హ్యాట్సాప్‌ ఇండియన్‌ ఆర్మీ | Video Of Army Rescuing Man With Prosthetic Limb Wins Hearts | Sakshi
Sakshi News home page

హ్యాట్సాప్‌ ఇండియన్‌ ఆర్మీ

Aug 23 2018 1:42 PM | Updated on Aug 23 2018 1:49 PM

భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమయింది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు కేరళను ముంచేశాయి. దాదాపు అన్ని జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. ఇప్పటి వరకూ దాదాపు 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నారు. ఓ బాలుడిని కాపాడం కోసం సైనికుడు తాడు సాయంతో ఒంటి చేత్తో హెలికాప్టర్‌పైకి వెళ్లడం, ఓ పైలట్‌ చాకచక్యంతో గర్భిణీని కాపాడడం లాంటి వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో కూడా వైరల్‌గా మరింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement