చిత్రం చూశారా.. స్తంభాలపై నుంచి ప్రమాదకర రీతిలో వాగుదాటుతున్నది విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలోని గాదెల్లోవ గిరిజన గ్రామానికి చెందిన చిన్నారులు. వీరంతా ప్రాథమిక విద్యను అభ్యసించేందుకు గాదెల్లోవకు పక్కనే ఉన్న మెట్టపాలెం ప్రాథమిక పాఠశాలకు ప్రతి రోజు కొండగెడ్డను దాటి వెళ్లాలి. వర్షాలకు గెడ్డ కాస్త పొంగిపొర్లుతుండడంతో స్తంభాల మీదుగా ప్రమాదకర రీతితో రాకపోకలు సాగిస్తున్నారు. పొరపాటున కాలుజారితే చిన్నారుల ప్రాణాలు పోతాయని, గెడ్డపై వంతెన నిర్మించాలని వేడుకుంటున్నా స్థానిక పాలకులు పట్టించుకోవడంలేదని గిరిజనులు వాపోతున్నారు.
స్తంభాలే వంతెన..
Aug 26 2025 9:37 PM | Updated on Aug 26 2025 9:37 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement