ఓ మహిళ అపరభద్రకాళి అవతార మెత్తింది. తన భర్తను కొట్టి చంపేందుకు ప్రయత్నించిన దుండగుల ముందు అపరకాళిలా మారి వారిని పరుగులు తీయించింది. ఒంటి చేత్తో వారిని ఢీకొని తోకముడిచి పారిపోయేలా చేసింది. ఈ ఘటన హర్యానాకు సమీపంలోని యమునా నగర్‌లో చోటు చేసుకుంది.
ఆమె కుటుంబానికి మరికొందరు వ్యక్తులకు ఎప్పటి నుంచో భూమి తగాదాలు ఉన్నాయంట. దాంతో పొలంవైపు ఒంటరిగా వెళ్లిన తన భర్తపై నలుగురు వ్యక్తులు పెద్ద కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఆమె ఓ పెద్ద కర్ర చేతబుచ్చుకొని వారి నలుగురిని ఎదుర్కొంది. బాగా దెబ్బలు తిని స్పృహతప్పిపోయిన తన భర్తను చూసి కట్టలు తెగే ఆవేశంతో ఒంటి చేత్తో వారిని పరుగులు పెట్టించి భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
భద్రకాళిలా మారిన భార్య విశ్వరూపం చూశారా
Feb 22 2018 3:44 PM | Updated on Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement