ ఇక లేనట్లే.. కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్‌ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ ఇంతియాజ్‌ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్‌సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్‌లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్‌ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్‌ అవుట్‌3 గంట్లల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్‌, రాజౌరి, పూంచ్‌ సెక్టార్‌ లో కాల్పులుపాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్‌ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌జమ్మూ కశ్మీర్‌ లో పలు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌

TDP Coalition Govt Police Over Action On YSRCP Leader Vidadala Rajini2
రెడ్‌బుక్‌ అండతో ‘ఖాకీ’ కావరం.. 'కారు లోంచి లాగి.. తోసేసి'..

చిలకలూరిపేట: పాలకులు రెడ్‌బుక్‌ మంత్రం జపిస్తుంటే కొంత మంది పోలీసు అధికారులు అందుకు వంత పాడుతూ సభ్యత సంస్కారాలు మరచి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, బీసీ నేత, వైఎస్సార్‌సీపీ నాయకురాలు అని కూడా చూడకుండా విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బనాయుడు రెచ్చిపోయి అనుచితంగా ప్రవర్తించారు. ఎక్కువగా మాట్లాడితే నీపైనా కేసు పెడతానంటూ బెదిరించారు. చెబుతుంటే అర్థం కావడం లేదా.. పక్కకు తప్పుకోండంటూ హూంకరించారు. ఓ దశలో రజినిని కారులోంచి పక్కకు లాగి తోసేసి.. ఆయన కారు­లోకి ఎక్కారు. నడిరోడ్డుపై సీఐ బరితెగింపు చూసి ప్రజలు విస్తుపోయారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, గ్రామ సర్పంచ్‌ బత్తుల సీతారామిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఆయనను పరామర్శించేందుకు శనివారం మధ్యాహ్నం విడదల రజిని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాగానే.. చిలకలూరిపేట రూరల్‌ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్‌ఐ పుల్లారావు, పోలీసు సిబ్బంది ఆమె కారును చుట్టుముట్టారు. తన కారు వద్ద ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఆమె రూరల్‌ సీఐని ప్రశ్నించారు. మీ అనుచరుడు మానుకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఉన్నాయని, అతన్ని అరెస్టు చేయడానికి వచ్చామని సీఐ బదులిచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ లేదా అరెస్టు వారంట్‌ను చూపాలని రజనీ కోరగా.. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సీఐ దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె తన కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, సీఐ వెంటనే ఆమెను కారులో నుంచి దురుసుగా బయటకు లాగారు. కారులోకి ఎక్కి శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. ‘సీఐ గారూ.. ఏమిటీ దురుసు ప్రవర్తన.. ఎఫ్‌ఐఆర్‌ లేదా ఇతర ఆధారాలు చూపి అరెస్టు చేయండి’ అని విడదల రజినీ కోరగా.. సీఐ మరింత రెచ్చిపోయి పక్కకు తప్పుకోవాలని హూంకరించారు. ‘చెబుతుంటే అర్థం కావడం లేదా.. ఎక్కువ మాట్లాడితే నా విధులకు ఆటంకం కల్పించినందుకు నీపై కూడా కేసు పెడతా’ అని బెదిరించారు. ఆమెను పక్కకు నెట్టివేసి శ్రీకాంత్‌రెడ్డిని తీసుకెళ్లిపోయారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డిని ప్రకాశం జిల్లా వైపు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై రూరల్‌ సీఐ సుబ్బానాయడును వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా.. రాష్ట్రంలో మహిళ పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు శృతిమించుతున్నాయి. సభ్యతా సంస్కారాలు మరిచి పోలీసులు వారి పట్ల సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో రాత్రిపూట నైటీలో ఉన్న ఎస్సీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు వి.కల్పనను విచక్షణ మరచి అరెస్ట్‌ చేశారు. రెండు నిమిషాల్లో చీర కట్టుకుని వస్తానన్నా కూడా వినిపించుకోకుండా నైటీ మీదుగానే జీప్‌ ఎక్కించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతున్న తీరుకు అద్దం పడుతున్నాయి. ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం దారుణం అని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని రెచ్చిపోతే మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని కొందరు పోలీసులు మరచిపోయి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

Indian Army Briefing On India Operation Sindoor3
దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం: భారత ఆర్మీ

న్యూఢిల్లీ: భారత్‍, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈరోజు(శనివారం) సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయగా, దీన్ని భారత కూడా ధృవీకరించడంతో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ముగింపు దొరికింది.అనంతరం ఇండియన్ ఆర్మీ.. ప్రెస్ మీట్ నిర్వహించింది. ‘ దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల యుద్ధంలో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాక్ తప్పుడు కథనాలు ప్రచారం చేసింది. భారత్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు అసత్య ప్రచారం చేశారు. పాక్ చెప్పినట్లు.. భారత్ ఆర్మీకి ఏమీ నష్టం జరగలేదు. భారత సైన్యం.. పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది. భారత్ పై కవ్వింపు చర్యలకు దిగి, పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఎల్ఓసీ దగ్గర పాక్ తీవ్రంగా నష్టపోయింది. బారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది’ అని భారత ఆర్మీ స్పష్టం చేసింది.భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణభారత్‌-పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం(శనివారం, మే10) 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.ట్రంప్‌ పెద్దన్న పాత్రఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్దన్న పాత్రలో ఇరు దేశాల మధ్య రాజీ కోసం ప్రయత్నించారు. కాల్పుల విరమణకు అమెరికాను పాకిస్తాన్‌ ఆశ్రయించడంతో ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహించి భారత్‌తో చర్చించారు. దీనికి భారత్‌ కూడా అంగీకరించి మే 12వ తేదీన పాక్‌తో చర్చలకు సిద్ధమైంది.

Pakistan air defence system destroyed by India4
పాక్‌ రెక్కలు కత్తిరించాం

యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్‌ పంచ్‌ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్‌ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్‌ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్‌ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్‌ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్‌ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్‌ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్‌ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.వైమానిక స్థావరాలుచకాలానూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్‌–78 విమానాలకు స్థావరం. పాక్‌ ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌కు ప్రధాన కేంద్రం కూడా. భారత్‌తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్‌ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్‌పై జరిపిన డ్రోన్‌ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్‌ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్‌. పాక్‌ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్‌పోర్ట్‌ స్క్వాడ్రన్లకు అడ్డా. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్‌ వైమానిక దళ (పీఏఎఫ్‌) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్‌ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్‌బార్న్‌ అర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్‌ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్‌ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్‌బేస్‌పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్‌లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.రఫీకీపంజాబ్‌ ప్రావిన్స్‌లో జాంగ్‌ జిల్లాలోని షోర్‌కోట్‌లో ఇస్లామాబాద్‌కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్‌కోట్‌ బేస్‌గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్‌ లీడర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్‌ కొనుగోలు చేసిన జేఎఫ్‌–17, మిరాజ్‌ వంటి అత్యాధునిక ఫైటర్‌ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్‌బేస్‌ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్‌ పంజాబ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్‌వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్‌ రక్షణ నెట్‌వర్క్‌లో అతి కీలకమైన భాగమిది.మురీద్‌చక్వాల్‌ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్‌–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్‌ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్‌పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్‌ డ్రోన్‌ వార్‌ఫేర్‌కు చక్వాల్‌ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్‌ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్‌ దాడులకు ప్రతి చర్యగా మురీద్‌ ఎయిర్‌ బేస్‌ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.రహీం యార్‌ఖాన్‌దక్షిణ పంజాబ్‌లో రహీం యార్‌ఖాన్‌ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్‌ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్, జైసల్మేర్‌ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్‌తో పాటు ఇక్కడి రన్‌వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.సుక్కుర్‌భొలారీ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. సింధ్‌ ప్రావిన్స్‌లో కరాచీ, హైదరాబాద్‌ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేశారు. సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్‌ కన్వర్షన్‌ యూనిట్‌ తాలూకు 19 స్క్వాడ్రన్‌కు కేంద్రం. ఎఫ్‌–15ఏ, ఎఫ్‌–16, కొన్ని జేఎఫ్‌–17లతో పాటు ఏడీఎఫ్‌ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్‌ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్‌ సపోర్ట్‌ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్‌ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్‌ఏఏబీ 2000 ఎయిర్‌బార్న్‌ అర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్‌) ఉంది.రాడార్‌ కేంద్రాలుసియాల్‌కోట్‌పంజాబ్‌లోని సియాల్‌కోట్‌ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్‌ కేంద్రం వైమానికంగా పాక్‌కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.పస్రూర్‌ఇది కూడా పంజాబ్‌లోనే సియాల్‌కోట్‌ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్‌ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.చునియన్‌పంజాబ్‌ ప్రావిన్స్‌లో లాహోర్‌కు 70 కి.మీ. దూరంలో చునియన్‌ వద్ద ఉంటుంది. పాక్‌లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Asaduddin Owaisi Sensational Comments On Pakistan5
పాకిస్థాన్‌పై అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. భారత్‌ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాక్‌ దాడులకు మించి భారత్‌ దాడి చేస్తుందన్నారు. ‘‘దేవుడి దయతో మనం భారత భూమిని జన్మించాం. భారత భూమి కోసం ప్రాణాలైన ఇస్తాం. ఇస్లాం పేరుతో పాక్‌ అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు’’ అని అసదుద్దీన్‌ పేర్కొన్నారు.పాకిస్థాన్‌ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అసదుద్దీన్‌ అన్నారు. ఇస్లాం పేరుతో పాకిస్థాన్‌ మారణహోమం సృష్టిస్తుంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపడం దారుణమన్నారు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బతకాలి’ అని అసదుద్దీన్‌ అన్నారు.

Sakshi Guest Column On Fake News in Social Media6
ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త సుమా!

దేశం యుద్ధ పరిస్థితుల్లో కూరుకుపోయిన సమయంలో శత్రువులు మన ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికీ, తమదే పైచేయి అని చెప్పడానికీ అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. అదే సమయంలో కొందరు భారతీయులూ సోషల్‌ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇష్టమొచ్చినట్లు రాశారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ హక్కును అనుసరించి ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను, నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని దుర్వినియోగపరచడం క్షంతవ్యం కాదు. పహెల్‌గామ్‌లో పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. పాక్‌ ప్రభుత్వ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌ను భారత్‌లో అందుబాటులో లేకుండా నిలిపి వేసింది. పలువురు పాక్‌ జర్నలిస్టులకు చెందిన ఎక్స్‌ ఖాతాలను కూడా నిషేధించింది. తప్పుడు, రెచ్చ గొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్తాన్‌ యూట్యూబ్‌ చానళ్లపై కూడా నిషేధం విధించింది. ఇందులో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్‌ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్,ద పాకిస్తాన్‌ రిఫరెన్స్‌ తదితర యూ ట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్‌ రక్షణ మంత్రి ఎక్స్‌ ఖాతాను కూడా నిలిపివేసింది. అలాగే పాక్‌ సినిమాల ప్రదర్శనపైనా నిషే«దం అమలులోకి వచ్చింది. అలాగే భారత్‌లోని అనేక వెబ్‌సైట్లనూ, యూట్యూబ్‌ చానళ్లనూ ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. అందులో ‘ద వైర్‌’ న్యూస్‌ పోర్టల్‌ ఒకటి. ఇటువంటి వెబ్‌సైట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం న్యాయం కాదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రెటరీ డి.రాజా ఖండించారు. ‘ద వైర్‌’ వంటి వెబ్‌సైట్‌ను నిషేధించవలసిన అవసరం లేదు. ఆ పేరుమీద పత్రికా స్వేచ్ఛను నిలిపివేయడం న్యాయం కాదు. జాతీయ సమగ్రత కోసం పహెల్‌గామ్‌లో ఉగ్రవాదుల చర్యను ఖండించడం మంచిదే కాని, వైర్‌ను నిషేధించడం న్యాయం కాదని ‘ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌’ న్యాయవాదీ, ఫౌండర్‌ డైరెక్టర్‌ అయిన అపర్‌ గుప్తా అన్నారు. ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయడం పరోక్ష యుద్ధంలో భాగం. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్‌పై సూసైడ్‌ దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏడు వీడియోలు పరిశీలించి అన్నీ అబద్ధాలే అని తేల్చింది. పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్‌ దాడి జరిగినట్లు వచ్చిన వార్త కూడా కల్పితమే అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓ పాత వీడియోపై కూడా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆ క్షిపణి దాడి 2020లో లెబనాన్‌లోని బీరూట్‌లో జరిగిన పేలుడు ఘటన అని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌... ఆర్మీ కంటోన్మెంట్‌పై ఫిదాయీ సూసైడ్‌ దాడి జరగ లేదని చాలా స్పష్టంగా వెల్లడించింది. ఇండియన్‌ ఆర్మీ పోస్టును పాకిస్తానీ దళాలు ధ్వంసం చేసినట్లు ప్రచారం అయిన మరో వీడియో కూడా ఫేక్‌ అని ప్రభుత్వం తేల్చింది. భారతీయ సైన్యంలో 20 రాజ్‌ బెటాలి యన్‌ అనే యూనిట్‌ లేనే లేదని ఫ్యాక్ట్‌ చెక్‌ పేర్కొన్నది. పాకిస్తాన్‌లోని ప్రధాన మీడియాతో పాటు కొందరు సోషల్‌ మీడియాలో భారత ప్రజల్లో భయాందోళనలు కలిగించే లక్ష్యంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేశారు. ఏది వాస్తవమో, ఏదికాదో తేల్చుకోవలసింది మనమే!మాడభూషి శ్రీధర్‌ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్‌ ఆఫ్‌ లా’ ప్రొఫెసర్‌

Opening ceremonies of Miss World competitions were a huge success7
అందం.. ఆత్మవిశ్వాసం

సాక్షి, హైదరాబాద్‌: శనివారం సాయంత్రం.. భాగ్యనగరం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం.. అందం.. ఆత్మవిశ్వాసం.. అభినయం.. కలిసి కవాతు చేశాయి..ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలను సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్‌ వరల్డ్‌ 72వ ఎడిషన్‌ పోటీలు హైదరాబాద్‌ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి 109 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పోటీదారులైన అందగత్తెలు లయబద్ధమైన పాశ్చాత్య సంగీత హోరుకు తగ్గట్టుగా అభినయిస్తూ తమను తాము పరిచయం చేసుకోగా, ఆయా సుందరీమణుల బృందాన్ని తెలంగాణ సంప్రదాయ కళాకారుల బృందం నర్తిస్తూ వేదిక మీదకు స్వాగతించింది. ఒకవైపు పాశ్చాత్య సంగీతం.. మరోవైపు తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం.. వెరసి ఓ జుగల్‌బందీగా ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశాయి. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం ప్రేక్షకులను ఆసాంతం అలరించింది. జయ జయహే తెలంగాణ ఆలాపనతో.. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో పరిమిత సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మధ్య ప్రపంచ సుందరి పోటీల పరిచయ కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం ఆరున్నరకు తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. గాయకుడు సంగీత శిక్షకుడు రామాచారి శిష్యులు 50 మంది ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించి ఆకట్టుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన సంగీత శిక్షణ కేంద్రాల కళాకారిణులు 250 మంది పేరిణి నృత్య రూపాన్ని ప్రదర్శించారు. ‘హంస నడకలతో అందమే సాగెనే... అరవిరిసిన..’ అంటూ ప్రపంచ సుందరి పోటీలకు సరిపోయే గీతాన్ని ఎంచుకున్న తీరు ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగా కళాకారిణులు నర్తించి పరవశింపజేశారు. అంత పెద్ద సంఖ్యలో కళాకారిణులు స్టేడియం మొత్తం కలిగి తిరుగుతూ నర్తించటం, మధ్యలో సీతాకోకచిలుక, నక్షత్రం, మిస్‌ వరల్డ్‌ లోగో ఆకృతిని ఆవిష్కరించడం అబ్బురపరిచింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఈ నృత్య కార్యక్రమానికి పేరిణి సందీప్‌ నృత్య దర్శకత్వం వహించగా, ఫణి నారాయణ స్వరాలు సమకూర్చారు. ఖండాల వారీగా నాలుగు బృందాలుగా.. ప్రారంభ వేడుకల్లో 109 దేశాల సుందరీమణులు పాల్గొన్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వీరిని ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించారు. తొలుత తెలంగాణకు చెందిన ఒక్కో సంప్రదాయ కళా బృందం ప్రదర్శన ఇవ్వగా, ఆ వెంటనే ఒక్కో బృందం చొప్పున సుందరీమణులు స్టేడియంలోకి వచ్చి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ ఆధ్వర్యంలో కొమ్ము కోయ బృందం కోయ డప్పు నృత్యం ప్రదర్శించారు. ఆ వెంటనే అమెరికా–కరేబియన్‌ దేశాలకు చెందిన తొలి సుందరీమణుల బృందం వచ్చింది. నిర్వాహకులు దేశాల వారీగా పిలవగానే ఆయా దేశాల ప్రతినిధులు ఒక్కొక్కరు పాశ్చాత్య బీట్‌కు తగ్గట్టుగా నర్తిస్తూ అభివాదం చేసుకుంటూ పరిచయం చేసుకున్నారు. తొలుత అర్జెంటీనా సుందరీమణి రాగా, చివరగా వెనిజువెలా అందెగత్తె వచ్చింది. అనంతరం గోండు గుస్సాడీ కళాకారులు శ్రీధర్‌ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే ఆప్రికా ఖండానికి చెందిన దేశాల సుందరీమణులు వచ్చి పరిచయం చేసుకున్నారు. అంగోలా సుందరీమణి ముందు రాగా, చివరగా జింబాబ్వే దేశానికి చెందిన పోటీదారు వచ్చింది. అనంతరం 14 మంది లంబాడీ డప్పు కళాకారులు స్వప్న, అందె భాస్కర్‌ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే యూరప్‌ ఖండానికి చెందిన దేశాల పోటీదారులు వచ్చి పరిచయం చేసుకున్నారు. చివరగా ఒగ్గు డోలు బృందం కళాకారులు 18 మంది ఒగ్గు రవికుమార్‌ ఆధ్వర్యంలో కళారూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా హ్యూమన్‌ పిరమిడ్‌ ఏర్పాటు చేసి పైకి ఎక్కిన కళాకారుడు జాతీయ జెండాను రెపరెపలాడేలా చేసిన తీరు ఆకట్టుకుంది. అనంతరం ఆసియా–ఓíÙయానా దేశాల ప్రతినిధులు స్టేడియంలోకి వచ్చి పరిచయం చేసుకున్నారు. మిస్‌ ఇండియా నందినీ గుప్తా రాగానే మార్మోగిన స్టేడియం.. చివరి బృందంలో భాగంగా మిస్‌ ఇండియా వరల్డ్‌ నందినీ గుప్తా వచ్చినప్పుడు స్డేడియం చప్పట్లు, ఈలలు, కేరింతలతో మార్మోగింది. గోకులంలో గోపిక వస్త్రధారణతో నందినీ గుప్తా స్టేడియంలోకి వచ్చారు. వేషధారణకు తగ్గట్టు తన పరిచయంలో భాగంగా ఆమె కవ్వంతో వెన్న చిలికే అభినయంతో రావటం విశేషం. నేపాల్‌కు చెందిన సుందరీమణి గులాబీ డిజైన్, అదే రంగు రవికతో తెలుపు రంగు చీరకట్టుతో రావటం ఆకట్టుకుంది. బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులు కూడా హాజరుకాగా.. థాయిలాండ్‌ సుందరీమణి చీరకట్టును పోలిన వస్త్రధారణతో వచ్చింది. శ్రీలంక యువతి నమస్కార ముద్రతో పరిచయం చేసుకుంది. చివరలో వచ్చిన వియత్నాం సుందరి వేగంగా నర్తిస్తూ ఆకట్టుకుంది. ఆ్రస్టేలియా యువతి కౌబాయ్‌ గెటప్‌లో వచ్చింది. పోటీలు ప్రారంభమైనట్టు ప్రకటించిన సీఎం పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ జూలియా మోర్లే, ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనా పిస్కోవాలు పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. అనంతరం ఆ ఇద్దరితో కలిసి ప్రపంచ సుందరి 72వ ఎడిషన్‌ పోటీలు ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహూతులు, పోటీదారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత పోటీదారులు అందరూ స్టేడియంలోకి వారివారి జాతీయ జెండాలు చేతపట్టుకుని ఊపుతూ వచ్చారు. చివరగా భారత పతాకాన్ని చేతబూని మిస్‌ ఇండియా వరల్డ్‌ నందినీ గుప్తా వచ్చారు. అప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అంతా ప్రపంచ శాంతిని కాంక్షించే మిస్‌ వరల్డ్‌ గీతాన్ని బృంద గానంగా ఆలపించారు. – భారత దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అసమాన ప్రదర్శన చాటిన సైనికులకు వందనం సమరి్పస్తున్నట్టు వ్యాఖ్యాత ప్రకటించినప్పుడు ‘జైహింద్‌’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. చివరకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ప్రారంభ వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నగర మేయర్‌ విజయలక్ష్మిమ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. గొప్ప నగరంలో ఉన్నందుకు పులకిస్తున్నాం: మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనా పిస్కోవా ‘నమస్తే హైదరాబాద్‌.. నమస్తే తెలంగాణ. ఈ అద్భుతమైన నగరంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల ప్రారంభోత్సవంలో మీ అందరితో కలిసి పాల్గొనటం నాకు గర్వంగా ఉంది. ఈ అద్భుత దేశం, గొప్ప సాంస్కృతిక కేంద్రంలో మేము ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ అనే అద్భుత కార్యక్రమంలో ఐక్యతను చాటుతూ పాల్గొంటున్నాం. తెలంగాణ సంప్రదాయాలు, గొప్ప చరిత్ర, అద్భుత ఆతిథ్యం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మిస్‌ వరల్డ్‌ అనేది కేవలం అందం గురించి మాత్రమే కాదు. ఇది ప్రపంచంలో ఓ మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో సాగుతుంది. విద్య, సాధికారత, సమాజ సేవ ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచడం ఇందులో భాగం. 109 దేశాల నుంచి వచ్చిన మహిళలు గొప్ప లక్ష్యంతో ఒక్కటిగా ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇప్పుడు హైదరాబాద్‌ సరైన వేదికగా నిలి చింది. ఈ నగరంలో సంప్రదాయం–ఆధునికత ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఇక్కడి ఆతిథ్యానికి, ,హృదయపూర్వక స్వాగతానికి ధన్యవాదాలు..’ అని మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనా పిస్కోవా అన్నారు.

Bride Sends Soldier Husband to Duty With Emotional Tribute8
వార్‌ జోన్‌.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం

పాకిస్తాన్‌ తో యుద్ధం వేళ.. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దుకావడంతో అంతా విధుల్లోకి తిరిగి హాజరయ్యే పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలోనే పెళ్లైన ఓ జవాన్‌ విధుల్లోకి హాజరయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మనోజ్‌ పాటిల్‌ మే 5వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పారామిలటరీ బలగాలు అంతా విధులకు హాజరు కావాలనే ఆదేశాల నేపథ్యంలో మనోజ్‌ పాటిల్‌ తిరిగి విధుల్లో చేరాడు. పెళ్లైన మూడు రోజులకే విధులకు హాజరయ్యాడు. అయితే నవ వధువు తన భర్తను దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి పంపి అందరికీ ఆదర్శంగా నిలవగా.. ఈ నూతన వధూవరుణ కథే దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఆ నవ వధువు దేశ భక్తిని అంతా కొనియాడుతున్నారు. తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపిన వనిత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.सगळ काही भारत मातेसाठी...लग्नाच्या तीन दिवसांनंतर महाराष्ट्राचे सुपूत्र मनोज पाटील देश सेवेसाठी रवाना... #oprationsindoor #IndianNavyAction #IndiaPakistanTensions #jalgaonnews #India #army #manojpatil #देशसेवा pic.twitter.com/1gmbhYcoTD— Ganesh Pokale... (@P_Ganesh_07) May 9, 2025

specialties about SAMAR, AD Gun, Pechora in india9
ఇండియా ప‌వ‌ర్‌ఫుల్ వెప‌న్స్‌.. శ‌త్రువులకు సింహ‌స్వ‌ప్నం!

పాక్‌ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్‌ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్‌–400, ఆకాశ్‌ ఎన్‌జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్‌ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది సోవియట్‌ కాలంనాటి మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ (ఎస్‌ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్‌–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్‌ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్‌ ఆధారిత మిసైల్‌ లాంచర్, ఫైర్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్‌ యాంటెన్నాలతో కూడిన 4ఆర్‌90 యత్నాగన్‌ రాడార్‌ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్‌ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కౌంటర్‌ అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ (సీఏయూఎస్‌). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్‌ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్‌ గ్రిడ్‌ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్‌ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్‌ డిటెక్షన్, సాఫ్ట్‌/హార్డ్‌ కిల్‌ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్‌ (ఎలక్ట్రో–ఆప్టికల్‌/ఇన్‌ఫ్రారెడ్‌) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్‌ కిల్‌ (డ్రోన్ల కమ్యూనికేషన్‌ సిగ్నల్స్‌ జామింగ్‌), హార్డ్‌ కిల్‌ (నేలకూల్చడం) చేస్తుంది.సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ ఫర్‌ అష్యూర్డ్‌ రిటాలియేషన్‌ (సమర్‌). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్‌ కమాండ్‌ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్‌ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్‌జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్‌–1 వ్యవస్థ ఆర్‌–73ఈ, సమర్‌–2 ఆర్‌–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్‌–73ఈ మిసైళ్ల రేంజ్‌ 8 కి.మీ. ఆర్‌–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.→ ఎల్‌–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్‌. తొలుత స్వీడిష్‌ కంపెనీ బోఫోర్స్‌ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్‌ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ వంటివాటి ద్వారా ఎల్‌–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్‌. షిల్కా అనేది వీటి రష్యన్‌ నిక్‌నేమ్‌. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Selute to indian army soldier Mothers10
వీరమాతకు వందనం

యుద్ధంలో బిడ్డను కోల్పోయిన దుఃఖం ఒకవైపు. ‘దేశమాత కోసం నా బిడ్డప్రాణత్యాగం చేశాడు’... అనే గర్వం ఒకవైపు... ఎంతోమంది వీరమాతలు... అందరికీ వందనం...యుద్ధ చరిత్రలోకి ఒకసారి...గర్వంగా అనిపించింది...కొన్ని సంవత్సరాల క్రితం... ఉగ్రవాదులతో జరిగిన పోరులో నలుగురిని చంపేశాడు లెఫ్టినెంట్‌ నవదీప్‌సింగ్‌. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూనే నేలకొరిగాడు 26 సంవత్సరాల ఆ యువకుడు. ‘నేనంటే నవదీప్‌కు ఎంత ఇష్టమో చెప్పడానికి మాటలు చాలవు. ఫ్రెండులా ఎన్నో కబుర్లు చెబుతుండేవాడు. నవదీప్‌ లేడు అనే వాస్తవం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికీ కలలో ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాడు. అమ్మా...నేను వస్తున్నాను అనే మాట వినబడితే సంతోషంగా అనిపించేది. లెఫ్టినెంట్‌ నవదీప్‌సింగ్‌ తల్లి కౌర్‌ ఇక ఆ మాట ఎప్పుడూ వినిపించదు. ఉగ్రవాదులను నవదీప్‌ దీటుగా ఎదుర్కోకపోతే ఎంతో నష్టం జరిగి ఉండేది... అని పై అధికారులు చెప్పినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నవదీప్‌ నా బిడ్డ. అతడు చనిపోయినప్పుడు నేనే కాదు.. ఎంతోమంది తల్లులు సొంత బిడ్డను కోల్పోయినట్లు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది. దేశం కోసం పోరాడే వీరసైనికుడికి ఒక్కరే అమ్మ ఉండదు. దేశంలోని ప్రతి అమ్మ తన అమ్మే’ అంటుంది పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన నవదీప్‌సింగ్‌ తల్లి కౌర్‌.ఇంటికి ఎప్పుడొస్తావు బిడ్డ?ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ నియోజక వర్గం కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్‌ మురళీనాయక్‌ పాక్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. ఆ తల్లి దుఃఖ భాషను అర్థం చేసుకోగలమా? కుమారుడు మురళీనాయక్‌ మరణం గురించి అడిగినప్పుడు ‘ఏమని చెప్పాలి సామీ’ అని ఆ తల్లి భోరున విలపించింది. మురళీనాయక్‌ పార్థివదేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చారు. వారు తనలాగే ఏడ్చారు. అమ్మా... నీ కొడుకు ఎంత గొప్ప వీరుడో చూశావా! ‘ఆర్మీ జవాన్‌ మురళీ నాయక్‌ తల్లి’ అని తనను పరిచయం చేస్తున్న సమయంలో ఆ తల్లి హృదయం గర్వంతో పొంగిపోతుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఆ వీరమాతలందరికీ వందనం.కవాతు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి!జమ్మూ కశ్మీర్‌ దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్‌ బ్రిజేష్‌ థాప వీరమరణం పొందాడు. ‘బ్రిజేష్‌ ఇక లేడు అనే వార్త విని కుప్పకూలిపోయాను. మా అబ్బాయి అని చెప్పడం కాదుగానీ చాలా క్రమశిక్షణ ఉన్న కుర్రాడు. ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లోనే నేను సైన్యంలో చేరుతాను అనేవాడు. సైన్యంలో పనిచేయడం చాలా కష్టం అని చెబుతుండేదాన్ని. ఎంత కష్టమైనా సైన్యంలోకి వెళతాను అనేవాడు. బ్రిజేష్‌ లేడనే వాస్తవం కష్టంగా ఉన్నా సరే... దేశం కోసం నా కుమారుడుప్రాణాలు అర్పించాడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది’ అంటారు నీలిమ థాప. సైనిక దుస్తుల్లో కుమారుడిని చూసిన తొలి క్షణం నీలిమ భావోద్వేగానికి గురయ్యారు.ఎప్పటి కల అది! నాన్న యూనిఫామ్‌ వేసుకొని చిన్నారి బ్రిజేష్‌ మార్చ్‌ చేస్తుండేవాడు (బ్రిజేష్‌ తండ్రి మిలిటరీలో పనిచేశారు) కుమారుడిని చూసి ‘మేజర్‌ సాబ్‌ వచ్చేశారు’ అని నవ్వేది.ఇప్పుడిక ఆమెకు నవ్వే అవకాశమే లేకపోవచ్చు. కన్నీటి సముద్రంలో దిక్కుతోచకుండా ఉన్నట్లుగానే ఉండవచ్చు. అయితే... కుమారుడి ధైర్యసాహసాల గురించి విన్నప్పుడు ఆ తల్లి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. ‘కెప్టెన్‌ బ్రిజేష్‌ థాప’ అని కుమారుడి పేరు విన్నప్పుడల్లా... ఆర్మీ అధికారుల కవాతు శబ్దాలు ఆమెకు వినిపిస్తూనే ఉంటాయి.ఆ తల్లి ఎలా తట్టుకుందో!‘పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకం’ అంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన మంజుల. ఇండియా–చైనా యుద్ధంలో ఆమె కుమారుడు కల్నల్‌ సంతోష్‌బాబు కన్నుమూశాడు. చదువులోనే కాదు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండే కొడుకును చూసి మంజుల గర్వించేది. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంతోష్‌ మరణం గురించి మంజులకు తెలియజేశారు. ఆ తల్లి గుండె ఎలా తట్టుకుందో తెలియదు. కల్నల్‌ సంతోష్‌ బాబు, తల్లి మంజులకుమారుడి బాల్యవిశేషాలు, క్రమశిక్షణ గురించి కళ్లకు కట్టినట్లు చెప్పే మంజుల కుమారుడి మరణం గురించి.. ‘మన దేశం కోసం మా అబ్బాయి వీరమరణం పొందాడు’ అని గర్వంతో చెబుతుంది. ‘ఒక్కడే బాబు నాకు...’ అంటున్న ఆ తల్లి కంఠానికి కన్నీళ్లు అడ్డుపడి మాటలు రావు. ఆమె మనసులో కనిపించని దుఃఖసముద్రాలు ఉండవచ్చుగాక... కానీ ఆమె పదే పదే చెబుతుంది...‘నా బిడ్డ మన దేశం కోసం చనిపోయాడు’.ఎక్కడ ఉన్నా అమ్మ గురించే‘కెప్టెన్‌ సౌరభ్‌ కాలియ బయట ఎలా ఉంటాడో తెలియదుగానీ ఇంట్లో మాత్రం చిలిపి’ అంటుంది అతడి తల్లి విజయ కాలియ. ‘మేరా పాస్‌ మా హై’ అని తల్లి గురించి సరదాగానే సినిమా డైలాగు చెబుతుండేవాడుగానీ... నిజంగా తల్లి సౌరభ్‌ ధైర్యం. సైన్యం. ‘ఒకరోజు సౌరభ్‌ వంటగదిలోకి వచ్చి సైన్‌ చేసిన బ్లాంక్‌ చెక్‌ ఇచ్చాడు. ఎందుకు? అని అడిగితే ‘నేను ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మనీ విత్‌డ్రా చేసుకోవడానికి’ అన్నాడు. తాను ఎక్కడ ఉన్నా నా గురించే ఆలోచించేవాడు’ అంటుంది విజయ.ఇప్పుడు ‘కాలియ హోమ్‌’లో ఆ బ్లాంక్‌ చెక్‌ కనిపిస్తూనే ఉంటుంది. ఆ చెక్‌ను చూసినప్పుడల్లా కుమారుడిని చూసినట్లుగానే ఉంటుంది. ‘డబ్బును డ్రా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ కాగితంపై నా బిడ్డ చేసిన సంతకం ఉంది. అది నాకోసం చేసింది. ఇది ఎప్పటికీ తీయటి జ్ఞాపకంగా ఉండిపోతుంది’ అంటుంది విజయ. చివరిసారిగా తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి ఫోన్‌ చేశాడు సౌరభ్‌.‘నా పుట్టిన రోజుకు తప్పకుండా ఇంటికి వస్తాను అన్నాడు. ఆ రోజు ఇప్పటికీ రాలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతుంది విజయ. 23 ఏళ్లు నిండకుండానే కార్గిల్‌ యుద్ధంలో సౌరభ్‌ చనిపోయాడు. హిమాచల్‌ద్రేశ్‌లోని పలంపూర్‌ ఇంట్లో ఒక గది మొత్తాన్ని సౌరభ్‌ మ్యూజియంగా మార్చారు. ‘ఈ మ్యూజియంలోకి వస్తే మా అబ్బాయి దగ్గరకి వచ్చినట్లే ఉంటుంది’ అంటుంది విజయ.నా కుమారుడు... వీరుడుఆ అమ్మ పేరు త్రిప్తా థాపర్‌... ఆమె కళ్లలో ఒకవైపు అంతులేని దుఃఖం, మరోవైపు గర్వం కనిపిస్తాయి. కార్గిల్‌ యుద్ధంలో థాపర్‌ తన కుమారుడిని కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో మహు పట్టణంలోని మిలిటరీ కంటోన్మెంట్‌ మ్యూజియంలో కార్గిల్‌ యుద్ధ దృశ్యాలను, కుమారుడి ఫోటోను చూస్తున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు.ఇరవై రెండు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విజయంత్‌ థాపర్‌ కార్గిల్‌ వార్‌ హీరో. తన దళంతో శత్రువుల బంకర్‌ ను చుట్టుముట్టే క్రమంలో విజయంత్‌ థాపర్‌ మరణించాడు.వీర్‌చక్ర విజయంత్‌ థాపర్‌ ,తల్లి త్రిప్తా థాపర్‌ ‘వీర్‌చక్ర విజయంత్‌ థాపర్‌ అమ్మగారు అని నన్ను పరిచయం చేస్తుంటారు. వీర్‌చక్ర అతడి పేరులో శాశ్వతంగా కలిసిపోయింది’ అని విజయంత్‌ గురించి గర్వంగా చెబుతుంది త్రిప్తా థాపర్‌. ఆమె దృష్టిలో అది మ్యూజియం కాదు. పవిత్ర స్థలం. ‘ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఫోటో ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దేశం కోసం చిన్న వయసులోనే జీవితాన్ని త్యాగం చేసిన వీరులను పదే పదే తలుచుకునేలా చేస్తుంది’ అంటుంది థాపర్‌. తన సన్నిహిత మిత్రురాలు పూనమ్‌ సైనీతో కలిసి తరచు ఈ మ్యూజియమ్‌కు వస్తుంటుంది త్రిప్తా థాపర్‌.ఎప్పుడు వచ్చినా కుమారుడి దగ్గరికి వచ్చినట్లే ఉంటుంది ఆ తల్లికి. బ్యాగులు సర్దుకొని ఇల్లు వదిలే ముందు... ‘అమ్మా... ఆరోగ్యం జాగ్రత్త’ అని చెప్పేవాడు. గంభీరంగా కనిపించే అతడి కళ్లలో అమ్మను విడిచి వెళ్లే ముందు సన్నని కన్నీటి పొర కనిపించేది. అయితే అమ్మకు ఆ కన్నీటి ఆనవాలు కనిపించకుండా తన చిరునవ్వు చాటున దాచేవాడు. ‘అమ్మా, కొడుకుల అనుబంధం గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అని కన్నీళ్లు తుడుచుకుంటుంది త్రిప్తా థాపర్‌ స్నేహితురాలు పూనమ్‌.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement