ఇసుక కొరత అంటూ దీక్షకు దిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు వైఎస్సార్ సీపీలో చేరారు. వారిద్దరికీ ముఖ్యమంత్రి... కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైఎస్సార్ సీపీలో చేరిన దేవినేని అవినాష్
Nov 14 2019 5:57 PM | Updated on Nov 14 2019 6:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement