ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన నిత్యావసరాల ధరలపై వైఎస్ఆర్ సీపీ సమరభేరి మోగించింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం ఏపీలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టనున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పార్టీలకు అతీతంగా నిరసన తెలపాలని వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చింది.