నవాజ్ షరీఫ్‌కి భారీ ఊరట | Pakistan court releases ex-PM Nawaz Sharif and daughter | Sakshi
Sakshi News home page

నవాజ్ షరీఫ్‌కి భారీ ఊరట

Sep 20 2018 7:52 AM | Updated on Mar 22 2024 11:23 AM

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు.. ఇస్లామాబాద్‌ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. అవెన్‌ఫీల్డ్‌ కేసులో షరీఫ్‌ (68), ఆయన కూతురు మర్యం, అల్లుడు రిటైర్డ్‌ కెప్టెన్‌ ముహ్మద్‌ సఫ్దార్‌ల జైలు శిక్షను నిలిపివేస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో బుధవారం రాత్రి ఈ ముగ్గురినీ విడుదల చేశారు. రావల్పిండి ఎయిర్‌బేస్‌ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌కు పటిష్టమైన భద్రత నడుమ తరలించారు. విడుదలకు ముందు జైలు సూపరింటెండెంట్‌ గదిలో తన సన్నిహితులతో ‘నేనేం తప్పు చేయలేదు. అది నా అంతరాత్మకు తెలుసు. ఏది సత్యమో అల్లాకు తెలుసు’ అని షరీఫ్‌ అన్నట్లు పాక్‌ మీడియా పేర్కొంది. లండన్‌లోని అవెన్‌ఫీల్డ్‌ ప్రాంతంలో ఖరీదైన బంగళాలు కొన్నారన్న కేసులో తమను జైల్లో పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ షరీఫ్, కూతురు, అల్లుడు ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement