హమ్మయ్య... ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. రెండు రోజుల క్రితం వరకు పట్టికలో చివరి స్థానంలో నిలిచేందుకు తమతో పోటీ పడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ అద్భుత ఆటను చూసి స్ఫూర్తి పొందిందో ఏమో పటిష్ట చెన్నైపై కీలక గెలుపుతో ఐపీఎల్‌లో తమ ఆట ముగిసిపోలేదని ముంబై గుర్తు చేసింది. పనిలో పనిగా లీగ్ తొలి మ్యాచ్‌లో తమకు అనూహ్యంగా షాక్ ఇచ్చిన సూపర్ కింగ్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది