ప్రధానమంత్రి పదవి చేపట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా పెదవి విప్పారు. 2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే తానే ప్రధాని అవుతానని ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవరిస్తే ప్రధాని పదవిని చేపడతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘అవును’ అని రాహుల్ సమాధానం ఇచ్చారు.