దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. విజయనగరం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన జంఝావతి ప్రాజెక్టు నిర్మాణాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మంచి రోజులొచ్చాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వైఎస్సార్ జంఝావతి రబ్బర్ డ్యాంను నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు జంఝావతి ప్రాజెక్టు నిర్వహణను పట్టించుకోకపోవడంతో అది నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో దేశంలోని ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లే చంద్రబాబు.. పక్క రాష్ట్రమైన ఒడిషా ముఖ్యమంత్రిని మాత్రం కలవడు అని ఎద్దేవా చేశారు.