వేడి నీటి పైపు పేలి అయిదుగురు మృతి | Five Killed After Boiling Water Floods Russian Hotel In Perm | Sakshi
Sakshi News home page

వేడి నీటి పైపు పేలి అయిదుగురు మృతి

Jan 20 2020 7:42 PM | Updated on Jan 20 2020 7:45 PM

వేడి నీటి పైపు పేలి అయిదుగురు మరణించిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. పెర్మ్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న హోటల్‌లో సోమవారం సాయంత్రం వేడి నీటితో ఉన్న పైపు పేలింది. దీంతో మరుగుతున్న వేడి నీరుహోటల్‌ గదుల్లోకి రావడంతో ఓ చిన్నారితో సహా అయిదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లోని ఓ మహిళ శరీరం 35 శాతం  కాలిపోయి ఆమె పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరు పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement