ఐసీసీకి సచిన్‌ కౌంటర్‌! | Heads I win, tails you lose, Tendulkar on ICC video comparing his Centurion six with Rohits | Sakshi
Sakshi News home page

ఐసీసీకి సచిన్‌ కౌంటర్‌!

Jun 18 2019 3:27 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఓల్ట్‌ ట్రాఫర్డ్‌ వేదికగా గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌శర్మ రికార్డు సెంచరీతో భారత్‌ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇన్నింగ్స్‌లో హసన్‌ అలీ బౌలింగ్‌లో రోహిత్‌శర్మ కొట్టిన సిక్స్‌ను చాలా మంది భారత అభిమానులు 2003 వరల్డ్‌కప్‌లో షోయబ్‌ అక్తర్‌ బౌలింగ్‌లో సచిన్‌ కొట్టిన సిక్స్‌తో పోల్చడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

దీనికి సంబందించిన వీడియోను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌  సామాజిక మాధ్యమంలో  పోస్ట్‌ చేస్తూ ... సచిన్‌ లేక రోహిత్‌శర్మలో ఎవరు ఆ షాట్‌ బాగా ఆడారో చెప్పాల్సిందిగా అభిమానులను ప్రశ్నించింది. దీనికి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘ మేమిద్దరం ఒకే దేశానికి చెందినవాళ్లమని, అందులోనూ ఇద్దరిది ముంబయి కాబట్టి మీరడిగిన ప్రశ్నకు అందులోనే సమాధానముందని’ కౌంటర్‌ ఇచ్చాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement