Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Indian Army Operation Sindoor POK Over Pahalgam Live Updates1
ఆపరేషన్‌ సింధూర్‌: పాకిస్తాన్‌లో టెన్షన్‌.. ఎయిర్‌పోర్టులు బంద్‌

Indian Army Operation Sindoor Updates.. త్రివిధ దళాల మీడియా సమావేశం..ఉదయం 10:30 కు ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశంసమావేశంలో పాల్గొననున్న రక్షణ, విదేశాంగ, ఆర్మీ ప్రతినిధులుఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులను వివరించనున్న ఆర్మీ.ఐదు భారత్ ఫైటర్ జెట్లను కూల్చేశామని చెబుతున్న పాకిస్తాన్Graphic representation of the targets taken by the Indian Armed Forces under #OperationSindoor in Pakistan and PoJK https://t.co/cEasBn51U9 pic.twitter.com/HMONRGQxWW— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన ఖర్గే..పాకిస్తాన్ మరియు పిఓకె నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉంది.పాకిస్తాన్‌, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత దళాల దాడి పట్ల చాలా గర్వపడుతున్నాం.భారత ఆర్మీ దృఢ సంకల్పం మరియు ధైర్యాన్ని మేము అభినందిస్తున్నాము.జాతీయ ఐక్యత, సంఘీభావం ఈ సమయంలో అవసరంభారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది.మన నాయకులు గతంలో మార్గాన్ని చూపించారు.జాతీయ ఆసక్తి మాకు అత్యున్నతమైనది. India has an unflinching National Policy against all forms of terrorism emanating from Pakistan and PoK. We are extremely proud of our Indian Armed Forces who have stuck terror camps in Pakistan and PoK. We applaud their resolute resolve and courage. Since the day of the…— Mallikarjun Kharge (@kharge) May 7, 2025ఆపరేషన్‌ సిందూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.భారతీయ పౌరుడిగా మన సాయుధ దళాలతో బలంగా నిలబడి ఉండాలి...పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద స్థావరాల పై ఆర్మీ జరిపిన దాడి మానకు గర్వకారణం.జాతీయ ఐక్యత కోసం అందరం కలిసి పనిచేద్దాంఈ సమయంలో మనమందరం ఒకే గొంతులో మాట్లాడదాం.. జై హింద్!#ఆపరేషన్ సిందూర్As an Indian citizen first, standing strongly with our armed forces. The strikes against terror factories in Pakistan & PoK make us proud. Let us make this a moment for national solidarity and unity, and all of us speak in one voice - Jai Hind!#OperationSindoor— Revanth Reddy (@revanth_anumula) May 7, 2025 భారత్‌కు ఇజ్రాయెల్‌ మద్దతు..ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారిఆత్మ రక్షణ నిమిత్తం దాడి చేసే హక్కు భారత్‌కు ఉందన్న ఇజ్రాయెల్ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోందని, దానికి తమ మద్దతు ఉంటుందని తెలిపిన రూవెన్‌ అజర్‌అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలన్న రూవెన్‌భారత్‌ దాడుల్ని స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్‌ ఒవైసీ ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నాంపహల్గాం లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారుపాకిస్తాన్‌ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాల్సిందే.. జైహింద్‌ मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025 ఆపరేషన్‌ సిందూర్‌పై రాహుల్‌ గాంధీ స్పందన ఇదే..ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌ పోస్ట్‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్‌’ Proud of our Armed Forces. Jai Hind!— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025 భారత సైన్యానికి మా మద్దతు: కాంగ్రెస్‌పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత సైన్యంసైన్యం చర్యలకు మద్దతు ఇస్తున్నామని తెలిపిన కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ఆపరేషన్‌ సిందూర్‌పై కేంద్ర మంత్రి జైశంకర్‌ పోస్ట్ఉగ్రవాదాన్ని సహించకూడదన్న కేంద్ర మంత్రి జైశంకర్‌ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని వ్యాఖ్యలుసరిహద్దుల నుంచే దాడులు.. ఆపరేషన్‌ సిందూర్‌పై 10 గంటలకు మీడియా సమావేశంభారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులుఆపరేషన్‌ సిందూర్‌.. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్త ఆపరేషన్‌ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు పేర్కొన్న భారత భద్రతా వర్గాలుఇంటెలిజెన్స్‌ వర్గాల సహకారంతో దాడిభారత భూభాగం నుంచే దాడులు నిర్వహించినట్లు పేర్కొన్న ఆర్మీ వర్గాలు ఆపరేషన్ సిందూర్‌లో 80 టెర్రరిస్టుల మృతిఆపరేషన్ జరిగిన ప్రాంతాలు1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - LeT3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్‌కోట్ - HM5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - LeT6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - HM8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - LeT9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎంసరిహద్దుల్లో టెన్షన్‌..భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ఆక్టివేట్ చేసిన భారత్రాఫెల్ యుద్ధ విమానాలతో మిసైల్స్ ఉపయోగించిన భారత్తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని అంగీకరించిన పాకిస్తాన్దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసిన పాకిస్తాన్తమకు అన్ని విషయాలపై సమాచారం ఉందన్న అమెరికాఉదయం 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశంమెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్న ఆర్మీబహవల్పూర్ లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడిమురిడీకే లోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్తావరాన్ని ధ్వంసం చేసిన భారత్మురిడీకే లోని భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న జైషే మహమ్మద్ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆర్మీభారత్‌ ఆర్మీ దాడి చేసిన ప్రాంతాలు ఇవే.. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై దాడులు..పాకిస్తాన్‌లో నాలుగు, పీవోకేలో ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు.తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్‌ ఆర్మీ,కోట్లీ, బహ్వాల్‌పూర్‌, ముజఫరాబాద్‌లో క్షిపణి దాడులు.బహ్వల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతం.పీవోకేతో పాటు పాక్‌లో ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసంత్రివిధ దళాల సమస్వయంతో మెరుపు దాడులు.భారత్‌ దాడుల్లో పాక్‌ ఆర్మీ ఐఎస్‌ఐ కంట్రోల్‌ రూమ్‌ ధ్వంసంఅర్ధరాత్రి 1:44 నిమిషాలకు భారత సైన్యం దాడులు.200 ఎకరాల్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ మెరుపు దాడులు. Operation Sindoor UPDATES: Here is the list of nine terror facility locations in Pakistan and Pakistan-occupied Kashmir that have been successfully neutralised-1. Markaz Subhan Allah, Bahawalpur - JeM2. Markaz Taiba, Muridke - LeT3. Sarjal, Tehra Kalan - JeM4. Mehmoona Joya,… pic.twitter.com/Q3Q6vyw0Sa— Press Trust of India (@PTI_News) May 7, 2025 పాక్‌ అప్రమత్తం.. విమానాశ్రయాలు మూసివేతఅప్రమత్తమైన పాక్‌ డిఫెన్స్‌ వ్యవస్థలుభారత్‌ దాడులతో పాక్‌ అప్రమత్తమైంది.లాహోర్‌, సియాల్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.हम जो कहते हैं, वो डेफिनिटली करते हैं...भारतीय सुरक्षा बलों ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।पाकिस्तान में 9 आतंकी ठिकाने पूरी तरह तबाह!भारतीय सेना कहा"पहलगाम का न्याय हुआ..."#OperationSindoorभारत माता की जय! 🇮🇳 pic.twitter.com/0Gve2IVl6J— Ankit Kumar Avasthi (@kaankit) May 7, 2025 పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడులుపహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టిన భారత్‌తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వంసోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి దాడి ఘటన వీడియోలుभारतीय सेना ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।#OperationSindoor के तहत पाकिस्तान में 8 आतंकी ठिकाने पूरी तरह तबाह!पहलगाम का न्याय हुआ... भारत माता की जय! 🇮🇳 pic.twitter.com/bzd6bu7IWd— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 7, 2025 #WATCH | Indian Army tweets, ""प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः" Ready to Strike, Trained to Win.(Video Source: Indian Army) pic.twitter.com/5tJbfBX4Nk— ANI (@ANI) May 6, 2025భారత్‌ దాడులు.. పలు విమానాలు రద్దు శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపిన స్పైస్‌ జెట్‌ధర్మశాల, లేహ్‌, జమ్మూ, అమృత్‌సర్‌ విమానాశ్రయాల మూసివేతఉత్తరభారతంలోని పలు ఎయిర్‌పోర్టులు మూసివేతఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూకేంద్రం నిర్ణయంజమ్ము, శ్రీనగర్‌, ధర్మశాల, లేహ్‌, అమృత్‌సర్‌ విమానాశ్రయాలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేతకేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం పాక్‌ ఉగ్ర స్థావరాలు ధ్వంసం..అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యంఅంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్‌ చేసిన భారత్‌మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్‌ లష్కరే క్యాంప్‌జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హెచ్‌ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్👉పహల్గాం దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్‌ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.👉పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌తో పాటు లాహోర్‌ లోని ఒక ప్రదేశంపై భారత్‌ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్‌ టు సర్ఫేస్‌’ మిసైళ్లను ప్రయోగించారు. 👉దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్‌’ అంటూ భారత్‌ సైన్యం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఇవి సర్జికల్‌ స్ట్రైక్స్‌ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. 👉పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్‌’ అని నామకరణం చేశారు. మసూద్‌ అజర్, హఫీజ్‌ సయీద్‌ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. 👉కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్‌ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్‌ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన రాజ్‌నాద్‌ సింగ్‌. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.భారత్‌ తడాఖా.. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ విలవిల (ఫొటోలు)👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

YS Jagan Support Over Operation Sindoor2
భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు ఆపరేషన్‌ సిందూర్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.ఆపరేషన్‌ సిందూర్‌పై వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025

What Is Operation Sindoor3
Operation Sindoor: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అంటే ఏమిటి?

delhi: పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్‌.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ (Operation Sindoor) మంగళవారం అర్ధరాత్రి పాక్‌ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తాజా సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..! అంటూ ఇండియన్‌ ఆర్మీ ఓ హింట్‌ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్‌పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అని పేరు పెట్టింది.పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్‌ ఆర్మీ ఆపరేషన్‌ సిందూర్‌ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమ శివుడు పార్వతి దేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు.. భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు. ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. This video captures the moment an Indian missile hit Bahawalpur, Pakistan, during 'Operation Sindoor' — a series of retaliatory attacks for last month’s Pahalgam bombing that killed 26 people, which India blames on Pakistan. pic.twitter.com/9g0yzHhYVB— Al Jazeera English (@AJEnglish) May 6, 2025సింధూరం భారతీయ సాంస్కృతికలో వివాహ తత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజపుత్‌లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్‌.. పాక్‌ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు. ఇది నీతికోసం, ధర్మంకోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది. దేశాన్ని కుదిపేసిన వినయ్‌ నర్వాల్‌ ఘటన ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌నే. వినయ్‌ నర్వాల్‌ దంపతులకు పెళ్లై అప్పటికి ఆరు రోజుల క్రితమే. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి నర్వాల్‌ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. దెబ్బకు దెబ్బ తీసిందిఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే.. భారత్‌ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో, ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా, ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది.

Asaduddin Owaisi on Operation Sindoor4
Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్‌ ఇదే

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌ ఉగ్రశిబిరాలపై భారత్‌ మెరుపు దాడి చేసింది. ఈ దాడిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్‌ వేదికగా స్పందించారు.పాక్‌ ఉగ్ర శిబిరాలపై భారత్‌ బలగాలు జరిపిన దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరోసారి పహల్గాం తరహా ఘటన పునరావృతం కాకుండా ఉండేలా పాకిస్తాన్‌కు గట్టి గుణ పాఠం చెప్పాలి. పాక్‌ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జై హింద్‌! అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. میں ہماری دفاعی افواج کی جانب سے پاکستان میں دہشت گرد ٹھکانوں پر کیے گئے ہدفی حملوں کا خیرمقدم کرتا ہوں۔ پاکستانی ڈیپ اسٹیٹ کو ایسا سبق سکھانا چاہیے کہ پھر کبھی دوسرا پہلگام نہ ہو۔ پاکستان کے دہشت گردی کے ڈھانچے کو تباہ کر دینا چاہیے۔ جے ہند!#OperationSindoor— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025

Chandrababu Coalition govt fails to respond to 50 percent marks in degree5
మెగా పేరుతో ఎందుకీ దగా?

సాక్షి, అమరావతి: డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అర్హత మార్కుల నిబంధన పేరుతో దరఖాస్తు దశలోనే ఎంతో మందిని అనర్హులను చేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా సగం మంది అభ్యర్థులపై ప్రాథమిక దశలోనే వేటు వేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించినా, జనరల్‌ అభ్యర్థుల మార్కుల నిబంధనను సడలించలేదు. డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండడంతో లక్షల మంది జనరల్‌ అభ్యర్థులు తమనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి టెట్‌ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించక పోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 పేరుతో గత నెల 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 నెలల పాటు ఊరించి ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు అభ్యర్థులకు తీరని నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటర్మీడియట్‌లో, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసిన వారికి ఈ నిబంధన వర్తించదని 2019 నవంబర్‌లో భారత ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసినా.. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. కనీస మార్కుల అంశంలో భిన్న వైఖరి అభ్యర్థుల అర్హత మార్కుల అంశంలో అటు ప్రభుత్వం, ఇటు పాఠశాల విద్యాశాఖలు భిన్నంగా వ్యవహరించడం విస్తుగొలుపుతోంది. తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)లో రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం మార్కు­లే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ జనరల్‌ అభ్యర్థులకు మాత్రం 50 శాతం అలాగే ఉంచింది. వాస్తవా­నికి జనరల్‌ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా, ఆ మేరకు అయినా తగ్గించక పో­వడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గతేడాది ఫిబ్ర­వరిలో విడుదల చేసిన డీఎస్సీ–­2024లో తొలుత 50 శాతం మార్కుల నిబంధన విధించగా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు ఇంటర్మీడియట్, డిగ్రీలలో కనీస మార్కులు జనరల్‌ అభ్యర్థులకు 45 శాతం, రిజర్వేషన్‌ అభ్యర్థులకు 40 శాతానికి తగ్గించారు. ఈ మేరకు నియమకాలు కూడా జరిగిపోయాయి. కానీ ఏపీలో మా­త్రం ఎన్‌సీటీఈ నిబంధనల అమలు చేయలేదు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఉపాధ్యాయ నియామకాలపై రాజస్థాన్, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుటు అక్కడి అభ్యర్థులు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించారు. దాంతో డిగ్రీలో కనీస అర్హత మార్కులపై ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఎన్‌సీటీఈకి మార్గదర్శకాలు విడుదల చేసింది. కనీస మార్కులపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉండేలా సూ­చ­నలు చేసింది. ఎన్‌సీటీఈ 2019 నవంబర్‌ 21న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ‘ఉపాధ్యాయ నియామకాల్లో 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ లేదా సమానమైన కో­ర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదు’ అని ప్రకటించింది. 2011 ఆగస్టు 2నాటి ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌లోనూ కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యు­యేషన్, ఏడాది కాల పరిమితి గల బీఈడీ చేసినవారు డీఎస్సీకి అర్హులుగా పేర్కొంది. ఈ లెక్కన ఎలా చూసినా జనరల్‌ అభ్యర్థులకు డీఎస్సీ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం మించరాదు. నిబంధనల్లో వివక్షపై తీవ్ర విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ నిబంధనలు పూర్తి వివక్షతో ఉన్నాయని అటు అభ్యర్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభు­త్వం ఇచ్చిన జీవో నంబర్‌ 15లో 2007 వరకు డిప్లొ­మా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందిన వారు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియ­ట్‌ ఉంటే ఎస్జీటీకి అర్హులుగా పేర్కొంది. కానీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 29 జూలై 2011కు ముందు బీఈడీ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించ­దన్న ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ నిబంధనలను మెగా డీఎస్సీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ నిబంధనను తెలంగాణ డీఎస్సీ–2024 కోసం ఇ­చ్చిన సవరణ జీవో నంబర్‌ 14లో పేర్కొన్నారు. దీని ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం, జనరల్‌ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. దీంతోపాటు ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫి­కేషన్‌ ప్రకారం 2011 జూలై 29 నాటికి బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత మార్కుల నిబంధన తొలగించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎన్‌సీటీఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో అర్హులైన జనరల్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యా­యం జరిగినట్లయింది. దీనిపై జనరల్‌ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.సీబీఎస్‌ఈ అభ్యర్థులకు అన్యాయం పదో తరగతి వరకు సీబీఎస్‌ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్‌ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్‌ఈ విద్యార్థులకు మొదటి భాష ఇంగ్లిష్‌ మాత్రమే ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సీబీఎస్‌ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఫిబ్రవరి–2024 డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ సమస్య లేదని అభ్యర్థులు చెబుతున్నారు. జూలై–2024 టెట్‌లోనూ కూటమి ప్ర­భు­త్వం ఈ నిబంధన పేర్కొనలేదంటున్నారు. ఉన్న ఫళంగా నిబంధలు మార్చేసి అన్యాయం చేస్తే సహించమని, తాజా టెట్‌ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీకి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

No Cricket in World Cups With Pakistan No Bollywood: Gautam Gambhir6
ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు వద్దు: గంభీర్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) టోర్నీల్లోనూ భారత్‌ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో టీమిండియా-పాకిస్తాన్‌ (IND vs PAK) మధ్య పుష్కర కాలంగా ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే.. అయితే ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇరు జట్లూ తలపడుతున్నాయి.ఇప్పుడు దీనికి కూడా ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్‌ సరిహదుల్లో తీవ్రవాదం ముగిసేవరకు ఇరు జట్ల మధ్య ఆటలకు ప్రాధాన్యత లేదని అతను అన్నాడు. అప్పటిదాకా ఎలాంటి ఆటలు అవసరం లేదుఈ విషయంలో బీసీసీఐ మాత్రమే కాదు, భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు అసలు ఎలాంటి ఆటలు అవసరం లేదు.గతంలోనూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను. నా దృష్టిలో క్రికెట్‌ మ్యాచ్, బాలీవుడ్‌ సినిమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలేవీ భారత సైనికులు లేదా భారత పౌరుల ప్రాణాలకంటే ముఖ్యం కాదు. మ్యాచ్‌లు జరుగుతుంటాయి.సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. గాయకులు వేదికలపై పాడుతూనే ఉంటారు. కానీ మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏదీ తగ్గించలేదు’’ అని గంభీర్‌ ఉద్వేగభరితంగా మాట్లాడాడాడు. ఆసియా కప్‌ గురించి చెప్పలేనుఅదే విధంగా.. ‘‘ఈ ఏడాది జరిగే ఆసియా కప్‌ గురించి నేను ఏమీ చెప్పలేను. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వారు ఏం చెబితే దానిని పాటిస్తాం’ అని గంభీర్‌ స్పష్టం చేశాడు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడిన విషయం విదితమే. బైసరన్‌ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా అనేక ఆంక్షలు విధించింది. ఆపరేషన్‌ సింధూర్‌తాజాగా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్తాన్‌లో నాలుగు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంటెలిజెన్స్‌ వర్గాల సహకారంతో భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భారత భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా

Chiranjeevi And Anand Mahindra Comments On operation sindoor7
'ఆపరేషన్‌ సింధూర్‌' కోసం నిలబడుదాం అంటూ ప్రముఖల పోస్ట్‌లు

పహల్గాం దాడికి 'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుతో భారత్‌ దీటైన సమాధానం ఇచ్చింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌ 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీంతో సుమారు 80మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఆపై కశ్మీర్‌లో ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ సంస్థలకు చెందిన కీలకమైన క్యాంప్‌లను భారత్‌ నేలమట్టం చేసింది. ఇలాంటి సమయంలో భారత ఆర్మీ వెంట తామందరం ఉన్నామంటూ పలువురు ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్’ అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.జై హింద్‌.. ఆపరేషన్‌ సింధూర్‌ - చిరంజీవిమా ప్రార్థనలు మా ఆర్మీతోనే ఉంటాయి.. ఒకే దేశం...కలిసి నిలబడతాము -ఆనంద్‌ మహీంద్రాజై హింద్‌.. భారత్‌ మాతాకీ జై.. - రితేశ్‌ దేశ్‌ముఖ్‌ధర్మో రక్షతి రక్షితః.. జైహింద్‌ కి సేనా - వీరేంద్ర సెహ్వాగ్‌భారత్‌ మాతా కీ జై.. సరైన న్యాయం జరిగింది - ఖుష్బూ

Pahalgam victims Responds Over Operation Sindoor8
మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్‌ సిందూర్‌.. పహల్గాం బాధితుల రియాక్షన్‌

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. భారత్‌ దాడుల్లో దాదాపు 80-90 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భారత ‍ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఆపరేషన్‌ ప్లాన్‌ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు.. దేశ ప్రజలు సైతం.. ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.ఆపరేషన్‌ సిందూర్‌పై శుభమ్‌ ద్వివేది తండ్రి సంజయ్‌ ద్వివేది స్పందిస్తూ..‘భారత ఆర్మీకి సెల్యూట్‌ చేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా దేశ ప్రజల బాధను విని పాక్‌ ఉగ్రస్థావరాలపై ఎటాక్‌ చేసినందుకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వార్తలను విన్నప్పటినుంచి మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.సంతోష్‌ జగ్‌దలే భార్య ప్రగతి జగ్‌దలే స్పందిస్తూ.. ఈ ఆపరేషన్‌ పేరు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మన కుమార్తెల సిందూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా’ అని అన్నారు.#WATCH | Pune | #OperationSindoor | "I cried a lot on hearing the name of the operation . It is a real tribute and justice to those who were killed by terrorists," says Asavari Jagdale, daughter of Santosh Jagdale, who was killed in Pahlagam terror attack pic.twitter.com/L6Wh7HivHM— ANI (@ANI) May 7, 2025సంతోష్ జగ్‌దలే కుమార్తె అశ్విరి స్పందిస్తూ..‘పాకిస్తాన్‌లో తొమ్మిది స్థానాల్లో వారిపై భారత ఆర్మీ ఎదురుదాడికి దిగింది. ఇది నిజంగా భిన్నమైన అనుభూతి. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరే అందుకు నిదర్శనం. మా కన్నీళ్లు ఆగలేదు. ఉగ్రవాదుల వల్ల సోదరీమణులు తమ సిందూరం కోల్పోయినందున వారికి గుర్తుగా ఈ దాడులకు నామకరణం చేశారుఆనందంతో కూడిన కన్నీళ్లు ఆగవు. మేం ఇంతటి బాధలోనూ ఆనందపడుతున్నాం. ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు’ అని అన్నారు.

Moody lowered India GDP growth forecast9
జీడీపీ వృద్ధి 6.3 శాతమే! కారణం..

భారత జీడీపీ 2025లో 6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడీస్‌ రేటింగ్స్‌ తాజా అంచనాలు ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ గతంలో వెల్లడించిన అంచనాలను తగ్గించింది. అమెరికా టారిఫ్‌లు, వాణిజ్య ఆంక్షలతో వృద్ధి నిదానించొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు.. భారత్‌–పాక్‌ మధ్య ఉద్రిక్తతలు సైతం జీడీపీ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.ఈ నేపథ్యంలో ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి, ఎక్కడ విస్తరణ చేపట్టాలి, ముడి పదార్థాల సమీకరణ తదితరాల వ్యయాలు పెరిగిపోవ్చని పేర్కొంది. 2026 సంవత్సరానికి మాత్రం లోగడ ప్రకటించిన 6.5 శాతం వృద్ధి రేటు అంచనాలనే మూడీస్‌ కొనసాగించింది. 2024 కేలండర్‌ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండడం గమనార్హం. విధానపరమైన అస్పష్టత, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి అంతర్జాతీయ వృద్ది రేటు అంచనాలను తగ్గిస్తున్నట్టు మూడీస్‌ రేటింగ్స్‌ తెలిపింది.ప్రపంచ వృద్ధిపైనా ప్రభావం..టారిఫ్‌లకు అమెరికా స్వల్పకాలం పాటు విరామం ఇచి్చనప్పటికీ చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలు జీ–20 దేశాల వ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని మూడీస్‌ రేటింగ్స్‌ తెలిపింది. 2025లో అమెరికా, చైనా జీడీపీ అంచనాలను సైతం కుదించింది. అమెరికా జీడీపీ 2025లో 1 శాతం, 2026లో 1.5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా వేసింది. గత అంచనాలు కుదించింది. చైనా 2025లో 3.8 శాతం, 2026లో 3.9 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఎన్‌బీఎఫ్‌సీ గోల్డ్‌ లోన్లకు కష్టాలుమొత్తం మీద అమెరికాకు సంబంధించి టారిఫ్‌లు గరిష్ట స్థాయికి చేరాయని.. రానున్న రోజుల్లో ఇవి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. తరచుగా ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) కఠినతరం చేస్తాయని, ఇది నిధులపై వ్యయాలు గణనీయంగా పెరిగేందుకు దారితీస్తుందని మూడీస్‌ తెలిపింది. వృద్ధికి ఇది విఘాతం కలిగించొచ్చని పేర్కొంది.

Pakistan Claimed It shot down three Indian Air Force fighter jets10
భారత్‌ విమానాలు కూల్చివేత అంటూ పాక్‌ ప్రచారం.. నిజమెంత?

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో దాయాది దేశం పాకిస్తాన్‌ను భారత్‌ దెబ్బకొట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేసింది. ఇక, ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ విజయవంతమైనట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. దాడులపై పాకిస్తాన్‌ స్పందిస్తూ.. భారత్‌కు చెందిన యుద్ద విమానాలను కూల్చివేసినట్టు దాయాది పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియా పేర్కొంది.ది హిందూ కథనం మేరకు.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా రెండు రాఫెల్ జెట్‌లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్‌ ఆర్మీ విజయవంతంగా భారతీయ జెట్‌లను కూల్చివేసిందని తెలిపింది. అయితే, ఈ వాదనలను భారత్‌ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో IAF విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. పాంపోర్, అఖ్నూర్ మీదుగా యుద్ధ విమానాలు డ్రాప్ ట్యాంకులను విసిరాయని భారత రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదంతా ఫేక్‌ ప్రచారమని తెలిపింది.JUST IN | At least three Indian jets have crashed in Jammu and Kashmir’s Akhnoor, Ramban, and Pampore areas, a government official told The Hindu, @vijaita reports.📸 @Imrannissar2 pic.twitter.com/7St8Fhtl65— The Hindu (@the_hindu) May 7, 2025మరోవైపు.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత భారత సైన్యానికి చెందిన రెండు స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్‌ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ చేసి పాక్‌ నీచ బుద్ధిని బయటపెట్టింది. ‘పాక్‌ సైన్యం సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీదే. ఆ వీడియోలన్నీ పాతవి. భారత్‌కు చెందినవి కూడా కాదు. పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 2024లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను, ఐర్లాండ్‌లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను వారు షేర్‌ చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండండి’ అని కేంద్రం భారత పౌరులకు సూచించింది. Social media posts falsely claims that Pakistan destroyed Indian Brigade Headquarters.#PIBFactCheck ❌ This claim is #FAKE✅ Please avoid sharing unverified information and rely only on official sources from the Government of India for accurate information. pic.twitter.com/9W5YLjBubp— PIB Fact Check (@PIBFactCheck) May 7, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement