చంద్రబాబు నాయుడు ఆర్ధిక క్రమశిక్షణ తప్పి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ విమర్శించారు. ఆదివారం జిల్లాలో పర్యటించిన మంత్రి గోపాల మిత్ర, ఇతర శాఖల నిధులను పసుపు కుంకుమకు తరలించారని ఆరోపించారు. నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు రైతులను నిర్లక్ష్యం చేశాడని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులెదురైనా రైతులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రైతు పండించిన పంటకు మద్ధతు ధరను అందించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారని పునరుద్ఘాటించారు.
చంద్రబాబు ఆర్థిక క్రమశిక్షణ తప్పారు..
Nov 24 2019 4:38 PM | Updated on Nov 24 2019 4:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement