బీసీలు ఎక్కడ, ఏ స్థితిగతుల్లో ఉన్నారో?... అక్కడే ఉండేలా ఆదరణ పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. బీసీ కుటుంబాల్లోని పిల్లల అభ్యున్నతికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. బలహీనవర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోనీయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, బీసీ స్కాలర్ షిప్, విదేశీ విద్య ఇలా అన్నిటికీ గండికొట్టి అన్యాయం చేశారని ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలను చంద్రబాబు బానిసలుగా మార్చారన్నారు.