రియో ఒలింపిక్స్ గేమ్స్లో రష్యా అథ్లెట్లు పాల్గొనే అంశంపై దాఖలైన పిటిషన్ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) కొట్టివేసింది. ఈ మేరకు రష్యా అథ్లెట్ల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు సీఏఎస్ గురువారం స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) పరిగణలోకి తీసుకోవాలని సీఏఎస్ తన తీర్పులో పేర్కొంది. దీంతో రష్యా పెట్టుకున్న రియో ఒలింపిక్స్ ఆశలకు గండిపడంది.