Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India And Pakistan War Updates1
కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్ దే బాధ్యత: విక్రమ్ మిస్త్రి

ఢిల్లీ: కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్‌ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్‌ జరిపిన ఈ చర్యకు భారత్‌ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్‌ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్‌ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.

India And Pakistan War Related Live Updates2
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌

War Live Updates..ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్విక్రమ్ మిస్త్రి, విదేశాంగ శాఖ కార్యదర్శిడీజీఎంఒల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారుదీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాంకాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్ దే బాధ్యతఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలిఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలిసీజ్‌ఫైర్‌ ఇక లేనట్లే.. కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్‌ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ ఇంతియాజ్‌ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్‌ సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్‌ లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్‌ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్‌ అవుట్‌3 గంట్లల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్‌, రాజౌరి, పూంచ్‌ సెక్టార్‌ లో కాల్పులుపాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్‌ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌జమ్మూ కశ్మీర్‌ లో పలు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌ This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025 What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025భారత్‌-పాక్‌ కాల్పుల విరమణను ధృవీకరించిన భారత్‌అధికారికంగా ప్రకటించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీఅమల్లోకి భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందంసాయంత్రం 5 గంటల నుంచే అమలు: విక్రమ్‌ మిస్రీభారత్‌, పాక్‌ల యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటనఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయిభారత్‌, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్‌ ఇరు దేశాలతో సుదీర్ఘంగా రాత్రంతా చర్చించాఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయిఇరు దేశాలకు కంగ్రాట్స్‌ pic.twitter.com/lRPhZpugBV— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025 బెంగళూరు నుంచి కళ్లి తండాకు మురళీ నాయక్‌ పార్థివదేహంపాకిస్తాన్‌ తో యుధ్ధంలో వీర మరణం పొందిన భారత జవాన్‌ మురళీ నాయక్‌ పార్థివదేహం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడ ఆ వీర జవాన్‌కు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆ జవాన్‌ పార్థివదేహాన్ని శ్రీసత్యసాయి జిల్లాలోని కళ్లితండా తరలిస్తున్నారు. రేపు(ఆదివారం) సైనిక లాంఛనాలతో వీర మరణం పొందిన ఆ జవాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరో జవాన్ వీరమరణంపాక్ కాల్పుల్లో మరో జవాన్ 'సచిన్ యాదవ్‌రావు వనాంజే' (29) వీరమరణం పొందారు. ఈయన స్వగ్రామం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లాలోని తమ్లూర్.సైరన్ల శబ్దాలు వాడొద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచనసైరన్ల సౌండ్‌లతో.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందికేవలం అవగాహన కార్యక్రమాల్లోనే వినియోగించాలి ఢిల్లీ :32 విమానాశ్రయాలు మూసివేత9 మే 2025 నుండి 14 మే 2025 వరకు (15 మే 2025న 0529 IST వరకు) ఆపరేషనల్ కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేతభారత విమానాశ్రయాల అథారిటీ (AAI) సంబంధిత విమానయాన అధికారులు జారీ చేసిన ఎయిర్‌మెన్‌కు సూచనల (NOTAMs) వివరాలు 1 తాత్కాలిక విమానాశ్రయ మూసివేత: ◦ ప్రభావిత విమానాశ్రయాల జాబితా: ▪ అధంపూర్ ▪ అంబాలా ▪ అమృత్‌సర్ ▪ అవంతీపూర్ ▪ బఠిండా ▪ భుజ్ ▪ బికనీర్ ▪ చండీగఢ్ ▪ హల్వారా ▪ హిండన్ ▪ జైసల్మీర్ ▪ జమ్మూ ▪ జామ్‌నగర్ ▪ జోధ్‌పూర్ ▪ కాండ్లా ▪ కాంగ్రా (గగ్గల్) ▪ కేశోద్ ▪ కిషన్‌గఢ్ ▪ కుల్లూ మనాలి (భుంటర్) ▪ లేహ్ ▪ లూధియానా ▪ ముంద్రా ▪ నలియా ▪ పఠాన్‌కోట్ ▪ పటియాలా ▪ పోర్‌బందర్ ▪ రాజ్‌కోట్ (హిరాసర్) ▪ సర్సావా ▪ షిమ్లా ▪ శ్రీనగర్ ▪ థోయిస్ ▪ ఉత్తర్లై ◦ ఈ కాలంలో ఈ విమానాశ్రయాలలో అన్ని పౌర విమాన కార్యకలాపాలు నిలిపివేయబడతాయి. ఆపరేషన్‌ సిందూర్‌.. ఐదుగురు టాప్‌ ఉగ్రవాదులు హతం26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.ముంబై దాడి సూత్రధారిని మట్టుబెట్టిన భారత్‌.ఉగ్రస్థావరాలపై దాడిలో అబు జిందాల్‌ మృతిఐదుగురు టాప్‌ ఉగ్రవాదులను హతమార్చిన భారత్‌.ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల్లో భాగంగా ఐదుగురు టాప్‌-5 టెర్రరిస్టులు హతం.ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు హతం.మురిద్కే, బహవల్‌పూర్‌లో జరిగిన దాడిలో ఉగ్రనేతలు మృతి,మురిద్కే దాడిలో అబు జుందాల్‌ హతం.అబు అంత్యక్రియలకు హాజరైన పాక్‌ ఆర్మీ చీప్‌ మునీర్‌.జైషీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ బావమరిది హఫీజ్‌ మహమ్మద్‌ జమీల్‌ హతంలష్కరే ఉగ్రనాయకుడు మహమ్మద్‌ యూసుఫ్‌ అజార్‌ హతం. కాందహార్‌ హైజాక్‌ కీలక సూత్రధారి మహమ్మద్‌ యూసఫ్‌ ఇవి మే 7వ తేదీ(బుధవారం అర్థరాత్రి) భారత్‌ మట్టుబెట్టిన ఉగ్రవాదులు వివరాలు Details of terrorists killed in the Indian strikes on 7th May in Pakistan: Sources 1) Mudassar Khadian Khas @ Mudassar @ Abu Jundal. Affiliated with Lashkar-e-Taiba. His funeral prayer was held in a government school, led by Hafiz Abdul Rauf of JuD (a designated global…— ANI (@ANI) May 10, 2025మోదీ హైలెవల్‌ మీటింగ్‌త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్‌ మీటింగ్‌ప్రధాని నివాసంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమావేశంభేటీలో పాల్గొన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్‌ భేటీ..పాకిస్తాన్‌ దాడులు, భారత్‌ కౌంటర్‌పై చర్చ.దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్‌ భేటీత్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీరాజ్‌నాథ్‌ భేటీలో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఏ ధోవల్‌.సరిహద్దుల్లో ఉద్రికత్తలపై గంటకుపైగా చర్చ. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు..శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లుఉదయం 11.45 గంటల సమయంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారుల వెల్లడికొన్ని ప్రాంతాల్లో మోగిన సైరన్లు.. పేలుడు శబ్దాలతో వణికిపోయిన ప్రజలుశనివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు Srinagar airport early morning pic.twitter.com/rK9diP6Xov— Maroof (@maroof2221) May 10, 2025పాక్‌కు భారీ నష్టం..పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్న భారత వైమానిక దళం.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్‌పై దాడులురెండు రోజులుగా పాక్‌లోని ప్రధాన నగరాలపై వాయుసేన దాడులుభారత వైమానిక దాడుల్లో లాహోర్‌, రావల్పిండి, సియాల్‌కోట్‌, పెషావర్‌, ఇస్లామాబాద్‌లో భారీ నష్టం.నూర్‌ఖాన్‌, ముర్షీద్‌, రఫికీ ఎయిర్‌బేస్‌లపై దాడి.నాలుగు పాక్‌ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్‌.భారత్‌ దాడులతో పాక్‌ ప్రజలు నగరాలు వదిలేసి వెళ్లిపోతున్నారు.కరాచీలోనూ భయంతో పాక్‌ ప్రజలు తరలి వెళ్తున్నారు.ఇస్లామాబాద్‌లో ఇప్పటికే పెట్రోల్‌ బంక్‌లు బంద్‌.పాకిస్తాన్‌లో ఎయిర్‌పోర్టులన్నీ షట్‌డౌన్‌.సియోల్‌కోట్‌లో మరో ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత్‌. అజిత్‌ దోవల్‌ భేటీ.. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న అజిత్‌ దోవల్‌. సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్న దోవల్‌.ఇంతకుముందే త్రివిధ దళాలతో భేటీ అయిన దోవల్‌. ఢిల్లీ..రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం.ౌసౌత్‌ బ్లాక్‌లో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.పాకిస్తాన్‌ దాడులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్యలుఉదయం 10:30 గంటకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం. ఆపరేషన్‌ సిందూర్‌పై వివరాలు వెల్లడించనున్న అధికారులు.పంజాబ్‌ భటిండాలో రెడ్‌ అలర్ట్‌ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ.జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న పాకిస్తాన్‌ కాల్పులు.రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్‌ ఆర్మీ.#WATCH | J&K: Parts of a damaged drone found in a field in RS Pura. pic.twitter.com/Y3akkre6pQ— ANI (@ANI) May 10, 2025#WATCH | J&K: A house in the civilian area in Jammu suffered massive damage due to heavy shelling by Pakistan. pic.twitter.com/eqbHYcqB9w— ANI (@ANI) May 10, 2025అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌..భారత్‌, పాకిస్తాన్‌ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.భారీగా భద్రతా దళాల మోహరింపు.ప్రజలు అ‍ప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.జమ్ము, రాజస్థాన్‌, పంజాబ్‌లో జనావాసాలపై పాక్‌ దాడులు.జానీపూర్‌ నివాస ప్రాంతంలో పాక్‌ మిస్సైల్‌ దాడులు. #WATCH | J&K: SDRF, local police, administration, and other agencies are at the spot. They cordoned off the place near Aap Shambhu Temple where a Pakistani strike occurred.As per the SDRF personnel, there has been no casualty. pic.twitter.com/FLLcHEc96X— ANI (@ANI) May 10, 2025పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్‌ దాడులు.. పాక్ మిలిటరీ పోస్ట్‌.. టెర్రర్‌ లాంఛ్‌ప్యాడ్‌ ధ్వంసంసరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులునియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్‌ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీపంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్‌ క్షిపణి శకలాలు లభ్యంజమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యంపౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్‌ దాడులు. #WATCH | A projectile debris in Rajasthan's Barmer as Pakistan started targeting civilian areas. pic.twitter.com/tENtKWlLOa— ANI (@ANI) May 10, 2025 #WATCH | J&K | Splinters and debris of a projectile retrieved from Akhnoor pic.twitter.com/SR3qe3gHbv— ANI (@ANI) May 10, 2025 పాక్‌కు చుక్కలే..పాక్‌ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.పాక్‌ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్‌. #WATCH | Parts of a projectile found in a field in Amritsar, Punjab. pic.twitter.com/bPxXOxWT8n— ANI (@ANI) May 10, 2025#WATCH | Amritsar, Punjab | Debris of a drone were recovered from a field in Muglani Kot village pic.twitter.com/zxmklvX2tL— ANI (@ANI) May 10, 2025 #WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw— ANI (@ANI) May 10, 2025నేడు భారత సైన్యం మీడియా సమావేశం.నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆపరేషన్‌ సిందూర్‌ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్‌ దాడులు తీవ్రతరం..లాహోర్‌, ఇస్లామాబాద్‌ టార్గెట్‌గా భారత్‌ దాడులు. మూడు పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.వీటిల్లో ఇస్లామాబాద్‌ సమీపంలో ఉన్న కీలక స్థావరంరెండు పాకిస్థాన్‌ ఫైటర్‌ జెట్ల కూల్చివేతశ్రీనగర్‌ బేస్‌ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలుశ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుఆకాష్‌ జెట్‌తో పాక్‌ క్షిపణులను కూల్చివేసిన భారత్‌. Pakistan tried to hit the capital of India, New Delhi by it's long range missile Fateh-2But intercepted by Barak-8 missile defence system in Sirsa of Haryana#IndianArmy please ekbar attacking mode me aajao 😡🙏#IndiaPakistanWar #IndianNavyAction pic.twitter.com/x3kd7v87W2— Priyanshu Kumar (@priyanshu__63) May 9, 2025📹VIDEO : Pakistani citizen (lahore) sharing reality of Indo-pak war. exposed Pakistan's failure & pak media lies.India is right on Top. 👍👍 pic.twitter.com/Ff44gptNlc— Vaishnavi (@vaishu_z) May 9, 2025 Lahore, Pakistan is now being targeted by India. Pakistan’s 2nd largest city and one that is fully undisputed.This war is escalating very quickly. pic.twitter.com/6lzojd3DcY— Spencer Hakimian (@SpencerHakimian) May 10, 2025పాకిస్తాన్‌ డ్రోన్‌ దాడులకు భారత్‌ ప్రతీకార దాడులు.పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూసివేత. పాక్‌ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్‌ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్‌, రావాల్పిండి, పెషావర్‌లపై దాడి చేసింది. నూర్‌ఖాన్‌, మురీద్‌, రఫికి ఎయిర్‌ బేస్‌లపై దాడులు చేసిన భారత్‌. డ్రోన్స్‌, మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌ ఎయిర్‌ బేస్‌లపై దాడి చేసిన భారత్‌.నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్‌, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.భారత్‌ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్‌ దాడులను తెగబడింది.జమ్ము,శ్రీనగర్‌, అమృత్‌సర్‌లను టార్గెట్‌ చేసిన పాకిస్తాన్‌.భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్‌ డ్రోన్‌ దాడులు.మిస్సైల్స్‌ ద్వారా పాక్‌ దాడులను అడ్డుకున్న భారత్‌.ఫతా వన్‌ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం.#WATCH | Jalandhar, Punjab: Parts of a Pakistan drone recovered after a blast in Kanganiwal village in Rural Jalandhar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZogqS588tR— ANI (@ANI) May 10, 2025 #WATCH | Loud explosions are being heard in Poonch area of Jammu and Kashmir. (Visuals deferred by unspecified time) pic.twitter.com/VkjzgY8jYc— ANI (@ANI) May 10, 2025టార్గెట్‌ పఠాన్‌కోట్‌..పఠాన్‌కోట్‌ను టార్గెట్‌ చేసిన పాకిస్తాన్‌.రెండు పాక్‌ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్‌.అన్నిచోట్ల పాక్‌ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.భారత్‌ దెబ్బతో పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌ బంద్‌.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్‌.శ్రీనగర్‌ టార్గెట్‌గా పాకిస్తాన్‌ ాదాడులు.శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. At least 4 airbases in Pakistan have been targeted by Indian strikes: Sources pic.twitter.com/3ZegA6YmzM— ANI (@ANI) May 10, 2025పాక్‌ డ్రోన్లు దాడులు.. సరిహద్దు ప్రాంతాలపై పాక్‌ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్‌ మొదలుకుని రాజస్తాన్‌ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది.కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్‌ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్‌ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్‌ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్‌ మొదలుకుని జోద్‌పూర్‌ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్‌ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్‌ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్‌ అలర్టులు జారీ చేశారు.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్‌ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్‌ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్‌ దాడులకు పాక్‌ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.పాక్‌ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్‌ దేశాలను పాక్‌ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్‌ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

Indian Army Briefing On India Operation Sindoor3
దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం: భారత ఆర్మీ

న్యూఢిల్లీ: భారత్‍, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈరోజు(శనివారం) సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయగా, దీన్ని భారత కూడా ధృవీకరించడంతో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ముగింపు దొరికింది.అనంతరం ఇండియన్ ఆర్మీ.. ప్రెస్ మీట్ నిర్వహించింది. ‘ దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల యుద్ధంలో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాక్ తప్పుడు కథనాలు ప్రచారం చేసింది. భారత్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు అసత్య ప్రచారం చేశారు. పాక్ చెప్పినట్లు.. భారత్ ఆర్మీకి ఏమీ నష్టం జరగలేదు. భారత సైన్యం.. పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది. భారత్ పై కవ్వింపు చర్యలకు దిగి, పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఎల్ఓసీ దగ్గర పాక్ తీవ్రంగా నష్టపోయింది. బారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది’ అని భారత ఆర్మీ స్పష్టం చేసింది.భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణభారత్‌-పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం(శనివారం, మే10) 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.ట్రంప్‌ పెద్దన్న పాత్రఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్దన్న పాత్రలో ఇరు దేశాల మధ్య రాజీ కోసం ప్రయత్నించారు. కాల్పుల విరమణకు అమెరికాను పాకిస్తాన్‌ ఆశ్రయించడంతో ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహించి భారత్‌తో చర్చించారు. దీనికి భారత్‌ కూడా అంగీకరించి మే 12వ తేదీన పాక్‌తో చర్చలకు సిద్ధమైంది.

Asaduddin Owaisi Sensational Comments On Pakistan4
పాకిస్థాన్‌పై అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. భారత్‌ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాక్‌ దాడులకు మించి భారత్‌ దాడి చేస్తుందన్నారు. ‘‘దేవుడి దయతో మనం భారత భూమిని జన్మించాం. భారత భూమి కోసం ప్రాణాలైన ఇస్తాం. ఇస్లాం పేరుతో పాక్‌ అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు’’ అని అసదుద్దీన్‌ పేర్కొన్నారు.పాకిస్థాన్‌ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అసదుద్దీన్‌ అన్నారు. ఇస్లాం పేరుతో పాకిస్థాన్‌ మారణహోమం సృష్టిస్తుంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపడం దారుణమన్నారు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బతకాలి’ అని అసదుద్దీన్‌ అన్నారు.

Bride Sends Soldier Husband to Duty With Emotional Tribute5
వార్‌ జోన్‌.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం

పాకిస్తాన్‌ తో యుద్ధం వేళ.. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దుకావడంతో అంతా విధుల్లోకి తిరిగి హాజరయ్యే పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలోనే పెళ్లైన ఓ జవాన్‌ విధుల్లోకి హాజరయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మనోజ్‌ పాటిల్‌ మే 5వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పారామిలటరీ బలగాలు అంతా విధులకు హాజరు కావాలనే ఆదేశాల నేపథ్యంలో మనోజ్‌ పాటిల్‌ తిరిగి విధుల్లో చేరాడు. పెళ్లైన మూడు రోజులకే విధులకు హాజరయ్యాడు. అయితే నవ వధువు తన భర్తను దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి పంపి అందరికీ ఆదర్శంగా నిలవగా.. ఈ నూతన వధూవరుణ కథే దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఆ నవ వధువు దేశ భక్తిని అంతా కొనియాడుతున్నారు. తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపిన వనిత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.सगळ काही भारत मातेसाठी...लग्नाच्या तीन दिवसांनंतर महाराष्ट्राचे सुपूत्र मनोज पाटील देश सेवेसाठी रवाना... #oprationsindoor #IndianNavyAction #IndiaPakistanTensions #jalgaonnews #India #army #manojpatil #देशसेवा pic.twitter.com/1gmbhYcoTD— Ganesh Pokale... (@P_Ganesh_07) May 9, 2025

AP Police Over Action on Vidadala Rajini6
మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం

పల్నాడు జిల్లా: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు. విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అరెస్ట​ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలానే విడదల రజినిపై కూడా అనేక అక్రమ కేసుల్ని బనాయించారు పోలీసులు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండటంపై ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు ఏపీలో పాలనను గాలికొదిలేసి కేవలం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

specialties about SAMAR, AD Gun, Pechora in india7
ఇండియా ప‌వ‌ర్‌ఫుల్ వెప‌న్స్‌.. శ‌త్రువులకు సింహ‌స్వ‌ప్నం!

పాక్‌ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్‌ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్‌–400, ఆకాశ్‌ ఎన్‌జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్‌ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది సోవియట్‌ కాలంనాటి మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ (ఎస్‌ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్‌–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్‌ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్‌ ఆధారిత మిసైల్‌ లాంచర్, ఫైర్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్‌ యాంటెన్నాలతో కూడిన 4ఆర్‌90 యత్నాగన్‌ రాడార్‌ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్‌ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కౌంటర్‌ అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ (సీఏయూఎస్‌). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్‌ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్‌ గ్రిడ్‌ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్‌ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్‌ డిటెక్షన్, సాఫ్ట్‌/హార్డ్‌ కిల్‌ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్‌ (ఎలక్ట్రో–ఆప్టికల్‌/ఇన్‌ఫ్రారెడ్‌) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్‌ కిల్‌ (డ్రోన్ల కమ్యూనికేషన్‌ సిగ్నల్స్‌ జామింగ్‌), హార్డ్‌ కిల్‌ (నేలకూల్చడం) చేస్తుంది.సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ ఫర్‌ అష్యూర్డ్‌ రిటాలియేషన్‌ (సమర్‌). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్‌ కమాండ్‌ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్‌ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్‌జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్‌–1 వ్యవస్థ ఆర్‌–73ఈ, సమర్‌–2 ఆర్‌–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్‌–73ఈ మిసైళ్ల రేంజ్‌ 8 కి.మీ. ఆర్‌–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.→ ఎల్‌–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్‌. తొలుత స్వీడిష్‌ కంపెనీ బోఫోర్స్‌ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్‌ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ వంటివాటి ద్వారా ఎల్‌–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్‌. షిల్కా అనేది వీటి రష్యన్‌ నిక్‌నేమ్‌. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Jagadeka Veerudu Athiloka sundari Re Release Box Office Collections8
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?

టాలీవుడ్‌లో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోల పాత హిట్‌ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఆ సినిమాలకు వెళ్లడంతో కలెక్షన్స్‌ కూడా భారీగా వస్తున్నాయి. అందుకే ఈ మధ్య ఈ రీరిలీజులు ఎక్కువయ్యాయి. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka sundari ) మళ్లీ థియేటర్‌లో విడుదలైంది. ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్‌ చేశారు. దీనికోసం వైజయంతీ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 8 కోట్లవరకు ఖర్చు చేశారు. ఇదంతా అభిమానుల కోసమేచేస్తున్నట్లుగా ప్రకటించారు. వారి అంచనాలకు తగ్గట్టే చిరంజీవి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఈ సినిమాను వీక్షించారు. దీంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.1.75 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్‌ వెల్లడించారు. వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది. తమ అభిమాన హీరో సినిమా రీరిలీజ్‌కి ఈ స్థాయి కలెక్షన్స్‌ రావడం పట్ల మెగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా విషయానికొస్తే.. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం 1990 మే 9న రిలీజై సంచలనం సృష్టించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి. అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.‘మాస్ట్రో’ ఇళయరాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.

Virat Kohli Wanted Captaincy But BCCI Refused: Rumours Goes Viral9
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి ఫైనల్‌ చేరకుండానేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2023-25 సీజన్‌ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్‌ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్‌ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్‌లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల బ్యాటింగ్‌ వైఫల్యమే.అయితే, కోహ్లి ఆసీస్‌ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్‌ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.సోషల్‌ మీడియా వేదికగాతాను టెస్టు ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు రోహిత్‌ శర్మ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జూన్‌ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.జట్టుకు బలం అతడుఅయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్‌తో సిరీస్‌ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్‌రూమ్‌లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?అయితే, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్‌ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్‌ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్‌మన్‌ గిల్‌ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్‌ నియమించాలని బోర్డు భావిస్తోంది.హెడ్‌కోచ్‌ గంభీర్‌ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్‌ వంటి మేటి జట్టుతో సిరీస్‌ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్‌గానూ హిట్‌కాగా గతంలో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్‌ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్‌గా ‍వ్యవహరించలేదు. బ్యాటర్‌గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్‌!

Kommineni Comments On Fraudulent Promises Chandrababu Govt10
ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!

‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్‌లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement