Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Reacts over TDP Fake Rumours on Rushikonda Palace
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్‌సీపీ

రుషి కొండపై గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను భూతద్దంలో చూపిస్తూ విష ప్రచారం చేస్తున్న టీడీపీ నేతల తీరును వైఎస్సార్‌సీపీ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.‘రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు’అంటూ వైస్సార్‌సీపీ ట్వీట్‌లో పేర్కొంది.రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk— YSR Congress Party (@YSRCParty) June 16, 2024

Farmers loan waiver in Telangana Phase by phase by Congress Govt
దశల వారీగానే మాఫీ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల రుణమాఫీని దశల వారీ­గా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టుగానే విడతల వారీగా పంటల రుణమాఫీ చేపట్టాలని.. వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను, తర్వాత రూ. 75 వేల వరకు, అనంతరం రూ.లక్ష.. ఇలా రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రైతుల్లో 70% మందికి రూ.లక్ష లోపే రుణాలు ఉన్నట్టు అంచనా. వీరికి తొలిదశలో మాఫీ చేసి.. తర్వాత మిగతా వారికి అమలు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చ జరుగుతోంది. నిధుల సేకరణపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీకి భారీగా నిధులు అవసరం కావడంతో సేకరణ కోసం ప్రభుత్వం అన్నిరకాల మార్గాలను అన్వేషిస్తోందని అంటున్నాయి. నాలుగు పథకాలకు రూ.50 వేల కోట్లు! రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాల్సి ఉంది. ఈ రెండింటికీ నిధులు సమీకరించడం సవాల్‌గా మారిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి సుమారు రూ.35 వేల కోట్లు అవసరమని అంచనా. రైతు భరోసా కింద ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఎకరాకు రూ.7,500 చొప్పున ఇచ్చేందుకు రూ.10,500 కోట్ల మేరకు కావాలి. రైతు బీమా పథకం ప్రీమియం చెల్లించేందుకు రూ.1,500 కోట్లు కావాలి. పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలంటే దాదాపు రూ.2,500 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇలా ఈ నాలుగింటికి కలిపి రూ.50 వేల కోట్ల వరకు అవసరం. రైతుభరోసా కింద ఈ నెల నుంచే పెట్టుబడి సాయం ఇవ్వాలి. రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించాలి. అంటే ఈ రెండు నెలల్లోనే నిధులన్నీ సమకూర్చుకోవాలి. భారం తగ్గించుకోవడంపై దృష్టి! భారీగా నిధుల అవసరం ఉండటంతో.. ఈ నాలుగు పథకాల భారాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు తీరును పరిశీలించింది. వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ రుణమాఫీ అమలుతీరును అధ్యయనం చేసి వచ్చారు. రాజస్తాన్‌లో రుణమాఫీ అమలుతీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. అర్హులైన రైతులకు లబ్ధిచేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే కసరత్తు కొనసాగుతోంది. నిజానికి రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీయిచ్చింది. కానీ ఆయా పథకాలకు అర్హులను గుర్తించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించింది. ఇప్పుడు ‘‘రైతు భరోసాకు, రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? అలా చేస్తే అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలుండాలి?’’ అన్నదిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంటే పథకాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఎం కిసాన్‌లో మినహాయింపు ఉన్న వర్గాలతోపాటు ఐదెకరాల పరిమితి పెట్టడం, సాగుచేసే రైతులకే భరోసా సాయం ఇవ్వడం వంటివి అమలు చేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నట్టు చెప్తున్నారు. రుణమాఫీకి కూడా ఇలాంటి నిబంధనలు పెడితే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆలోచన సాగుతున్నట్టు సమాచారం. నిధుల సమీకరణ ఎలా? ఈ నాలుగు పథకాల కోసం ఒకేసారి రూ.50 వేల కోట్ల మేరకు నిధులు సమీకరించడం అంత సులువైన వ్యవహారం కాదని.. ఒకవేళ ఆంక్షలు విధించి, కోతలు పెట్టినా కూడా అంత పెద్ద మొత్తంలో సొమ్ము సేకరణ కష్టమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూనే, నిధుల సమీకరణకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొత్తగా ‘రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌’ ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి.. ఒకేసారి రూ.35 వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న ఆలోచన జరుగుతోంది. అయితే ఏదైనా కార్పొరేషన్‌కు భారీగా రుణం ఇవ్వాలంటే.. దానిని అదే సంస్థ తిరిగి చెల్లించగలదంటూ ఆదాయ మార్గాలను చూపాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏదైనా సంస్థ లేదా పథకం పేరుతో బ్యాంకులు ఇచ్చే రుణం సొమ్మును ఆ పనికి మాత్రమే వినియోగించాలని.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లకుండా చూడాలని ఇటీవల రిజర్వుబ్యాంకు వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణ సేకరణకు ఉన్న ఇతర అవకాశాలేమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతోంది. వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినట్టు తెలిసింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో 700 ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వం గుర్తించింది. అందులో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రూ.20 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే రిజర్వుబ్యాంకు గవర్నర్‌తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.

ఆరోపణలు చేస్తున్న రాహుల్‌ గాంధీ
ఉప్పందిందా? లేక నిప్పులేని పొగేనా?

జూన్‌ 1న ఎగ్జిట్‌ ఫలితాలు వెల్లడవటానికి ముందు రోజు మే 31న జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందరి రోజు జరిగిన దానికి రెట్టింపు! ఈ మొత్తం కొనుగోళ్లలో 58 శాతం వాటా విదేశీ ఇన్వెస్టర్లదే. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ మోదీ ఘన విజయం సాధించబోతున్నారని ప్రకటించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ట్రేడింగ్‌ జరగటం యాదృచ్ఛికమైతే కాదు. దీనివల్ల అసలు ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్‌ 4న స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి పోవటం, సాధారణ ఇన్వెస్టర్ల షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం జరిగింది. ఆ రోజు స్టాక్‌ మార్కెట్‌కు వచ్చిన నష్టం అక్షరాలా 30 లక్షల కోట్ల రూపాయలు. అందుకే... ‘ఎగ్జిట్‌పోల్‌ స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’ జరిగిందా అన్నది ప్రశ్న.మే 31–జూన్‌ 4 మధ్య నేషనల్‌ స్టాక్‌ ఎక్సే ్చంజి (ఎన్‌.ఎస్‌.ఇ)లో ఏదైనా అనుమానాస్పదమైన, ఆందోళన కలిగించే పరిణామం సంభవించిందా? సంభవించింది అని రాహుల్‌ గాంధీ అంటున్నారు. దానిపై దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయన అంటున్నది నిజమేనని మనమెలా చెప్పగలం? వాస్తవాలను పరిశీలించడం ద్వారా మాత్రమే. కనుక ఈ విషయమై ‘ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌’ చైర్మన్‌ ప్రవీణ్‌ చక్రవర్తి వద్ద అందుబాటులో ఉన్న కొన్ని వివరాలను మీ ముందు ఉంచుతాను. ఇందుకు చక్రవర్తినే నేను ఎంచుకోవటానికి కారణం రాహుల్‌ అంటున్న దానికి, చక్రవర్తి చెబుతున్నది చాలా దగ్గరి ఏకీభావం కలిగి ఉన్నదని నేను అనుకోవటం. మొదటిది– మే 31న ఎన్‌.ఎస్‌.ఇ.లో జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందటి రోజు మొత్తానికంటే రెట్టింపు. పదేళ్ళ కిత్రం 2014 మే నెలలో ఇలాంటిదే నరేంద్ర మోదీ తన తొలి మెజారిటీ సాధించినప్పుడు జరిగినప్పటికీ అలా జరగడం ‘‘చాలా అరుదు’’ అని చక్రవర్తి అంటారు. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించినప్పుడు సైతం స్టాక్‌ మార్కెట్‌ కార్యకలాపాలు ఆ ముందరి రోజు కన్నా రెట్టింపు ఏమీ కాలేదు. 22 శాతం మాత్రమే పెరిగాయి. రెండవది– ఎన్‌.ఎస్‌.ఇ. సొంత డేటా చెబుతున్న దానిని బట్టి 31న జరిగిన ‘‘మొత్తం షేర్ల కొనుగోళ్లలో 58 శాతం వాటాను ఫారిన్‌ ఇన్వెస్టర్లే (ఎఫ్‌ఐలు) కలిగి ఉన్నారు’’ అని చక్రవర్తి అంటున్నారు. ‘‘ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారంలో ఆ ముందు వరకు ఎఫ్‌ఐలు అంత భారీ మొత్తంలో షేర్లను కొనటం, కొన్న వాటికి మించి అమ్మటం జరగలేదు’’ అని కూడా ఆయన అన్నారు. మరి విదేశీ ఇన్వెస్టర్లను అంత భారీ మొత్తాలలో కొనిపించింది ఏమిటి? భారీగా కొనటం మాత్రమే కాదు, 31న వారు అంతే భారీగా అమ్మకాలు కూడా జరిపారన్న వాస్తవాన్ని చక్రవర్తి విస్మరించారు. బదులుగా ఆయన, ‘‘తర్వాతి రోజు ఏం జరిగిందన్న దానిని బట్టే ఆ ముందు రోజు జరిగిన దానిని వివరించగలం’’ అన్నారు. తర్వాతి రోజు అంటే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు బయటికి వచ్చిన రోజు. మే 31కి, జూన్‌ 1కి చక్రవర్తి పెట్టిన ఈ లంకె... ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల గురించి విదేశీ ఇన్వెస్టర్లకు ముందే తెలిసైనా ఉండాలి, లేదంటే వారికై వారు సర్వే జరిపించుకొని ఉండాలి అన్నదానిని సూచిస్తోంది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు అంత భారీగా షేర్లు కొనటానికి ఈ రెండూ కాకుండా మూడో కారణం ఏదైనా ఉండి ఉంటుందా?ఉంటుందనైతే చక్రవర్తి అనుకోవటం లేదు. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా ఒకే రీతిన మోదీ అపారమైన విజయం సాధించబోతున్నారని ఫలితాలను వెల్లడించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ట్రేడింగ్‌ అనే అత్యంత అరుదైన పరిణామం జరగటం అన్నది కేవలం యాదృచ్ఛికమైతే కాదు’’ అంటారాయన. కానీ అది యాదృచ్ఛికం ఎందుకు కాకూడదు? ఇందిరా గాంధీ తన మరణం గురించి మాట్లాడిన 24 గంటల తర్వాత ఆమె హత్య జరిగింది. అది యాదృచ్ఛికం మాత్రమే! విషయాన్ని ఒకడుగు ముందుకు తీసుకెళదాం. విదేశీ ఇన్వెస్టర్లు మే 31న షేర్లు కొనుగోలు చేశారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ అనంతరం జూన్‌ 3న స్టాక్‌ మార్కెట్‌ రాకెట్‌లా పైకి దూసుకెళ్లింది. కాబట్టి అప్పుడు కనుక వారు ఆ షేర్లను అమ్ముకుని ఉంటే భారీగా లాభాలు వచ్చేవి. అలా చేయటంలోని నియమబద్ధత గురించే ఇప్పుడు చక్రవర్తి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఆయనైతే ఎలా సమాధానం ఇస్తారనే విషయంలో సందేహం లేదు. ‘‘సంఘటనల కాలక్రమం, స్టాక్‌ మార్కెట్‌ డేటాలను అనుసరించి... ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయటానికి మాత్రమే కాకుండా, స్టాక్‌ మార్కెట్‌లను ఉపయోగించి లాభపడటానికి కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ ఆయుధాలు అయ్యాయని ఎవరైనా తేలిగ్గా చెప్పేయొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఎగ్జిట్‌ పోల్‌ స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’ ఇండియాలో జరిగి ఉంటుంది’’ అంటారు చక్రవర్తి. మీడియా నిర్వహించినవి కనుక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు లీక్‌ అయే అవకాశం ఉందనే విషయాన్ని పక్కనపెడదాం. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లే తమ సొంతంగా ఎగ్జిట్‌ పోల్స్‌ని జరిపించుకొని ఉండి, ఆ ఫలితాలు కూడా మీడియా నిర్వహించిన ఫలితాల దిశనే సూచిస్తూ ఉండి, వాటి ఆధారంగా వాళ్లు షేర్లు కొని ఉంటే అప్పుడది నియమబద్ధం అవుతుందా? ఒకటే ప్రశ్న ఏమిటంటే... విదేశీ ఇన్వెస్టర్లు అంత ప్రయాసతో ఎగ్జిట్‌ పోల్స్‌ జరిపించుకొని ఉంటారా? నాకైతే సందేహమే. సగటు భారతీయ పెట్టుబడిదారుల విషయానికి వద్దాం. మొదట, వారు విన్నది ఇదీ: నరేంద్ర మోదీ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’తో (మే 23న) మాట్లాడుతూ, ‘‘నేను నమ్మకంగా చెప్పగలను, జూన్‌ 4న బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంటుంది. స్టాక్‌ మార్కెట్‌ కూడా కొత్త రికార్డులకు చేరుకుంటుంది’’ అన్నారు. అంతకు ముందు హోంమంత్రి ‘ఎన్డీటీవీ’తో (మే 13న) మాట్లాడుతూ, ‘‘జూన్‌ 4 లోపు షేర్లు కొనమని మీకు చెబుతున్నాను. అవి అమాంతం పెరగబోతున్నాయి’’ అన్నారు. ఆ సలహాలపై వారు షేర్లు కొని ఉంటే, జూన్‌ 4న ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి పోవటం, వారి షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం చూశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ రోజు స్టాక్‌ మార్కెట్‌కు వచ్చిన నష్టం రూ. 30 లక్షల కోట్లు. దాంతో సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయితే మూడు రోజుల తర్వాత, వారాంతంలో శుక్రవారం 7వ తేదీన స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి 4వ తేదీన వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవటం మాత్రమే కాదు, షేర్ల పెరుగుదల ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ఇక్కడ ఇన్వెస్టర్లకు వచ్చినదానికంటే పోయినది ఎక్కువ.దీనర్థం ‘సమస్య’ విదేశీ ఇన్వెస్టర్లలో ఉందని! అది దర్యాప్తు జరిపించవలసినంత సమస్యా? భారతదేశంలోని వ్యక్తులు, సంస్థల తరఫున వారు షేర్లలో పెట్టుబడి పెట్టి ఉంటారని మీకు అనుమానంగా ఉంటే అప్పుడు దర్యాప్తు అవసరం కావచ్చు. మీకలాంటి అనుమానం లేదా? వాళ్లు తమకై తామే ఇన్వెస్ట్‌ చేసి ఉంటారని బహుశా మీకు అనిపిస్తోందా? అప్పుడైతే తదుపరి చర్య అవసరం అవుతుందా?కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Tdp,janasena Activists Attack On Jogi Ramesh House
మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి

సాక్షి,ఎన్టీఆర్‌ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు.

Sales Of Affordable Homes Fall 4 pc In January March PropEquity
హైదరాబాద్‌లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు

తక్కువ సరఫరా, లగ్జరీ అపార్ట్మెంట్లకు అధిక డిమాండ్ కారణంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఎనిమిది ప్రధాన నగరాల్లో అఫోర్డబుల్‌ ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 61,121 యూనిట్లకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తెలిపింది. మొదటి ఎనిమిది స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ జనవరి-మార్చి కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల అమ్మకాలు 6,3787 యూనిట్లుగా ఉన్నాయి. చౌక గృహాల సరఫరా తక్కువగా ఉండటం అమ్మకాలు స్వల్పంగా పడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం, ఈ టాప్ 8 నగరాల్లో 2024 జనవరి-మార్చి మధ్య కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల తాజా సరఫరా 53,818 యూనిట్ల నుంచి 33,420 యూనిట్లకు తగ్గింది.ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి-మార్చిలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ .60 లక్షల వరకు ధర కలిగిన గృహాల అమ్మకాలు 23,401 యూనిట్ల నుంచి 28,826 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 14,532 యూనిట్ల నుంచి 12,299 యూనిట్లకు పడిపోయాయి. అహ్మదాబాద్‌లో 8,087 యూనిట్ల నుంచి 6,892 యూనిట్లకు తగ్గాయి.హైదరాబాద్‌లో ఈ ఇళ్ల అమ్మకాలు 3,674 యూనిట్ల నుంచి 3,360 యూనిట్లకు తగ్గగా, చెన్నైలో అమ్మకాలు 3,295 యూనిట్ల నుంచి 2,003 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరులో అమ్మకాలు 5,193 యూనిట్ల నుంచి 2,801 యూనిట్లకు తగ్గాయి. కోల్‌కతాలో మాత్రం అమ్మకాలు 2,831 యూనిట్ల నుంచి 3,741 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 2,774 యూనిట్ల నుంచి 1,199 యూనిట్లకు తగ్గాయి.

India cricket teams record in T20 World Cup Super Eight
సూపర్‌-8కు సై.. టీమిండియాను భయపెడుతున్న గత రికార్డులు

టీ20 వరల్డ్‌కప్‌-2024లో గ్రూపు స్టేజీలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్‌-8 పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు గ్రూపు-ఎ నుంచి సూపర్‌-8కు అర్హత సాధించింది. సూపర్‌-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో భారత్‌ తలపడనుంది. ఇప్పటికే గ్రూపు-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్‌, భారత్ తమ బెర్త్‌లు ఖారారు చేసుకోగా.. మరో బెర్త్‌ కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్‌-8లో భారత్‌ షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలిద్దాం.టీ20 వరల్డ్ కప్ టీమిండియా సూపర్ 8 షెడ్యూల్జూన్ 20 : భారత్‌ వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్జూన్ 22: భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆంటిగ్వాజూన్ 24: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, సెయింట్ లూసియాఅదే విధంగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో సూపర్‌-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సూపర్‌-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే?టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) సూపర్ 8, సూపర్ 10, సూపర్ 12 రౌండ్లలో మ్యాచ్‌లను నిర్వహిస్తుంటుంది. అయితే ఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్‌ను సూపర్ 8 రౌండ్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. 12 సంవత్సరాల తర్వాత సూపర్-8 ఫార్మాట్‌ను ఐసీసీ తిరిగి మళ్లీ తీసుకువచ్చింది. చివరిగా 2012 టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌ ఎయిట్‌ ఫార్మాట్‌లో జరిగింది. సూపర్‌-8 ఫార్మాట్‌లో భారత జట్టు ట్రాక్‌ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇప్పటి టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ సూపర్‌ 8లో 12 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించగా, ఎనిమిదింట ఓటమి పాలైంది. టీమిండియా విన్నింగ్‌ శాతం 33.3 శాతంగా ఉండగా.. ఓటమి శాతం 66.67% గా ఉంది.టీ20 వరల్డ్‌కప్‌-2007లో సూపర్‌-8లో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అదే విధంగా 2009, 2010 పొట్టి ప్రపంచకప్‌లో సూపర్‌-8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది.ఆ తర్వాత 2012 వరల్డ్‌కప్‌లో రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. అయితే ఈ నాలుగు వరల్డ్‌కప్‌లలో కూడా భారత జట్టు ఎంఎస్‌ ధోని నాయకత్వంలోనే బరిలోకి దిగింది. 2007 వరల్డ్‌కప్‌ను ధోని సారథ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత తొలిసారి సూపర్‌-8 ఫార్మాట్‌లో ఆడనుంది.

Rahul Gandhi Joins EVM Debate After Elon Musk Tweet
ఈవీఎంల ట్యాంపరింగ్‌తో ఎన్నికల్లో విజయం.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్‌ ఎలోన్‌ మస్క్‌ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్‌ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పరోక్షంగా స్పందించారు. EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them. Serious concerns are being raised about transparency in our electoral process.Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024 దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘భారత్‌లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్‌ వేదికగా స్పందించారు.సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్‌ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్‌ చేశారు.ఫోన్‌తో ఈవీఎంను అన్‌ల్యాక్‌ చేసిన ఎన్డీఏ అభ్యర్థి!ముంబై నార్త్‌ వెస్ట్‌ లోక్‌సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్‌ లోక్‌సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్‌ 4న రెస్కో పోలింగ్‌ కౌంటింగ్‌ సెంటర్‌ బయట ఎంపీ రవీంద్ర వైకర్‌ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్‌ వినియోగించారు. ఆ ఫోన్‌ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్‌ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.కౌంటింగ్‌ సెంటర్‌లో ఉన్న ఈవీఎం మెషిన్‌కు మంగేష్‌ పన్హాల్కర్‌కు ఫోన్‌కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్‌లో ఓటీపీ సాయంతో కౌంటింగ్‌ సెంటర్‌లో ఉన్న ఈవీఎం మెషిన్‌ ఓపెన్‌ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్‌ ఫన్హాల్కర్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. భారత్‌లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్‌ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్‌ను వినియోగించలేరని అన్నారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024

Chalasani Srinivas Comments On TDP
ప్రత్యేక హోదా వద్దన్నవారు దుర్మార్గులు: చలసాని శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: విభజన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నవారిని దుర్మార్గులుగా చూస్తామంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం.. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీలు అమలైతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.‘‘గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న వారు తాజాగా ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చారు. రాష్టం బాగుపడటం, భవిష్యత్‌ కూడా ముఖ్యమే. తెలుగు జాతి హక్కుల కోసం రాష్ట్ర ‍ప్రభుత్వం కాంప్రమైజ్‌ కావొద్దు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాలి. కేంద్రం నుంచి హామీలు తీసుకోవడం కాదు.. అమలయ్యేలా చూడాలి’’ అని చలసాని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.చంద్రబాబు, జనసేన విభజన అంశాలపై మాట్లాడలేదు.. నయనో, భయనో ప్రత్యేక హోదా తీసుకురావాలి.. పోలవరం పై కుట్ర జరుగుతుంది.. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇవ్వాలి’’ అని చలసాని అన్నారు. ‘‘ఏపీలో మీడియాపై నిషేధం సరికాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిషేధించిన ఛానల్స్‌ను పునరుద్ధరించాలి’’ చలసాని కోరారు.

Congress Leader Urges Shah Rukh Khan to Visit His Ailing Teacher
చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్‌..

పాఠాలు నేర్పిన గురువు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కానీ అభిమాని పేరు చెప్పగానే కదల్లేని స్థితిలో ఉన్న ఆయన కళ్లలో ఒక మెరుపు. అది చూసిన కాంగ్రెస్‌ లీడర్‌ సజరిత లైఫ్‌లాంగ్‌.. ఎలాగే ఆ శిష్యుడిని గురువు ముందు హాజరుపర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం అలాగైనా ఆయన ఆరోగ్య పరిస్థితిలో కాస్త మార్పు వస్తుందని భావిస్తున్నారు.క్షీణిస్తున్న ఆరోగ్యంఆ శిష్యుడు మరెవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌. షారూఖ్‌ గురువు ఎరిక్‌ డిసౌజ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ విషయాన్ని డిసౌజ సోదరి సజరిత లైఫ్‌లాంగ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 'నా సోదరుడు ఎరిక్‌ డిసౌజ హెల్త్‌ కండీషన్‌ దిగజారుతోంది. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. ప్లీజ్‌ షారూఖ్‌.. ఒక్కసారి ఆయనను చూడటానికి రా.. క్షణాలు గడిచేకొద్దీ తనకేం జరుగుతుందోనని భయంగా ఉంది. ముంబై నుంచి గోవా రావడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. కొన్ని నిమిషాలు చాలుఒక అరగంటలో వచ్చేయొచ్చు. కేవలం కొన్ని నిమిషాల సమయం తన కోసం కేటాయించు. ఇప్పుడాయనకు మీరే ప్రపంచం. మీ రాక వల్ల తను కోలుకునే అవకాశం ఉంది. లేదంటే తన కళ్లముందు కమ్ముకున్న చీకటి నుంచి విముక్తి లభించి శాంతి చేకూరవచ్చు. చివరిసారిగా అడుగుతున్నాను.. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాను' అని అభ్యర్థించారు. షారూఖ్‌కు, ఎరిక్‌ డిసౌజకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఓ పాత వీడియోను సైతం షేర్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు షారూఖ్‌.. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తన గురువును చూసేందుకు వెళ్లాలని కోరుతున్నారు. This feels like my final plea, my last attempt to reach out to @iamsrk to humbly request his presence by the side of Brother Eric S D'Souza. Each day, Brother 's health weakens, his condition worsening with every passing moment. Mumbai, just an hour away by flight, holds the… pic.twitter.com/9HaCjp5gLv— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 14, 2024 https://t.co/6QcjlFVvLj— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 15, 2024చదవండి: 'మహారాజ'.. విజయ్‌ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి

Infosys bags over USD 100 million deal from Ikea
మరో భారీ డీల్‌ను దక్కించుకున్న ఇన్ఫోసిస్‌

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి 100 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) డీల్‌ను దక్కించుకుంది. హెచ్‌సీఎల్, క్యాప్ జెమినీ, డీఎక్స్‌సీ వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది.ఈ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం.. ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్‌ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జ్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, ఈవీపీ కర్మేష్ వాస్వానీ ఈ డీల్‌కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్‌కే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.ఈ డీల్‌ కారణంగా చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, పోలాండ్, స్వీడన్, అమెరికా దేశాల్లో ఐకియాలో 350 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కు మారనున్నారు. కోల్డ్ కాలింగ్, కొన్ని ప్రారంభ కనెక్షన్లతో ప్రారంభమై వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముగిసిన మూడేళ్ల సుదీర్ఘ, సంతృప్తికరమైన ప్రయాణం అని ఇన్ఫోసిస్ కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement