రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కాంక్షతో ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. తెలుగుదేశం పార్టీని ఇందులో కలుపుకునేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో పొత్తుకు టీడీపీ నుంచి కూడా సానుకూల సంకేతాలు వెలువడినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేందుకు టీపీసీసీ నాయకత్వం నుంచి వచ్చిన ఈ పొత్తు ఆలోచనకు టీడీపీ అధినేత చంద్రబాబు సుముఖంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్‌కు వర్తమానం అందించారు. అప్పటికే టీడీపీ నేతలతో సీట్లపై సాగించిన చర్చలు, ప్రతిపాదనలపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు కొందరు సోమవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు?
Mar 20 2018 5:55 PM | Updated on Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement