రాష్ట్ర ప్రజలపై పడిన రూ. 3 లక్షల కోట్ల అప్పుల భారంలో అధిక సొమ్ము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్లిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వారం రోజుల పాటు జరిగిన ఐటీ దాడుల్లో ఆయన మాజీ పీఎస్ వద్దే రూ. 2000 కోట్లు దొరికాయని.. ఈ పరిణామాలు చూస్తుంటే బాబు దోపిడీ రూ. లక్ష కోట్లకు చేరిందనడంలో ఏమాత్రం ఆశ్చర్యంలేదన్నారు.