లలిత్ మోదీ, విజయ్ మాల్యా లాంటివాళ్లు వేల కోట్లు ఎగేసి దేశం విడిచి పారి పోయాక అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనుకుంటూ భ్రమల్లో కూరుకుపో యిన బ్యాంకింగ్ రంగానికి మరో వ్యాపారి నీరవ్ మోదీ ఝలక్ ఇచ్చాడు. స్టేట్ బ్యాంకు తర్వాత రెండో అతి పెద్ద బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)కి జంకూగొంకూ లేకుండా రూ. 11,300 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి అచ్చం లలిత్, మాల్యాల తరహాలోనే సకుటుంబ సమేతంగా దేశం నుంచి నిష్క్రమిం చాడు. రూ. 280 కోట్ల మేర మోసం జరిగిందన్న ఫిర్యాదు కాస్తా పట్టుమని పదిరో జులు గడవకుండానే రూ. 11,300 కోట్లకు ఎగబాకింది.