‘విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగింది కుట్ర కాదా బాబూ’ | YS Jagan Fires On Chandrababu Naidu Over Vizag Airport Incident | Sakshi
Sakshi News home page

‘విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగింది కుట్ర కాదా బాబూ’

Nov 17 2018 7:00 PM | Updated on Mar 22 2024 11:16 AM

‘విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగింది కుట్ర కాదా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న టీడీపీ గత మార్చి నెలలో తెగదెంపులు చేసుకుంది. అప్పటికే ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన రావడంతో నన్ను చంపేందుకు పథకం రచించారు. ఓ సినీ నటుడిని తీసుకొచ్చి ఆపరేషన్ గరుడ పేరుతో స్క్రిప్టు చదివించారు. దానికి ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో బీజేపీ రాష్ట్రంలో అనిశ్చితి రగిల్చి టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తోందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడి జరగబోతోందని శివాజీతో చెప్పించారు. కేంద్రం పరిధిలో ఉండే ఎయిర్‌పోర్టులో దాడి చేసి నన్ను చంపేస్తే బాబు ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో ఆపరేషన్‌ గరుడలో చెప్పినట్టే జరగిందని ప్రచారం చేస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ ప్రజలకు వివరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement