తన పాలనపై నిజాయితీగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం సీఎం చంద్రబాబు నాయుడుకు ఉందా అని రాయచోటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ధైర్యం రాలేదంటే ప్రజలను వంచించాలని చూస్తున్నారని అర్థమన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'ఎన్నికలు వస్తున్నాయనే ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. విభజన సమస్యలు కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబుకు గుర్తు రాలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం చంద్రబాబు ఏం చేశారు? ప్రజల సమస్యలపై 9ఏళ్లుగా పోరాడుతోంది ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. చంద్రబాబు పాలనంతా మోసపూరితం.