ఈనాటి ముఖ్యాంశాలు
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘ పోలీసు సంక్షేమ నిధి’ నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా వాసుల చిరకాల స్వప్నం అయిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిశ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ ఫర్ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల మధ్య తలెత్తిన వివాదం.. కాల్పులకు దారితీసింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి