ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా లేక సింగపూర్దా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం ఏపీ ప్రభుత్వం సింగపూర్కు లక్ష కోట్ల నజరానా ఇస్తున్నారని రోజా ఆరోపించారు. ఇది మాస్టర్ ప్లాన్ కాదని చంద్రబాబు డైవర్షన్ ప్లాన్ అని ఎద్దేవా చేశారు.