సాధరణంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు అనుకోని కారణాల వల్ల ప్రయాణం కాస్తా ఆలస్యమయితే ఎక్కడ లేని చిరాకు వస్తుంటోంది. ఆ సమయంలో ఫోన్ పట్టుకునో, బుక్ చదువుతునో కాలక్షేపం చేయడానికి ప్రయత్నిస్తుంటాము. కానీ కాసేపటికి అది కూడా బోర్ కొడుతుంది. ఇక అప్పుడు చేసేదేం లేక ఆలస్యానికి కారణమయిన వారిని తిట్టుకుంటూ కూర్చుంటాము. ఇది మనలాంటి వారి పరిస్థితి. కానీ ఇదే ప్లేస్‌లో షెమీకా చార్లెస్ ఉంటే ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు.