సాక్షి, విజయవాడ : దళిత ఎంపీ, వైఎస్సార్‌సీపీ నాయకుడు నందిగం సురేశ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడిగి యత్నించారు. జై అమరావతి అనాలంటూ ఎంపీ సురేశ్ వాహనాన్ని టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి అజయ్ చౌదరి, మరికొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా పార్టీ స్టాండ్ అని ఎంపీ సురేశ్ స్పష్టం చేశారు. దీంతో ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసేందుకు యత్నించారు. నందిగామాలో ఓ వైద్యుడిని కలిసేందుకు ఎంపీ సురేశ్ వెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.