ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన వ్యక్తుల వ్యాపారాలు బాగుపడటానికి జరుగుతున్న ఆరాటమే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని నెల్లిమర్లలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఈ నియోజకవర్గంలో కట్టాలని ప్రజాపతినిధులు నిర్ణయం తీసుకుంటే మంచిదే అనుకున్నామని అన్నారు.