డిజిటల్ చదువుల రెక్కలతో పేదింటి పిల్లల విహంగ వీక్షణం.. అధునాతన ట్యాబ్‌ల పంపిణీతో ఇక ప్రపంచం వారి గుప్పిట్లో.. ఇది వారికి జగన్ మామ ఇస్తున్న కానుక!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 4.34 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని నేడు తన పుట్టినరోజున ప్రారంభించిన సీఎం వైయస్ జగన్.
₹620 కోట్ల వ్యయంతో డిసెంబరు 21 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ట్యాబ్‌ల పంపిణీ జరగనుంది. ₹17,500కుపైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు ₹15,500 విలువ గల బైజూస్ కంటెంట్‌తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికీ మొత్తంగా ₹33,000 లబ్ధి చేకూరనుంది.
మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా చేసేందుకు ఇది జగనన్న వేస్తున్న రహదారి.. ఇక మన పిల్లలు ఏలనున్నారు విశ్వనగరి!