విశాఖపట్నం నగరంలోని కైలాసగిరిపై చిరుతలు కలకలం రేపాయి. కైలాసగిరిపై రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు తెలుసుకుని పర్యాటకులు హడలిపోతున్నారు. దీంతో ఆ ప్రాంతానికి వచ్చిన అటవీ అధికారులు అక్కడినుంచి పర్యాటకులు, వ్యాపారులను ఖాళీ చేయించారు. చిరుతల కోసం అటవీ శాఖాధికారులు గాలిస్తున్నారు. అయితే అవి ఎటువైపు నుంచి వచ్చాయి, ఎటు వెళ్లాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు.