టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తాజాగా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంతంగా కూర్చుని తుపాకీతో కొన్ని రౌండ్లు గురి తప్పకుండా టార్గెట్‌ను షూట్ చేశాడు ధోని. అయితే ప్రకటనల కోసం చేసే షూటింగ్ కంటే కూడా తుపాకీతో కాల్చడం చాలా తేలికంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని తాజాగా ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.