మెట్రో పిల్లర్ కారణంగా దుర్మరణం పాలైన మౌనిక కుటుంబ సభ్యులు ఎల్ అండ్ టీ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తమకు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు మాత్రం ఇంతవరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటనపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మెట్రో ఘటనలో ప్రమాదవశాత్తు మరణిస్తే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఈ ప్రమాదానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా లేదా అన్న విషయంపై కూడా స్పష్టతనివ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయంలోనూ ఎటూ తేల్చకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రూ. 20 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం
Sep 23 2019 8:04 PM | Updated on Sep 23 2019 8:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement