ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Oct 30th Justice Nagarjuna Reddy takes oath as APERC Chairman | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 30 2019 8:25 PM | Updated on Mar 21 2024 11:38 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ సదస్సుకు తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు సభ్యులు భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement