తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రేపు సాయంత్రం లోకసభ స్పీకర్‌ను కలువనున్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజీనామాలు ఆమోదించండి లేదా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’ అనేదే తమ నినాదమన్నారు. రాజీనామాలు చేసి ఇన్ని రోజులవుతున్నా ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి మానసింగా సిద్ధమయ్యారన్నారు.