అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన నేపథ్యంలో పేదల ఇళ్లు కనిపించకుండా గోడ నిర్మాణం చేపట్టడం విమర్శల పాలవగా తాజాగా మొతెరా ప్రాంతంలో మురికివాడల నుంచి ప్రజలను ఖాళీ చేయించేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు అక్కడి పేదలకు 7 రోజుల ముందు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించేందుకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మొతెరా స్టేడియాన్ని సందర్శించారు.