జిల్లాలో రెండోరోజు వైఎస్ షర్మిల ప్రచారం కొనసాగుతోంది. రాజన్న తనయకు నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాగా వైఎస్ షర్మిల శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నందివెలుగు రోడ్డు నుంచి రోడ్ షో ప్రారంభించారు. అక్కడి నుంచి మణి హోటల్ సెంటర్, కొల్లి శారద మార్కెట్, బ్రహ్మానందరెడ్డి స్టేడియం, పొన్నూరు రోడ్డు, లాంచర్ట్ రోడ్డు, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం మీదుగా పూలకొట్ల సెంటర్, హిమనీ కూల్‌డ్రింక్ సెంటర్, జిన్నా టవర్, పాతబస్టాండ్ సెంటర్ మీదుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం సమీపంలోని ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తఫా కార్యాలయం వరకు పర్యటిస్తారు.